అర్క రామారావు మృతదేహం
నేరడిగొండ(బోథ్): నేరడిగొండ మండలం దూద్గండి ప్రాంతంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇచ్చోడ మండలం మేడిగూడకు చెందిన అర్క రామారావు (39) మృతి చెందాడు. రామారావుకు కొన్ని రోజుల క్రితం కుక్క కరిచింది. కుక్క కాటు చికిత్సకు ఆయుర్వేద మందు తాగడానికి గురువారం సాయంత్రం రామారావు కొర్టికల్లోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. మందు తాగి గురువారం అక్కడే ఉండి శుక్రవారం ఉదయం తన స్వగ్రామానికి కొర్టికల్ గ్రామానికి చెందిన కనక నగేశ్‌తో ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు.మార్గమధ్యంలో గుర్తు తెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రామారావుకు తీవ్ర గాయాలయ్యాయి. కనక నగేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని అంబులెన్స్‌లో నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామారావు మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment