
సాక్షి, ప్రకాశం జిల్లా: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన కేసులో విజయ్‌పాల్‌ను ఈ రోజు కూడా పోలీసులు విచారించారు. రాజకీయ కక్షతోనే విజయ్‌పాల్‌ను అరెస్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈనెల 13న విజయ్‌పాల్ మొదటి సారి విచారణకు హాజరయ్యారు. రెండోసారి ఈ రోజు(మంగళవారం) విచారించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. మొత్తం ఎనిమిది సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment