
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలోని క్వారీ గుంత వద్ద ప్రమాదం జరిగింది. సరదాగా ఈతకు వచ్చిన ఎనిమిది మంది యువకులు సెల్ఫీలు దిగుతుండగా ఓ యువకుడు కాలు జారి క్వారీ గుంతలో పడిపోయాడు. ఈత రాక మునిగి చనిపోయాడు. మృతుడు మల్లేపల్లి మండలం అప్జల్‌సాగర్‌కు చెందిన భానుచందర్ (19)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment