ప్రమాదవశాత్తు మరుగుతున్న రసంలో పడి యువకుడు మృతి | Man Died After Fell Into A Cauldron Of Hot Rasam At Tamilnadu | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు మరుగుతున్న రసంలో పడి యువకుడు మృతి

Published Mon, May 1 2023 12:16 PM | Last Updated on Mon, May 1 2023 3:18 PM

Man Died After Fell Into A Cauldron Of Hot Rasam At Tamilnadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తమిళనాడు: ప్రమాదవశాత్తు మరుగుతున్న రసంలో పడి ఒక యువకుడు మృతి చెందాడు. ఈ విషాధ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ‍ప్రకారం..వివాహ వేడుకలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు కాలేజీ విద్యార్థి అని, పార్ట్‌ టైం జాబ్‌గా క్యాటరింగ్‌ పనిచేస్తున్నట్లు తెలిపారు. అతిధులకు వడ్డన చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.

బాధితుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించినప్పటికీ తీవ్ర కాలిన గాయలవ్వడంతో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. అతను తీవ్రంగా గాయపడటంతో శరీరం ట్రీట్‌మెంట్‌కి సహకరించలేదని అందువల్లే అతడి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: గజరాజులను చూసి తోకముడిచిన పులి: వీడియో వైరల్‌)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement