ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం మోదిగూడ గ్రామంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందాడు.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం మోదిగూడ గ్రామంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మోదిగూడ గ్రామానికి చెందిన కనక మారుతి(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి వ్యవసాయ బావి నుంచి ఇంటికి వస్తున్న సమయంలో పిడుగుపడి మృతిచెందాడు. అయితే రాత్రి నుంచి మారుతి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు గురువారం ఉదయం వెతుక్కుంటూ వెళ్లి చూడగా వ్యవసాయబావి వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు.