కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీ ఉద్యోగుల ధర్నా
తిరుపతి అర్బన్/సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : అంగన్‌వాడీ ఉద్యోగులు మృతి చెందితే కనీసం మట్టి ఖర్చులకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడం ఏంటి అంటూ.. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు కనీసం మట్టి ఖర్చులకైనా నిధులు కేటాయించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన ధర్నా చేశారు. వారికి సీఐటీయూ నేతలు మద్దతు పలికారు.
సీఐటీయూ తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల సమయంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇచి్చన హామీలను కూటమి సర్కార్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా అంగన్‌వాడీల సంఘం అధ్యక్షురాలు పద్మలీల అధ్యక్షతన పెద్ద ఎత్తున జరిగిన నిరసన ధర్నాలో అంగన్‌వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి, శ్రామిక మహిళా జిల్లా కనీ్వనర్ లక్ష్మీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచుతామని చంద్రబాబు చెప్పిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
అనంతరం కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌కు ఓ వినతిపత్రాన్ని అందించారు. పాడేరులో అంగన్‌వాడీ సంఘం నాయకులు మాట్లాడుతూ.. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పలుచోట్ల హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment