ఎలుకల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Published Tue, Aug 16 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
ఏలూరు అర్బన్ : కడుపునొప్పితో బాధపడుతున్న ఓ వ్యవసాయ కూలీ ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దెందులూరు మండలం కొవ్వలికి చెందిన చమ్మల కిశోర్ చాలా కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం కడుపునొప్పి రావడంతో ఇంటì లో ఉన్న ఎలుకల మందును నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Advertisement
Advertisement