అనుమానం.. క్షణికావేశం! | anger problems | Sakshi
Sakshi News home page

అనుమానం.. క్షణికావేశం!

Published Tue, Feb 25 2014 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM

anger problems

 పద్దకొత్తపల్లి / లింగాల, ఆ జంటకు తొమ్మిది నెలల క్రితమే వి వాహమైంది.. అనుమానం వారి పాలి ట శాపమైంది.. నిండు నూరేళ్లు జీవి తం గడపాల్సిన ఆ దంపతులు తరచూ గొడవ పడేవారు..

 

ఈ క్రమంలోనే క్షణికావేశానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు.. హృదయ విదారకమైన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పెద్దకొత్తపల్లి మండలం పెద్దకారుపాములకు చెం దిన గౌరమ్మ (22)కు లింగాల వాసి కృష్ణయ్య (26) తో గతేడాది మే నెలలో వివాహమైంది. ఆ  సమయంలో *లక్షతో పా టు నాలుగు తులాల బంగారాన్ని ఇచ్చారు. ఇద్దరూ స్థానికం గా కూలిపని చేస్తూ జీవనం సాగించేవారు.]

 

 

అయితే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తర చూ గొడవ పడుతుండేవా డు. దీంతో ఈనెల 21న ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం అతను స్కూటర్‌పై వచ్చి అదే రాత్రి ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలోని దేదినేనిపల్లి రోడ్డు పక్క న ఉన్న ఓ చెట్టుకు తాడుతో ఉరివేసుకుని తమ ప్రాణాలు బలితీసుకున్నా రు. సోమవారం ఉదయం అటువైపు వెళ్లిన గ్రామస్తులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ సైదులు, తహశీల్దార్ జంగయ్య పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా కృష్ణయ్యకు తల్లి లక్ష్మమ్మతో పాటు ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు. గౌరమ్మకు తల్లిదండ్రులు వెంకటమ్మ, వెంకటయ్య తోపాటు నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. ఈ సంఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement