Eye Problems
-
డేంజర్ జోన్ నుంచి బయటపడ్డా: బుల్లితెర నటి
బాలీవుడ్ బుల్లితెర నటి జాస్మిన్ భాసిన్ ఇటీవలే తన కళ్లకు ఆపరేషన్ చేయించుకుంది. కార్నియా దెబ్బతినడంతో సర్జరీ చేయించుకున్నట్లు సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించింది. ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్లో ధరించిన కాంటాక్ట్ లెన్స్‌ల కారణంగా కళ్లకు సమస్య వచ్చిందని తెలిపింది. జాస్మిన్ తన కళ్ల చికిత్స కోసం ముంబయి వెళ్లినట్లు చెప్పింది.తాజాగా తాను కళ్ల సమస్య నుంచి బయపడినట్లు జాస్మిన్ భాసిన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం డేంజర్ జోన్ నుంచి బయపడ్డాడని పేర్కొంది. చికిత్స తర్వాత డాక్టర్ సలహాతో రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నట్లు వెల్లడించింది. చివరికి నా కంటి పాచ్‌లను తొలగించారని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తనకు చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. నా ముఖంపై ఈ చిరునవ్వును తిరిగి తెచ్చినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. -
మసకేయిస్తున్న ‘మయోపియా’
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఓవైపు ఔట్‌డోర్ ఆటలకు అవకాశం లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు ఒకటే చదువులు.. ఇంకోవైపు కాస్తో కూస్తో దొరికిన విరామంలో స్మార్ట్ ఫోన్లతో కాలక్షేపం.. వెరసి పిల్లలు కంటి సమస్యల బారినపడుతున్నారు. ముఖ్యంగా మయోపియా కబళిస్తోంది. పిల్లల్లో దూర దృష్టి తగ్గిపోతోంది. కంటి లోపాలున్న పిల్లల్లో ప్రతి 20 మందిలో 18 మందిని మయోపియా వేధిస్తోంది. నేత్ర వైద్యులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఉదయాస్తమానం చదువులు, ఆ తర్వాత సెల్ఫోన్లో గేమ్స్‌కు అలవాటుపడుతున్న పిల్లల్లో మయోపియా సమస్యకు దారితీస్తోందని అంటున్నారు.‘స్మార్ట్’ కాటు..ప్రస్తుతం చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ స్మార్ట్ ఫోన్ చేతిలో లేనిదే నిమిషం గడవడం లేదు. ఎక్కువసేపు దీన్ని వాడే వారిలో పలు సమస్యలు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నిత్యం 5 నుంచి 6 గంటలు స్మార్ట్ ఫోన్ వినియోగించేవారు కళ్లు డ్రై అవడంతో సమస్యలకు గురవుతున్నారు. అలాంటి వారిలో కళ్లు మంటలు, దురదలు రావడం, వెలుతురు సరిగ్గా చూడలేకపోవడం, కళ్లు ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ దశలో సరైన చికిత్స పొందకుంటే చూపు మందగించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా డ్రైవింగ్ చేసే సమయంలో ఏకాగ్రతను కోల్పోయి కంగారు పడతారని అంటున్నారు.నివారణకు ఇలా చేయాలి..» పిల్లలు బయట ఆటలు ఆడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.» దగ్గర వాటితోపాటు దూరంగా ఉన్న వాటిని కూడా తరచూ చూస్తుండాలి.» బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుని స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించాలి. » కళ్లకు ఫోన్ 15 సెంటిమీటర్ల దూరంలో ఉంచి చూడాలి. ముఖానికి దగ్గరగా పెట్టుకోకూడదు. » 20 నిమిషాల పాటు ఫోన్, కంప్యూటర్ వాడాక 20 సెకన్ల పాటు దూరంలో ఉన్న వస్తువులను చూడాలి. కనురెప్పలు వేయడంతో నల్లగుడ్డు పొరపైకి నీరు చేరి కళ్లు డ్రై కావు. » ఎట్టి పరిస్థితుల్లో చీకట్లో స్మార్ట్ ఫోన్‌ను వినియోగించరాదు. » కంప్యూటర్‌పై పనిచేసే వారు యాంటీ రిఫ్లెక్టివ్ గ్లాసెస్ వాడితే ప్రయోజనకరంగా ఉంటుంది. » రోజులో ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్, కంప్యూటర్‌పై పనిచేసే వారు ఐడ్రాప్స్ వాడాలి.పిల్లల్లో దూర దృష్టి సమస్య..ప్రస్తుతం పిల్లల్లో ఎక్కువగా దూరపు చూపు తగ్గుతోంది. మా వద్దకు వచ్చే ప్రతి 20 మందిలో 18 మందికి ఇదే సమస్య ఉంటోంది. దీనికి కారణం పిల్లలు కేవలం పుస్తకాలు చదవడం, స్మార్ట్ ఫోన్లు చూడటానికి పరిమితం కావడమే. అలాంటి వారిలో కంటి సైజు పెరిగి దూరపు చూపు మందగిస్తోంది. ఔట్‌డోర్ క్రీడలు కూడా చాలా అవసరం. దూరంగా ఉన్న వాటిని కూడా పిల్లలు చూస్తూ ఉండాలి.. ఆటలు ఆడుతుండాలి. – డాక్టర్ బషీర్ అహ్మద్ మయోఖ్, నేత్ర వైద్య నిపుణుడు, విజయవాడ -
కాపాడే కన్నీరు పొడిబారితే..!
కన్ను ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఏదైనా కాస్త తగలగానే కళ్లల్లోంచి నీళ్లు కారిపోతుంటాయి. కన్ను పొడిబారితే ప్రమాదమని ప్రకృతి ఈ కన్నీళ్లను ఏర్పాటు చేసింది. నిత్యం ఏసీ గదుల్లో ఉండటం, కంప్యూటర్దో, ల్యాప్టాప్లదో, ఆఖరికి మొబైల్ స్క్రీన్నో ఎప్పుడూ చూస్తూ ఉండటంతో పాటు... కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు, జబ్బులు ఉన్నప్పుడు కూడా కన్నుపొడిబారుతుంది. ఇలా పొడిబారడం వల్ల కంటి ఇన్ఫెక్షన్లు వచ్చేందుకూ, ఒక్కోసారి చూపు కోల్పోయేందుకూ అవకాశముంది. కన్ను పొడిబారే సమస్యను వైద్య పరిభాషలో ‘కెరటో కంజంక్టివైటిస్ సిక్కా’(డ్రై ఐ) అని చెబుతారు. ఈ కండిషన్ అవగాహన పెంచుకుని, కంటిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ కథనం. కంటిని తడిగా ఉంచడానికి లాక్రిమల్ గ్లాండ్స్ అనే ప్రధాన కన్నీటి గ్రంథితో పాటు మ్యూసిన్ గ్లాండ్స్, మొబిమియన్ గ్లాండ్స్ అనే మరో రెండు రకాల గ్రంథులూ తోడ్పడతాయి. ఇందులో లాక్రిమల్ గ్లాండ్స్ నీటి మోతాదులెక్కువగా ఉండే కన్నీటినీ, మ్యూసిన్ గ్లాండ్స్ కాస్త జిగురుగా ఉండే పదార్థ్ధాన్నీ, ఇక మెబొమియాన్ గ్లాండ్స్ అనేవి కాస్త నూనెలా ఉండే పదార్థాన్ని (ల్యూబ్రికెంట్గా ఉపయోగపడేందుకు) స్రవిస్తాయి. ఈ మూడూ కలిసి పూర్తి కన్నీటి స్రావాలకు కారణమవుతాయి. గ్రంథుల పనితీరు మారుతుండే లోపాలు... ఈ మూడు గ్రంథుల పనితీరుల్లో, దేనిలో లోపం వచ్చినా... కన్నీటి నాణ్యత దెబ్బతింటుంది. ఏయే గ్రంథుల్లో లోపాలుంటాయో, దాన్ని బట్టి కన్నుపొడిబారడమనే ప్రక్రియలోనూ తేడాలొస్తాయి. ఉదాహరణకు... లాక్రిమల్ గ్లాండ్ కన్నీటిలోని నీళ్లను స్రవిస్తుంది. కాబట్టి దీనిలో లోపంతో కన్నీటిలోని నీరు మోతాదులు తగ్గుతాయి. మ్యూసిన్ తగ్గితే ‘టియర్ బ్రేకింగ్ టైమ్’ తగ్గుతుంది. అంటే కన్నీరు స్రవించాక అది ఓ పొర (ఫిల్మ్)లా ఏర్పడి... కొంతసేపు కన్ను ఉపరితలం మీద ఉంటుంది. ఏర్పడ్డ తర్వాత ఆ ఫిల్మ్ ఎంతసేపు ఉంటే... కంటికి అంత రక్షణ. ఇక కన్ను త్వరగా పొడిబారుతుందంటే... (అంటే నీరు త్వరత్వరగా ఆవిరైపోతుందంటే) మెబోమియన్ గ్లాండ్స్ పనితీరు తగ్గిందని అర్థం. బయట గాలివేగం ఎక్కువగా ఉన్నప్పుడు (విసురుగా గాలి వీస్తున్నప్పుడు), టూవీలర్ డ్రైవింగ్‌లో కన్నీరు ఎక్కువగా ఆవిరవుతుంది. కానీ జీవనశైలి మార్పులతో అంటే ఏసీలు, స్క్రీన్‌ను చాలాసేపు చూడటం, పొగతాగడం వంటి అలవాట్లతో ఆవిరి కావడం పెరుగుతుంది. దీన్నే ‘ఎవాపరేటివ్ డ్రై ఐ’ అంటారు. కన్ను పొడిబారడానికి మరికొన్ని కారణాలు... కన్ను పొడిబారడానికి అనేక కారణాలు ఉంటాయి. అవి... ∙వయసు పైబడటం: వయసు పెరుగుతున్న కొద్దీ కన్ను పొడిబారడమూ పెరుగుతుంటుంది. మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఇది ఎక్కువ. ∙కొన్ని వైద్య సమస్యలు: థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సాధారణ ఆటోఇమ్యూన్ సమస్యలు, కొలాజన్ వాస్క్యులార్ డిసీజ్, దీర్ఘకాలిక డయాబెటిస్, సిస్టమిక్ లూపస్ అరిథమటోసిస్ వంటి రుగ్మతలు ఉన్నవారిలో, కీళ్లనొప్పులతో బాధపడేవారిలో ఈ సమస్య ఎక్కువ. కొన్ని రకాల మందులు: యాంటీ డిప్రెసెంట్స్, యాంగ్జైటీని తగ్గించే మందులు, శరీరంలో నీటిని బయటకు పంపించే డైయూరెటిక్స్, మహిళల్లో గర్భనిరోధక మందులు, స్టెరాయిడ్స్, దీర్ఘకాలం పాటు గ్లకోమాకు మందులు వాడేవారిలో... ఇలా అనేక మందులతో ఈ సమస్య పెరుగుతుంది. జీవనశైలి మార్పులతో : ∙ ఏసీ గదుల్లో ఎక్కువసేపు ఉండటం కనురెప్పలను తక్కువగా కదిలించడం... కంప్యూటర్‌పైనా లేదా ల్యాప్‌టాప్, టీవీ, మొబైల్ వరకూ ఏదైనా స్క్రీన్‌ను ఎక్కువగా సేపు చూస్తుండటం, మైక్రోస్కోప్ వంటి ఉపకరణాలపై ఎక్కువగా పనిచేయడం. ∙కనురెప్పలను పూర్తిగా మూయలేకపోవడం. కంటికి గాయం కావడం వల్ల కనురెప్పలను తగినంత కదిలించలేనప్పుడు. ∙కనురెప్ప అంచుల్లో ఇన్ఫెక్షన్ (బ్లెఫరైటిస్) ఉన్నవారిలో కన్ను పొడిబారడం ఎక్కువ. ∙కంటికి లేజర్ చికిత్స చేయించుకున్నవారిలో మొదటి మూడునెలల్లో మాత్రం కన్నుపొడిబారే సమస్య వచ్చేందుకు అవకాశం ఉంది. ఇక కొందరిలో కారణాలేవీ కనిపించకుండానే ఈ సమస్య రావచ్చు. కళ్లలో మంట: కళ్లలో తగినంతగా నీరు స్రవించనప్పుడు కళ్లు మంటలు వస్తాయి. కానీ కళ్లు ఎర్రబారవు. మసక బారడం: కొందరిలో చూపు కాస్తంత మసకబారవచ్చు. వెలుగును చూడలేకపోవడం: ఎక్కువ వెలుగును చూడలేకపోవడం, ప్రకాశవంతమైన కాంతిని భరించలేకపోవడం. కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకునేవారిలో: కాంటాక్ట్‌లెన్స్‌లు వాడటంలో ఇబ్బందిగా ఉండటం. ఇబ్బందులివీ.. కన్ను పొడిబారడం వల్ల వచ్చే సమస్యలు అందరిలో ఒకేలా ఉండవు. ఈ కింద పేర్కొన్న వాటిలో కొన్ని కనిపించవచ్చు. ∙కొందరిలో కంటిపైన ఉండే కంజెక్టివా పొరలో ఇన్ఫెక్షన్ రావచ్చు. (కంజంక్టివైటిస్). ∙కొందరిలో కార్నియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. సమస్య తీవ్రతను బట్టి కొందరి కళ్లలో చిన్న చిన్న పుండ్లు రావచ్చు. చాలా అరుదుగా కొందరిలో కార్నియా దెబ్బతినే ప్రమాదంకూడా ఉండవచ్చు. నిర్ధారణ ఇలా... లక్షణాలను బట్టి కంటి డాక్టర్లు సమస్యను నిర్ధారణ చేస్తారు. అయితే కొందరిలో కొన్ని రకాల ఇతర వ్యాధుల వల్ల (జోగ్రన్స్ సిండ్రోమ్ వంటి వాటి కారణంగా) ఇలా జరుగుతుందేమో అని చూస్తారు. అందుకే కన్ను పొడిబారిన లక్షణాలు ఉండేవారికి వ్యాధి నిర్ధారణ చేసే సమయంలో అనేక ఇతర లక్షణాలను కూడా డాక్టర్లు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ష్కిర్మర్ టియర్ టెస్ట్: కొన్ని సందర్భాల్లో ష్కిర్మర్ పరీక్షతో దీన్ని నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షలో ఒక రకం ఫిల్టర్ పేపర్‌ను కంటి కిందివైపు రెప్ప కింద ఐదు నిమిషాల పాటు ఉంచుతారు. ఆ వ్యవధిలో ఆ పేపర్ ఎంత తడి అవుతుందో పరిశీలించడం ద్వారా లాక్రిమల్ గ్లాండ్ లోపాల్ని పరీక్షిస్తారు. టియర్ బ్రేకప్ టైమింగ్ : కంటి ఉపరితలంపై ఏర్పడే టియర్ ఫిల్మ్ ఎంతసేపటికి బ్రేక్ అవుతుందో తెలుసుకునే ఈ పరీక్షతో మ్యూసిన్ గ్రంథి లోపాలను తెలుసుకుంటారు. మెబోమియోగ్రఫీ : ఈ టెస్ట్‌తో మెబోమియన్ గ్రంథి లోపం తెలుస్తుంది. ఓసీటీ : ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ (ఓసీటీ) అనే పరీక్ష ద్వారా టియర్ ఫిల్మ్ మందం ఎంత ఉందో తెలుసుకుంటారు. చికిత్స... గతంలో కన్నీటిని స్రవించే చుక్కల మందులు, జెల్స్‌తో చేసే చికిత్స స్థానంలో ఇప్పుడు ఏయే గ్రంథి లోపాలు ఏమిటో తెలుసుకుని, వాటికి అనుగుణంగా చేసే చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు... కృత్రిమ కన్నీటి మందులు: కృత్రిమంగా కన్నీళ్లను పెంచే చుక్కల మందులు, జెల్ రూపంలో లభ్యమయ్యే మందుల్ని వాడటం ద్వారా డాక్టర్లు లాక్రిమల్ గ్లాండ్ పనితీరును చక్కదిద్దుతారు. ‘సైక్లో ఇమ్యూన్ ఐ డ్రాప్స్’ కూడా డ్రై ఐ చికిత్సకు ఉపయోగపడతాయి. అలాగే లాక్రిమల్ ప్లగ్స్‌ను వాడతారు. వీటివల్ల కన్నీళ్లు ముక్కులోకి జారిపోవు. దాంతో అవి కళ్ల లోనే ఎక్కువసేపు ఉండి కళ్లను తడిగా ఉంచుతాయి. ఇక మ్యూసిన్ గ్రంథి పనితీరు మెరుగుపరచడానికి ‘సెక్రిటోగ్యాగ్స్’ అనే ఉపకరణాలు ఉపయోగిస్తారు. మొబోమియన్ గ్లాండ్స్ పనితీరును మెరుగుపరచడానికి కొన్ని రకాల మసాజ్‌లు, థెర్మో థెరపీలతో పాటు కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడతారు. డ్రై ఐ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నవారిలో సంప్రదాయ చికిత్సలతో తగ్గనప్పుడు బాధితుని నుంచి సీరమ్ (ఆటోలాగస్ సీరమ్) సేకరించి, చుక్కల రూపంలో వాడతారు. ∙శస్త్ర చికిత్స : ఈ చికిత్సలో భాగంగా నోటిలోని అతి మృదువైన పొరలను తీసి, కంటిలో అమర్చి... పరిస్థితిని చక్కబరుస్తారు. ఇవేకాకుండా... పని ప్రదేశాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, కంప్యూటర్ ముందు కంటిని హాని తక్కువగా ఉండేలా ఎలా కూర్చోవాలో, తగిన వ్యాయామాలేమిటో, బరువు తగ్గించుకోవడం, అవసరాన్ని బట్టి పనిచేసే గదిలో తేమ (హ్యుమిడిటీ) పెంచుకోవడం... ఇవన్నీ బాధితులకు కౌన్సెలింగ్‌లో డాక్టర్లు చెబుతారు. కన్నుపొడిబారిపోవడం వల్ల ఒక్కోసారి చూపుకోల్పోవడం లాంటి పెను ముప్పు ఉండే అవకాశాలు ఎక్కువ. అందుకే కన్నుపొడిబారుతుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన మందులు వాడాలి. ∙ (చదవండి: ‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్' అంటే? తలెత్తే సమస్యలు.. -
కండ్లకలక వస్తే అలా మాత్రం చేయకండి, కంటిచూపు పోతుంది
కండ్లకలక.. దీన్నే పింక్ ఐ లేదా ఐ ఫ్లూ అని అంటారు. కొంతకాలంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కండ్లకలక కేసులు కలవర పెడుతున్నాయి. ఇది తరచుగా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అసలే వర్షకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడే ప్రజలకు కండ్లకలక ఇప్పుడు మరో సమస్యగా మారింది. ఐ ఫ్లూ కరోనాలా అంటువ్యాధిగా మారుతోంది. కండ్లకలక వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లను చూసినా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుందా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. కంటిలో చిన్న నలక పడినా ఆ బాధ వర్ణనాతీతం. అందుకే కంటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేశ వ్యాప్తంగా గత కొన్నాళ్లుగా కండ్లకలక కేసులు కలవర పెడుతున్నాయి. వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే కలకలు ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా గుంపుగా ఉన్న ప్రదేశాల్లో ఈ వ్యాధి సొందరగా ఇతరులకు సోకుతుంది. కండ్లకలక వచ్చిన రోగి నుంచి ఈజీగా ఎనిమిది మందికి వ్యాధి సోకే అవకాశం ఉంది.ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ వస్తుంది. వ్యాధి నయం కావడానికి దాదాపు 10 రోజులు పడుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కంటిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి చూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కండ్లకలక లక్షణాలు కళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది. కంటి నుంచి కంటిన్యూగా నీరు కారుతుంది, కంటిరెప్పలు ఉబ్బిపోతాయి. సరిగా చూడలేకపోవడం, లైట్ వెలుతురును కూడా తట్టుకోలేకపోవడం దీని లక్షణాలు కండ్లకలక వస్తే జ్వరం, తేలిపాటి గొంతునొప్పి కూడా బాధిస్తుంది. కండ్లకలక వస్తే ఏం చేయాలి? కండ్లకలక సోకితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. కండ్లకు గోరువెచ్చటి కాపడాలు, మంట నుంచి ఉపశమనం పొందడానికి అనెల్జెసిక్స్ వాడొచ్చు. కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటీ బయోటిక్ డ్రాప్స్ వాడాలి. కండ్ల కలక వచ్చిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు వాడొద్దు. కంటిని తరచుగా నీటితో కడుక్కోవాలి. దీంతో తొందరగా తగ్గిపోతుంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన డైట్‌ను పాటించాలి. కండ్లకలక వస్తే ఇలా అస్సలు చేయొద్దు కండ్లకలక చిన్న సమస్యే అని సొంత వైద్యం చేసుకోవద్దు కళ్లను తరచూ తాకొద్దు, దీనివల్ల సమస్య మరింత పెరుగుతంది ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పడు జనంలోకి తిరగడం వంటివి చేయొద్దు సమస్య చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవడం ఉత్తమం. కళ్ల కలక లక్షణాలు! 👁🗨కళ్ళలో నొప్పి, మంట, దురద 👁🗨కళ్ళు ఎర్రగా మారడం 👁🗨కళ్ళ నుంచి తరుచుగా నీరు కారడం 👁🗨కళ్ళు వాపు 👁🗨నిద్ర లేచిన తర్వాత కనురెప్ప అతుక్కుపోవడం 👁🗨నిర్లక్ష్యం చేస్తే కండ్ల నుంచి చీము కారడం#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/rMmPxOdB0g — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 #Conjuctivitis#HealthForAll#SwasthaBharat pic.twitter.com/1r7hp7II4D — Ministry of Health (@MoHFW_INDIA) August 2, 2023 వాళ్లను చూస్తే కండ్లకలక వస్తుందా? కండ్లకలక వచ్చినవారిని నేరుగా చూస్తే ఇతరులకు కూడా ఆ వ్యాధి సోకుతుందా? అంటే అది ఒట్టి అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు. వైరల్ కన్జక్టివిటిస్ ఉన్న వాళ్లను చూస్తే ఇది వ్యాపించదు. ఈ వ్యాధి ప్రధానంగా చేతుల ద్వారా ఇతరులకు సోకుంది. కండ్లకలక వచ్చిన వాళ్లు వాడిన వస్తువులను తాకడం, ఉపయోగించడం వల్ల ఈ వ్యాధి అంటుకుంటుంది. అలాగే వాళ్లు మాట్లాడేటప్పుడు నోటి తుంపర్ల నుంచి కూడా ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. అంతేకానీ కండ్ల కలక సోకిన వాళ్లు మరొకరిని చూసినంత మాత్రాన్నే వ్యాధి సోకే అవకాశమే లేదు. ఇక సన్ గ్లాసెస్ లేదా ముదురు కళ్లద్దాలు ధరించడం వల్ల కండ్లకలక ఇతరులకు వ్యాపించదు అనే సందేహం చాలామందికి వెంటాడుతుంది. కానీ ఇందులో నిజం లేదు. కళ్లద్దాలు ధరించడం వల్ల అసౌకర్యాన్ని కొంతమేరకు అధిగమించే అవకాశం ఉంటుంది. కానీ వ్యాధిని నిరోధించే ఛాన్స్ లేదు. ✅గత కొద్ది రోజులుగా కళ్ల కలక 👁️కేసులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ✅మరి ఇలాంటి సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి తెలిస్తే త్వరగా నయం అవుతుంది. ✅అవేంటో కింది ఇన్ఫోగ్రాఫ్ ద్వారా తెలుసుకోండి#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/EZ7TLH6axd — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 -
కంటి శుక్లాలు ఏర్పడడానికి కారణం ఈ చిన్న మార్పుతో అంధత్వం దూరం
-
రెండు కళ్ళకి ఒకేసారి శుక్లం ఆపరేషన్ చేయించవచ్చా..?
-
కంట్లో శుక్లం ఆపరేషనే మార్గమా ..?
-
కంటి పై ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు ...కంటి చూపు పూర్తిగా కోల్పోతారు
-
కంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు 'లీ' ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చూపు మందగించడం, కంటికి వచ్చే అంటువ్యాధులకు పరిష్కారంగా ఫార్మా కంపెనీ లీ హెల్త్ డొమెయిన్ ‘డీ–మాక్యులా’ పేరుతో సహజ సిద్ధ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చింది. అశ్వగంధ, బోస్విల్లా శరాషియో, జీగ్జాంథిన్, త్రిఫల, బిటా కెరోటిన్, కుంకుమ పువ్వును దేశీయ ఆవు నెయ్యిలో మరిగించి సేకరించిన రసాయనంతో డీ–మాక్యులా సాఫ్ట్‌జెల్ క్యాప్సూల్ తయారైందని కంపెనీ డైరెక్టర్ ఆళ్ల లీలా రాణి తెలిపారు. కంటి మంట, పొడిబారడం, హానికర నీలి కాంతికి వ్యతిరేకంగా పోరాడడానికి, డయాబెటిక్ రెటినోపతి చికిత్సలో సహాయకారిగా ఉంటుందన్నారు. అమెజాన్, లీహెల్త్డొమెయిన్.కామ్ ద్వారా కూడా లభిస్తుంది. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అద్భుతాలు చేస్తున్న 11ఏళ్ల బాలిక!
ఆర్టీఫీషియ్ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో కేరళకు చెందిన 11 ఏళ్ల బాలిక అద్భుతాలు సృష్టిస్తోంది. 10 ఏళ్ల వయసులో Ogler EyeScan అనే ఏఐ యాప్‌ను డిజైన్ చేసింది. ఐఫోన్‌ను ఉపయోగించి ఆ యాప్ ద్వారా కంటి సమస్యల్ని గుర్తిస్తుంది. ప్రస్తుతం ఆమె తయారు చేసిన ఏఐ అప్లికేషన్ చర్చాంశనీయంగా మారింది. కేరళకు చెందిన 11ఏళ్ల లీనా రఫీక్ (Leena Rafeeq) తయారు చేసిన ఏఐ అప్లికేషన్ గురించి లింక్డ్ ఇన్‌లో వివరించారు. ఆ పోస్ట్‌లో..రకరకాల పద్దతుల్లో అడ్వాన్స్డ్ కంప్యూటర్ విజన్ అండ్ మెషిన్ లెర్నింగ్‌తో కంటికి సంబంధించిన వెలుతురు, రంగు, దూరాన్ని కొలిచే సామర్ధ్యం ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు స్కానర్ ఫ్రేమ్‌తో కంటి వెలుతురు సమస్యల్ని గుర్తించవచ్చని అన్నారు. స్కాన్ తగిన విధంగా తీసుకున్న తర్వాత కంటి వ్యాధులు ఆర్కస్, మెలనోమా, పేటరీజియం, కంటిశుక్లం వంటి సమస్యల్ని నిర్ధారించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా రఫీక్ మాట్లాడుతూ.. థర్డ్ పార్టీ లైబ్రరీలు, ప్యాకేజీలు లేకుండా యాపిల్‌కు చెందిన స్విఫ్ట్‌యుఐ (SwiftUI) ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో ఆరునెలల పాటు శ్రమించి ఈ యాప్‌కు జీవం పోసినట్లు తెలిపారు. అయితే, Ogler EyeScan ఐఫోన్ 10, అంతకంటే ఎక్కువ iOS 16+తో మాత్రమే సపోర్ట్ చేస్తుందని చెప్పారు. కాగా రఫీక్ చేసిన అప్లికేషన్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఇలాంటి యాప్స్‌ను తయారు చేయడం అద్భుతమని కొనియాడుతున్నారు. చదవండి👉 సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఖాతాదారులకు భారీ ఊరట! -
Health: కళ్లలో ఎరుపు చార, కన్నులో బూడిద రంగు వలయం.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Health Tips In Telugu: కంటి తెల్లగుడ్డు మీద ఒక ఎర్రని, రక్తపు చార వంటి గుర్తు కనిపించిందంటే.. అది అక్కడి ఒక చిన్న రక్త నాళం చిట్లిందని అర్థం. ఈ పరిస్థితి కి చాలా సందర్భాల్లో కారణాలు తెలియవు. కొన్ని రోజుల్లోనే ఆ చార కనిపించకుండా పోతుంది. అయితే.. అధిక రక్తపోటుకు లేదా మధుమేహానికి సూచిక కావచ్చు. అంతేకాదు, రక్త సరఫరాలో గడ్డలు కట్టి అడ్డంకులు ఏర్పడి అధిక రక్తస్రావానికి దారితీయగల ప్రమాదానికి ఈ రక్త చారిక సంకేతం కావచ్చు. రక్తం పలుచబారటానికి వాడే ఆస్పిరిన్ వంటి మందులు కూడా ఈ చారకు కారణం కావచ్చు. ఈ సమస్య తరచుగా వస్తున్నట్లయితే తమకు ఇస్తున్న మందుల మోతాదును సమీక్షించాల్సిందిగా తనకు చికిత్స చేస్తున్న వైద్యుణ్ణి కోరవచ్చు. కన్నులో బూడిద రంగు వలయం కంటిలో నల్లగుడ్డు (శుక్ల పటలం) చుట్టూ తెల్లటి లేదా బూడిద రంగు వలయం కనిపిస్తే అది అధిక కొవ్వుకు చిహ్నంగా, గుండె జబ్బు ప్రమాదం ఎక్కువ ఉన్నదని చెప్పే సంకేతంగా పరిగణిస్తారు. సాధారణంగా వయోవృద్ధుల కళ్లలో కూడా ఈ వలయాలు కనిపిస్తుంటాయి. అందుకే దీనికి వైద్య పరిభాషలో ఆర్కస్ సెనిలిస్ అని పేరు పెట్టారు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! చదవండి: Diabetes: షుగర్ పేషెంట్లకు ఆరోగ్య ఫలం!.. ఒక్క గ్లాసు జ్యూస్ తాగితే 15 నిమిషాల్లో.. Eye Problems: ప్రమాద సంకేతాలు.. ఉబ్బిన కళ్లు, రెప్పల మీద కురుపులు.. ఇంకా ఇవి ఉన్నాయంటే -
Health: ప్రమాద సంకేతాలు.. ఉబ్బిన కళ్లు, రెప్పల మీద కురుపులు.. ఇంకా ఇలా ఉంటే
Health Tips In Telugu- Eye Care: కళ్లు.. మన ఆరోగ్యానికి వాకిళ్లు అని చెప్పచ్చు. విషప్రభావానికి గురైనప్పుడు కళ్లు మూతలు పడిపోతుంటాయి. అదేవిధంగా కొన్ని రకాల అనారోగ్యాలకు సూచనగా కళ్లు ఎర్రబడటం, మంటలు పుట్టడం, పుసికట్టడం జరుగుతుంటుంది. అందుకే చాలామంది వైద్యులు మనం ఏదైనా సమస్యతో వెళ్లినప్పుడు కళ్లను కూడా పరీక్ష చేయడం చూస్తుంటాం. ఇంతకీ కళ్లు ఎలా ఉంటే ఏ సమస్య ఉందో ఎలా నిర్ధారించవచ్చో తెలుసుకుందాం. అనారోగ్యాలను గుర్తించగలిగే పరిస్థితులు వస్తాయి. మన శరీరంలోని ఇతర అవయవాలు, భాగాలను పరీక్షించడానికి ఉపయోగించే పరికరాలు, టెక్నాలజీ, పద్ధతులకన్నా... కేవలం మన కళ్లలోకి చూసి అనేకరకాల ఆరోగ్య సమస్యలను గుర్తించటం సాధ్యమే. మన కళ్లు చూపే ప్రమాద సంకేతాల్లో కొన్ని ఇవి. కనుపాప పరిమాణం కనుపాప వెలుతురుకు తక్షణమే స్పందిస్తుంది. ప్రకాశవంతమైన వాతావరణంలో కనుపాప చిన్నదవుతుంది. వెలుతురు తగ్గే కొద్దీ కనుపాప పెద్దదవుతుంది. అయితే ఈ కనుపాప పరిమాణం హెచ్చుతగ్గుల ప్రతిస్పందన నెమ్మదిగా లేదా ఆలస్యంగా జరుగుతున్నట్లయితే దానిని పలు రకాల అనారోగ్యాలకు సూచనగా భావించవచ్చు. అందులో అల్జీమర్స్ వంటి వ్యాధులు, మందుల ప్రభావాలు, మాదకద్రవ్యాల వినియోగించారనే దానికి ఆధారాల వంటివి ఉంటాయి. కొకెయిన్ వంటి మాదకద్రవ్యాలను ఉపయోగించే వారిలో కనుపాపలు ఉబ్బినట్లు కనిపిస్తే, హెరాయిన్ వాడేవారిలో కనుపాపలు చిన్నవిగా కనిపిస్తాయి. ఎరుపు లేదా పసుపు కళ్లు కంటిలోని తెల్లగుడ్డు రంగు మారటం మన శరీరంలో ఏదో తేడా ఉందనడానికి సంకేతం కావచ్చు. కళ్లు రక్తంతో ఎరుపెక్కిన రంగులో కనిపిస్తే.. అది అధికమోతాదులో మద్యం లేదా, మాదక ద్రవ్యాలను తీసుకున్నదానికి సంకేతం కావచ్చు. కళ్లలో నలత లేదా ఇన్ఫెక్షన్ కారణంగా కూడా కళ్లు ఎర్రగా మారవచ్చు. అయితే ఈ సమస్య చాలా వరకూ రోజుల్లోనే తగ్గిపోతుంది. ఒకవేళ కళ్లు ఇలా రంగి మారి ఎక్కువ కాలం అలాగే ఉంటే మరింత తీవ్రమైన ఇన్ఫెక్షన్ , వాపు లేదా కాంటాక్టు లెన్స్, సొల్యూషన్లకు రియాక్షన్‌కు సూచన కావచ్చు. మరీ తీవ్రమైన కేసుల్లో ఎరుపు కళ్లు గ్లుకోమాకు సూచనకావచ్చు. ఈ జబ్బు అంధత్వానికి దారితీయగలదు. ఇక తెల్లగుడ్డు పసుపు రంగులోకి మారితే అది జాండిస్ (కామెర్లు)కు గుర్తు. కురుపులు, గడ్డలు కళ్లలో మనం చూడగానే చాలా భయపెట్టే సమస్యలు ఒక్కోసారి అతి నిరపాయకరమైన, చాలా సులభంగా చికిత్స చేయగలిగే సమస్యలు కావచ్చు. కంటి తెల్లగుడ్డు మీద పుట్టుకువచ్చే పసుపురంగులోని లావాటి గడ్డ ఉంటుంది. ఇది కొవ్వు, మాంసం ఒకచోట పేరుకుని ఏర్పడే గడ్డ. దీనిని చుక్కల మందుతో సులభంగా తగ్గించవచ్చు. లేదంటే చిన్నపాటి శస్త్రచికిత్సతో తొలగించవచ్చు. నిజానికి ఈ గడ్డను అది కార్నియాను – అంటే నల్లగుడ్డును తాకకముందే తొలగించి తీరాలి. ఒకవేళ అది పెరుగుతూ పోయేదాకా అశ్రద్ధ చేస్తే.. నల్లగుడ్డు (శుక్ల పటలం) మీద పెట్రీజియం అనే ఒక తెరవంటిది ఏర్పడుతుంది. అది చూపును మసకబారుస్తుంది. ఉబ్బిన కళ్లు కళ్లు బయటకు పొడుచుకు వచ్చినట్లు ఉబ్బుగా ఉండటం మామూలు ముఖాకృతిలో భాగంగా ఉండవచ్చు. కానీ, మామూలుగా ఉబ్బెత్తు కళ్లు లేని వారికి.. కళ్లు ఉబ్బుతూ బయటకు పొంగుతున్నట్లుగా రావటం మొదలైతే.. అందుకు థైరాయిడ్ గ్రంథి సమస్య కారణం కావచ్చు. దీనికి వైద్యసాయం అవసరం. ఒకటే కన్ను బయటకు పొడుచుకువచ్చినట్లు అయితే.. దానికి కారణం ఏదైనా గాయం కానీ, ఇన్ఫెక్షన్ కానీ కావచ్చు. అరుదైన కేసుల్లో కంటి వెనుక ట్యూమర్ (గడ్డ) ఏర్పడటం కారణం కావచ్చు. రెప్పల మీద కురుపులు కళ్లే కాదు, కనురెప్పలు కూడా చాలా అనారోగ్యాల గురించి సూచిస్తుంటాయి. ఇవి ప్రధానంగా కనురెప్పల గ్రంథులకు సంబంధించిన చిన్నపాటి అనారోగ్యాలకు గుర్తు. ఎక్కువగా పై కనురెప్ప మీద.. అరుదుగా కింది కనురెప్ప మీద ఒక ఎర్రటి గడ్డ ఏర్పడుతుంది. నూనె గ్రంథికి అడ్డంకులు తలెత్తటం వల్ల ఈ కురుపులు పుట్టుకొస్తాయి. ఈ కనురెప్పల కురుపులు మామూలుగా వాటికవే తగ్గిపోతాయి. లేదంటే కాపడం పెట్టటం ద్వారా తగ్గుతాయి. ఒకవేళ అలా తగ్గని పక్షంలో దీనిని చిన్నపాటి శస్త్రచికిత్సతో తొలగించాలి. కళ్లు అదరటం కళ్లు లేదా కనురెప్పలు అదరటం అనే ఈ పరిస్థితి చాలా వరకూ ఒత్తిడి వల్ల కానీ పోషకాహార సంతులనం లోపించటం వల్ల కానీ, అధిక మోతాదులో కెఫీన్ సేవించటం వల్ల కానీ తలెత్తే సమస్య. దీనిని అంతగా పట్టించుకోనక్కరలేదు. వీటితో పాటు కళ్లలో ఎరుపు చార, కన్నులో బూడిద రంగు వలయం ఏర్పడినా అశ్రద్ధ చేయవద్దు. చూశారుగా... ఇప్పటికైనా అప్పుడప్పుడు కళ్ల మీద దృష్టి పెడతారు కదా...! నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కలిగించడం కోసం మాత్రమే! చదవండి: Diabetes: షుగర్ పేషెంట్లకు ఆరోగ్య ఫలం!.. ఒక్క గ్లాసు జ్యూస్ తాగితే 15 నిమిషాల్లో.. గర్భిణులు గ్రహణ సమయంలో బయట తిరగడం వల్లే అలా జరుగుతుందా? -
Health: సన్నగా, ఎత్తుగా ఉండి.. వేళ్లు పొడుగ్గా పెరుగుతున్నాయా? అయితే!
Marfan Syndrome Symptoms &Treatment: మార్ఫన్ సిండ్రోమ్ అనేది వేర్వేరు అవయవాలకు సంబంధించి∙అనేక లక్షణాలను కనబరిచే ఒక వ్యాధి. ఇది పుట్టుకతో వచ్చే జన్యుపరమైన జబ్బు. దీని లక్షణాలు కూడా విలక్షణంగా ఉంటాయి. ఇందులో కండరాలకు, రక్తనాళాలకు వెన్నుదన్ను (సపోర్ట్)గా ఉండే కనెక్టివ్ టిష్యూ దెబ్బతినడం వల్ల వాటికి బలం లోపిస్తుంది. కొందరిలో... మరీ ముఖ్యంగా గర్భిణుల రక్తనాళాలను ప్రభావితం చేసి గుండెను ప్రభావితం చేయవచ్చు. మరికొందరిలో కళ్లు, ఎముకలను కూడా దెబ్బతీయవచ్చు. లక్షణాలు 👉🏾మార్ఫన్ సిండ్రోమ్‌కు గురైన వారు చాలా సన్నగా, ఎత్తుగా ఉంటారు. ఆ సౌష్ఠవంలోనే ఏదో లోపం ఉందనిపించేలా ఎత్తు పెరుగుతారు. కాళ్లూ, చేతులు, వేళ్లూ, కాలివేళ్లూ అన్నీ సాధారణం కంటే పొడుగ్గా ఉంటాయి. 👉🏾వేళ్లు పొడుగ్గా పెరుగుతాయనడానికి ఓ నిదర్శనం ఏమిటంటే... మన బొటనవేలిని అరచేతిలో ఉంచి ముడిచినప్పుడు అది సాధారణంగా అరచేతిలో లోపలే ఉంటుంది. కానీ ఈ జబ్బు ఉన్నవారిలో అరచేయి మూసినప్పుడు బొనటవేలు... పిడికిలి దాటి బయటకు కనిపిస్తుంది. 👉🏾ఎదుర్రొమ్ము ఎముకలు బయటకు పొడుచుకు వచ్చినట్లు కనిపిస్తాయి. 👉🏾మరొకొందరిలో లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండవచ్చు. 👉🏾పలువరస చక్కగా, తిన్నగా లేకుండా పళ్లన్నీ గుంపులు గుంపులా ఉన్నట్లుగా వస్తాయి. 👉🏾దగ్గరివి మాత్రమే కనిపించడం, దూరం చూపు అంతగా స్పష్టంగా లేకపోవడం ఉంటుంది. 👉🏾మనందరిలోనూ పాదాలు కొద్దిగా ఒంపు తిరిగి ఆర్చి మాదిరిగా ఉంటాయి. 👉🏾కానీ మార్ఫన్ సిండ్రోమ్ ఉన్నవారి పాదాలు ఫ్లాట్‌గా ఉంటాయి. 👉🏾గుండెసమస్యలు తలెత్తుతుంటాయి. 👉🏾మరీ ముఖ్యంగా గర్భవతుల్లో ఈ సమస్యలు రావచ్చు. గుండె, రక్తనాళాలకు సంబంధించిన సమస్య ఇలా... గుండెకు సంబంధించిన కీలక ధమని అయోర్టా అనే పెద్ద రక్తనాళం ఉంటుంది. దీని ద్వారానే అన్ని భాగాలకు మంచి రక్తం అందుతుంది. రక్తం అందించే ప్రతి రక్తనాళంలోనూ లోపలివైపున ఇంటిమా అనే పొర, మధ్యపొరగా మీడియా, బయటిపోరగా అడ్వెంటీషియా అనే మూడు పొరలుంటాయి. రక్తప్రసరణ సాఫీగా, సక్రమంగా జరిగిలా చూసేందుకు ఇంటిమా తోడ్పడుతుంది. ఇక మధ్యపొర అయిన మీడియా, బయటి పొర అడ్వెంటీషియాలు బలంగా ఉండేందుకు రక్తనాళం గోడల్లో ఉండే కొలాజెన్, ఎలాస్టిక్ అనే ఫైబర్లు రక్తనాళానికి సపోర్ట్ చేస్తుంటాయి. ఈ ఫైబర్లే రక్తం ఒత్తిడి పెరిగినా... వేగం పెరిగినా... రక్తనాళానికి సాగే గుణాన్ని, ఆ ఒత్తిడిని తట్టుకునే గుణాన్ని ఇస్తాయి. కొందరిలో మార్ఫన్ సిండ్రోమ్ కారణంగా... పుట్టుకతోనే కొలాజెన్ తక్కువగా ఉంటుంది. వారు పెరుగుతున్న కొద్దీ ఉన్న కొద్దిపాటి కొలాజెన్ కాస్తా తగ్గిపోతూ ఉంటుంది. దాంతో రక్తనాళం బలహీనమవుతుంది. ఒక్కోసారి అది వాచిపోయి, దాని పరిమాణం పెరుగుతుంది. దాంతో ఛాతీ నొప్పి, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యను అశ్రద్ధ చేస్తే రక్తనాళం పగలడం లేదా రక్తనాళాల గోడలు చీలే అవకాశం ఉంది. అయోర్టా మాత్రమే కాకుండా... మైట్రల్ వాల్వ్‌కు సంబంధించిన సమస్యలు కూడా మార్ఫన్ సిండ్రోమ్‌లో తలెత్తవచ్చు. అంతేకాదు... కిడ్నీలకు రక్తసరఫరా ఆగిపోయి అవి దెబ్బతింటాయి. మెదడుకు రక్తసరఫరా తగ్గి పక్షవాతం వస్తుంది. ఇలా దాదాపు అన్ని అవయవాలూ దెబ్బతిని మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కి దారితీసే ప్రమాదం ఉంది. చికిత్స ఎలా? ఇది పుట్టుకతో వచ్చే జన్యుసంబంధమైన వ్యాధి కావడంతో... వ్యాధి మొత్తానికి ఒకేవిధమైన చికిత్స ఉండదు. దీనితో ఏ అవయవం ప్రభావితమైతే... ఆ అవయవానికి సంబంధించిన చికిత్స అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు అయోర్టా ప్రభావితం అయినప్పుడు, అవసరమైన కొందరిలో ‘బెంటాల్స్ ప్రొసిజర్’ అనే అత్యవసర శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉంటుంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు చాలా తరచుగా కనిపిస్తుంటాయి. ఉదాహరణకు ఈ బాధితుల్లో సగం మందికి పైగా వారి కళ్లలోని లెన్స్ జారిపోతుంది. అలాగే కాటరాక్ట్, గ్లకోమా వంటివి చాలా చిన్నవయసులోనే, చాలా ముందుగా వస్తుంటాయి. రెటీనా సమస్యలూ ఉంటాయి. ఈ వైవిధ్యమైన లక్షణాలూ, ప్రభావాలు ఉన్నందున... బాధితుల సమస్యకు అనుగుణంగా చికిత్స అవసరమవుతుంది. చదవండి👇 Gynecology: పిల్లలు కాకుండా ఆపరేషన్.. శారీరకంగా, మానసికంగా కోలుకున్న తర్వాతే.. Healthy Heart Diet: 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు, బచ్చలి కూర తిన్నారంటే! -
నీళ్లింకిపోతున్న నేత్రాలు
నేత్రాలు నిండు జలాశయాల వంటివి. అయితే మనిషి నిర్లక్ష్యంతో కళ్లల్లో నీరు ఆవిరవుతోంది. అధిక గంటలు స్మార్ట్ ఫోన్‌తో గడిపేస్తుండటం.. వేడి గాలుల్లో ప్రయాణాలు చేస్తుండటంతో కళ్లల్లో కల్లోలం అలముకుని ఎడారిలా మారిపోతున్నాయి. చివరకు చూపుపై ప్రభావం పడుతోంది. – లబ్బీపేట (విజయవాడ తూర్పు) సమస్య ఏంటంటే.. మనిషి నిమిషానికి ఎనిమిది సార్లు కంటి రెప్పలు ఆర్పుతుంటాడు. అలా చేయడం ద్వారా కార్నియాకు అవసరమైన నీరు చేరి కళ్లు డ్రై కాకుండా చేస్తాయి. కానీ వేసవి ప్రయాణాల్లో వేడి గాలులకు కళ్లు తడారిపోయి దురదలు రావడం, కార్నియా సమస్యలు తలెత్తుతుంటాయి. ఇటీవల కాలంలో పిల్లలు అధిక సమయం స్మార్ట్ ఫోన్‌తోనే గడుపుతున్నారు. ఇలా స్మార్ట్‌ఫోన్ చూసే సమయంలో కనురెప్పులు నిమిషానికి రెండు, మూడు సార్లు మాత్రమే ఆర్పుతుంటారని వైద్యులు చెబుతున్నారు. దీంతో కళ్లు తడారిపోయి దురదలు, మంటలు రావడం, కొందరికి తలనొప్పి వంటి సమస్యలు వస్తున్నట్లు నేత్ర వైద్యులు వివరిస్తున్నారు. విజయవాడలో కంటి వైద్యులను ఆశ్రయిస్తున్న రోగుల్లో 60 నుంచి 70 శాతం మంది స్మార్ట్ ఫోన్ కారణంగా కార్నియా సమస్యలకు గురవుతున్నట్లు చెబుతున్నారు. నిత్యం ఐదు నుంచి ఆరు గంటలు ఫోన్ వాడే వారిలో నేత్రాలు పొడారిపోవడంతో కార్నియా(నల్లగుడ్డు) సమస్యలు వస్తున్నట్లు వివరిస్తున్నారు. అలా వస్తున్న వారిలో 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు వారు ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా యువత రాత్రి సమయంలో దుప్పటి ముసుగు వేసుకుని, పడుకుని చీకట్లో స్మార్ట్‌ఫోన్ వాడే వారిలో ఈ అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు పాటించాలి వేసవిలో ప్రయాణాలు చేసే వారు తప్పనిసరిగా కళ్లజోడు వినియోగించాలి. తరచూ ముఖాన్ని చన్నీటితో కడుక్కోవడం మంచిది. స్మార్ట్ ఫోన్‌ను బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుని ఉపయోగించాలి. కళ్లకు ఫోన్ 15 సెంటీమీటర్ల దూరంలో ఉంచి చూడాలి. ముఖానికి దగ్గరగా పెట్టకూడదు. 20 నిమిషాల పాటు ఫోన్ , కంప్యూటర్ వాడిన తర్వాత 20 సెకన్ల పాటు దూరంలో ఉన్న వస్తువులను చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో చీకట్లో స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించరాదు. కంప్యూటర్‌పై పనిచేసే వారు యాంటీ రిఫ్లెక్టివ్ గ్లాసెస్ వాడితే ప్రయోజనకరంగా ఉంటుంది. రోజులో ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్, కంప్యూటర్‌పై పనిచేసే వారు ఐ డ్రాప్స్ వాడటం ద్వారా దుష్ఫలితాలు లేకుండా చూడవచ్చు. అలర్ట్ అవ్వాల్సిందే.. కళ్లు మంటలు, దురదలు రావడం, వెలుతురు సరిగ్గా చూడలేక పోవడం, కళ్లు ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా డ్రైవింగ్ చేసే సమయంలో ఏకాగ్రతను కోల్పోయి కంగారు పడుతుంటారు. ఈ దశలో సరైన చికిత్స పొందకుంటే నల్లగుడ్డు (కార్నియా) దెబ్బతిని చూపుమందగించే ప్రమాదం ఉంది. సకాలంలో చికిత్స అవసరం.. వేసవిలో ప్రయాణాలు చేసే వారు కళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వేడి గాలులు కళ్లకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లజోడు వాడటం మంచిది. లేకుంటే వేడి గాలులకు కళ్లు పొడారిపోతాయి. స్మార్ట్ ఫోన్ వల్ల తలెత్తే సమస్యలకు సకాలంలో చికిత్స పొందాలి. లేకుంటే క్రమేణా కార్నియా దెబ్బతిని చూపుకోల్పోయే ప్రమాదం ఉంది. మా వద్దకు చికిత్స కోసం వస్తున్నవారిలో 60 శాతం మందికి ఇలాంటి సమస్యలతో బాధపడే వారే ఉంటున్నారు. – డాక్టర్ ఇ.ఎస్.ఎన్.మూర్తి, నేత్రవైద్య నిపుణుడు, ప్రభుత్వాస్పత్రి -
పిల్లల్లో కంటి నల్లగుడ్డు చుట్టూ తెల్ల వలయం?
పెద్ద వయసు వాళ్లలో కంటి నల్లగుడ్డు చుట్టూ తెల్లటి వలయం రావడం మామూలే. వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధుల్లోని చాలామందిలో ఇది కనిపిస్తుంది. కానీ పిల్లల్లోనైతే ఇది రావడానికి వాతావరణ కాలుష్యం ఓ కారణమనీ, దాంతో వచ్చే అలర్జీ కారణంగానే ఇలా జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఆరుబయట తిరుగుతూ దువు్మూ ధూళి, ఆరుబయటి కాలుష్య, పుప్పొడి వంటి వాటికి నిత్యం ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు... ఏదైనా అంశంతో అలర్జీ కలిగితే ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలా కార్నియా చుట్టు తెల్లవలయం రావడాన్ని వైద్య పరిభాషలో వెర్నల్ కెరటో కంజంక్టవైటిస్ (వీకేసీ) అంటారు. ఈ సమస్య నివారణ కోసం వాతావరణ కాలుష్యాలకు దూరంగా ఉండటం ద్వారా కంటిని రక్షించుకోవాలి. ఇందుకోసం ప్లెయిన్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడటం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. ఈ సవుస్య ఉన్నవారు వీలైనన్నిసార్లు కంటిని స్వచ్ఛమైన నీటితో కడుగుతూ ఉండాలి. కంటి డాక్టర్‌ను కలిసి... వారు సూచించిన యాంటీ అలర్జిక్ చుక్కల వుందుల్ని వాడాల్సి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు ఒకింత ఎక్కువ కాలం పాటు వీటిని వాడాల్సిరావచ్చు. వీటిల్లోనూ స్టెరాయిడల్, నాన్ స్టెరాయిడల్ (స్టెరాయిడ్ లేనివి) అనే రెండు రకాల మందులు ఉంటాయి. స్టెరాయిడ్ మోతాదులు ఉన్న మందుల్ని మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు మాత్రమే వాడాలి. ఎక్కువకాలం వాడితే సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉన్నందువల్ల డాక్టర్ సూచించిన కాలానికి మించి వాటిని వాడకూడదు. ఇక నాన్‌స్టెరాయిడ్ (స్టెరాయిడ్ లేని) మందుల్ని మాత్రం చాలా కాలంపాటు వాడవచ్చు. ఉదాహరణకు ఓలోపాటడిన్ వంటి నాన్‌స్టెరాయిడ్ డ్రాప్స్ రోజుకు రెండుసార్లు చొప్పున ఆరుమాసాల వరకు వాడవచ్చు. అలాగే లూబ్రికెంట్ డ్రాప్స్ కూడా వాడాలి. దాంతో అలర్జెన్స్ పలచలబారుతాయి. కంటికి ఉపశమనం కలుగుతుంది. ఈ మందుల్ని వాడుతున్న కొద్దీ నల్లగుడ్డు చుట్టూ ఉన్న తెల్లటి రంగు క్రమంగా మాయమవుతుంది. అలర్జీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సూచనల మేరకు యాంటీహిస్టమైన్ ఐ డ్రాప్స్‌తో పాటు కొందరిలో యాంటీహిస్టమైన్ మాత్రలు కూడా వాడాల్సి వస్తుంది. ఈ సవుస్య గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేకపోయినా... నిర్లక్ష్యం మాత్రం మంచిది కాదు. -
Health Tips: పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటున్నారా.. అయితే..
పొన్నగంటి కూర మంచి పోషక విలువలు గలిగినది. ఇది అతి సులభంగా, అతి తొందరగా పెరిగే ఆకు కూర. దీనికి విత్తనాలు వుండవు. ఇది కేవలం కాండం ద్వారానే అభివృద్ధి చెందుతుంది. పొన్నగంటి కూర ఆకులు ఏడాది పొడవునా లభిస్తాయి. ►పోషక విలువలు... పొన్నగంటి కూరలో ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు సి, ఎ లకు మంచి మూలం. ►ఇంకా విటమిన్ ‘ఎ’, ‘బి6’, ’సి’, ఫొలేట్, రిబోఫ్లావిన్’, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం దీని నుంచి సమృద్ధిగా లభిస్తాయి. ►జుట్టుకు పోషణనిచ్చే బయోటిన్ పొన్నగంటి కూరలో పుష్కలంగా ఉంటుంది. ►పురాతన గ్రంథాలు, ఆయుర్వేద వైద్యనిపుణులు చెప్పిన దాని ప్రకారం పొన్నగంటి కూరను నలభై ఎనిమిది రోజులపాటు తింటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మకాంతి పెరుగుతుంది. ►పొన్నగంటి కూరను ఉడికించి, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారని, అదే కందిపప్పు, నెయ్యితో కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారనీ ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ►శుభ్రం చేసిన పొన్నగంటి ఆకును కట్ చేసి.. పెసరపప్పు, చిన్న ఉల్లి పాయలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాల పొడి చేర్చి ఉడికించి తీసుకుంటే రక్త శుద్ధి జరుగుతుంది. ►ఎక్కువ ఎండల్లో తిరిగి పనిచేసే వారికి, గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి కంటి కింద నల్లటి వలయాలు వస్తాయి. కంటి సమస్యలు ఏర్పడుతాయి. అలాంటి సమస్యలు ఎదురైతే.. పొన్నగంటి ఆకుతో తాలింపు చేసుకుని తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. ►ఇంకా ఈ ఆకుకూర నోటి దుర్వాసనను పోగొడుతుంది. ►గుండెకు, మెదడుకు బలాన్నిస్తుంది. ►ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. ►దీనిలో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. ►గౌట్ వ్యాధి, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి. చదవండి: Sankranti Special Recipes: నోరూరించే అరిశెలు.. కరకరలాడే సకినాలు.. నువ్వుల్లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్.. కాబట్టి Radish Health Benefits: ముల్లంగి రసం తాగుతున్నారా.. అయితే.. -
వైఎస్సార్ కంటి వెలుగు: ఆ ‘చూపు’ సూపర్
సాక్షి, అమరావతి: సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు.. అంటే అన్ని ఇంద్రియాల్లోకెల్లా నేత్రాలు చాలా ముఖ్యమైనవని అర్ధం. అలాంటి కంటిచూపుకు రాష్ట్రంలో తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లల్లో కంటి లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి వారి జీవితంలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో 2019 అక్టోబర్ 10న వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలందరికీ ఉచితంగా కంటి పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన పిల్లల్లో కంటి సమస్యలు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. 66.17 లక్షల మంది పిల్లలకు పరీక్షలు కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 60 వేలకు పైగా స్కూళ్లలోని 66.17 లక్షల మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో 4.38 లక్షల మందికి దృష్టి లోపాలున్నట్లు గుర్తించారు. బాలికల్లో 6.81 శాతం మందికి, బాలురుల్లో 6.46 శాతం మందికి చూపులో ఇబ్బందులు ఉన్నట్లు ఆ పరీక్షల్లో తేలింది. మొత్తం మీద రాష్ట్రంలో ప్రతీ 100 మంది పిల్లల్లో 6.6 శాతం మంది పిల్లలకు కంటి సమస్యలున్నట్లు స్పష్టమైంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ పరీక్షల్లో మిగతా పిల్లలతో పోల్చి చూస్తే గిరిజన పిల్లల్లో దృష్టి లోపాలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. వారు నివశించే ప్రాంతాలతో పాటు ఆధునిక ఆహారపు అలవాట్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల ప్రభావం తక్కువగా ఉండటంతో వారిలో దృష్టి లోపాలు తక్కువగా ఉన్నాయి. వీరిలో అత్యల్పంగా 0.29 శాతమే సమస్యలున్నట్లు పరీక్షల్లో తేలింది. అలాగే.. ఎస్సీ పిల్లల్లో 1.09 శాతం దృష్టిలోపం ఉండగా ఓసీ పిల్లల్లో 1.77 శాతం ఉంది. అత్యధికంగా బీసీ పిల్లల్లో 3.46 శాతం కంటి సమస్యలు కనిపించాయి. రెండు దశల్లో కంటి పరీక్షలు పిల్లలందరికీ రెండు దశల్లో కంటి పరీక్షలు నిర్వహించారు. తొలి దశలో ప్రాథమికంగా కంటి స్క్రీనింగ్ నిర్వహించారు. వీరి వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఈ స్క్రీనింగ్‌లో కంటి సమస్యలున్నట్లు గుర్తించిన 4.38 లక్షల మంది పిల్లలకు రెండో దశలో నిపుణులతో పరీక్షలు చేయించారు. ఇందులో 2.41 లక్షల మందికి మందులు, వైద్యుల సలహాలు, సూచనలిచ్చారు. 1.58 లక్షల మందికి కళ్లజోళ్లను పంపిణీ చేశారు. మరో 42,542 మందికి నిపుణుల పరీక్షలకు సూచించారు. ఈ పరీక్షల ద్వారా 24,017 మంది పిల్లలకు కంటి సంరక్షణపై సూచనలు చేశారు. 2,612 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని తేల్చగా వీరిలో 294 మందికి వాటిని పూర్తిచేశారు. మరో 145 మంది పిల్లలకు శుక్లాల ఆపరేషన్లు చేశారు. పిల్లలపై ‘ఎలక్ట్రానిక్స్’ ప్రభావం తీవ్రంగా ఉంది చిన్న పిల్లల కంటిచూపుపై ఎలక్ట్రానిక్ పరికరాల ప్రభావం తీవ్రంగా ఉంది. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు వంటివి చిన్నతనం నుంచే అలవాటు చెయ్యొద్దు. టీవీల ప్రభావం కూడా తక్కువేం కాదు. వీటి ప్రభావం పట్టణ పిల్లల్లో ఎక్కువ. గిరిజన ప్రాంతాల్లో ఈ ఉపకరణాలు తక్కువగా వాడుతున్నారు కాబట్టి గిరిజన పిల్లల్లో కంటి సమస్యలు తక్కువగా ఉన్నాయి. – డా. హైమావతి, నోడల్ అధికారి, వైఎస్సార్ కంటి వెలుగు కంటి పరీక్షల వివరాలు జెండర్ పరీక్షలు దృష్టిలోపం లోపం శాతం బాలురు 34,44,818 2,22,676 6.46 శాతం బాలికలు 31,72,795 2,16,075 6.81 శాతం సామాజికవర్గాల వారీగా కంటి పరీక్షలు.. సామాజికవర్గం దృష్టిలోపం లోపం శాతం ఎస్సీ 72,771 1.09 శాతం ఎస్టీ 19,214 0.29 శాతం బీసీ 2,29,567 3.46 శాతం ఓసీ 1,17,109 1.77 శాతం -
ఓటీటీ.. యువత పోటాపోటీ
ఏలూరు టౌన్: వినోద రంగంలో ఓవర్ ద టాప్ (ఓటీటీ) కీలక భూమి పోషిస్తోంది. కరోనాతో పాత పద్ధతులకు భిన్నంగా నూతన మార్గాలపై యువత మొగ్గుచూపుతోంది. టీవీ సీరియళ్లను మరిపించేలా వెబ్‌సిరీస్‌లు, థియేటర్లలో విడుదల కాని సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఓటీటీల వినియోగం బాగా పెరిగింది. సెల్ఫోన్లో యాప్‌ల ద్వారా యువత, విద్యార్థులు అరచేతిలో వినోదాన్ని పొందుతున్నారు. ఇది వ్యసనంలా మారితే మానసిక, శారీరక ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రూ.500లోపు ఖర్చుతో.. కరోనా కాలంలో ఓటీటీ (ఓవర్ ద టాప్) హవా విపరీతంగా పెరిగిపోయింది. మొన్నటివరకూ సినిమా థియేటర్లు సైతం మూసివేయడంతో వినోద ప్రియుల చూపు ఓటీటీలపై పడింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, ఆహా, జీ5, సోనీ లివ్, వూట్ వంటి ఓటీటీ చానల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిపై యువత, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు ఇలా అన్ని వర్గాల దృష్టి పడింది. ముఖ్యంగా యువత అత్యధికంగా వీటిని వినియోగిస్తున్నారు. ఏడాదికి కేవలం రూ.500లోపు మాత్రమే సబ్స్రిప్షన్ చెల్లిస్తే ఐదుగురు నుంచి పదిమంది వరకూ వారి సెల్ఫోన్లలో లాగిన్ అయ్యి వీక్షించే అవకాశం ఉండటంతో వీటి వినియోగం బాగా పెరిగింది. ‘వెబ్‌సిరీస్’ మాయాజాలం సరికొత్త సినిమాలతోపాటు హాలీవుడ్ సినిమాలకు తీసిపోని విధంగా రూపొందుతున్న వెబ్‌సిరీస్‌పై యువత అమితాసక్తి చూపుతోంది. కొన్ని సిరీస్‌ల కోసం ప్రత్యేకంగా ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. నేరం, మాఫియా, ఆర్థిక నేరాలు, రాజకీయ నేపథ్యాల సిరీస్‌లు ఎక్కువగా వీరిని ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో సిరీస్‌లో పది నుంచి పదిహేను ఎపిసోడ్లు ఉండటం, రెండు, మూడు ఎపిసోడ్లను ఒకేసారి విడుదల చేస్తూ ఉండటంతో వీక్షకులు రెట్టింపు అవుతున్నారు. ఓ మాయాజాలంలా ఓటీటీల విస్తృతి పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యసనంలా మారుతోంది సెల్‌ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచాన్నే చుట్టిరావచ్చు. సెల్‌ఫోన్ ఆన్లైన్ వినియోగం అనర్థాలకు దారితీస్తోంది. యువత, విద్యార్థులు వెబ్‌సిరీస్‌లకు బానిసలవుతున్నారు. వ్యసనంలా మారిపోవటం ఆందోళన కలిగిస్తోంది. అత్యధిక సమయం నేర సంబంధిత సిరీస్‌లు చూడటంతో ఏకాగ్రత కోల్పోవటం, ప్రతికూల ఉద్వేగాలకు లోనుకావటం, కోపం, ఆందోళనలు, అసహనం వంటి మానసిక సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. గంటల తరబడి సెల్ఫోన్లు చూడటంతో శారీరక సమస్యలు తప్పవు. తల్లిదండ్రులు గుర్తించి మొదట్లోనే పిల్లలు వాటికి బానిసలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. –అక్కింశెట్టి రాంబాబు, సైకాలజిస్ట్, తణుకు కంటి సమస్యలు మనిషికి వెలుగు కన్ను. కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఏకధాటిగా సెల్‌ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ వంటివి చూస్తూ ఉంటే దాని ప్రభావం కంటిపై పడుతుంది. పిల్లలు, పెద్దల్లో ప్రధానంగా డ్రై ఐ అనే సమస్య ఏర్పడుతుంది. మయోఫియా అనే సమస్యకూ దారితీసే అవకాశం ఉంది. మైనస్ కళ్లజోడు వేయించుకోవాల్సిన ఇబ్బంది ఏర్పడుతుంది. అల్ట్రావయోలెట్ కిరణాల కారణంగా కంటి రెటీనా దెబ్బతిని మెల్లగా కంటికి సంబంధించిన తీవ్ర సమస్యలు బాధిస్తాయి. కంటికి రెప్పలా.. మన కంటిని మనమే కాపాడుకోవాలి. –డాక్టర్ ఏఎస్ రామ్, కంటివైద్య నిపుణులు, ఏలూరు -
మీరు డయాబెటికా?
అదుపులో లేకుండా ఉండే చక్కెరవ్యాధి అన్ని అవయవాలతో పాటు కంటిని కూడా దెబ్బతీస్తుందన్న విషయం తెలిసిందే కదా. ఇలా డయాబెటిస్ కారణంగా కంటికి కూడా పలు సమస్యలు వస్తాయి. వాటిలో ముఖ్యమైనది ‘డయాబెటిక్ రెటినోపతి’. మిగతా ఏదైనా అవయవానికి లోపం వస్తే కొద్దో గొప్పో సమస్యను మేనేజ్ చేయవచ్చేమోగానీ... కంటికి వచ్చే సమస్యలతో అంతా అంధకారమైపోతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు అన్ని అవయవాల విషయంలోనూ జాగ్రత్తగా ఉన్నప్పటికీ ... కంటి విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలన్న విషయం గుర్తుంచుకోవాలి. షుగర్వ్యాధి ఉన్న ప్రతివారూ తమ రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచుకోవడం ఎంతముఖ్యమో... డయాబెటిక్ రెటినోపతిపై అవగాహన పెంచుకోవడమూ అంతే ప్రధానం. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. డయాబెటిక్ రెటినోపతి అంటే ఏమిటో తెలుసుకునే ముందుగా... అసలు మనకు చూడటం అన్న ప్రక్రియ ఎలా సాధ్యమవుతుందో అర్థం చేసుకుందాం. మన కంటి వెనక భాగంలో రెటీనా అనే తెర ఉంటుంది. మనకు కనిపించే దృశ్యం దీనిపై తలకిందులుగా పడుతుంది. అక్కడి నుంచి ఆ ఇమేజ్ మెదడుకు చేరడం వల్ల మనకు చూడటం అనే ప్రక్రియ సాధ్యమవుతుంది. కంటికి వెనక ఉన్న రెటినా తెరకు అత్యంత సన్నటి రక్తనాళాల (క్యాపిల్లరీస్) ద్వారా రక్తం సరఫరా అవుతుంటుంది. డయాబెటిస్ నియంత్రణ లేనివారిలో ఈ క్యాపిల్లరీస్ ఉబ్బడం జరుగుతుంది. దీన్నే మైక్రో అన్యురిజమ్ అంటారు. కొందరిలో క్యాపిలరీస్ మూసుకుపోతాయి. క్యాపిలరీస్ మూసుకుపోయినప్పుడు రెటినాకు కావాల్సిన పోషకాలు, ఆక్సిజన్ అందవు. అప్పుడు రెటీనా సరిగా పనిచేయదు. మైక్రో అన్యురిజమ్స్ లీక్ అయినప్పుడు ఎగ్జుడేట్స్ అనే పదార్థం రెటినాలో పేరుకుపోతుంది. దీనివల్ల రెటినా ఉబ్బతుంది. ప్రధానంగా మాక్యులా అనే మధ్యభాగంలో ఈ ఉబ్బు ఎక్కువగా ఉంటుంది. దీన్నే డయాబెటిక్ మాక్యులార్ ఎడిమా అంటారు. రక్తనాళాలు మూసుకుపోయినవారిలో అసాధారణమైన అవాంఛిత కొత్తరక్తనాళాలు పెరుగుతాయి. ఈ కొత్త రక్తనాళాల నుంచి మాటిమాటికీ రక్తస్రావం జరుగుతుంటుంది. ఈ రక్తం రెటినాలోనూ, విట్రియస్ అనే జెల్‌లోనూ స్రవిస్తుంది. దీనివల్ల అకస్మాత్తుగా చూపు తగ్గిపోతుంది. ఈ రక్తస్రావం రెటినాలోగానీ, విట్రియస్‌లో గానీ కొంతకాలం అలాగే ఉంటే రెటినా ఊడే ప్రమాదం ఉంది. దీన్నే ‘రెటినల్ డిటాచ్మెంట్’ అంటారు. క్రమేణా ఈ కొత్తరక్తనాళాలు కంటి ముందుభాగానికి (యాంగిల్ ఆఫ్ ది యాంటీరియర్ ఛేంబర్) వచ్చినప్పుడు నియోవాస్కులార్ గ్లకోమా అనే ప్రమాదకరమైన గ్లకోమా వస్తుంది. రెటినల్ డిటాచ్మెంట్ వల్లగానీ లేదా గ్లకోమా వల్లగానీ చాలామంది తమ చూపును పూర్తిగా కోల్పోతారు. అయితే డయాబెటిక్ రెటినోపతి లక్షణాలు మొదటి దశలో కనిపించవు. ఇలాంటి అసాధారణ, అవాంఛిత రక్తనాళాల నుంచి రక్తస్రావం అయి, అది కంటిలోని విట్రియస్ అనే జెల్లీలోకి స్రవించినప్పుడు ఈ కండిషన్‌ను తొలిసారి గుర్తించడం సాధ్యమవుతుంది. తర్వాత కంటి ముందు నల్లటి చుక్కలు తేలుకుంటూ పోతున్నట్లుగా, అల్లుకుపోతున్నట్లుగా కనిపిస్తుంటాయి. ఆ తర్వాత మెల్లమెల్లగాగానీ లేదా ఒక్కోసారి అకస్మాత్తుగా గాని కంటిచూపు పోవచ్చు. డయాబెటిస్ ఉంటే తరచూ కంటి పరీక్ష తప్పదు... పైన పేర్కొన్న పరిస్థితులను నివారించుకోవడం కోసం డయాబెటిస్ ఉన్నవారు కనీసం ఆర్నెల్లకొకసారి అయినా లేదా కంటి వైద్యుడు సూచించిన ప్రకారం కంటి పరీక్షలు చేయించుకోవాలి. మనం పైన చెప్పుకున్న అవాంఛిత పరిణామాలను తొలిదశలోనే గుర్తించి, తగిన చికిత్స చేస్తే చూపు కోల్పోయే ప్రమాదం ఉండదు. సాధారణంగా రెటినోపతి సమస్య ఉన్నవారికి ఫండస్ ఫొటో, ఓసీటీ పరీక్ష, ఫ్లోరెసిన్ యాంజియోగ్రఫీ అనే పరీక్షలు చేసి, రెటినోపతి ఏ దశలో ఉందో నిర్ధారణ చేస్తారు. ఫండస్ ఫొటో ద్వారా స్టేజ్‌తో పాటు... మొదటిసారి పరీక్షించినప్పుడూ, ఆ తర్వాతి విజిట్స్లోనూ తేడాలు గమనిస్తారు. ఓసీటీ పరీక్షలో రెటినా ఎంతగా మందం అయ్యింది అనే విషయం తెలుస్తుంది. యాంజియోగ్రఫీలో కొత్తరక్తనాళాలు, రెటినాలో జరిగే రక్తసరఫరా (రెటినల్ సర్క్యులేషన్) గమనిస్తారు. డయాబెటిస్ ఉన్నవారు ఎవరైనా సరే... కనీసం ఆర్నెల్లకోసారి లేదా తమ కంటిడాక్టరు సూచించిన వ్యవధుల్లో తరచూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలతో చూపును జీవితాంతం పదిలంగా కాపాడుకోవడం సాధ్యమవుతుందని గుర్తుంచుకోవాలి. చికిత్స డయాబెటిక్ రెటినోపతిలో కంటికి జరిగిన నష్టాన్ని బట్టి అనేక రకాల చికిత్సలు చేయాల్సిరావచ్చు. ఉదాహరణకు లేజర్ ఫొటో కోయాగ్యులేషన్ అనే ప్రక్రియ ద్వారా లీకేజీలను అరికడతారు. ఇది గోల్డ్‌స్టాండర్డ్ చికిత్స. ఈ ప్రక్రియలో అసాధారణంగా, అవాంఛితంగా పెరిగిన రక్తనాళాలనూ తగ్గిస్తారు. మ్యాక్యులార్ ఎడిమా ఉన్నవారికి యాంటీవెజ్ ఇంజెక్షన్ల ద్వారా రెటినా వాపును తగ్గిస్తారు. అడ్వాన్స్డ్ రెటినోపతి ఉన్నవారికి, విట్రియస్ హేమరేజీతో పాటు రెటినల్ డిటాచ్మెంట్ ఉన్నవారికి మైక్రో విట్రియో రెటినల్ సర్జరీ నిర్వహిస్తారు. డాక్టర్ రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు -
చిన్నారి కంటికి ఏమైంది..
చిన్నప్పుడు పిల్లల కంటి సమస్యను గుర్తించడం కష్టం..నిశితంగా తల్లితండ్రులు వారి చూపును పరిశీలిస్తే తప్ప సమస్య బయటపడదు. కొందరు టీవీ లేదా పుస్తకం దగ్గరగా పెట్టుకుని చూస్తుంటారు. మరికొందరికి కంటి నుంచి తరచూ నీరుకారుతుంది. మరికొందరు రెప్పలు ఆడిస్తూ ఉంటారు. చిన్న సమస్యేలే.. వయసు పెరిగే కొలదీతగ్గిపోతుందని తల్లితండ్రులుసమాధానపడుతుంటారు.అంతేకాని వైద్యుని దగ్గరకుతీసుకువెళ్ళరు. ఇలాంటి పిల్లలకుఆదిలోనే వైద్యం చేయిస్తే కంటిని కాపాడిన వారిమమవుతాం. ఈ బాధ్యతను కీలకంగా భావించి రాష్ట్రప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైతే ఆపరేషన్లు సైతం ఉచితంగా చేయాలని సంకల్పించింది. సాక్షి కడప : ఆహారంలో సమతుల్యత లోపమో.... జన్యుపరమైన సమస్యో...పుట్టుకతోనే వచ్చిన ఇబ్బందో తెలియదుగానీ జిల్లాలో అనేకమంది చిన్నారులు కంటికి సంబంధించిన లోపంతో అల్లాడుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించి వైఎస్సార్‌కంటి వెలుగు పథకం ద్వారా చికిత్స చేసి కొత్త వెలుగులు ప్రసాదిస్తోంది ప్రభుత్వం. అక్టోబరు 10 అంధత్వ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభించిన ఈపథకం విజయవంతంగా కొనసాగుతోంది. మొదటి విడతలో 4,24,000 మంది విద్యార్థులను పరిశీలించి కంటి సమస్యలున్న చిన్నారులను గుర్తించి సరిదిద్దేందుకు సమాయత్తమవుతున్నారు. 13 వేల మందికి కంటి అద్దాలు అవసరం ఇప్పటివరకు తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో విద్యార్థులకు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, పాఠశాల ఉపాధ్యాయులు పరీక్షలు చేపట్టారు. అందులో 32,005 మందికి కంటిచూపు సమస్యలను గుర్తించారు. ఆప్తాలమిక్ అసిస్టెంట్లు పాఠశాలల వారీగా వారికి మరోసారి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి లోపాన్ని గుర్తించారు. 27 వేల మంది చిన్నారులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించగా 13 వేల మందికి కంటి అద్దాలు అవసరమని పక్కాగా లెక్క తేల్చారు. ముంబయికి చెందిన ఓ సంస్థ ద్వారా కంటి అద్దాలను అందజేస్తున్నారు. ఆప్తాలమిక్ అసిస్టెంట్లు చిన్నారులను పరిశీలించిన అనంతరం అక్కడి నుంచే నేరుగా ఆన్లైన్ ద్వారా కంటికి సంబంధించిన వివరాలు పొందుపరిచి ఫలానా సైజులో అద్దాలు అవసరమని సమాచారం ఇస్తున్నారు. తదనంతరం అద్దాలు ముంబయి నుంచి సోమవారం కడపకు చేరుకోగానే....దాదాపు రెండు వేల మందికి అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2000 మందికి కంటి వ్యాధులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించిన వారిలో రెండు వేల మంది కంటి వ్యాధులతో బాధపడుతున్నారు.కంటిలో గుల్లలు, పొరలు, శుక్లాలు, రే చీకటి, కనుగుడ్డు సమస్య, మెల్లకన్ను, కార్నియా సంబంధిత వ్యాధులతో ఉన్నట్లు లెక్క తేల్చారు. వీరందరికీ కడప రిమ్స్, ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ఆపరేషన్లు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. అందరికీ ఆపరేషన్లు అవసరం లేకపోయినా ప్రత్యేక చికిత్సల ద్వారా వ్యాధులను నయం చేసేందుకు వైద్యాధికారులు సిద్దమయ్యారు. జనవరి 15వ తేదీలోపు అన్ని చికిత్సలను పూర్తి చేయనున్నారు. అద్దాలు అవసరమైన వారికి కూడా ఆ గడువులోపు అందజేసేందుకు ప్రణాళిక రచించారు.ప్రత్యేక పరీక్షలు అవసరమైన మరో ఐదు వేల మంది పరీక్షలకు రోజూ 30 వైద్య బృందాలు పనిచేస్తున్నాయి. వారం రోజుల్లో పూర్తవుతాయి. జనవరి 15 తరువాత పెద్దలకు కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలి దశలో రాజంపేట డివిజన్లో ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించేందుకు వైద్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఆరు నెలలపాటు అక్కడ కంటి సమస్యలున్న వారికి పరీక్షలు మొదలుకొని ఆపరేషన్ల వరకు అన్నీ చేయనున్నారు. ఇలా మూడు విడతల్లో 2021 నాటికి జిల్లా అంతటా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఏది ఏమైనా జిల్లాను కంటి సమస్య రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బాల్యంలోనే కంటి సమస్యలను గుర్తించేందుకు నడుం బిగించిన ప్రభుత్వం ♦ వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభం ♦ తొలిదశలో విద్యార్థులందరికీ పరీక్షలు పూర్తి ♦ కంటి అద్దాలు అవసరమైన వారు గుర్తింపు ♦ కొందరికి ప్రత్యేక వైద్య చికిత్సలు ♦ ముంబయి నుంచి వస్తున్నకంటి అద్దాలు ♦ జనవరి 15నుంచి పెద్దలకూ పరీక్షలు ♦ జిల్లాలో 32,005 మందికి కంటి సమస్యలు ♦ 27 వేల మంది విద్యార్థులకు పూర్తయిన పరీక్షలు ♦ 13 వేల మందికి కంటి అద్దాల అవసరం ♦ 23 నాటికి ముంబయినుంచి వస్తున్న అద్దాలు ♦ 2000 మందికిపైగా ప్రత్యేకవైద్యం ♦ ఇప్పటికే4425పాఠశాలల్లో4,24,000మందికి పరిశీలన ♦ జనవరి 10లోపుఆపరేషన్లు పూర్తికికసరత్తు ఆపరేషన్లకు ఏర్పాట్లు రెండు వేల మందికి పైగా చిన్నారుల కళ్లలో పెద్ద సమస్యలు ఉన్నాయి...వాటికి పరిష్కారం చూపేందుకు కొందరికి కంటి ఆపరేషన్లు...మరికొందరికి ఇతర మార్గాల ద్వారా పరిష్కారం చూపుతున్నాం. నాణ్యతతో కూడిన అద్దాలను కూడా అందిస్తాం. జనవరి 15వ తేదీలోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం.త్వరలోనే రాజంపేట డివిజన్లో రెండవ విడత ఫిబ్రవరి 1 నుంచి ప్రజలందరికీ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం– డాక్టర్ రామిరెడ్డి, డెప్యూటీ డీఎంహెచ్ఓ,అంధత్వ నివారణ సంస్థ జిల్లా అధికారి, కడప -
కళ్లల్లో కల్లోలం
నేత్రాలు నిండు జలాశయాల వంటివి. అయితే మనిషి నిర్లక్ష్యంతో కళ్లల్లో నీరు ఆవిరవుతోంది. కళ్ల సహజత్వాన్ని మెల్లగా కోల్పోయేలా చేసే టీవీ.. కంప్యూటర్ల జాబితాలోకి స్మార్ట్ఫోన్లు వచ్చి చేరాయి. అధిక గంటలు స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్‌తో గడిపేస్తుండటంతో కళ్లల్లో కల్లోలం అలముకుని ఎడారిలా మారిపోతున్నాయి. చివరకు చూపుపై ప్రభావం పడుతోంది. ఇందులో భాగంగా కళ్లు పొడిబారడం అనే సమస్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. సాక్షి, నెహ్రూనగర్ (గుంటూరు): ఆధునిక టెక్నాలజీతో అందరికీ అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ఫోన్లు కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరానికి మించి వినియోగిస్తుండడంతో మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడు యువతీ, యువకులతో పాటు పెద్దవారిలోనూ ఇదే సమస్య మొదలైంది. ఒకప్పుడు కంప్యూటర్‌తో గంటల తరబడి గడిపేవారు. అవసరం లేకపోయినా ఇంటర్నెట్ చూస్తూ, వీడియో గేమ్స్ ఆడుతూ కాలం వెల్లబుచ్చేవారు. ఇప్పుడు కంప్యూటర్లతో పాటు స్మార్ట్ఫోన్లు జతకలిశాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ ఆధునిక పరికరానికి అతుక్కుపోతున్నారు. మనిషి రోజులో 16 గంటల పాటు మేల్కొని ఉంటే అందులో 3 నుంచి 4 గంటల పాటు స్మార్ట్‌ఫోన్ చూస్తూ గడిపేవారు అధికంగా ఉంటున్నారు. నిద్రపోయే 8 గంటల సమయాన్ని సైతం యువత కుదిస్తే మరో రెండు, మూడు గంటలను స్మార్ట్‌ఫోన్‌కే కేటాయిస్తోంది. ఫలితంగా శారీరక, మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటోంది. ఇందులో కళ్లు పొడిబారడం అనే సమస్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. నిత్యం ఐదు నుంచి ఆరు గంటలు స్మార్ట్‌ఫోన్ వాడే వారిలో కళ్లు డ్రై అవడంతో పాటు కార్నియా సమస్యలు వస్తాయని కంటి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎవరికి వస్తుందంటే.. 50 సంవత్సరాలు నిండిన స్త్రీలకు, బహిష్టు ఆగిన తర్వాత హార్మోన్ థెరపీలో ఉన్నవారికి, కాలుష్య వాతావరణంలో ఎక్కువగా తిరిగే వారికి, కళ్లల్లో కాంటాక్ట్ లెన్స్ వాడే వారికి, ధూమపానం చేసే వారికి, ఎక్కువ సమయం కంప్యూటర్‌పై పనిచేసే వారికి, కొన్ని రకాలైన మందులు (బీపీ, అలర్జి, మానసిక వ్యాధిగ్రస్తుల మందులు, గర్భ నిరోధక మాత్రలు) వాడే వారితో పాటు కీళ్ల నొప్పులు, మధుమేహం వ్యాధి మందులు వాడే వారికి కూడా డ్రై ఐ రావచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రయాణాలు చేసే వారు కూలింగ్ గ్లాస్ వాడాలి. తరచూ ముఖాన్ని చన్నీటితో కడుక్కోవాలి. స్మార్ట్‌ఫోన్ బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుని చూడాలి. కళ్లకు ఫోన్‌కు మధ్య 15 సెంటీమీటర్ల దూరంగా పెట్టుకుని చూడాలి. ముఖానికి దగ్గరగా పెట్టుకోకూడదు. 20 నిమిషాల పాటు ఫోన్, కంప్యూటర్ వాడిన తర్వాత 20 సెకన్ల పాటు దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. అలా చేయడంతో పాటు కనురెప్పలు కొట్టడం వల్ల నల్లగుడ్డు పొరపైకి నీరు చేరి డ్రై అవకుండా దోహదం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చీకట్లో స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించరాదు. కంప్యూటర్‌పై పనిచేసే వారు యాంటీ రిఫ్లేక్టివ్ గ్లాసెస్ వాడితే మంచిది. రోజులో ఎక్కువ సేపు స్మార్‌ఫోన్, కంప్యూటర్‌పై పనిచేసే వారు ఐ డ్రాప్స్, ఆయిట్మెంట్లు వాడటం ద్వారా దుష్ఫలితాలు దరిచేరకుండా చూసుకోవచ్చు. నేత్ర పరీక్ష నిర్వహిస్తున్న వైద్యుడు (ఫైల్) డ్రై ఐని అశ్రద్ధ చేస్తే చూపు కోల్పోతారు డ్రై ఐ వచ్చిన వారు ఆర్టిఫీషియల్ ఐ వాటర్ (కృత్రిమ కంటినీళ్లు) చాలా కాలం వాడాలి. వాడే టియర్ డ్రాప్స్ ఎలాంటి ప్రిజర్వేటివ్ లేకుండా వాడితే మంచిది. పొడి బారిన కళ్ల సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు సైక్లోస్పోడిన్ ఐ డ్రాప్స్ వాడాల్సి ఉంటుంది. ఈ డ్రాప్స్ ఎక్కువ ఉత్ప్రేరితం చేసి కంట్లో ఎక్కువ నీళ్లు వచ్చేలా దోహదం చేస్తాయి. డ్రై ఐని అశ్రద్ధ చేస్తే కంట్లోని కార్నియాపై తెల్లటి మచ్చలు వచ్చి చూపు కోల్పోయే అవకాశం ఉంది. కంటికి పని కల్పించే టీవీ, కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ వంటి వస్తువులను సరైన దూరంలో నుంచి చూస్తే చాలా వరకు కంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. వీలైనంత వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కళ్లను పక్కకు మరల్చాలి. డాక్టర్ మెండా ఫర్నీకుమార్, కంటి వైద్య విభాగాధిపతి, జీజీహెచ్, గుంటూరు నేత్రాలు పొడిబారే లక్షణాలు కళ్లు అలసినట్లుగా ఉండడం. కళ్లల్లో మంట, కంట్లో దురదగా ఉండటం, కళ్లల్లో నీళ్లు రావడం, కళ్లు నొప్పిగా ఉండడం, కళ్లల్లో ఇసుకపోసినట్లుగా ఒత్తుకోవడం ఈ లక్షణాలు ఉంటే డ్రై ఐ (కళ్లు పొడిబారడం) సమస్యతో బాధపడుతున్నట్లే. డ్రై ‘ఐ’ ఎలా గుర్తిస్తారు డ్రై ఐ కనుగొనేందుకు కంటి వైద్యులు ఘమర్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్షలో కంట్లో నీరు ఎంత ఉందో కొలిచేందుకు ఒక ఫిల్టర్ పేపర్ వాడతారు. సాధారణంగా 35 మిల్లీమీటర్ల పేపర్ తడిగా అయితే నార్మల్‌గా ఉన్నట్లు, 5 మిల్లీమీటర్ల కంటే తక్కువగా తడి ఉంటే అతి ప్రమాదకర డ్రై ఐగా నిర్ధారిస్తారు. -
పాపకు మెల్లకన్ను ఉన్నట్లు అనిపిస్తోంది...
మా పాప వయసు మూడున్నర ఏళ్లు. వచ్చే ఏడాది స్కూల్లో వేయడం కోసం... ఇప్పట్నుంచే అలవాటు చేయడానికి తనను ప్లే స్కూల్‌కు పంపుతున్నాం. ఈ క్రమంలో ఆమెకు మెల్లకన్ను ఉన్నట్లు గుర్తించాను. పాప దేనినైనా తదేకంగా చూస్తున్నప్పుడు మెల్లకన్ను పెడుతోంది. మాకు తెలిసిన కంటి డాక్టర్‌ను సంప్రదిస్తే ఆమెకు కళ్లజోడు అవసరమని చెప్పారు. ఇంత చిన్న పాపకు కళ్లజోడు అవసరమా? ఆమెకు ఇంకేదైనా చికిత్స అందుబాటులో ఉందా? మీరు చెప్పిన వివరాల ప్రకారం బహుశా మీ పాపకు అకామడేటివ్ ఈసోట్రోపియా అనే కండిషన్ ఉండవచ్చునని తెలుస్తోంది. మెల్లకన్ను దూరదృష్టి (హైపర్‌మెట్రోపియా)ని సరిచేయకపోవడం వల్ల ఇలాంటి కండిషన్ వస్తుంది. ఈ సమస్య సాధారణంగా స్కూలుకు వెళ్లే పిల్లల్లో మొదలవుతుంది. ఏదైనా చదివే సమయంలో సరిగా కనిపించనప్పుడుగానీ లేదా తదేకంగా చూస్తూ తనకు కనిపిస్తున్నదాన్ని స్పష్టంగా చూసేందుకు అకామడేట్ చేసుకునే ప్రయత్నంలో గానీ ఈ కండిషన్ మొదలవుతుంది. అదే క్రమంగా మెల్లకన్నుకు దారితీస్తుంది. మీ పాప కంటి సమస్యను చక్కదిద్దడానికి ప్లస్ పవర్ ఉన్న లెన్స్‌లను (అద్దాలను) కంటివైద్యనిపుణులు సూచిస్తారు. ఈ కంటి అద్దాలను ఆరు నెలల పాటు వాడాక అప్పుడు మళ్లీ మెల్లకన్ను ఏ మేరకు ఉందో పరీక్షించి చూస్తారు. ఈ క్రమంలో వయసు పెరిగేకొద్దీ ప్లస్ పవర్ తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే మెల్లకన్ను సమస్య దానంతట అదే నయమవుతుంది. అప్పుడు ఆమెకు ఎలాంటి చికిత్సా అవసరం లేదు. ప్లస్ పవర్ ఉన్నంతకాలం ఆమెకు కళ్లజోడు తప్పనిసరి. ఇంత చిన్న వయసులో కళ్లజోడు ఎందుకు అంటూ మీరు గనక నిర్లక్ష్యం చేసే, అది ఆంబ్లోపియా (లేజీ ఐ) అనే కండిషన్‌కు దారితీసి, ఆమె ఒక కంట్లోగానీ, లేదా రెండు కళ్లలోగానీ చూపు తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు మీ పాపకు తగిన అద్దాలు ఇప్పించండి. కళ్లద్దాలు ఇష్టం లేదు...ప్రత్యామ్నాయం ఉందా? నా వయస్సు 20 ఏళ్లు. నేను నాలుగేళ్లుగా కళ్లద్దాలు వాడుతున్నాను. నాకు మైనస్ 3 పవర్ ఐసైట్ ఉంది. నాకు కళ్లద్దాలు వాడటం ఇష్టం లేదు. నా వయసుకంటే పెద్దగా కనిపిస్తున్నాను. అందుకే వాటికి బదులుగా వాడదగిన కాంటాక్ట్ లెన్స్‌లు వాడటమో లేదా లాసిక్ సర్జరీయో చేయించుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఆ రెండింటి గురించి వివరాలు చెప్పండి. మొదట కాంటాక్ట్ లెన్సెస్ గురించి తెలుసుకుందాం. అవి కంటి నల్లపొర (కార్నియా పొర) మీద వాడే ప్లాస్టిక్ లెన్సెస్ అన్నవూట. ఇందులో సాఫ్ట్ లెన్స్, సెమీ సాఫ్ట్ లెన్స్, గ్యాస్ పర్మియబుల్ లెన్స్, రిజిడ్ లెన్స్ అని వెరైటీస్ ఉన్నాయి. దీన్ని పేషెంట్ కార్నియాను బట్టి వాళ్లకు ఏది ఉపయుక్తంగా ఉంటుందో డాక్టర్లు సూచిస్తారు. కాంటాక్ట్ లెన్స్‌ను ఉదయం పెట్టుకొని, రాత్రి నిద్రపోయే వుుందు తొలగించాలి. వాటిని అలా పెట్టుకొనే నిద్రపోకూడదు. కాంటాక్ట్ లెన్స్ ఉన్నప్పుడు కన్ను నలపకూడదు. కాంటాక్ట్ లెన్స్ ఉన్నవాళ్లు ఎక్కువగా డస్ట్, పొగ, వేడిమి ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు. ఇక లాసిక్ సర్జరీ అంటే కార్నియా పై పొర ఒంపు (కర్వేచర్)ను అడ్జెస్ట్ చేసి దూరదృష్టి (ప్లస్), హ్రస్వ దృష్టి (మైనస్) లోపాలను సరిచేస్తారు. రిఫ్రాక్షన్ స్టేబుల్‌గా ఉంటే లేజర్ చికిత్స కూడా చేయించుకోవచ్చు. లేజర్ అయినా వారం నుంచి పది రోజుల్లో చూపు నార్మల్‌గా ఉంటుంది. ఈ చికిత్సతో సాధారణ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాతే ఈ ఆపరేషన్‌ను సూచిస్తుంటాం. మీ వయసు 20 ఏళ్లు కాబట్టి మీరు ముందుగా కొన్ని పరీక్షలు చేయించుకొని, అర్హులైతే లాసిక్కు తప్పక వెళ్లవచ్చు. డాక్టర్ రవికుమార్ రెడ్డికంటి వైద్య నిపుణులు, మెడివిజన్ ఐ హాస్పిటల్,హైదరాబాద్. -
49 లక్షల మందికి కంటి సమస్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడో వంతు మందికి కంటి సమస్యలున్నట్లు ‘కంటి వెలుగు’ కింద ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో వెల్లడైంది. మంగళవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1.49 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అం దులో 49 లక్షల మంది ఏదో ఒకరకమైన కంటి సమస్యతో బాధపడుతున్నారని వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపింది. ఆ నివేదిక ప్రకారం ఇప్పటివరకు 67.68 లక్షల మంది పురుషులు, 81.24 లక్షల మంది మహిళలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. పురుషుల కంటే మహిళలు 13.56 లక్షల మంది అధికంగా పరీక్షలు చేయించుకున్నట్లు తేలింది. 9,104 గ్రామాల్లో (91.66%) కంటి వెలుగు కార్యక్రమం పూర్తయింది. మిగిలిన గ్రామాల్లో ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 22.3 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు.. శని, ఆదివారాలు, సెలవు రోజులు మినహా మిగిలిన రోజుల్లో గ్రామాలు, బస్తీల్లో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, కంటి వైద్య నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పరీక్షలు చేసిన అనంతరం అవసరమైన వారికి అక్కడికక్కడే రీడింగ్ గ్లాసులు ఇస్తున్నారు. ఇప్పటివరకు 22.30 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు అందజేశారు. చత్వారం గ్లాసుల పెండింగ్.. చత్వారం ఉన్న వారికి ప్రిస్క్రిప్షన్ రాసిస్తున్నారు. దాని ప్రకా రం ప్రభుత్వమే ప్రత్యేకంగా గ్లాసులు తయారుచేసి ఇస్తోంది. ఇప్పటి వరకు 17.56 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ రాసివ్వగా, అందులో 7.54 లక్షల మందికి మాత్ర మే ఆయా గ్లాసులను ఇచ్చారు. 10.02 లక్షల మందికి చత్వారం గ్లాసులు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా చత్వారం గ్లాసులు అందజేయాల్సి ఉన్నందున జాప్యం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. 9 లక్షల మంది ఎదురుచూపు కంటి సమస్యలున్న వారిలో 9.07 లక్షల మందికి ఆపరేషన్లు, ఇతరత్రా వైద్య సేవలు అవసరమని వైద్య, ఆరోగ్యశాఖ నివేదికలో తెలిపింది. రాష్ట్రంలో ఎన్నికల ముందు వరకు కొం దరికి ఆపరేషన్లు నిర్వహించగా కొన్ని చోట్ల వికటించడంతో ఆపరేషన్లు నిలిపివేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఇప్పటికీ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. కంటి వెలుగు కార్యక్ర మం ముగింపు దశలో ఉంది. లక్షలాది మంది ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఆపరేష న్లు ఎప్పుడు చేస్తారో అధికారులు కూడా చెప్ప డంలేదు. దీనిపై అనిశ్చితి నెలకొంది. -
'దృష్టి'కి దిష్టి తగిలింది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కంటి సమస్యలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ‘కంటి వెలుగు’కార్యక్రమంలో లక్షలాది మంది వివిధ రకాల కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడైంది. కంటి వెలుగుకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ తాజాగా సర్కారుకు పంపిన నివేదికలో అనేక అంశాలను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం... ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 77.58 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో అధికంగా 40 శాతం మంది కంటి సమస్యలతో బాధపడుతుండటంపై వైద్య నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇంతమందికి కంటి సమస్యలు ఉండటానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, పేదరికం కారణంగా ఇప్పటివరకు పట్టించుకోకపోవడం వంటివేనని స్పష్టం చేస్తున్నారు. ఆడవారిలో అధిక సమస్యలు... కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటివరకు 77.58 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో అత్యధికంగా 42.84 లక్షల (55.23%) మహిళలే ఉన్నారు. 34.72 లక్షల (44.76%) మంది పురుషులున్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే ఇప్పటివరకు కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో బీసీలు 56.48% ఉన్నారు. ఎస్సీలు 17.15%, ఎస్టీలు 10.51 శాతమున్నారు. ఓసీలు 10.59% మంది ఉన్నారు. మైనారిటీలు 5.27 శాతం ఉన్నారు. 13.92 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు.. కంటి వెలుగులో దీర్ఘ దృష్టి ఉన్న వారికి రీడింగ్ గ్లాసులు అందజేశారు. అందులో 40 ఏళ్లలోపు వారు 2.45 లక్షల మంది ఉంటే, 40 ఏళ్లు పైబడినవారు 11.46 లక్షల మంది ఉన్నారు. ఇక హస్వ దృష్టితో బాధపడుతున్నవారికి ప్రత్యేక అద్దాలు కావాలని వైద్యులు ప్రిస్కిప్షన్ రాసిచ్చారు. వారందరికీ కంపెనీ నుంచి ప్రత్యేకంగా కంటి అద్దాలు సరఫరా చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 39 వేల మందికే అందజేశారు. ఇంకా 11 లక్షల మందికి చత్వారం కంటి అద్దాలు సకాలంలో సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా కంటి పరీక్షలు చేశాక కేవలం 3 లక్షల మందికి మాత్రమే ఆపరేషన్లు అవసరమని వైద్యాధికారులు ముందుగా అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు చేసిన పరీక్షల్లోనే ఏకంగా 5.78 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరమని నిర్దారణకు రావడం గమనార్హం. మిగిలిన ప్రజలందరికీ కంటి పరీక్షలు చేసే సరికి ఆ సంఖ్య 12 లక్షలకు పైగానే చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే రాష్ట్రంలో కంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఆపరేషన్లు అవసరమైనా చేయించుకోకుండా అలాగే ఉండటం వల్ల ఈ సంఖ్య అధికంగా కనిపిస్తుందని అంటున్నారు. చైతన్యం లేకపోవడంతోనే.. ప్రజల్లో చైతన్యం లేక కంటి సమస్యలు అధికంగా నమోదవుతున్నాయి. ఆహారపు అలవాట్లు సరిగా లేక, షుగర్ వ్యాధి ఉన్నా గుర్తించక త్వరగానే కంటి సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో కంటి సమస్యను పెద్దగా పట్టించుకోవడంలేదు. ముదిరే వరకు చూస్తూనే ఉన్నారు. పేదరికం, చైతన్యం లేకపోవడంతో ఇలా జరుగుతోంది. స్టెరాయిడ్స్ మందులు వాడటం, షుగర్ తదితర కారణాలతో క్యాటరాక్ట్ వస్తుంది. ముదిరే వరకు చూస్తే మున్ముందు కనుచూపు వచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి కంటి సమస్యలను గుర్తించి వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ దీప శిల్పిక, సన్‌షైన్ ఆసుపత్రి -
గాడ్జెట్ల వాడకంతో కంటి సమస్యలు
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు లాంటి గాడ్జెట్ల వాడకంతో పట్టణ ప్రాంతాల్లో కంటి సమస్యలు మరింత పెరిగాయని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. కాబట్టి పట్టణాల్లోనూ కంటి సమస్యలను తగ్గించాల్సిన అవసరం ఉందని, దీనిపై ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి దృష్టి సారించాలన్నారు. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సామాజిక నేత్ర సంరక్షణ విభాగం ‘గుళ్లపల్లి ప్రతిభారావు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ ఐ కేర్’20వ వార్షికోత్సవం శనివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ.. చాలా మంది ఆరోగ్య పరీక్షలపై దృష్టి సారించడం లేదని, కంటి సమస్యలను ముందే గుర్తించకపోతే తర్వాత మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు. 55 కోట్ల మందికి గోల్డ్ ఆరోగ్య కార్డులు: నడ్డా దేశవ్యాప్తంగా 55 కోట్ల మంది కోసం ఈ నెల 23న ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. పథకాన్ని అమలుకు 29 రాష్ట్రాలూ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయన్నారు. పథకంలో భాగంగా ప్రజలకు గోల్డ్ ఆరోగ్య కార్డులు ఇస్తామని, కార్డులున్న వారికి ఏడాదికి రూ. 5 లక్షల ఆరోగ్య కవరేజీ ఉంటుందన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య కవరేజీ కార్యక్రమమన్నారు. 1,350 రకాల వ్యాధులకు అవసరమైన చికిత్సలు, శస్త్ర చికిత్సలు దీని ద్వారా చేయించుకోవచ్చని చెప్పారు. ఇందులో కంటి శస్త్రచికిత్సలూ ఉన్నాయన్నారు. 2022 నాటికి అన్నీ వెల్నెస్ సెంటర్లే కేంద్ర ప్రభుత్వం 2017లో సమగ్ర ఆరోగ్య విధానాన్ని ప్రకటించిందని, కొత్త విధానం ద్వారా వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశామని నడ్డా చెప్పారు. దేశ ప్రజలంతా జీవితాంతం ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చామన్నారు. దేశంలోని లక్షన్నర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), ఉప కేంద్రాలన్నింటినీ వెల్నెస్ సెంటర్లుగా మారుస్తామన్నారు. గతేడాది 4 వేలు, ఈ ఏడాది 5 వేలు.. ఇలా 2022 నాటికి అన్ని కేంద్రాలనూ మార్చేస్తామని చెప్పారు. మహిళలకు సర్వైకల్ కేన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు మొదలు అన్ని రకాల సమగ్ర పరీక్షలు వెల్నెస్ సెంటర్లలో చేస్తారని చెప్పారు. ఎల్వీ ప్రసాద్ సేవలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాలని, అందుకు కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనం ఖేత్రపాల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇలా చదివితే కళ్లు పోతాయ్!
లండన్ : అతిగా చదవటం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు శాస్త్రవేత్తలు. సంవత్సరాల తరబడి అలా చదవటం వల్ల కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన యూనివర్శిటీ ఆఫ్ బ్రిష్టల్, కర్డిఫ్ యూనివర్శిటీలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెలుగు చూశాయి. సంవత్సరాల కొద్ది చదువులు చదవటం వల్ల అది నేరుగా కంటిచూపు మీద ప్రభావం చూపుతుందంటున్నారు. వైద్య పరిభాషలో ‘మియోపియా’అని చెప్పబడే కంటి సంబంధ వ్యాధి దాడి చేసే అవకాశం ఉందంటున్నారు. ‘మెండెలియన్ రాండమైజేషన్’ పద్ధతి ద్వారా 40-69 మధ్య వయస్సు కలిగిన దాదాపు 68వేల మందితో ఓ సర్వే నిర్వహించారు శాస్త్రవేత్తలు. ‘మియోపియా’ పెరుగుతూపోతే కంటిచూపు కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. చదువుకునే సంవత్సరాలు పెరిగే కొద్ది వారిలో కంటిచూపు ప్రతి సంవత్సరానికి 0.27 డియోప్ట్రాస్(రిప్రేక్టివ్ ఎర్రర్) మేర నష్టపోయినట్లు వెల్లడైంది. ఇంటర్‌తో చదువు ఆపేసిన వారిలో కంటిచూపు కొంత మెరుగ్గా ఉన్నట్లు తేలింది. చదువులు పెరిగే కొద్ది విద్యార్హత పెరగటంతో పాటు కంటిచూపు తగ్గుతుందని గుర్తించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ర్యాంకుల కోసం పిల్లలకు విశ్రాంతి ఇవ్వకుండా చదివించే తల్లిదండ్రులు కొంచెం ఆలోచిస్తే పిల్లలు ‘కళ్ల’కాలం సుఖంగా ఉంటారని మేథావులు సలహా ఇస్తున్నారు. -
కళ్ల సమస్యలకు చెక్!
కళ్ల సమస్యలు వచ్చినా... అక్షరాలు లేదా వస్తువులు సరిగా కనిపించకపోయినా డాక్టర్ కళ్ల జోడు వాడాలని సూచిస్తారు. వాటివల్ల కంటి సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని కాదు.. కాస్త ఉపశమనం కలుగుతుంది అంతే. కాటరాక్ట్ శస్త్రచికిత్స కానీ లెన్స్ వాడటం వల్ల, లేజర్ చికిత్స వల్ల కాస్త కంటి సమస్యలను నయం చేసుకోవచ్చు. అయితే వీటన్నింటి సాయం అవసరం లేకుండానే కంటి చుక్కల మందు సాయంతో సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు ఇజ్రాయెల్‌కు చెందిన శాస్త్రవేత్తలు. అంతేకాదు ఉన్న సమస్యలను కూడా తగ్గించవచ్చని పేర్కొంటున్నారు. ఇందుకోసం తాము ఓ ప్రత్యేకమైన కంటి చుక్కల మందు తయారు చేసినట్లు ఇజ్రాయెల్ టెల్ అవీవ్‌లోని బార్ ఇలాన్ యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానోటెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ శాస్త్రవేత్తలు తెలిపారు. తామే తయారు చేసిన చుక్కల మందుతో కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చిన స్పష్టం చేస్తున్నారు. ‘రిఫ్రాక్టరీ సమస్యలను సరిచేసేందుకు తాము ఓ వినూత్న పద్ధతిని కనుగొన్నాం’ అని కంటి వైద్య నిపుణుడు డా.డేవిడ్ స్మద్జ తెలిపారు. ఈ మందు వేసిన పందుల కార్నియా సమస్యలు చాలా వరకు తొలగిపోయాయని తమ పరిశోధనల్లో తేలినట్లు చెప్పారు. దూరదృష్టి, హ్రస్వ దృష్టి సమస్యలు తొలగిపోయాయని వివరించారు. అయితే మానవులపై వచ్చే నెలలో క్లినికల్ ట్రయల్స్ చేయాల్సి ఉందని చెప్పారు. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి మరి! -
కంట్లో చీకట్లు
సాక్షి, హైదరాబాద్: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు.. అయితే ముఖ్యమైన ఆ కన్నే ప్రమాదంలో పడిందిప్పుడు. మారుతున్న జీవనశైలి, పౌష్టికాహార లోపం తదితర కారణాల వల్ల కంటిచూపు సమస్యలు పెరుగుతున్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 25 శాతం మంది కంటి చూపు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పెద్ద వయస్సు వారికి శుక్లాలు (పొర), చిన్న పిల్లలకు పోషకాహార లోపం వల్ల దృష్టి లోపాలు వస్తున్నాయి. శుక్లాల కారణంగానే 43 శాతం మంది కంటిచూపు కోల్పోతున్నారని నిపుణు లు నిర్ధారించారు. మధుమేహం కారణంగా కంటిచూపు సమస్యల(డయాబెటిక్ రెటినోపతి)తో బాధపడుతున్నవారూ పెరుగుతున్నా రు. రాష్ట్రంలోని 7 శాతం జనాభా డయాబెటిక్ రెటినోపతి సమస్యతో బాధపడుతున్నారు. వీరు కాకుండా మరో 7 శాతం మంది చూపు కోల్పోయేందుకు కారణమయ్యే నీటి కాసులు(గ్లకోమా) సమస్యతో బాధపడుతున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో గ్లకోమా లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అంధత్వ నివారణపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని రకాల దృష్టి లోపాలను గుర్తించేందుకు ప్రత్యేక సర్వేను చేపట్టింది. 550 గ్రామాలను ఎంపిక చేసి 2017 అక్టోబర్‌లో సర్వే మొదలుపెట్టింది. ఇటీవల వివరాలను నమోదు చేసింది. గ్రామీ ణ ప్రాంతాల్లోని ప్రతి వంద మందిలో ఇద్దరు కంటి చూపు సమస్యలతో బాధపడుతుండగా పట్టణాల్లో వంద మందిలో ఒకరు ఈ ఇబ్బం ది ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా శుక్లాల సమస్యతోనే కంటిచూపు కోల్పోతున్నారు. రాష్ట్రంలో 3.21 లక్షల శుక్లాల చికిత్సలు నిర్వహించారు. నేత్రదానంతో 5,126 మంది కంటిచూపును పొందారు. పోషకాహారం తీసుకోకపోవడం వల్లే.. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు పోషకాహా రం తీసుకోకపోవడం వల్ల పిల్లలు పుట్టుకతోనే కంటిచూపు సమస్యల బారిన పడుతున్నారు. చిన్న వయస్సులోనే కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నవారు 7 శాతం మంది ఉంటున్నారు. నెలలు నిండకుండానే పుట్టిన వారిలో రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ సమస్య వస్తోంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే శాశ్వతంగా చూపు పోయే ప్రమాదం ఉంది. మన రాష్ట్రంలోని పిల్లల్లో కంటి చూపు సమస్య బాధితులు పెరుగుతున్నారు. 2014–15లో 5,44,469 మంది విద్యార్థుల్లో 24,947 మందికి కంటి చూపు సమస్యలున్నాయి. 2015– 16లో 6,53,156 మందిని పరీక్షించగా... 40,264 మంది బాధితులున్నారు. 2016– 17లో 6,10,234 మంది లో 40,367 మంది విద్యార్థులకు చూపు సమస్యలున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. చికిత్స ఏర్పాట్లు... కంటి చూపు సమస్యల నివారణపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రత్యేక కార్యాచరణ మొదలుపెడుతోంది. మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ‘అంధత్వ రహిత తెలంగాణ(అవైడబుల్ బ్లైండ్నెస్ ఫ్రీ తెలంగాణ–ఏబీఎఫ్‌టీ)’పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. నేత్ర వైద్య నిపుణులు, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు దీంట్లో భాగస్వాములు అవుతున్నాయి. ఇందుకోసం మొదటి దశలో 2017–18లో 10 జిల్లాలను ఎంపిక చేసింది. వచ్చే ఏడాది 10 జిల్లాల్లో, మరో ఏడాది ఇంకో 10 జిల్లాల్లో ఇదే తరహా కార్యక్రమాలను నిర్వహించనుంది. రాష్ట్రంలో 2019 నాటికి కంటిచూపు సమస్యలు లేకుండా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. స్వచ్ఛంద సంస్థల సహకారంతో కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. కొన్ని గ్రామాలను ఎంపిక చేసి పూర్తి స్థాయిలో వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. – డాక్టర్ మోతీలాల్, జాయింట్ డైరెక్టర్, జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం శుక్లాల సమస్యతోనే ఎక్కువ మందికి కంటి చూపు సమస్యలు వస్తున్నాయి. కాలుష్యం సైతం కంటి సమస్యలకు కారణమవుతోంది. పోషకాహార లోపంతో చిన్న వయస్సులోనే కంటి చూపు సమస్యలు వస్తుంటాయి. మధుమేహం ఉన్నట్లు తేలితే వెంటనే కంటి పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ రవీందర్‌గౌడ్, సూపరింటెండెంట్, సరోజినిదేవి కంటి ఆస్పత్రి -
12 సార్లు... 1 నిమిషానికే!
అధ్యయనం మనుషులు నిమిషానికి ఎన్నిసార్లు కన్నార్పుతారో తెలుసా...12 సార్లు. అవును ప్రతి 5 సెకన్లకోసారి కనురెప్పలు వాటంతట అవే మూసుకుపోతాయి. నిమిషానికి... 12సార్లయితే మరి గంటకు...12 *60=720 సార్లు. రోజుకు... 24*720=17280 సార్లు. ఆసక్తికరమైన అంశాన్ని చూసేటప్పుడు కన్నార్పే నిడివి 5 సెకన్లకంటే ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్ మానిటర్ని చూసేటప్పుడు కూడా కన్నార్పడం ఆలస్యం అవుతుంటుంది. దాంతో కంటిని శుభ్రపరిచే ప్రక్రియ తక్కువగా జరుగుతుంది. కంప్యూటర్ మీద పనిచేసే వారికి కంటిసమస్యలు త్వరగా రావడానికి ఇదీ ఓ కారణమే. కళ్లకు తగినంత తేమను అందిస్తూ, దుమ్ముధూళిని తొలగించడానికే కనురెప్పలు మూసుకుంటాయి. -
నిండు జీవితానికి ‘నవ’ పరీక్షలు!
