![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/30/drinking-images.jpg.webp?itok=WBUyJcHn)
జైనథ్: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన భౌనే భూపాల్ (42) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు.
బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తితోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ముఖ్య గమనిక:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment