మనోవ్యాధితో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య | inter student comited to suside | Sakshi
Sakshi News home page

మనోవ్యాధితో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

Published Tue, Oct 4 2016 9:50 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

మనోవ్యాధితో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడేపల్లిగూడెం పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని భూపాల్‌నగర్‌కు చెందిన నాదెండ్ల మనోజ్‌సాయికుమార్‌ (18) స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతని మానసిక స్థితి సరిగా లేదు. దీంతోపాటు నరాల బలహీనతతో బాధపడుతున్నాడు.

తాడేపల్లిగూడెం రూరల్‌ : మనోవ్యాధితో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడేపల్లిగూడెం పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని భూపాల్‌నగర్‌కు చెందిన నాదెండ్ల మనోజ్‌సాయికుమార్‌ (18) స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతని మానసిక స్థితి సరిగా లేదు. దీంతోపాటు నరాల బలహీనతతో బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన అతను సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి ఎంతకీ రాలేదు. మంగళవారం ఉదయం పంపుల చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అతని తల్లిదండ్రులు  తల్లిదండ్రులు చంద్రశేఖర్, మంగ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తల్లి మంగ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై ఐ.వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement