నిజామాబాద్ క్రైం (నిజామాబాద్‌అర్బన్) : మద్యానికి బానిసైన ఓ యువకుడు.. తాగేందుకు ఇంట్లో డబ్బు ఇవ్వలేదనే మనస్తాపంతో ఉరేసుకున్నాడు. వన్ టౌన్ ఎస్సై గౌరేందర్ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన మడిగే శివరాం (28) తల్లి, అన్న, చెల్లెలుతో కలిసి రెండేళ్ల క్రితం నిజామాబాద్‌కు వలస వచ్చాడు. స్థానిక కోజాకాలనీలో ఉంటూ శివరాం, అతని అన్న కార్మికులుగా పని చేస్తున్నారు. పని చేయగా వచ్చిన డబ్బులతో మద్యం సేవిస్తూ శివరాం మద్యానికి బానిసయ్యాడు. మందు తాగేందుకు శుక్రవారం డబ్బులు లేకపోవటంతో చెల్లెలిని అడుగగా, తన వద్ద లేవని ఆమె చెప్పింది. మద్యానికి డబ్బులు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన శివరాం.. మిర్చి కాంపౌండ్ రైల్వే ట్రాక్ పక్కన ఖాళీ స్థలంలో గల వేప చెట్టుకు టవల్‌తో శుక్రవారం రాత్రి ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment