పుణేవాసుల్లో మహిళలే అధికంగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ప
పింప్రి, న్యూస్‌లైన్: పుణేవాసుల్లో మహిళలే అధికంగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. పదేళ్ల క్రితం 2.5 శాతం మంది ఉద్యోగినులు, ఒక శాతం మంది గృహిణుల్లో ఈ వ్యాధులు ఉండేవని డాక్టర్ సతేజ్ జోనార్కర్ తెలిపారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రులను పరిశీలిస్తే 55 శాతం మంది రోగులు గుండె జబ్బులు ఉన్నవారేనని తేలిందని వివరించారు. మధుమేహం కూడా పెరుగుతోందన్నారు. 2020 నాటికి దేశంలో 26 లక్షల మంది గుండె వ్యాధుల బారిన పడే అవకాశముందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. ఆరోగ్యంపై మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని, గుండె జబ్బు లక్షణాలు కనిపించిన వెంటనే అశ్రద్ధ చేయకూడదని గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ శిరీష్ సాఠే తెలిపారు. ఎప్పుడన్నా గుండెలో నొప్పి అని పించినా నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు.