Health Tips In Telugu: Is Green Tea Really Works For Weight Loss - Sakshi
Sakshi News home page

Green Tea- Weight Loss: గ్రీన్‌ టీ ఎంత మంచిది? నిజంగానే బరువు తగ్గుతారా?

Published Sat, Jun 25 2022 3:37 PM | Last Updated on Sat, Jun 25 2022 6:09 PM

Health Tips In Telugu: Is Green Tea Really Works For Weight Loss - Sakshi

Green Tea Health Benefits: బరువు తగ్గడానికి తీసుకునే ఆహార పానీయాల్లో గ్రీన్‌ టీ మెరుగ్గా పనిచేస్తుంది. గ్రీన్‌ టీ ఎంత పాపులర్‌ అంటే, ‘డైట్‌’ అనే పదాన్ని ప్రస్తావించినప్పుడు, గ్రీన్‌ టీ అందులో తప్పకుండా ఉంటుంది’’ అని న్యూట్రిషనిస్టులు, డాక్టర్లు చెబుతున్నారు.

కామెల్లియా సినెన్సిస్‌ మొక్క నుండి తయారైన గ్రీన్‌ టీకి.. ఆకుపచ్చ రంగు కారణంగా దానికి ఆ పేరు వచ్చింది. యాంటీ ఆక్సిడెంట్ల పవర్‌హౌస్‌గా పేరు తెచ్చుకున్న గ్రీన్‌ టీ నిజంగా బరువు తగ్గడంలో ఎంతవరకూ సహాయపడుతుందో తెలుసుకుందాం?

మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్‌ టీ!
గ్రీన్‌ టీ వల్ల ఇన్సులిన్‌ సెన్సిటివిటీ పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. టైప్‌ 2 డయాబెటీస్‌ వచ్చే రిస్క్‌ తగ్గుతుందని ఈ పరిశోధనల వల్ల తెలుస్తోంది. 

దంతాల ఆరోగ్యానికి
దంతాల ఆరోగ్యానికి గ్రీన్‌ టీ బాగా పని చేస్తుంది. నోటి దుర్వాసన, దంతక్షయం, వివిధ రకాల చిగుళ్ళ వ్యాధులు కలిగించే బ్యాక్టీరియాని గ్రీన్‌ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ నశింప చేస్తాయి. నోటి కాన్సర్‌ వచ్చే రిస్క్‌ని కూడా గ్రీన్‌ టీ తగ్గించగలదని తెలుస్తోంది.

బరువు తగ్గడానికి
బరువు తగ్గడానికి గ్రీన్‌ టీ పరోక్షంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వేడి లిక్విడ్‌ తాగడం వలన ఆహారం తీసుకోవాలనే కోరికను తగ్గిస్తుంది. అలా అని గ్రీన్‌ టీలో తేనెను అతిగా జోడించ కూడదు. 
అలాగే మంచిది కదా అని గ్రీన్‌ టీని అతిగా తాగడం మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల దుష్ప్రభావాలు కలగవచ్చు.
చదవండి: Magnesium Deficiency: ఇది లోపిస్తే కిడ్నీలు పాడవుతాయి.. ఇంకా! ఇవి తింటే మేలు! కానీ ఎక్కువైతే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement