Anti accidents
-
హత్రాస్ తొక్కిసలాట.. తొలిసారి స్పందించిన భోలే బాబా
లక్నో : ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో భోలే బాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు .. సత్సంగ్ ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. కానీ ఆ ఘటన తర్వాత భోలే బాబా పరారయ్యాడు. పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.ఈ తరుణంలో ఉత్తర ప్రదేశ్ హత్రాస్‌లో 121 మందికి మరణానికి కారణమైన భోలేబాబా ఓ ప్రకటన చేశారు. వ్యతిరేక శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ఇది భయంకరమైన గందరగోళాన్ని సృష్టించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాడు.First responce from Bhole Baba Ashram after stampede incident. Appointed Advocate AP Singh for legal action pic.twitter.com/jXdq1AxW4H— Abhishek Thakur (@Abhisheklive4u) July 3, 2024తన న్యాయవాది ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. తాను వెళ్లిన చాలా సేపటి తర్వాత తొక్కిస లాట జరిగిందని తెలిపారు.సంత్సంగ్ ముగిసిన తర్వాత కొంతమంది సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాం. దీనిపై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తామంటూ ఓ నోట్‌ను విడుదల చేశారు.కాగా, సామాన్యుల మరణానికి కారణమైన భోలే బాబాను అరెస్టు చేస్తారా అని అడిగిన ప్రశ్నకు రాష్ట్ర పోలీసు చీఫ్ ప్రశాంత్ కుమార్ స్పందించారు. వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి.గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము అని ఆ నోట్లో పేర్కొన్నారు. -
కలబంద రసంతో.. ఉపయోగాలెన్నో..!
కలబందలో మొక్కలకు కావలసిన పోషకాలు, యాంటిఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. అమైనా ఆమ్లాలు, కాల్షియం, జింక్, మెగ్నీషియం వంటివి 75 రకాలపోషకాలుంటాయి.. ఇది మొక్కలను క్రిములు, వైరస్లు, శిలీంధ్రాల నుంచి కాపాడుతుంది. కలబంద ఆకు ముక్కలను మిక్సీలో వేస్తే రసం వస్తుంది. స్పూనుతో ఈ కింద చెప్పిన కొలతలో ఇంటిపంటలు / మిద్దెతోటల సాగులో వాడుకోవచ్చు..1. ఒక టీస్పూను కలబంద రసాన్ని ఒక లీటరు నీటితో కలిపి మొలక దశలో లేదా చిన్న మొక్కలు స్ప్రే చేయవచ్చు. వారానికి ఒక సారి చేస్తే సరి΄ోతుంది.2. ఒక టేబుల్ స్పూన్ రసాన్ని ఒక లీటరు నీటితో కలిపి మొక్క ఉన్న కుండీలోపోయాలి. ఇలా నెలకు ఒకసారి చేయాలి. దీనివలన మొక్కకు ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది.3. మొక్కను ఒక కుండీ నుంచి వేరే కుండీలోకి మార్చినప్పుడు లీటరు నీటికి ఒక టేబుల్ స్పూన్ రసాన్ని కలిపి కుండీలోపోయాలి. ఇలా చేస్తే మొక్క మార్పిడి వత్తిడికి గురికాదు.4. ఎరువుగా వాడాలి అన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల కలబంద రసాన్ని లీటరు నీటితో కలిపి మొక్క కుండీలోపోయాలి. ఇలా 15 రోజులకు ఒకసారి వాడాలి.5. స్ప్రే చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ వాడాలి లీటరు నీటికి. ఆకుల అడుగు భాగంలో మాత్రమే స్ప్రే చేయాలి. దీనివలన మొక్క తొందరగాపోషకాలను గ్రహిస్తుంది.6. రూటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఏదైనా మొక్క కొమ్మను విరిచి నాటుకోవాలంటే, నేరుగా కలబంద రసంలో అరగంట కొమ్మ చివరను నానబెట్టి, ఆ తరువాత నాటవచ్చు.7. ఇది బూడిద తెగులును అరికడుతుంది. గమనిక: కలబంద రసం తయారు చేసిన అర గంట లోపే వాడాలి. పులిస్తే అందులో ఉన్నపోషకాలు కొన్నిపోతాయి.– విజయలక్ష్మి, బెంగళూరు మిద్దెతోట బృందంఇవి చదవండి: ఫోన్ కనపడకపోతే.. ప్రాణం పోతోందా? అయితే మీకీ వ్యాధి ఉన్నట్లే! -
చలిలో అనారోగ్యం... నెయ్యితో వైద్యం
ప్రస్తుతం వ్యాధి నిరోధక సామర్ధ్యం / ఇమ్యూనిటీ మీద సర్వత్రా అవగాహన పెరిగిన నేపధ్యంలో నెయ్యి అనేది ఒక సహజమైన ఇమ్యూనిటీ బూస్టర్‌గా ఆహార నిపుణులు సిథ్స్ఫార్మ్ నిర్వాహకులు కిషోర్ ఇందుకూరి అభివర్ణిస్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తో పాటు ఇతర పలు సంస్థలు కూడా నెయ్యి అందించే ఆరోగ్య లాభాలను థృవీకరించిన నేపధ్యంలో నెయ్యి వినియోగం వల్ల కలిగే పలు ప్రయోజనాలు ఆయన వివరించారిలా... దేశీ నెయ్యి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. తద్వారా వింటర్ సీజన్లో విభిన్న రకాల వైరస్‌లను అడ్డుకుని ఫ్లూ, దగ్గు, జలుబుల నుంచి రక్షిస్తుంది. ఆయుర్వేద గ్రంధాల ప్రకారం... దేహంలోని అంతర్గత ఉష్ణాన్ని క్రమబద్ధీకరించి ఉంచేందుకు నెయ్యి సహకరిస్తుంది. అందువల్లే దీనిని చలికాలపు వంటకాలు, గజర్ కా హల్వా, మూంగ్ దాల్ హల్వా తదితర మిఠాయిల్లో ఎక్కువ వినియోగిస్తారు. శీతాకాలంలో ప్రధాన పండగలు రావడం, ఆ సమయంలో దీపాలను సైతం నెయ్యి తో వెలిగించడం వెనుక అంతరార్ధం ఇదే. అలాగే పిండివంటలు వండుకోవడం సర్వ సాధారణం. గారెలు, బూరెలు, అరిసెలు...మరేవైనా సరే వాటి తయారీలో ఆయిల్ వినియోగం తప్పనిసరి. అయితే వీలైనంత వరకూ పిండి వంటలు నెయ్యితో వండడం శ్రేష్టమంటున్నారు నిపుణులు సంప్రదాయంగా మన భారతదేశ వంటల విధానంలో నెయ్యి ఒక తప్పనిసరి ముడి సరుకు. మరీ ముఖ్యంగా శాఖాహార వంటలకు సంబంధించి అటు రుచిని ఇటు ఆరోగ్యాన్ని పెంచేందుకు నెయ్యి తప్పనిసరిగా వినియోగించేవారు. అయితే రిఫైండ్ ఆయిల్స్‌తో నెయ్యిని మేళవించడం అనేది ఆధునికులు చేస్తున్న అతిపెద్ద పొరపాటని పోషకాహార నిపుణుల మాట. పుష్కలంగా నీరుతో పాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా నెయ్యిలో పుష్కలంగా ఉంటాయి. తద్వారా వ్యాధి నిరోధకత పెంపొందుతుంది. శరీరం కొవ్వును గ్రహించడంలో నెయ్యి సహకరిస్తుంది. బరువు తగ్గించే మార్గాల్లో నెయ్యి వాడకం కూడా ఒకటని నవతరం వైద్యులు చెబుతున్నారు. నెయ్యిలో శరీరానికి అవసరమైన, కొవ్వును కరిగించే ద్రవపదార్ధాలు, శరీర ధర్మాల్ని నిర్వర్తించడంలో సహకరించే డి,కె,ఇ,ఇ విటమిన్స్ ఉంటాయి. దీనిలో బ్యుటిరిక్ యాసిడ్ ఉంటుంది. దీనిని పెద్ద పేగు కణాలు శక్తి కారకంగా ఉపయోగించుకుంటాయి. హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను కాపాడుతుంది. –కణాల విధులను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ రాకను నెయ్యిలోని అధిక వేడి గుణం అడ్డుకుంటుంది. పరగడుపున ఉదయం పూట నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కణాల పునరుజ్జీవన ప్రక్రియను అది బలోపేతం చేస్తుంది. నెయ్యిలోని యాంటాక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ గుణాలు చర్మంలోని సున్నితత్వాన్ని పరిరక్షిస్తాయి. చర్మాన్ని దెబ్బ తీసే పిగ్మంటేషన్ ను, ఇన్ఫ్లమేషన్ ను దూరం చేస్తాయి. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. ఇది సహజమైన మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. గుండె పనితీరు, కంటి చూపును మెరుగుపరచి, కేన్సర్, మలబద్దక నివారిణిగా ఉపకరిస్తుంది. దగ్గు, జలుబు, తలనొప్పి వంటి శీతాకాల సమస్యలను తగ్గించేందుకు చేసే న్యాసా చికిత్సలో గోరు వెచ్చని నెయ్యిని వినియోగిస్తారు. –భారతీయ పురాణాలు, సంప్రదాయాలు ఎప్పటి నుంచో నెయ్యి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. అలాగే ఆయుర్వేద చికిత్స నిపుణులు...దీనిని సహజసిద్ధమైన ఇమ్యూనిటీ బూస్టర్‌గా అభివర్ణిస్తారు. అలాగే శాస్త్రీయ పరిశోధనలు కూడా నెయ్యిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం అత్యుత్తమ ఆరోగ్య చిట్కాగా తేల్చాయి. –కిషోర్ ఇందుకూరి, సిథ్స్ ఫార్మ్ -
రోజూ కనీసం ఒక ఆపిల్ తినాలా.. మరి ఆ పేషంట్ల సంగతేంటి?!
Benefits Of Eating Apple: పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా మధుమేహం, మానసిక, గుండె సమస్యలను నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదని ఎన్నాళ్లుగానో వింటున్నాం. పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజలవణాలు ఆపిల్స్‌లో పుష్కలంగా ఉండడం వల్లే ఈ మాట వాడుకలో ఉంది. ►గుండె సంబంధిత సమస్యల ముప్పుని తగ్గించుకోవాలంటే రోజూ కనీసం ఒక ఆపిల్ తినాలి. దీనిలోని పీచు పదార్థం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ►అంతేగాక రక్తపీడనాన్ని అదుపులో ఉంచడానికి తోడ్పడి హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఆపిల్ నివారిస్తుంది. ►మధుమేహం ఉన్నవారు ఏ పండ్లు తినాలి? ఏవి తినకూడదు అని తర్జనభర్జన పడుతుంటారు. ఇటువంటి వారు ఆపిల్స్‌ను నిరభ్యంతరంగా తినవచ్చని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ►మధుమేహం ఉన్నవాళ్లు ఆపిల్ తినడం వల్ల టైప్–2 డయాబెటీస్ ఏడు శాతం తగ్గుతుంది. ►ఆపిల్ తినడం వల్ల మానసిక సమస్యలు దరిచేరవు. ఆపిల్‌లో ఉన్న క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మానసిక సమస్యలు రానివ్వదు. ►అందుకే రోజూ ఆపిల్స్ తినేవాళ్లలో ఆల్జీమర్స్, డిమెన్షియా(మతిమరుపు) వచ్చే అవకాశాలు తక్కువ. -
Weight Loss: బరువు తగ్గాలా.. ‘గ్రీన్ కాఫీ’ ట్రై చేయండి!
రోజూ తాగే కాఫీపొడి, వేయించిన గింజల నుంచి తీస్తారు. వేయించకుండా పచ్చిగా ఉన్న గింజలతో చేస్తే కాఫీనే గ్రీన్ కాఫీ అంటారు. కాఫీ గింజలను వేయించినప్పుడు కొన్ని ఔషధ గుణాలను కోల్పోతాము. అలా కాకుండా గ్రీన్ కాఫీ తాగితే అనేక ఔషధ గుణాలు శరీరానికి అందుతాయి. ఆ గుణాలేంటో చూద్దాం... ►గ్రీన్ కాఫీ శరీరంలోని కొవ్వుని కరిగించి అధిక బరువును తగ్గిస్తుంది. ►వివిధ కారణాలతో శరీరంలో అంతర్గతంగా జరిగే నష్టాన్ని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నివారిస్తాయి. ►మధుమేహన్ని, రక్తపోటును నియంత్రిస్తుంది. ►జీవక్రియలను మెరుగు పరిచి బరువును నియంత్రణలో ఉంచుతుంది. ►యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అందడం వల్ల వయసు ప్రభావంతో చర్మం ఏర్పడే ముడతలు త్వరగా రావు. చదవండి: Health Tips: వేరు శెనగలు, ఖర్జూరాలు, కిస్మిస్లు తరచుగా తింటే... Typhoid Diet: టైఫాయిడ్ టైంలో ఇవి తినడం చాలా ప్రమాదకరం.. మరేం తినాలి?! -
కరోనా: పెరుగుతున్న విటమిన్ల వాడకం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ విజంభన వల్ల ప్రపంచ దేశాల్లో విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవడం పెరిగిపోయింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కావలసిన రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు నేడు ప్రజలు విటమిన్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. రొమ్ము, అండాశయం తదితర క్యాన్సర్ల నుంచి బయట పడేందుకు ఏసీఈ విటమిన్లు దోహదం చేయడం కూడా విటమిన్ల వాడకాన్ని పెంచింది. గతేడాదితో పోలిస్తే ఒక్క బ్రిటన్‌లోనే విటమిన్ల వినియోగం ఏకంగా 17.3 శాతం పెరిగింది. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 12 రకాల మొక్కలు, ఐదు రకాల జంతువుల నుంచి వస్తోన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. అందుకనే ఇంకా విటమిన్లు, పోషక పదార్థాల కోసం ఇతర మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది. బంగాళా దుంపలో సీ విటమిన్‌తోపాటు బీ 6 విటమిన్లు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని ఎదుర్కోవడంలో కీలక పాత్ర వహించే డీ విటమిన్ లోపాన్ని ప్రజలు ఎదుర్కొంటున్నారు. అందుకు ఆధునిక జీవన విధానంతోపాటు వాణిజ్య ప్రపంచీకరణ కూడా కారణమే. క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో కూడా డీ విటమిన్ బాగా పని చేస్తోందని తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. సూర్య రశ్మి ద్వారా వచ్చే డీ విటమిన్ కోసం కూడా నేడు ప్రజలు సప్లిమెంట్లపై ఆధార పడాల్సి వస్తోంది. (చదవండి: భారత్‌లో తగ్గుతున్న ‘కరోనా మరణాలు’) శరీరంలోని ‘యాంటీ ఆక్సిడెంట్లు’ తగ్గించడంలో ఏ, ఈ విటమిన్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఏ, ఈ విటమిన్లు ఎక్కువగా ఉండే సప్లిమెంట్ల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటికి బదులుగా ఈ రెండు విటమిన్లు సహజంగా దొరికే ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు. ఇక ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కూడా జీర్ణ శక్తి బాగా మెరగుపర్చడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కూడా వైద్యులు సూచిస్తున్నారు. కే1, కే2 విటమిన్లు రక్త ప్రసరణలో ప్రముఖ పాత్ర వహిస్తాయని ఓ తాజా అధ్యయనంలో తేలింది. పాలకూర, బీట్రూట్, క్యాబేజీ, బీన్స్, కోడిగుడ్లు, బెర్రీస్, గ్రేప్స్, దానిమ్మ కాయల్లో ఈ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. (చదవండి: కరోనాను 'ఢీ'కొట్టండి) -
తొలి మెడిసిన్ చాక్లెట్!
వాషింగ్టన్: చాక్లెట్ ప్రియులకు ‘తీపి’కబురు. చాక్లెట్ తింటే కొలెస్ట్రాల్, కొవ్వు పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుందని చాలా మంది నోరు కట్టేసుకుంటారు. అయితే ఈ చాక్లెట్ తింటే అలాంటి ముప్పేమీ ఉండదు. అమెరికాకు చెందిన కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా రక్తపోటును తక్కువగా ఉంచే, మంచి కొలెస్ట్రాల్‌ను శరీరంలో ఉంచే సరికొత్త మెడిసిన్ చాక్లెట్‌ను రూపొందించింది. యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఉండే చాక్లెట్, కకోలను దీని తయారీలో వాడారు. సాధారణంగా చాక్లెట్ బార్లో కనీసం 70 శాతం కొవ్వు, షుగర్ ఉంటాయి. అయితే కుకా జోకో రూపొందించిన నమూనా చాక్లెట్లో కేవలం 35 శాతమే కొవ్వు, షుగర్ ఉంటాయని ‘మెట్రో’ పత్రిక పేర్కొంది. కోకో మొక్క సారంతో కకోలో ఉండే చేదును తొలగించవచ్చని కంపెనీ ప్రతినిధి అహరొనియన్ చెప్పారు. ఇది చాక్లెట్‌లోని కొవ్వును తొలగిస్తుందని, దీంతో కకో నుంచి లభించే వైద్య ప్రయోజనాలను పొందవచ్చన్నారు. సాధారణ చాక్లెట్లో ఉండే కొవ్వును ఇప్పటికి సగానికి తగ్గించామని, అయితే 10 శాతం కొవ్వు, షుగర్ ఉండే చాక్లెట్‌ను తయారుచేయడమే తమ లక్ష్యమన్నారు. -
వయసును నిలిపేయండి... వ్యాధుల్ని జయించండి!
మీరు తక్కువ వయసు వారిగా కనిపిస్తూ దీర్ఘకాలం యౌవనంతో ఉండాలనుకుంటున్నారా? మీ వయసు పదేళ్లు వెనక్కుపోతే బాగుంటుందనిపిస్తోందా? మీకు ఏ జబ్బులూ త్వరగా రాని విధంగా వ్యాధినిరోధకశక్తి ఉండాలని భావిస్తున్నారా? వీటన్నింటికీ పరిష్కారం యాంటీ ఆక్సిడెంట్స్. ఇంతటి శక్తిమంతమైన ఈ పోషకాల కోసం మనం ఏ ట్యాబ్లెట్లూ మింగనక్కర్లేదు, ఏ టానిక్కులూ తాగనక్కరలేదు. అన్ని సీజన్లలో లభించే తాజా పండ్లు, ఆకుపచ్చటి కూరగాయలు తింటే చాలు... మీరు కోరుకునే పై కోరికలన్నీ తీరతాయి. అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్పై అవగాహన కోసం ఈ కథనం. యాంటీ ఆక్సిడెంట్స్ మిమ్మల్ని చాలాకాలం పాటు వయసు పైబడకుండా చేయడమే కాదు... ఆ వయసులో ఉండే వ్యాధినిరోధకతనూ సమకూరుస్తాయి. ఆ పని ఎలా చేస్తాయో తెలుసుకునే ముందుగా మనం మనలోని జీవకణాల గురించి కాస్త తెలుసుకోవాలి. మన దేహమంతా జీవకణాలతో నిర్మితమై ఉంటుంది. ప్రతి జీవకణంలోనూ ప్రతిక్షణం జీవక్రియలు జరుగుతూనే ఉంటాయి. మన దేహాన్ని ఒక వాహనంతో పోల్చుదాం. ఇంధనం మండి, శక్తి విడుదల అయితేనే కదా బండి నడిచేది. అలాగే మన జీవక్రియలన్నీ నడవాలంటే కూడా ప్రతి జీవకణంలో ఇంధనం మండి, శక్తి వెలువడాలి. కణాల్లోని జీవక్రియల్లో జరిగిదేదిదే. ఈ జీవక్రియల్లో మనం తీసుకున్న పదార్థాలు పరమాణువుల రూపంలో ఉండే అయాన్లుగా మారతాయి. ఒక పదార్థం మూలకంగా ఉన్నప్పుడు మాత్రమే అస్థిత్వాన్ని కలిగి ఉంటుంది. కానీ అది దాని పరమాణువులుగా మారి అయాన్ల రూపంలో ఉన్నప్పుడు అస్థిత్వం కలిగి ఉండక... తన అస్థిత్వం కోసం పక్కనున్న పదార్థాలతో రసాయనిక చర్య జరిపి మళ్లీ స్థిరమైన మూలకంగా ఏర్పడటం కోసం తపిస్తుంటుంది. ఈ క్రమంలో పక్కన ఏ పదార్థం ఉంటే దానితో రసాయనికచర్య జరుపుతుంది. ఇలా రసాయనిక చర్య జరపడం అంటే మామూలు పరిభాషలో దాన్ని తినేయడమే. ఉదాహరణకు బయటపడి ఉన్న ఒక ఇనుపముక్కతో గాలిలో ఉండే ఆక్సిజన్ రసాయనికచర్య జరిపిందనుకుందాం. ఒక కెమిస్ట్ పరిభాషలో చెప్పాలంటే అక్కడ ఆక్సీకరణం జరిగిందంటారు. కానీ మామూలు వ్యక్తుల భాషలో చెబితే ఆ ఇనుపముక్కకు తుప్పు పట్టిందంటారు. ఇలాగే మన దేహంలోని కణాల్లోనూ శక్తిని ఉత్పన్నం చేయడం కోసం మనం పీల్చుకునే ఆక్సిజన్ కణాల్లో పోషకాలను మండిస్తుంది. ఆ ప్రక్రియలో జరిగే ఆక్సిడేషన్ ప్రక్రియలో అయాన్లు వెలువడతాయి. ఆ అయాన్లపై విద్యుదావేశం ఉంటుంది కాబట్టి వాటిని ఫ్రీ రాడికల్స్ అంటారు. ఆ అయాన్లపై ఉండే విద్యుదావేశాలు రెండూ... పాజిటివ్, నెగెటివ్ చర్య జరిపి ఒక న్యూట్రల్ పదార్థాన్ని ఏర్పరిస్తేనే గాని మళ్లీ ఆ అయాన్ల ప్రభావం అంతరించదు. ఈ ప్రక్రియలో ఆక్సిడేషన్ తర్వాత అయాన్లు వెలువడతాయి కాబట్టి వాటిని ఆక్సిడెంట్స్ అనుకోవచ్చు. ఇక మనం తీసుకునే తాజా పండ్లు, ఆకుకూరల్లోని పోషకాలు ఆ అయాన్లతో వెంటనే చర్య జరిపి, మన దేహంలోని మిగతా కణాలు వెంటనే దెబ్బతినకుండా కాపాడతాయి. అంటే ఆక్సిడెంట్స్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి కాబట్టి వాటిని ‘యాంటీ-ఆక్సిడెంట్స్’ అంటారన్నమాట. కణకాలుష్యం నుంచి విముక్తి, దీర్ఘకాలపు యౌవనప్రాప్తి ఎలా? వాహనంలో ఇంధనం మండినప్పుడు శక్తి వెలువడి వాహనాన్ని నడిపిస్తుంది. ఈ క్రమంలో విడుదలైన కాలుష్యపు పొగ... వాహనానికి ఉన్న గొట్టం ద్వారా బయటకు వస్తుంది. మరి మన దేహంలోని కణాల్లోనూ ఇదే ప్రక్రియ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. అప్పుడు కూడా మన దేహకణాల్లో మనం పీల్చుకున్న ఆక్సిజన్ వల్ల (అంటే రెస్పిరేషన్ కారణంగా), ఒక పక్క కణనిర్మాణమూ, మరో పక్క కాలుష్యంతో కణ నాశనం... ఇలా జరిగే కణనాశన ప్రక్రియను అరికట్టేందుకు కణం రిపేర్... ఇవన్నీ జరిగే జీవక్రియల్లో (అంటే మెటబాలిక్ కార్యకలాపాల్లో), శక్తివనరు అయిన గ్లూకోజ్ మండి శక్తి వెలువడే ప్రక్రియలో (అంటే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో) కణాల్లోనూ కాలుష్యాలు ఏర్పడతాయి. ఇవి శరీరంలో లోపల ఏర్పడే కాలుష్యాలు. కాగా మన వాతావరణంలోనూ దేహకణాలకు హానిచేసే కాలుష్యాలు ఉంటాయి. అవి... వాతావరణ కాలుష్యం, సూర్యకాంతి, ఎక్స్-రేలు, పొగ, ఆల్కహాల్ వంటివి. ఇవన్నీ మనలో అంతర్గతంగా ఏర్పడే కాలుష్యాలు, బయటి కాలుష్యాలు కలగలసి మన దేహ కణాలను నిత్యం దెబ్బతీస్తూ ఉంటాయి. ఒకవేళ ఇలా దెబ్బతీయడమే ఎక్కువగా జరుగుతుంటే మన కణాలకు త్వరగా వృద్ధాప్యం వస్తుంది. ఒకవేళ అప్పటికప్పుడు ఆ కాలుష్యాలను తొలగిస్తూ, అవి చూపే ప్రభావాలను తగ్గిస్తూ ఉండే పోషకాలను మనలోకి పంపిస్తున్నామనుకోండి. అప్పుడు కణం దీర్ఘకాలం ఆరోగ్యంగా, యౌవనంగా ఉంటుంది కదా. అలా ఉండటం వల్ల ఒకపట్టాన మనకు వృద్ధాప్యం దరిచేరదన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్‌తో ఏయే వ్యాధుల నుంచి రక్ష... యాంటీ ఆక్సిడెంట్స్ అనేక వ్యాధుల నుంచి మన దేహాన్ని రక్షిస్తాయి. ప్రధానంగా రెండు రకాలుగా ఇవి శరీరంలోని కణాలను కాపాడతాయి. ఒకటి పోషకాల రూపంలో తీసుకున్నప్పుడు అంటే విటమిన్లు, ఖనిజాలు (మినరల్స్) గా స్వీకరించినప్పుడు. దాంతోపాటు ప్రోటీన్ల రూపంలోని కొన్ని పోషకాలు మన దేహంలోకి వెళ్లాక రసాయనికచర్యల తర్వాత ఎంజైములుగా మారి కూడా కణాల పాలిట శ్రీరామరక్షగా ఉంటాయి. ఇలా ఈ రెండు తరహాల్లో అవి మనల్ని ఏ క్యాన్సర్ ఏ గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్ ఏ పక్షవాతం (స్ట్రోక్) ఏ అల్జైమర్స్ ఏ వ్యాధినిరోధకశక్తిలోపంతో వచ్చే జబ్బులు ఏ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏ క్యాటరాక్ట్... వంటి ఎన్నో వ్యాధుల నుంచి కాపాడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పనితీరుకు ఇదో ఉదాహరణ... యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోడానికి ఒక చిన్న ఉదాహరణ. మీరు ఒక ఆపిల్‌ను కోసి వాతావరణంలో ఉంచారనుకోండి. ఆపిల్‌లోని ఇనుముతో గాలిలోని ఆక్సిజన్ చర్య జరిపి కాసేపటి తర్వాత అది బ్రౌన్ రంగులోకి మారుతుంది. కానీ ఒక నిమ్మకాయను పిండి ఆ రసాన్ని ఆపిల్ ముక్కలపై పడేలా చేస్తే అది అలా మారదన్నమాట. అంటే నిమ్మరసంలోని విటమిన్ ‘సి’ అనే యాంటీ ఆక్సిడెంట్... ఆపిల్‌లోని ఇనుము కణాల (ఫ్రీరాడికల్స్)తో), గాలిలోని ఆక్సిజన్ కణాల (ఫ్రీ-రాడికల్స్) తో చర్యజరపకుండా కాపాడిందన్నమాట. ఈ క్రమంలో ఆక్సిజన్ కణాలతో నిమ్మలోని యాంటీఆక్సిడెంట్స్ చర్య జరిపి ఆపిల్ ను రక్షించాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఆపిల్ ముక్కలను తాజాగా ఉంచినట్లు, మన దేహంలోని కణాలనూ తాజాగా ఉంచుతాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్‌లో రకాలు : ఏ ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్స్ : గ్లూటాథయోన్, ఎస్ఓడీ వంటివి శరీరంలోనే ఉత్పత్తి అయి, అవి 24 గంటలూ శరీరంలోనే ఉంటూ కణాలను రక్షిస్తూ ఉంటాయి. వీటిని ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఏ సెకండరీ యాంటీ ఆక్సిడెంట్స్ : వీటిని మనం బయటి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి, మన దేహ కణాలను రక్షిస్తుంటాయి. స్వాభావికంగా దొరికే యాంటీ ఆక్సిడెంట్లు... ఏ చిక్కుళ్లు : చిక్కుళ్ల పైతోలులో ఉండే పాలీఫినాల్స్ అనే పోషకాలు చాలా విలువైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇక రాజ్మా, కిడ్నీ బీన్స్ కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్లే. ఏ టొమాటో : వీటిల్లో లైకోపిన్ అనే పోషకం ఉంటుంది. ఇది యాంటీ-క్యాన్సరస్‌గా పనిచేసే యాంటీఆక్సిడెంట్. అయితే టొమాటోలు తినడం ద్వారా లభ్యమయ్యే లైకోపిన్ మన శరీరంలో ఇంకడానికి ఆరోగ్యకరమైన కొవ్వులు కావాలి. అందుకే వాటిని నాణ్యమైన నూనెతో చేసిన వంటకంగా తీసుకుంటే ఎంతో ఆరోగ్యం. ఏ నట్స్ : బాదం, ఆక్రోట్, వేరుశనగ గింజలు వంటి వాటిల్లో విటమిన్ ‘ఇ’ పుష్కలంగా ఉంటుంది. ఇది కణాలను దెబ్బ తినకుండా రక్షించి, వయసు పైబడనివ్వకుండా చేస్తుంది. అంతేకాదు.. క్యాన్సర్, గుండెజబ్బులు, క్యాటరాక్ట్ వంటి జబ్బుల నుంచి కాపాడుతుంది. విటమిన్ ‘ఇ’ మరో విటమిన్ అయిన ‘సి’తో కలిసి కొన్ని దీర్ఘకాలిక జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఏ బెర్రీ పండ్లు : బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో యాంథోసయనిన్, హైడ్రాక్సిసిన్నమిక్ ఆసిడ్, హైడ్రాక్సీబెంజోయిక్ ఆసిడ్, ఫ్లేవనాయిడ్స్ అనే పోషకాలు, విటమిన్‘సి’ పుష్కలంగా ఉంటాయి. ఇది అన్ని యాంటీ ఆక్సిడెంట్స్లలోకెల్లా ప్రభావవంతమైనది. పై పోషకాలన్నీ కలిసి మన శరీరానికి ఎన్నో విధాల రక్షణను, ఆరోగ్యాన్నీ సమకూరుస్తాయి. ఎన్నో ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని కాపాడతాయి. మన దేహంలోని కండరాలు, ఎముకలతో బలంగా పట్టి ఉంచేందుకు దోహదపడే కొలాజెన్ ఉత్పాదనకు తోడ్పడతాయి. మన రక్తనాళాలన్నీ చివరల వరకూ మూసుకుపోకుండా సంరక్షిస్తూ... ఏదైనా గాయం అయినప్పుడు వెంటనే మానేందుకు ఉపకరిస్తాయి. అంతేకాదు... పై పోషకాలు ఇనుము, ఫోలేట్ అనే పోషకాలు మన దేహంలోకి వేగంగా ఇమిడిపోయేలా చేస్తాయి. ఏ ద్రాక్షపండ్లు : ఈ పండ్లలో ‘రిస్వెరట్రాల్’ అనే పోషకం ఉంటుంది. ఇది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి సమర్థంగా ఉపయోగపడుతుంది. మనం చాలా ప్రభావవంతమైన విటమిన్ ‘సి’తో పోల్చినా ద్రాక్షలో ఉండే రిస్వెరట్రాల్ పోషకం హాని చేసే కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) పట్ల దాదాపు 10 నుంచి 20 రెట్లు అధిక ప్రభావపూర్వకంగా పని చేసి చాలా వేగంగా దాన్ని నిర్వీర్యం చేస్తుంది. అందుకే ద్రాక్షపండ్లు గుండెజబ్బులు రాకుండా రక్షణ కల్పిస్తుంది. నిర్వహణ: యాసీన్ యాంటీ ఆక్సిడెంట్ తాలూకు శక్తి, ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని, ఏయే యాంటీ ఆక్సిడెంట్స్ లోపాల వల్ల ఏయే పరిణామాలు సంభవిస్తాయో శాస్త్రీయంగా గుర్తించి, ఆ లోపాలను భర్తీ చేసేలా, అవసరమైన యాంటీ ఆక్సిడెంట్‌ను ఇచ్చి రుగ్మతలను సరిచేసే ప్రయత్నాన్ని రేవా హెల్త్, స్కిన్, హెయిర్ సంస్థ చేస్తోంది. ఇందుకోసం యాంటీ ఆక్సిడెంట్ ప్రోగ్రామ్ (ఏటీపీ) పేరిట ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో ఫిజీషియన్, న్యూట్రిషనిస్ట్, చర్మవ్యాధి నిపుణులు పాలుపంచుకుంటారు. మేని ఛాయ ప్రకాశవంతంగా, మేను నునుపుగా, ఆరోగ్యంగా ఉండటంతో పాటు, మన జుట్టు కూడా అంతే ఆరోగ్యంగా, ఒత్తుగా ఎదిగేలా చేయడానికి ఏటీపీ కార్యక్రమం తోడ్పడేందుకు అవకాశం ఉంది. -అంజలి డాంగే అంజలి డాంగే చీఫ్ న్యూట్రిషనిస్ట్, రేవా హెల్త్, స్కిన్, హెయిర్ క్లినిక్, బంజారాహిల్స్, హైదరాబాద్.