ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ శరద్ కుమార్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.
న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్ శరద్ కుమార్ పదవీకాలాన్ని అనూహ్యంగా వరుసగా రెండోసారి కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
హర్యానాకు చెందిన శరద్ కుమార్ 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2013, జూలై 30న ఆయన ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు.