BCCI ACU New Chief: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి చెందిన అవినీతి నిరోధక విభాగానికి (ఏసీయూ) అధిపతిగా ప్రముఖ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శరద్ కుమార్ నియమితులయ్యారు. గతంలో ఆయన టెర్రరిజం కార్యకలాపాల్ని నిరోధించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా నాలుగేళ్ల పాటు క్లిష్టమైన టెర్రిరిజం దర్యాప్తులను చేపట్టారు.
ఎన్‌ఐఏ హెడ్‌గా పనిచేసిన అనుభవం
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 68 ఏళ్ల శరద్ 1979 బ్యాచ్‌కు చెందిన హరియాణా క్యాడర్ ఐపీఎస్. ముంబై ఉగ్రదాడి అనంతరం కేంద్రం ఎన్‌ఐఏను ఏర్పాటు చేసింది. 2013 నుంచి 2017 వరకు శరద్ ఎన్‌ఐఏ హెడ్‌గా వ్యవహరించారు. అనంతరం 2018 నుంచి 2020 వరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలోనే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో కీలకంగా పనిచేశారు.
కేకే మిశ్రా ఏడాది పాటే
ఇప్పుడు ఆ అనుభవమే శరద్ కుమార్‌ను ఏసీయూ చీఫ్‌ను చేసింది. నిజాయితీ గల అధికారిగా పేరున్న శరద్ 1996లో, తిరిగి 2004లో రాష్ట్రపతి పోలీస్ మెడల్స్‌ను పొందారు. ఈ నెల 1 నుంచి బోర్డు ఏసీయూ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు పనిచేస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు ఏసీయూ చీఫ్‌గా ఉన్న కేకే మిశ్రా కూడా హరియాణా క్యాడర్‌కే చెందిన ఐపీఎస్ అధికారి. కానీ ఏడాది మాత్రమే పదవిలో ఉన్న ఆయన రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన కారణాలు మాత్రం వెల్లడి కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment