పొన్నగంటి కూర మంచి పోషక విలువలు గలిగినది. ఇది అతి సులభంగా, అతి తొందరగా పెరిగే ఆకు కూర. దీనికి విత్తనాలు వుండవు. ఇది కేవలం కాండం ద్వారానే అభివృద్ధి చెందుతుంది. పొన్నగంటి కూర ఆకులు ఏడాది పొడవునా లభిస్తాయి.
►పోషక విలువలు... పొన్నగంటి కూరలో ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు సి, ఎ లకు మంచి మూలం.
►ఇంకా విటమిన్ ‘ఎ’, ‘బి6’, ’సి’, ఫొలేట్, రిబోఫ్లావిన్’, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం దీని నుంచి సమృద్ధిగా లభిస్తాయి.
►జుట్టుకు పోషణనిచ్చే బయోటిన్ పొన్నగంటి కూరలో పుష్కలంగా ఉంటుంది.
►పురాతన గ్రంథాలు, ఆయుర్వేద వైద్యనిపుణులు చెప్పిన దాని ప్రకారం పొన్నగంటి కూరను నలభై ఎనిమిది రోజులపాటు తింటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మకాంతి పెరుగుతుంది.
►పొన్నగంటి కూరను ఉడికించి, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారని, అదే కందిపప్పు, నెయ్యితో కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారనీ ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
►శుభ్రం చేసిన పొన్నగంటి ఆకును కట్ చేసి.. పెసరపప్పు, చిన్న ఉల్లి పాయలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాల పొడి చేర్చి ఉడికించి తీసుకుంటే రక్త శుద్ధి జరుగుతుంది.
►ఎక్కువ ఎండల్లో తిరిగి పనిచేసే వారికి, గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి కంటి కింద నల్లటి వలయాలు వస్తాయి. కంటి సమస్యలు ఏర్పడుతాయి. అలాంటి సమస్యలు ఎదురైతే.. పొన్నగంటి ఆకుతో తాలింపు చేసుకుని తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
►ఇంకా ఈ ఆకుకూర నోటి దుర్వాసనను పోగొడుతుంది.
►గుండెకు, మెదడుకు బలాన్నిస్తుంది.
►ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి.
ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది.
►దీనిలో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది.
►గౌట్ వ్యాధి, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి.
చదవండి: Sankranti Special Recipes: నోరూరించే అరిశెలు.. కరకరలాడే సకినాలు.. నువ్వుల్లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్.. కాబట్టి
Radish Health Benefits: ముల్లంగి రసం తాగుతున్నారా.. అయితే..
Comments
Please login to add a commentAdd a comment