పాన్‌గల్: అనారోగ్యం కారణంతో మనస్తాపం చెంది ఓ వివాహిత ఉరేసుకుని మృతిచెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వేణు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కేతేపల్లికి చెందిన కాకం కాశమ్మ(38) కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో కూలి పనలు చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ నుంచి మంగళవారం సొంత గ్రామానికి చేరుకుంది.
మనస్తాపంతో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, అనారోగ్యంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ముఖ్య గమనిక:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
పాము కాటుతో మహిళ మృతి
నర్వ: పాము కాటుకు గురై మహిళ మృతిచెందిన సంఘటన నర్వ మండలం పెద్దకడ్మూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దకడ్మూర్‌కి చెందిన ఎల్లంపల్లి కుర్వ అక్కెమ్మ(45) తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లింది. అక్కడ మోకాలి వద్ద పాము కాటు వేయడంతో భయంతో ఇంటికి వచ్చింది.
చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను మక్తల్ మండలం గుడిగండ్ల వద్ద నాటువైద్యానికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ పరిస్థితి విషమించడంతో నర్వ పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఇక్కడి వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్తతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఇది చదవండి: ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై హత్యాయత్నం.. దాడిచేసింది వారే..!
Comments
Please login to add a commentAdd a comment