ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కుంతాల మండలం అందాకూర్ గ్రామంలో మంగళవారం అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్తానికంగా ఉండే వామన్‌పల్లి ముత్యం(28) అనే వ్యక్తి ఊరి బయట ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేకే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.
స్థానికుల సమాచారం అందించడంతో కుంతాల పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్య చేసి చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(కుంతాల)