
గుమ్మిడిపూండి(తమిళనాడు): వర్షం కురుస్తుండగా పిడుగును సెల్‌ఫోన్‌తో ఫొటో తీయబోయి ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చెన్నై తురైపాక్కానికి చెందిన రమేష్(45) బుధవారం గుమ్మిడిపూండి సమీపంలోని సున్నంబుకుళం గ్రామంలో తన స్నేహితుని రొయ్యల చెరువు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. దూరంగా పిడుగులు పడుతుండటాన్ని గమనించిన రమేష్ తన సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీయబోయాడు. దీంతో రమేష్‌కు సమీపంలో పిడుగు పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment