Anti Corruption Unit
-
BCCI: బీసీసీఐ ఏసీయూ చీఫ్‌గా NIA మాజీ హెడ్
BCCI ACU New Chief: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి చెందిన అవినీతి నిరోధక విభాగానికి (ఏసీయూ) అధిపతిగా ప్రముఖ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శరద్ కుమార్ నియమితులయ్యారు. గతంలో ఆయన టెర్రరిజం కార్యకలాపాల్ని నిరోధించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా నాలుగేళ్ల పాటు క్లిష్టమైన టెర్రిరిజం దర్యాప్తులను చేపట్టారు.ఎన్ఐఏ హెడ్‌గా పనిచేసిన అనుభవంఉత్తరప్రదేశ్కు చెందిన 68 ఏళ్ల శరద్ 1979 బ్యాచ్‌కు చెందిన హరియాణా క్యాడర్ ఐపీఎస్. ముంబై ఉగ్రదాడి అనంతరం కేంద్రం ఎన్ఐఏను ఏర్పాటు చేసింది. 2013 నుంచి 2017 వరకు శరద్ ఎన్ఐఏ హెడ్‌గా వ్యవహరించారు. అనంతరం 2018 నుంచి 2020 వరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలోనే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో కీలకంగా పనిచేశారు.కేకే మిశ్రా ఏడాది పాటేఇప్పుడు ఆ అనుభవమే శరద్ కుమార్‌ను ఏసీయూ చీఫ్‌ను చేసింది. నిజాయితీ గల అధికారిగా పేరున్న శరద్ 1996లో, తిరిగి 2004లో రాష్ట్రపతి పోలీస్ మెడల్స్‌ను పొందారు. ఈ నెల 1 నుంచి బోర్డు ఏసీయూ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు పనిచేస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు ఏసీయూ చీఫ్‌గా ఉన్న కేకే మిశ్రా కూడా హరియాణా క్యాడర్‌కే చెందిన ఐపీఎస్ అధికారి. కానీ ఏడాది మాత్రమే పదవిలో ఉన్న ఆయన రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. చదవండి: WT20 WC Ind vs NZ: కివీస్ ముందు తలవంచారు -
భగత్‌సింగ్‌ను ఉరితీసిన రోజున పంజాబ్ సీఎం సంచలన ప్రకటన.. దేశంలోనే ఫస్ట్..?
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో సీఎంగా భగవంత్ మాన్ బాధ్యతలు స్వీకరించారు. కేజ్రీవాల్, భగవంత్ మాన్ ఆలోచనలతో పంజాబ్‌లో వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది ఆప్ ప్రభుత్వం. ఇప్పటికే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పి, మంత్రులకు టార్గెట్ విధించిన ఆప్ సర్కార్ తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. బుధవారం భగత్ సింగ్ బలిదానం చేసిన రోజైన షహీద్ దివస్ (మార్చి 23) సందర్భంగా ఖట్కర్ కలాన్‌లో సీఎం మాన్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల విగ్రహాల వద్ద నివాళి అర్పించిన అనంతరం పంజాబ్‌లో అవినీతిపరుల ఆట కట్టించేందుకు యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ నంబర్(9501200200)ను సీఎం ప్రకటించారు. అందులో భాగంగానే యాంటీ కరప్షన్ యాక్షన్ లైన్ పేరుతో ఒక వాట్సాప్ నంబర్(9501200200)ను విడుదల చేశారు. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్ ఓ వీడియో పోస్ట్ విడుదల చేశారు. పంజాబ్‌లో ఎవరైనా లంచం అడిగినా, మరేదైనా అవినీతికి పాల్పడినట్లు ప్రజల దృష్టికి వస్తే ఈ వాట్సాప్ నంబర్‌కు వీడియో లేదా ఆడియో రికార్డింగ్ చేసి పంపించాలన్నారు. అనంతరం సీఎం పర్యవేక్షణలో ఉన్న ఓ టీమ్ వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పంజాబ్‌ను అవినీతిమయం కాకుండా కాపాడుకుందామని సీఎం పిలుపునిచ్చారు. పంజాబ్‌ను అవినీతి రహితం చేస్తే అదే మనం స్వాతంత్ర్య సమర యోధులకు ఇచ్చి నివాళి అంటూ వ్యాఖ్యలు చేశారు. AAP PUNJAB GOVT LAUNCHES ANTI-CORRUPTION ACTION LINE! 📞 WhatsApp: 9501-200-200 "कोई रिश्वत मांगे तो मना मत करना! उसकी Audio/Video Recording कर लेना, हम उसके ख़िलाफ़ एक्शन लेंगे!" - CM @BhagwantMann #AAPagainstCorruption pic.twitter.com/TsXHUKH9Iq — AAP (@AamAadmiParty) March 23, 2022 -
బీసీసీఐకి కొత్త ఏసీయూ చీఫ్
ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లో కీలక విభాగమైన యాంటీ కరప్షన్ యూనిట్‌కు కొత్త బాస్‌ను నియమించారు. త్వరలో ఐపీఎల్-14వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గుజరాత్ మాజీ డీజీపీ షాబిర్ హుస్సేన్ షెఖదమ్ ఖాండావాలాను కొత్త ఏసీయూ చీఫ్‌గా నియమించింది. బీసీసీఐలో ఇప్పటివరకూ ఏసీయూ చీఫ్‌గా వ్యవహరించిన అజిత్ సింగ్ షెకావత్ పదవీకాలం మార్చి 31న ముగిసింది. 2018 ఏప్రిల్ 30 నుంచి 2021 మార్చి 31 వరకూ అజిత్ సింగ్ షెకావత్ బీసీసీఐ ఏసీయూ చీఫ్‌గా సేవలందించారు. ఐపీఎల్లో బెట్టింగ్ మాఫియా పెరిగిపోతుండటంతో బుకీలపై నిఘా తప్పనిసరి చేశారు. అందుకే పాత చీఫ్ పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త నియామకం చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుండటంతో షాబిర్ హుస్సేన్ రెండు రోజుల్లో అక్కడకు ప్రయాణం కానున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆటగాళ్లందరికీ అవగాహనా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. 'ఏసీయూ రెండు బృందాలుగా విడిపోయి చెన్నై, ముంబై ప్రయాణం అవుతాయి. రెండు నగరాల్లో ఉన్న ఎనిమిది జట్లలోని ఆటగాళ్లకు ఒకసారి పూర్తి అవగాహన కల్పిస్తాము. బుకీలు ఆటగాళ్లను ఎలా సంప్రదిస్తారు. సోషల్ మీడియా ద్వారా ఆటగాళ్లకు ఎలా వలవేస్తారనే దానిపై పూర్తిగా పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్తాము. గతంలో ఆటగాళ్లను ఎలా సంప్రదించి లోబరుచుకున్నారు అనే ఉదాహరణలు కూడా చెప్తాము' అని కొత్త బాస్ షాబిర్ హుస్సేన్ తెలిపారు. పాత ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ కాలంలో అనేక మంది బుకీలను అరెస్టు చేసి జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఆటగాళ్లు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే వారికి హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేస్తారు. ఇక్కడ చదవండి: కాస్కోండి.. మిమ్ముల్ని చితక్కొట్టడానికి వస్తున్నాడు! వివాదాస్పద రనౌట్ దుమారం: ‘డీకాక్ తప్పేమీ లేదు’