Health Benefits of Green Coffee in Telugu - Sakshi
Sakshi News home page

Health Tips: ఈ కాఫీ తాగితే బరువు తగ్గొచ్చు.. ఇంకా

Published Fri, Sep 24 2021 8:55 AM | Last Updated on Fri, Sep 24 2021 1:14 PM

Health Tips In Telugu: Green Coffee Uses For Weight Loss - Sakshi

రోజూ తాగే కాఫీపొడి, వేయించిన గింజల నుంచి తీస్తారు. వేయించకుండా పచ్చిగా ఉన్న గింజలతో చేస్తే కాఫీనే గ్రీన్‌ కాఫీ అంటారు. కాఫీ గింజలను వేయించినప్పుడు కొన్ని ఔషధ గుణాలను కోల్పోతాము. అలా కాకుండా గ్రీన్‌ కాఫీ తాగితే అనేక ఔషధ గుణాలు శరీరానికి అందుతాయి. ఆ గుణాలేంటో చూద్దాం... 

గ్రీన్‌ కాఫీ శరీరంలోని కొవ్వుని కరిగించి అధిక బరువును తగ్గిస్తుంది. 

వివిధ కారణాలతో శరీరంలో అంతర్గతంగా జరిగే నష్టాన్ని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నివారిస్తాయి. 

మధుమేహన్ని, రక్తపోటును నియంత్రిస్తుంది. 

జీవక్రియలను మెరుగు పరిచి బరువును నియంత్రణలో ఉంచుతుంది. 

యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా అందడం వల్ల వయసు ప్రభావంతో చర్మం ఏర్పడే ముడతలు త్వరగా రావు.  

చదవండి: Health Tips: వేరు శెనగలు, ఖర్జూరాలు, కిస్‌మిస్‌లు తరచుగా తింటే...
Typhoid Diet: టైఫాయిడ్‌ టైంలో ఇవి తినడం చాలా ప్రమాదకరం.. మరేం తినాలి?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement