Retired IPS
-
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్‌పాల్ అరెస్ట్
సాక్షి, ప్రకాశం జిల్లా: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన కేసులో విజయ్‌పాల్‌ను ఈ రోజు కూడా పోలీసులు విచారించారు. రాజకీయ కక్షతోనే విజయ్‌పాల్‌ను అరెస్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.ఈనెల 13న విజయ్‌పాల్ మొదటి సారి విచారణకు హాజరయ్యారు. రెండోసారి ఈ రోజు(మంగళవారం) విచారించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. మొత్తం ఎనిమిది సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. -
BCCI: బీసీసీఐ ఏసీయూ చీఫ్‌గా NIA మాజీ హెడ్
BCCI ACU New Chief: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి చెందిన అవినీతి నిరోధక విభాగానికి (ఏసీయూ) అధిపతిగా ప్రముఖ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శరద్ కుమార్ నియమితులయ్యారు. గతంలో ఆయన టెర్రరిజం కార్యకలాపాల్ని నిరోధించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా నాలుగేళ్ల పాటు క్లిష్టమైన టెర్రిరిజం దర్యాప్తులను చేపట్టారు.ఎన్ఐఏ హెడ్‌గా పనిచేసిన అనుభవంఉత్తరప్రదేశ్కు చెందిన 68 ఏళ్ల శరద్ 1979 బ్యాచ్‌కు చెందిన హరియాణా క్యాడర్ ఐపీఎస్. ముంబై ఉగ్రదాడి అనంతరం కేంద్రం ఎన్ఐఏను ఏర్పాటు చేసింది. 2013 నుంచి 2017 వరకు శరద్ ఎన్ఐఏ హెడ్‌గా వ్యవహరించారు. అనంతరం 2018 నుంచి 2020 వరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలోనే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో కీలకంగా పనిచేశారు.కేకే మిశ్రా ఏడాది పాటేఇప్పుడు ఆ అనుభవమే శరద్ కుమార్‌ను ఏసీయూ చీఫ్‌ను చేసింది. నిజాయితీ గల అధికారిగా పేరున్న శరద్ 1996లో, తిరిగి 2004లో రాష్ట్రపతి పోలీస్ మెడల్స్‌ను పొందారు. ఈ నెల 1 నుంచి బోర్డు ఏసీయూ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు పనిచేస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు ఏసీయూ చీఫ్‌గా ఉన్న కేకే మిశ్రా కూడా హరియాణా క్యాడర్‌కే చెందిన ఐపీఎస్ అధికారి. కానీ ఏడాది మాత్రమే పదవిలో ఉన్న ఆయన రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. చదవండి: WT20 WC Ind vs NZ: కివీస్ ముందు తలవంచారు -
రిటైర్డ్ ఐపీఎస్ ల గుప్పిట్లో పొలిసు శాఖ
-
ముగ్గురి మాటే శాసనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో పోలీసు శాఖలోకి రాజ్యాంగేతర శక్తులు ప్రవేశించాయి. రిటైరైపోయిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల గుప్పిట్లో పోలీసు శాఖ చిక్కుకుంది. రిటైర్డ్ డీజీ ఏబీవీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్, రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ల మాటే శాసనంగా చలామణి అవుతోంది.సర్వీసు మొత్తం అత్యంత వివాదాస్పదంగా ముద్రపడ్డ ఈ ముగ్గురూ ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంలో పోలీసు శాఖపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే ఈ అధికారులు ఎస్సై నుంచి డీజీపీ స్థాయి అధి కారిని కూడా శాసిస్తున్నారు. వారి ప్రాపకం పొందిన అధికారులకే పోస్టింగులు ఇస్తున్నారు. వారు చెప్పి నట్టల్లా ఆడాలని, చెప్పిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించాలని షరతులు పెడుతున్నారు. ఇందుకు ఒప్పుకొన్న వారికే సీఎంవో కటాక్షం లభించి, పోస్టింగులు వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పోలీసు శాఖలో ఈ ముగ్గురి మాటే శాసనం.సర్వీసు అంతా అవినీతి, అక్రమాలు, వివాదాలే..ఈ ముగ్గురు అధికారుల సర్వీసు మొత్తం వివాదాస్పదమే. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరు చెలరేగిపోయారు. పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్నది బహిరంగ రహస్యం. ఆశ్రిత పక్షపాతం, రాజకీయ కక్ష సాధింపులతో ఫక్తు రాజకీయ నేతల మాదిరిగానే వ్యవహరించారు. వీరిలో డీజీ హోదాలో ఇటీవల రిటైరైన ఏబీ వెంకటేశ్వరరావు సర్వీసు అంతా అత్యంత వివాదాస్పదం. గతంలో నిఘా విభాగం అధిపతిగా చేసినప్పుడు వైఎస్సార్సీపీ నేతలను వేధించడం, ప్రలోభాలకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నారు. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి, టీడీపీలో చేర్పించడంలో ప్రధాన పాత్రధారి. టీడీపీ రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు ఈయన ఏకంగా కేంద్ర భద్రతా చట్టాలను ఉల్లంఘించి మరీ ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలను కొనడం సంచలనం సృష్టించింది. తన కుమారుడి కంపెనీ ద్వారా పెగాసస్ కంపెనీ స్పైవేర్‌ను అక్రమంగా కొన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ కొన్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర శాసన సభలోనే చెప్పడం సంచలనం రేపింది.» పూర్వపు డీజీపీ ఆర్పీ ఠాకూర్ అవినీతి, వివాదాలకు మారుపేరుగా ముద్ర పడ్డారు. ఆయన రాయలసీమలో పని చేసినప్పుడు ఫ్యాక్షనిస్టులతో అంటకాగి శాంతి భద్రతలను గాలికొదిలేశారు. 2018లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగితే.. డీజీపీగా ఉన్న ఠాకూర్ కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా ఏకపక్షంగా ఆ కేసును పక్కదారి పట్టించేందుకు యత్నించారు. దానిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అప్పటి రాష్ట్ర పోలీస్ బాస్‌గా ఉన్న ఈయన మాత్రం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. ఇంత చేసినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన సీనియారిటీని గౌరవించి కీలక పోస్టింగులు ఇచ్చింది. ఆర్టీసీ ఎండీగా గౌరవనీయమైన పోస్టులో రిటైరయ్యే అవకాశం కల్పించింది. రిటైరైన తరువాత కూడా కీలక పదవిలో నియమించింది. ఆయన మాత్రం పచ్చ రాజకీయ వాసనలను వీడలేదు. ఇటీవలి ఎన్నికల సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో మకాం వేసి మరీ ఆ పార్టీ కోసం పని చేశారు. పోలీసు అధికారులను బెదిరించారు. ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేసేందుకూ సాహసించారు. ఎన్నికల్లో టీడీపీ అక్రమాల కుట్రలో కీలకంగా వ్యవహరించారు. డీఐజీ స్థాయిలో రిటైరైన ఘట్టమనేని శ్రీనివాస్ గత ఐదేళ్లుగా టీడీపీ బ్యాక్ ఆఫీసులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ కేంద్రంగా పని చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం పంపిణీని ఆయనే పర్యవేక్షించారు.ఇవిగో ఉదాహరణలురాజధాని ప్రాంతంలో కీలక జిల్లా పోలీసు అధికారి పోస్టు ఆశించిన ఓ ఐజీ స్థాయి అధికారిని కొన్ని రోజుల క్రితం వీరు పిలిపించారు. వైఎస్సార్సీపీ నేతలు ఎవరెవరి మీద ఎక్కడెక్కడ అక్రమ కేసులు ఎలా పెట్టవచ్చో ఒక లిస్టు తయారు చేసి ఇవ్వాలని చెప్పారు. ప్రస్తుతం తాము పెట్టిస్తున్న అక్రమ కేసులను పర్యవేక్షించాలని, జిల్లా ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో మాట్లాడుతూ కేసుల నమోదు, వేధింపులు వేగవంతం చేసేట్టు చూడాలని కూడా చెప్పారు. తాము సంతృప్తి చెందితే ఆయన ఆశించిన కీలక పోస్టింగ్ ఇస్తామని షరతు విధించారు. దాంతో ఆ అధికారి వారు చెప్పిన పని చేశారు. వైఎస్సార్సీపీ నేతల మీద అక్రమ కేసులను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఆయన పనితీరుతో ఆ ముగ్గురు రిటైర్డ్ అధికారులు సంతృప్తి చెంది పచ్చ జెండా ఊపారు. దాంతో ప్రభుత్వం ఆయనకు రాజధాని ప్రాంతంలో కీలక పోలీసు అధికారిగా పోస్టింగ్ ఇచ్చింది.» ఇటీవలి ఎన్నికల్లో గుంటూరులో అత్యంత వివాదాస్పద అధికారిగా మారిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా పోస్టింగ్ కోసం వీరి వద్దకు వచ్చారు. ఎన్నికల్లో టీడీపీకి కొమ్ముకాశాను కాబట్టి కీలక పోస్టింగ్ కావాలని కోరారు. ఆయనకు కూడా ఇదే విధమైన షరతు విధించారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడితో ఏమాత్రం సంబంధం లేని వారిని ఆ కేసులో ఇరికించాలని, వేధించాలని చెప్పారు. అలా చేస్తేనే మరింత ప్రాధాన్యమున్న పోస్టింగ్ ఇస్తామని చెప్పారు. » జిల్లాల ఎస్పీలతో సహా శనివారం బదిలీ చేసిన 37 మంది ఐపీఎస్ జాబితా తయారు చేసిందీ ఈ ముగ్గురే. ఇటీవలి ఎన్నికల్లో ఏకపక్షంగా వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టి వేధించి తీవ్ర వివాదాస్పదమైన బిందుమాధవ్ నాయుడును కర్నూలు జిల్లా ఎస్పీగా నియమించారు. టీడీపీ సీనియర్ నేతకు సమీప బంధువైన కోయ ప్రవీణ్‌ను కర్నూలు రేంజ్ డీఐజీగా నియమించారు. టీడీపీకీ అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరిస్తారని పేరు బడ్డ దామోదర్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ఈ విధంగా మొత్తం ఐపీఎస్‌ల నియామ కాలన్నీ ఈ ముగ్గురు రిటైర్డ్ అధికారుల ఎంపిక మేరకే చేసినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చెప్పినట్లు చేస్తేనే పోస్టింగులుఈ ముగ్గురికీ ప్రభుత్వం ఎలాంటి నామినేటెడ్ పదవులు, ఇతరత్రా అధికారిక హోదా ఏదీ ఇవ్వలేదు. అయినా వారు చెప్పిందే చేయాలని ముఖ్య నేత పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్టు సమాచారం. తద్వారా పోలీసు శాఖను ఈ ముగ్గురే నియంత్రిస్తారని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ముఖ్య నేత కార్యాలయం స్పష్టం చేసింది. దీంతో ఈ ముగ్గురూ చెలరేగిపోతున్నారు. రాష్ట్రాన్ని ప్రాంతాలవారీగా పంచేసుకుని ఎస్సై నుంచి డీజీపీ వరకూ యావత్ పోలీసు వ్యవస్థనే గుప్పిట్లోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీలు, డీఐజీల పోస్టింగులు అన్నీ వీరే ఖరారు చేస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ ముగ్గురి కనుసన్నల్లోనే రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ సాగుతోంది. శనివారం 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు, అంతకుముందు కొన్ని రోజుల క్రితం అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారుల బదిలీలన్నీ ఈ ముగ్గురి ఎంపిక మేరకే జరిగాయి. వీరు ముగ్గురూ ఐపీఎస్ అధికారులను పిలిపించుకుని మాట్లాడి సంతృప్తి చెందిన తరువాతే వారి ఫైళ్లు ముందుకు కదిలాయి. అనంతరమే పెద్ద బాబు, చిన బాబు ఆమోదముద్ర వేశారు. ఐపీఎస్‌లే కాదు.. సీఐల పోస్టింగులు కూడా వీరి కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ఐపీఎస్ నుంచి సీఐ వరకు పోస్టింగులకు రేటు కూడా ఫిక్స్ చేస్తున్నట్లు పోలీసు శాఖలో చర్చ నడుస్తోంది. అంతేకాదు.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల మీద అక్రమ కేసులు ఎలా పెడతారు? ఎలా వేధిస్తారు? అంటూ పోస్టింగులకు ముందు అధికారులను వీరు ముగ్గురూ ప్రశ్నిస్తున్నారు. తాము సంతృప్తి చెందితేనే పోస్టింగుల జాబితాలో వారి పేరు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు చేసిన బదిలీలన్నీ అదే ప్రాతిపదికన చేశారు. -
వర్ధన్నపేట బరిలో రిటైర్డ్ ఐపీఎస్ కేఆర్ నాగరాజు
సాక్షి, వరంగల్: వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహరచనతో వెళ్తోంది. ఇప్పటికే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణను నియమించిన పార్టీ అధిష్టానం.. ఇక్కడి నుంచి బరిలోకి దింపే అభ్యర్థి విషయంలోనూ ఆర్థిక, కుల, స్థానిక, పరిచయాలు ఉన్న వారిని ఎంపిక చేసి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని పావులు కదుపుతోంది. కొద్ది రోజులుగా వరంగల్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కొండేటి శ్రీధర్ కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశముందని వార్తలొచ్చాయి. తాజాగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతోపాటు రిటైర్డ్ ఎస్పీ, ఎస్సీ మాల వర్గానికి చెందిన కేఆర్ నాగరాజు పేరు వినిపిస్తోంది. ఇందులో భాగంగానే మామునూరు క్యాంపులో ఆదివారం జరిగిన ‘క్యాంప్ లైన్స్ బాయ్స్’ ఆత్మీయ సమ్మేళనం ఈయన పొలిటికల్ ఎంట్రీని ఖరారు చేసింది. మీకు మేం అండగా ఉంటాం.. మీరు రాజ కీయాల్లోకి రండి’ అంటూ ఈ ఆత్మీయ సమ్మేళనంలో మిత్రులందరూ ప్రతిపాదించడాన్ని బట్టి చూస్తుంటే నాగరాజు వర్ధన్నపేట గడ్డ వేదికగా పోరుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కొల్లాపూర్‌లో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి, మరికొందరు నేతలతోపాటు కేఆర్ నాగరాజు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెళ్లనుండడంతో ఆయన చేరిక లాంఛనమేనని స్థానిక నేతలు అంటున్నారు. మళ్లీ వర్ధన్నపేట నుంచే... స్థానికుడితోపాటు వర్ధన్నపేటలోనే ప్రొహిబిషనరీ ఎస్సైగా 1990లో పోలీస్ కెరీర్ ప్రారంభించిన నాగరాజు.. ఇప్పుడు అక్కడి నుంచే రాజకీయ ప్రస్థానం మొదలెట్టేలా వ్యూహరచన చేస్తున్నారు. స్పెషల్ పార్టీలో పని చేసిన సమయంలోనూ ఇక్కడ చాలామందితో పరిచయం ఉంది. స్కూలింగ్ మామునూరు పోలీస్ క్వార్టర్స్‌లో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు, ఆ తర్వాత పది వరకు రంగశాయిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ, ఆపై చదువులు హనుమకొండలో చదివారు. ఉమ్మడి వరంగల్‌లో వర్ధన్నపేట ప్రొహిబిషనరీ ఎస్సై, నెక్కొండ, కేయూసీ, మొగుళ్లపల్లి, స్పెషల్ పార్టీ, మిల్స్ కాలనీ, పరకాలలో ఎస్ఐగా, ములుగు, సుబేదారి, సీఐడీ వరంగల్, పాలకుర్తిలో సీఐగా, డీఎస్పీగా వరంగల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, జనగామలో పనిచేశారు. ఆతర్వాత హైదరాబాద్‌లో వివిధ హోదాల్లో పనిచేసి మళ్లీ వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీగా, ఆ తర్వాత ఐపీఎస్ వచ్చాక నిజామాబాద్ కమిషనర్‌గా పనిచేసి 2023 మార్చి 21న రిటైర్డ్ అయ్యారు. హాకీలోనూ జూనియర్, సీనియర్ నేషనల్స్ ఆడిన కేఆర్ నాగరాజు ఎక్కువ సమయం మాత్రం మామునూరుకే కేటాయించారు. ఇప్పటికే మామునూరు క్యాంప్‌నకు ఆనుకొని ఉన్న లక్ష్మీపురంలో ఇల్లు నిర్మించుకొని ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే అరూరిపై ఉన్న వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్‌కి ఉన్న బలం, తన వ్యక్తిగత పరిచయాలు, బంధువులు, పోలీసు శాఖలో ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న పరిచయాలు కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఓ దఫా వర్ధన్నపేట నియోజకవర్గంలో సర్వే పూర్తిచేసినట్లు తెలిసింది. గతంలోనూ పేరు వినిపించినా.. ఇప్పటికే కేఆర్ నాగరాజు పేరు కొన్నేళ్లుగా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీనుంచే వరంగల్ ఎంపీగా పోటీచేస్తారని గుసగుసలు వినిపించినా.. చివరకు హస్తం పార్టీ నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గపోరు వల్ల ఎంపీగా పోటీ చేస్తే ప్రయోజనం ఉండదనుకున్న కేఆర్ నాగరాజు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోటీచేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీనుంచి నమిండ్ల శ్రీనివాస్ వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు లేకపోవడం కూడా కేఆర్ నాగరాజుకు కలిసిరానుంది. ఇప్పటికే కేఆర్ నాగరాజు బరిలో ఉంటారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన సంకేతాలు ఇస్తున్నట్టుగా ప్రచారం ఉంది. ఇంకోవైపు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేరు కూడా పార్టీ శ్రేణుల్లో చక్కర్లు కొడుతోంది. దీనికితోడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు దంపతులు కూడా పార్టీని గెలిపించేవారికే సై అంటున్నట్టుగా ఉన్నారని తెలిసింది. దీంతో త్వరలోనే అభ్యర్థి ఎవరనేది తేలనుంది. -
భయభ్రాంత భారతమా? భయమే ఆయుధమా?
దేశం ఎన్నో విషయాలకు ఉలిక్కిపడు తోంది. అవి 140 పదాల ట్వీట్లు కావొచ్చు, వాట్సాప్ సందేశాలు కావొచ్చు, ఫేస్బుక్ పోస్టులు, ఈ-మెయిల్స్, ఆర్టికల్స్, పుస్తకాలు, పాటలు, నాటకాలు, సినిమాలు... అసలు దేశాన్ని అస్థిరపరచనిది అంటూ ఏదీ లేదు. దేశద్రోహం, మతపరమైన లేదా వర్గపరమైన సెంటిమెంట్లను దెబ్బకొట్టడం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులను గనక సంకేతంగా భావిస్తే దేశం వినా శనానికి దగ్గరగా ఉన్నట్టు. ప్రపంచంలోని ఇంకే దేశమూ రాజ్యానికి వ్యతిరేకంగా నేరాలు చేశారని ఆరోపిస్తూ తన సొంత పౌరుల మీద ఇన్ని కేసులు పెట్టదు. ఒకవేళ ఈ కేసులన్నీ వాస్తవమైనవే అయితే, స్పష్టంగా ఈ దేశంలో ఏదో లోపం ఉందని అర్థం. నిర్మాణం