లక్నో : ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో భోలే బాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు .. సత్సంగ్ ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. కానీ ఆ ఘటన తర్వాత భోలే బాబా పరారయ్యాడు. పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ తరుణంలో ఉత్తర ప్రదేశ్ హత్రాస్‌లో 121 మందికి మరణానికి కారణమైన భోలేబాబా ఓ ప్రకటన చేశారు. వ్యతిరేక శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ఇది భయంకరమైన గందరగోళాన్ని సృష్టించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాడు.
First responce from Bhole Baba Ashram after stampede incident. Appointed Advocate AP Singh for legal action pic.twitter.com/jXdq1AxW4H
— Abhishek Thakur (@Abhisheklive4u) July 3, 2024
తన న్యాయవాది ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. తాను వెళ్లిన చాలా సేపటి తర్వాత తొక్కిస లాట జరిగిందని తెలిపారు.సంత్సంగ్ ముగిసిన తర్వాత కొంతమంది సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాం. దీనిపై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తామంటూ ఓ నోట్‌ను విడుదల చేశారు.
కాగా, సామాన్యుల మరణానికి కారణమైన భోలే బాబాను అరెస్టు చేస్తారా అని అడిగిన ప్రశ్నకు రాష్ట్ర పోలీసు చీఫ్ ప్రశాంత్ కుమార్ స్పందించారు. వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి.గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము అని ఆ నోట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment