కలబందలో మొక్కలకు కావలసిన పోషకాలు, యాంటిఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. అమైనా ఆమ్లాలు, కాల్షియం, జింక్, మెగ్నీషియం వంటివి 75 రకాలపోషకాలుంటాయి.. ఇది మొక్కలను క్రిములు, వైరస్‌లు, శిలీంధ్రాల నుంచి కాపాడుతుంది. కలబంద ఆకు ముక్కలను మిక్సీలో వేస్తే రసం వస్తుంది. స్పూనుతో ఈ కింద చెప్పిన కొలతలో ఇంటిపంటలు / మిద్దెతోటల సాగులో వాడుకోవచ్చు..
1. ఒక టీస్పూను కలబంద రసాన్ని ఒక లీటరు నీటితో కలిపి మొలక దశలో లేదా చిన్న మొక్కలు స్ప్రే చేయవచ్చు. వారానికి ఒక సారి చేస్తే సరి΄ోతుంది.
2. ఒక టేబుల్ స్పూన్ రసాన్ని ఒక లీటరు నీటితో కలిపి మొక్క ఉన్న కుండీలోపోయాలి. ఇలా నెలకు ఒకసారి చేయాలి. దీనివలన మొక్కకు ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది.
3. మొక్కను ఒక కుండీ నుంచి వేరే కుండీలోకి మార్చినప్పుడు లీటరు నీటికి ఒక టేబుల్ స్పూన్ రసాన్ని కలిపి కుండీలోపోయాలి. ఇలా చేస్తే మొక్క మార్పిడి వత్తిడికి గురికాదు.
4. ఎరువుగా వాడాలి అన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల కలబంద రసాన్ని లీటరు నీటితో కలిపి మొక్క కుండీలోపోయాలి. ఇలా 15 రోజులకు ఒకసారి వాడాలి.
5. స్ప్రే చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ వాడాలి లీటరు నీటికి. ఆకుల అడుగు భాగంలో మాత్రమే స్ప్రే చేయాలి. దీనివలన మొక్క తొందరగాపోషకాలను గ్రహిస్తుంది.
6. రూటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఏదైనా మొక్క కొమ్మను విరిచి నాటుకోవాలంటే, నేరుగా కలబంద రసంలో అరగంట కొమ్మ చివరను నానబెట్టి, ఆ తరువాత నాటవచ్చు.
7. ఇది బూడిద తెగులును అరికడుతుంది.
గమనిక: కలబంద రసం తయారు చేసిన అర గంట లోపే వాడాలి. పులిస్తే అందులో ఉన్నపోషకాలు కొన్నిపోతాయి.
– విజయలక్ష్మి, బెంగళూరు మిద్దెతోట బృందం
ఇవి చదవండి: ఫోన్ కనపడకపోతే.. ప్రాణం పోతోందా? అయితే మీకీ వ్యాధి ఉన్నట్లే!
Comments
Please login to add a commentAdd a comment