Benefits Of Eating Apple: పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా మధుమేహం, మానసిక, గుండె సమస్యలను నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదని ఎన్నాళ్లుగానో వింటున్నాం. పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజలవణాలు ఆపిల్స్‌లో పుష్కలంగా ఉండడం వల్లే ఈ మాట వాడుకలో ఉంది.
►గుండె సంబంధిత సమస్యల ముప్పుని తగ్గించుకోవాలంటే రోజూ కనీసం ఒక ఆపిల్ తినాలి. దీనిలోని పీచు పదార్థం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
►అంతేగాక రక్తపీడనాన్ని అదుపులో ఉంచడానికి తోడ్పడి హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఆపిల్ నివారిస్తుంది.
►మధుమేహం ఉన్నవారు ఏ పండ్లు తినాలి? ఏవి తినకూడదు అని తర్జనభర్జన పడుతుంటారు. ఇటువంటి వారు ఆపిల్స్‌ను నిరభ్యంతరంగా తినవచ్చని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
►మధుమేహం ఉన్నవాళ్లు ఆపిల్ తినడం వల్ల టైప్–2 డయాబెటీస్ ఏడు శాతం తగ్గుతుంది.
►ఆపిల్ తినడం వల్ల మానసిక సమస్యలు దరిచేరవు. ఆపిల్‌లో ఉన్న క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మానసిక సమస్యలు రానివ్వదు.
►అందుకే రోజూ ఆపిల్స్ తినేవాళ్లలో ఆల్జీమర్స్, డిమెన్షియా(మతిమరుపు) వచ్చే అవకాశాలు తక్కువ.
Comments
Please login to add a commentAdd a comment