గ్రీన్‌టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని విన్నాం. పైగా దీన్ని తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది, ఎన్నో యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు కూడా. ఐతే గ్రీన్ టీ ఉన్నట్లే..గ్రీన్ కాఫీ కూడా ఉందని విన్నారా..?. కాఫీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. అందుకని టీ ఉన్నట్లే కాఫ్లీ కూడా ఉంటే బాగుండనన్న ఆ ఆలోచనకు రూపం ఇచ్చారు ఈ కేరళ విద్యార్థులు. అలానే గ్రీన్ టీ మాదిరిగానే ఈ గ్రీన్ కాఫీ కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాల అందించేదిగా ఉండాలని భావించారు. అందుకోసం వాళ్లు ఏం చేశారు. ఎలాంటి ప్రయోగాలు చేశారు? విజయవంతమయ్యారా తదితరాల గురించి చూద్దాం.!
లారస్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లాజిస్టిక్స్‌కు చెందిన పది మంది సభ్యుల విద్యార్థి బృందం ఈ గ్రీన్ కాఫీని తయారు చేసే ప్రయోగాలకు నాంది పలికారు. వాళ్లు మంచి ఆరోగ్యకరమైన కాఫీని తయారు చేయడం, ఉత్పత్తులు మంచిగా కొనగోలు అయ్యేలా ప్యాకింగ్ వంటి వాటిపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఇలాంటి కొత్త ప్రయోగాల్లో కంపెనీలు తమవంత సహాయ సహకారాలు అందిస్తుంది. అలానే కలమ్సేరి ఆధారిత ప్రైవేటు కంపెనీ ఒకటి ఈ బృందానికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది.
ఇక ఈ బృందం ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ డాక్టర్ అజయ్ శంకర్ సలహాలు, సూచనలతో మంచి గ్రీన్ కాఫీని తయారు చేశారు. అయితే రుచి మాత్రం తాగేలా టేస్టీగా లేదు. ప్రజలు ఆసక్తిచూపి తాగే విధంగా అస్సలు లేదు. దీంతో విద్యార్థుల బృందం తీవ్ర ఆందోళనకు లోనయ్యింది. అయితే దీనికి రోజ్ ఫ్లేవర్, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు జోడించి చూశారు. అవి జోడిస్తే ప్రొడక్ట్ నిల్వ ఉండే వ్యవధి కాలం తగ్గిపోవడంతో ఇక ఆ ప్రయత్నం మానేశారు.
దీంతో ఈ అరబికా కాఫీ గింజలను చిన్న చిన్న ఉండలుగా చేసి ప్యాక్ చేయాలని నిర్ణయించారు. తీరా మార్కెట్లోకి రిలీజ్ చేశాక పూర్తిగా నష్టాల ఎదురయ్యాయి. దీంతో ప్రతి కస్టమర్‌కి గ్రీన్ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాల వివరించి అమ్మడం ప్రారంభించారు. కొద్ది రోజుల్లో వారిలో కూడా ఈ ప్రోడక్ట్‌పై నమ్మకం ఏర్పడి కొనుగోలు చేసేందుకు ఆసక్తికనబర్చారు.
ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
గ్రీన్ కాఫీ గింజలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. క్లోరోజెనిక్ యాసిడ్ ఉండటం వల్ల కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. గ్రీన్ కాఫీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అందువలన, ఇది బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది.
గ్రీన్ కాఫీ గింజల్లో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, గ్రీన్ కాఫీ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వరకు బ్యాలెన్స్ చేయవచ్చు.
గ్రీన్ కాఫీ అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది. రక్తపోటును పెంచే కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. రోజూ గ్రీన్ కాఫీ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
గ్రీన్ కాఫీ గింజలలో అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అధ్యయనాల ప్రకారం, గ్రీన్ కాఫీ గింజలలోని క్లోరోజెనిక్ యాసిడ్ ట్యూమర్ సెల్స్ ఏర్పడకుండా.. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది.
గ్రీన్ కాఫీ గింజలు సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తాయి. ఇవి శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు కొవ్వు, కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
(చదవండి: ఆ బామ్మ అమ్మే ఇడ్లీల ధర తెలిస్తే షాకవ్వుతారు! ఈ వయసులో..)
Comments
Please login to add a commentAdd a comment