లోపభూయిష్టం అయివుండాలి, లేదా ఇక్కడి ప్రజలకు దేశం పట్ల ప్రేమ లేద నుకోవాలి. అలా కానట్టయితే, ‘ఇతరులు’ అనుకునే వాళ్లందరి తోనూ రాజకీయ లెక్కలు సరిచూసుకుంటున్నట్టు. సాధారణంగా ఈ ఇతరులు అనేవాళ్లు ముస్లింలు, వామపక్షీయులు, అర్బన్ నక్సలైట్లు, విద్యార్థులు, ఇంకా ఇతర విస్మృత వర్గాలకు చెందిన కార్యకర్తలు. ఇంకోలా చెప్పాలంటే, ఎవరి అభిప్రాయం అత్యధిక ప్రజలను రెచ్చగొట్టేట్టుగా ఉందో వాళ్లు దేశ వ్యతిరే కులు అవుతారు, వాళ్లను రాజ్యపు సర్వశక్తులతో వేటాడుతారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, 2017–19 మధ్య రాజ్యానికి వ్యతిరేకంగా నమోదైన కేసులు 25,118. సగటున ఏడాదికి 8,533. ఈ రాజ్య వ్యతిరేక నేరాల్లో 93 కేసులు దేశ ద్రోహం(సెక్షన్ 124ఎ); 73 కేసులు దేశం మీద యుద్ధం తల పెట్టినవి(సెక్షన్ 121 లాంటివి); 58 కేసులు దేశ సమగ్రతకు సంబంధించినవి(సెక్షన్ 153బి); 1,226 కేసులు ‘ఉపా’. నిజ మైన తీవ్రవాద దాడి ఒక్కటి కూడా దేశంలో జరగని కాలంలో ‘ఉపా’, ‘దేశద్రోహం’ కేసుల్లో వందల మంది అరెస్టయ్యారు. దేశంలో ఇంతమంది తీవ్రవాదులు ఉన్నారా? ఎవరైనా కేంద్ర ప్రభుత్వాన్ని హింసామార్గంలో కూలదోయాలని మాట్లా డటం విన్నామా? కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాదులు దేశం నుంచి విడిపోవాలని కోరుకున్నారు. కానీ వాళ్లెప్పుడూ ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోయాలని మాట్లాడలేదు. 2004లో సీపీఐ (మావోయిస్ట్) సభ్యులు విప్లవం అన్నారు. వాళ్ల ప్రయత్నంలోని నిరర్థకత అర్థమై వాళ్లు కూడా దాని గురించి మాట్లా డటం మానేశారు. దేశంలో ఇంతమంది తీవ్రవాదులు ఉన్నారంటే, ప్రభుత్వంలో తీవ్ర లోపం ఉందని అర్థం. సుదీర్ఘ కాలంగా ఈ పరిపాలన నడుస్తున్న తీరు ఎంతోమంది యువ కులు, పరిశోధక విద్యార్థులను తీవ్రవాదులుగా మార్చేస్తోందని అర్థం. లేదా ఈ మొత్తం విషయమే ఒక ప్రహసనం. ప్రపంచంలో బహుశా మన ఒక్కదేశంలోనే 73 ఏళ్ల స్వాతంత్య్రానంతరం కూడా అన్ని రాజకీయ పక్షాల నాయకులు దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాలని పిలుపునివ్వడంలో ఎంత మాత్రమూ అలసిపోరు. ఇక్కడ పాఠశాలల్లో ప్రారంభం నుంచే దేశభక్తిని ప్రబోధిస్తాం, అయినా చాలామంది దేశానికి అశుభం కోరుకుంటారని తలుస్తాం. నిరంకుశత్వం అనే భావన భారత రాజ్యాన్ని పట్టిపీడిస్తోంది. ఏమాత్రం భిన్నాభిప్రాయం పొడ సూపినా మన రాజకీయ నాయకులు తీవ్రమైన అభద్రతకు లోనవుతున్నారు. నిర్మాణాత్మకంగా ఏమీచేయనప్పుడు, వాళ్లు చూపగలిగేది రాజకీయ వ్యూహమే. ‘ఒక్కరిని చంపు, పదివేల మందిని భయపెట్టు’ అంటాడు గొప్ప చైనా వ్యూహకర్త సన్ ట్జూ. ‘ఒక్కరిని తప్పుడు కేసులో ఇరికించు, పదివేలమందిని భయపెట్టు’ అని భారతదేశం దీన్ని నవీకరించింది. 2017–19 మధ్య 6,250 కేసులు భిన్న వర్గాల మధ్య వైరాన్ని పెంచడం అన్న కారణంతో నమోదైనవి. ఇవన్నీ కూడా సెంటిమెంట్లను దెబ్బతీశారని పెట్టినవి. విశ్వగురువుగా చెప్పు కునే దేశంలోని ప్రజలు ఇంత అతిసున్నిత మనస్కులు అయ్యారా? దైవదూషణ చట్టం మన దగ్గర లేదుగానీ 153ఎ, 295ఎ సెక్షన్లను మితిమీరి వాడటం పరిస్థితిని దానికంటే దిగ జారుస్తోంది. అనుద్దేశపూర్వకంగా ఏదైనా మతాన్ని అవమా నిస్తే అదేమీ నేరం కాదని 1957 నాటి రామ్‌జీ లాల్ మోదీ వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా, ద్వేషంతో చేసేదే నేరం. వీళ్లు చాలడం లేదని ఈమధ్య మనకు ‘అంతర్జాతీయ కుట్రదారులు’ కూడా తయారయ్యారు. 1976లో ఒక కేసులో తీర్పిస్తూ వి.ఆర్.కృష్ణ అయ్యర్ తన మద్దతుదారులకంటే విమర్శకుల నుంచే ఎక్కువగా ప్రభుత్వం నేర్చుకోగలదని వ్యాఖ్యానించారు. అలాంటిది తేలికపాటి హాస్యానికి కూడా పోలీసు కేసులు పెట్టే రోజులొచ్చాయి. అంటే దేశం ‘భయభ్రాంత భారత్’ అవుతోందని అర్థం. లేదంటే, తన ప్రజలను పాలించడానికి భయం అనే ఆయుధాన్ని వాడుతోం దని అనుకోవాలి. ఎన్.సి. ఆస్థానా వ్యాసకర్త విశ్రాంత ఐపీఎస్ అధికారి, కేరళ మాజీ డీజీపీ -
నేడు వైఎస్సార్సీపీలోకి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి
భీమవరం టౌన్: ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలతో మమేకమవుతున్న తీరు మనస్సును హత్తుకోవడంతో వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం నాగులపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కె.లక్ష్మీరెడ్డి తెలిపారు. భీమవరంలో డాక్టర్ ఎం.బాపిరాజు నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాతో తనకెంతో అనుబంధం ఉందని, ఇక్కడ స్నేహితులు, ఆత్మీయులు ఎందరో ఉన్నారన్నారు. 1995–98లో జిల్లాలో పనిచేశానని, 2012లో సీనియర్ ఎస్పీగా మహబూబ్‌నగర్‌లో పదవీ విరమణ చేశానన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం ఎంతో శ్రమిస్తున్నాడని, ఆయన ఆత్మస్థైర్యాన్ని చూసి ఎంతో మంది ఆయన అడుగులో అడుగు వేస్తున్నారన్నారు. ఆదివారం వైఎస్ జగన్ సమక్షంలో తానుపార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. రాష్ట్రమంతా పర్యటిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుని పరిష్కారాలు చూపుతున్న జగన్మోహన్రెడ్డి ప్రజల హృదయాల్ని గెలుచుకుంటున్నారన్నారు. తాను పార్టీలో ఏ పదవి ఆశించి చేరడం లేదన్నారు. విశ్రాంత జీవితం గడుపుతున్న తనకు జగన్ పాదయాత్ర స్ఫూర్తి కలిగించిందన్నారు. తన సేవలను పార్టీ ఏ విధంగా వినియోగించుకుంటే ఆ విధంగా సహకరిస్తామన్నారు. రిటైర్డ్ రిజిస్ట్రార్, నెల్లూరు వీపీఆర్ ఫౌండేషన్ సీఈఓ ప్రొఫెసర్ వి.నారాయణరెడ్డి, ఏలూరు సీనియర్ న్యాయవాది బీవీ కృష్ణారెడ్డి, కడప జిల్లా రాజంపేటకు చెందిన గురుప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. -
ఏపీ హోంశాఖ సలహాదారుగా రిటైర్డ్ ఐపీఎస్
అమరావతి: ఏపీ హోంశాఖ సలహాదారుగా రిటైర్డ్ ఐపీఎస్ కోడె దుర్గా ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ప్రణాళిక అమలుపై హోంశాఖకు దుర్గాప్రసాద్ సలహాలు ఇవ్వనున్నారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ కేడర్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ అధికారి అయిన కోడె దుర్గా ప్రసాద్ 2011 నవంబర్‌లో ఎస్పీజీ చీఫ్‌గా పదోన్నతి పొందారు. అంతకు ముందు విశాఖపట్టణం పోలీస్ కమిషనర్‌గా, ఏపీ ట్రాన్స్‌కో మేనేజింగ్ డైరెక్టర్‌గా, గ్రేహౌండ్స్ చీఫ్‌గా, అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా పలు బాధ్యతలు నిర్వహించారు. కొద్ది కాలం రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్‌గా కూడా పనిచేశారు.