బీపి, షుగర్, కంటి సమస్యలు, లివర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, గుండెజబ్బులు, స్థూలకాయం, ఎముకలు బలహీనపడటం, రక్తంలో ెహిమోగ్లోబిన్ తగ్గడం వంటి సమస్యలు చాలామందికి సర్వసాధారణంగా ఎదురయ్యేవే. కారణాలను గుర్తించి, వాటిని అదుపులోకి తెచ్చేందుకు ఉపకరించేవే ఈ నవపరీక్షలు... 1. రక్తపోటు పరీక్ష: ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి పెరగడంతో చిన్న వయసు వారిలో కూడా ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు కనిపిస్తోంది. ‘స్ఫిగ్మోమానోమీటర్’ అనే పరికరంతో బీపీని కొలుస్తారు. వైద్యుల సలహా మేరకు ఆహార విహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలా వరకు దీనిని అదుపు చేయవచ్చు. అప్పటికీ అదుపులోకి రాకుంటే, మందులు వాడాల్సి ఉంటుంది. 2. ఈసీజీ పరీక్ష: గుండె పనితీరును తెలుసుకోవడానికి ఎలక్ట్రో కార్డియోగ్రఫీ (ఈసీజీ) పరీక్ష అత్యవసరం. ఈసీజీ పరికరం సాయంతో గుండె కొట్టుకునే తీరును తెలుసుకుంటారు. దీనిద్వారా గుండె కండరాలకు తగినంతగా రక్త సరఫరా జరగకపోవడం, గుండె లయలో హెచ్చుతగ్గులు, తగినంత వేగంతో గుండె పంప్ చేయలేకపోవడం, గుండె కండరాల్లో ఏవైనా దళసరిగా మారడం లేదా వాటి పరిమాణం పెరగడం, గుండెలో పుట్టుకతో ఏర్పడే లోపాలు వంటివి కనుక్కోవచ్చు. 3. లివర్ ఫంక్షన్ టెస్ట్స్: లివర్ పనితీరును తెలుసుకునేందుకు చేసే కొన్ని రకాల రక్తపరీక్షలనే లివర్ ఫంక్షన్ టెస్ట్స్ అంటారు. వీటిలో ఆల్బుమిన్, టోటల్ బైలురుబిన్, డెరైక్ట్ బైలురుబిన్, ట్రాన్సామినాసెస్, ఆల్కలైన్ ఫాస్ఫేట్స్ వంటి పదార్థాల స్థాయిని కనుగొనేందుకు చేసే పరీక్షలు ఉంటాయి. వీటి ద్వారా హెపటైటిస్, హైపర్ పారాథైరాయిడిజం, పచ్చకామెర్లు (జాండిస్) వంటి జబ్బులను తెలుసుకోవచ్చు. వీటితో పాటు అల్ట్రాసౌండ్ హోల్ అబ్డామిన్ పరీక్ష చేయడం ద్వారా లివర్ సిరోసిస్, ఫ్యాటీలివర్ కూడా ఉందేమో తెలుసుకోవచ్చు. లివర్‌లోని లోపాల వల్ల తలెత్తే జబ్బుల లక్షణాలు అంత తొందరగా బయటపడవు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే, చికిత్స చేయడం తేలిక. 4. కంటి పరీక్ష: సాధారణంగా కంటిచూపు 6/6 ఉంటుంది. చిన్నారులు ఎక్కువగా హ్రస్వదృష్టి బారిన పడుతుంటారు. నలభై ఏళ్లు దాటాక చత్వారం వచ్చేస్తుంది. అంటే, దూరదృష్టి పెరుగుతుందన్నమాట. ఇవే కాకుండా, వయసు మళ్లిన వారికి గ్లకోమా, క్యాటరాక్ట్ వంటి ఇబ్బందులూ తలెత్తుతాయి. ఎప్పటికప్పుడు కంటి పరీక్ష జరిపించుకుంటూ, తగిన చికిత్స పొందాలి. 5. కిడ్నీ పరీక్ష: కిడ్నీల పనితీరును తెలుసుకోవడానికి సీరమ్ క్రియాటినిన్ పరీక్ష నిర్వహిస్తారు. కండరాల జీవక్రియలో వెలువడే రసాయనిక వ్యర్థమే క్రియాటినిన్. రక్తంలో క్రియాటినిన్ స్థాయిని సక్రమంగా ఉండేలా చూడటంలో కిడ్నీలదే కీలక పాత్ర. కిడ్నీల పనితీరులో తేడా వస్తే రక్తంలో క్రియాటినిన్ పరిమాణం పెరిగిపోతుంది. క్రియాటినిన్ పరిమాణం సాధారణంగా 0.8-1.2 ఎండీ/డీఎల్, పురుషుల్లో 0.8-1.3 ఎంజీ/డీఎల్ ఉంటుంది. మూత్రపరీక్ష ద్వారా కూడా దీని స్థాయిని తెలుసుకుంటారు. ఒక్కోసారి అవసరాన్ని బట్టి మూత్రపరీక్ష, రక్తపరీక్ష రెండింటి ద్వారా ఈ పరిమాణాన్ని తెలుసుకుని, కిడ్నీల పనితీరులో తేడాలు ఉన్నట్లు తేలితే తగిన చికిత్స చేస్తారు. 6. కొలెస్ట్రాల్ పరీక్ష: రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే గుండెజబ్బులు, పక్షవాతం వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. రక్తపరీక్ష ద్వారా కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తెలుసుకోవచ్చు. ఎల్డీఎల్, హెచ్‌డీఎల్ ఈ పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. ఎల్డీఎల్నే చెడు కొవ్వు అంటారు. ఇది ఎక్కువగా ఉంటే, ధమనుల్లో కొవ్వు చేరి గుండెపోటు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. అదే, హెచ్‌డీఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ రక్తనాళాల్లోకి చెడుకొవ్వు చేరకుండా అరికడుతుంది. 45 పైబడ్డ వాళ్లు ప్రతి ఏటా ఈ పరీక్ష చేయించుకోవాలి. 7. చక్కెర పరీక్ష: రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉంటే డయాబెటిస్ ఉన్నట్లే. చక్కెరను నియంత్రించే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే పాన్‌క్రియాస్ పనితీరు మందగించినా, కండరాలు, కాలేయం, కొవ్వుల్లో ఉండే జీవకణాలు ఇన్సులిన్‌కు తగిన రీతిలో ప్రతిస్పందించకపోయినా చక్కెరజబ్బు వస్తుంది. పాన్‌క్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోతే టైప్-1 డయాబెటిస్ వస్తుంది. ఇది చిన్న వయసు నుంచే కనిపిస్తుంది. ఇన్సులిన్‌ను శరీరంలోని జీవకణాలు తగిన రీతిలో ఉపయోగించుకోనప్పుడు టైప్-2 డయాబెటిస్ వస్తుంది. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. ఎలాంటి లక్షణాలూ కనిపించకపోయినా 45 ఏళ్ల వారు తరచు రక్తపరీక్షలు జరిపించుకుని, రక్తంలో చక్కెర స్థాయిని తెలుసుకోవడం మంచిది. 8. కంప్లీట్ బ్లడ్ పిక్చర్: రక్తంలో ఉండే సూక్ష్మ పదార్థాలన్నింటి పరిమాణాన్ని సమగ్రంగా తెలుసుకునేందుకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్ష నిర్వహిస్తారు. రక్తహీనత వంటి లోపాలను కనుగొనేందుకు ఈ పరీక్ష ఎంతగానో దోహదపడుతుంది. రక్తంలో హెమోగ్లోబిన్ పరిమాణం 11ఎంజీ/డీఎల్ నుంచి 16 ఎంజీ/డీఎల్ వరకు ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే రక్తహీనతతో బాధపడుతున్నట్లే. డెంగ్యూ వంటి వ్యాధులు సోకినప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా పడిపోతుంది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ద్వారానే ఆ పరిస్థితిని తెలుసుకోవచ్చు. 9. బోన్ డెన్సిటీ టెస్ట్: మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గిపోవడంతో మహిళలు ఆస్టియో పొరాసిస్కు గురవుతుంటారు. మరీ సన్నగా ఉండే మహిళలు, వంశపారంపర్యంగా ఈ వ్యాధి కొనసాగుతున్న వాళ్లు ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. బోన్ డెన్సిటీ పరీక్ష ద్వారా ఆస్టియో పొరాసిస్ వ్యాధిని తేలికగా గుర్తించవచ్చు. బోన్ డెన్సిటీ తక్కువగా ఉంటే క్యాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. డాక్టర్ ఎల్. సుదర్శన్ రెడ్డి సీనియర్ జనరల్ ఫిజీషియన్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబద్ -
కంట్లో నలుసు!
ఐటీ, అనుబంధ ఉద్యోగుల్లో పెరుగుతున్న కంటి సమస్యలు 70 శాతం మందికి ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ మారిన జీవనశైలే కారణమంటున్న నిపుణులు జాగ్రత్తపడకపోతే ప్రమాదమని హెచ్చరిక సిటీబ్యూరో: రోజంతా కంప్యూటర్లకు అతుక్కుపోవడం, గంటల తరబడి టీవీల ముందు కూర్చోవడం, రెప్పవాల్చకుండా అదే పనిగా పని చేయడం, కనీస విరామం లేకపోవడం వల్ల ఐటీ దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో నూటికి 70 శాతం మంద్ఙికంప్యూటర్ విజన్ సిండ్రోమ్*(సీవీఎస్)వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. కళ్లు ఎరుపెక్కడం, కంట్లో నలుసులు ఏర్పడటం, మంట, దురద, తడారి పోవడం, నీరు కారడం, వంటి సమస్యలు కంటి చూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నగరం లోని వాసన్, అగర్వాల్, ఎల్వీప్రసాద్, సరోజినీదేవి, మ్యాక్స్‌విజన్, తదితర కంటి ఆస్పత్రుల్లో ప్రతి రోజూ 400కుపైగా కేసులు న మోదవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. జీవనశైలిని మార్చుకోకపోతే భవిష్యత్తులో కంటి చూపు దెబ్బతినే అవ కాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెప్పవాలిస్తేనే రక్షణ నగరంలో ఐటీ, దాని అనుబంధ రంగాల్లో మూడు లక్షలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నట్లు అంచనా. ఇక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయా ల్లోనూ కంప్యూటర్ల వినియోగం తప్పని సరిగా మారింది. చివరికి షాపింగ్ మాల్స్‌లో కూడా వీటి వినియోగం పెరిగింది. కనురెప్ప వాల్చ కుండా గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్‌పై పని చేస్తుండటం వల్ల కళ్లు దెబ్బతింటున్నాయి. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ప్రతి వంద మందిలో 70 శాతం మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. కళ్లపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఇరిటేషన్‌కు గురవుతున్నారు. ప్రతి చిన్న అంశానికి చిరాకు పడుతున్నారు. ఇదిలా ఉండగా పిల్లలు సైతం గేమ్స్ పేరుతో కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. గంటల తరబడి టీవీలను వీక్షిస్తుండంతో చూపు మందగించడం వల్ల పుస్తకంలోని అక్షరాలను కూడా చదువలేక పోతున్నారు. కాపాడుకోవచ్చు ఇలా కనురెప్పవాల్చకుండా అదేపనిగా కంప్యూటర్‌పై పని చేయకూడదు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కంప్యూటర్ స్క్రీన్ నుంచి దృష్టి ని మరల్చాలి. కంట్లో మంట ఉన్నప్పుడు కనురెప్పలను రెండు చేతులతో మూసి అదిమిపట్టుకోవాలి. కంప్యూటర్ల ముందు కూర్చున్నప్పుడు ట్యూబ్ లైట్లు ఆర్పేయకూడదు. చీకట్లో పనిచేయడం వల్ల కంప్యూటర్ స్క్రీన్ కాంతి ప్రభావం నేరుగా కంటిపై పడుతుంది. ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి 20 నుంచి 30సార్లు కళ్లను మూసి తెరవాలి. కంప్యూటర్ మానిటర్‌కు కళ్లకు కనీసం రెండు అడుగుల దూరంలో ఉండేలా చూసుకోవాలి. కళ్లు దురదగా అనిపిస్తే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. కంటికి ఓ వ్యాయామం నిమిషానికి పదిసార్లు కళ్లు మూసి తెరవడం వల్ల ఒత్తిడి మాయమవుతుంది.కనుగుడ్లను కిందికి, పైకి కనీసం పదిసార్లు కదిలించాలి.కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి కనీసం పదిహేను సార్లు తిప్పాలి.ఎదురుగా ఉన్న గోడపై గుర్తుపెట్టి దానిపై దృష్టిని కేంద్రీకరించి చూపు మెరుగు పరుచుకోవచ్చు.మంచి నీరు, పళ్ల రసాలు ఎక్కువగా తాగడం ద్వారా కంటి సమస్యను జయించవచ్చు.రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.దోస కీర ముక్కలను కనురెప్పలపై ఉంచడం వల్ల ఒత్తిడి మాయమవడంతో పాటు కలర్ కూడా మెరుగు పడుతుంది. - డాక్టర్ రవీందర్‌గౌడ్, కంటి వైద్య నిపుణుడు ఇండియన్ ఆప్తమాలజీ సొసైటీ ప్రకారం వైద్యులకు అందుతున్న ఫిర్యాదులు ఇలా.. కళ్లు అలసి పోవడం 64.95 శాతం ఒత్తిడికి గురికావడం 48.83 శాతం తలనొప్పి 45.68 శాతం మెడ, భుజాలనొప్పి 44.01శాతం ఇరిటేషన్‌కు గురికావడం 37.5 శాతం కళ్లల్లో మంట/దురద 34.38 శాతం రెండు దృశ్యాలు కన్పించడం 30.48 శాతం కంటి నుంచి నీరు కారడం 14.78 శాతం -
కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు
వయసు మీద పడుతున్న కొద్దీ వచ్చే కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని ఏపీ పెన్షనర్ల సంఘం కార్యదర్శి కేఎస్ హనుమంతరావు అన్నారు. విజయవాడ గవర్నర్ పేటలోని స్వాతంత్ర్య సమరయోధుల భవనంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల కోసం రాజమండ్రి గౌతమి నేత్రాలయం గురువారం ప్రత్యేకంగా నిర్వహించిన నేత్రవైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెన్షనర్లు ముఖ్యంగా తమ కంటి చూపును ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని, ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ శిబిరానికి మొత్తం 62 మంది హాజరు కాగా, వాళ్లలో 18 మందికి కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల పథకం (ఈహెచ్ఎస్) కింద వీళ్లందరికీ సోమవారం నాడు రాజమండ్రిలో ఆపరేషన్లు చేస్తారు. దీనికి సంబంధించి వాళ్లందరికీ రవాణా, ఆహారం, మందులు అన్నింటినీ ఆస్పత్రి అందజేస్తుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ల ప్రతినిధి టి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
కనుపాపకు ఎంత కష్టం
రోజూ నగరంలో కంటి సమస్యలతో వైద్యుల వద్దకు వెళుతున్న వారు 5,000 ఇందులో గాలి, రసాయన కాలుష్యాల కారణ బాధితులు 500 ఎక్కువగా ఇలాంటి బాధితులు 18 నుంచి 35 ఏళ్ల లోపువారే పొల్యూషన్ వల్ల దీర్ఘకాలిక కంటిసమస్య మారిన బాధితుల సంఖ్య ఏటా 15 వేలు ఇందులో అబ్బాయిలే 70 శాతం మంది. నయనం ప్రధానం. కానీ నగర జీవి కంటిపాపకు కష్టకాలమొచ్చింది. ఇది ఎంత వేగంగా అంటే మనకు ఏం జరుగుతోందో తెలిసే లోపే చూపు మసకబారుతోంది. ఇంటికెళితే చికాకు. ఆఫీసుకొస్తే అలసట. ఆఫీసు పనులతో మానసిక ఒత్తిడి. ప్రయాణం చేయడంతో కంటిపాపపై ఒత్తిడి. ఇదీ నగరంలో లక్షలాది మంది యువతీయువకుల పరిస్థితి. కంటి బాధితులు మిగతా ఏరంగంలో పెరగనంతగా పెరుగుతున్నారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం వారిని తిన్నగా అంధత్వం దిశగా నెడుతోంది. అరవై ఏళ్లకు చత్వారం వస్తుందంటారు. కానీ ముప్ఫై దాటాయో లేదో కళ్లకు అద్దాలు. నలభై దాటితే చత్వారం. యాభైలో మరింత దారుణం. ప్రతి వందమంది కంటి బాధితుల్లో నగరంలో పొగలు, దుమ్మూ ధూళితో వస్తున్న కంటివ్యాధుల బాధితులు కనీసం 15 శాతం దాటారు. పొగల సెగలు కంటిపాపను ఛిద్రం చేస్తున్న తీరుపై డాక్టర్లే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకైనా కంటిని కాపాడుకోవచ్చునని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డా.రవికుమార్‌రెడ్డి చెబుతున్నారు. ఇలా మొదలవుతున్నాయ్ కంటిపాప కష్టాలు - నగరంలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు కంటి వ్యాధులకు గురవుతున్నారు. - ప్రధానంగా రెండు రకాల ఇబ్బందులు కంటివ్యాధులకు కారణమవుతోంది - వెజిటబుల్ మెటీరియల్...అంటే వృక్ష సంబంధిత లేదా జంతు సంబంధిత రేణువులు. - వాహనాల నుంచి వచ్చే రసాయన ధూళి. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్ తదితరం - ఈ రెండు రకాల కారణాల వలన ప్రతి వందమందికీ పదిహేను మంది ఏడాదికి రెండు మూడు సార్లు కంటి వైద్యుల దగ్గరకు వెళుతున్నారు - ప్రధానంగా వీటి వలన కళ్లకలక, ఇన్ఫెక్షన్, కార్నియల్ అల్సర్ తదితరం వస్తున్నాయి - కళ్లు ఎరుపుగా మారడం, కళ్లనుంచి పదే పదే నీళ్లు కారడం వస్తున్నాయి - కళ్లలో ఇరిటేషన్, అలర్జీ, కళ్లు డ్రై అవడం అంటే పొడిబారడం జరుగుతుంది - ఇలాగే కొన్నేళ్ల తర్వాత కళ్లు మసకబారడం జరుగుతుంది - ఆ తర్వాత కొన్నేళ్లలో కంటిచూపు తగ్గుతూ వస్తుంది - ఎయిర్ పొల్యూషన్, కెమికల్ పొల్యూషన్ వల్ల కంటిలో నల్లగుడ్డుపై ఎరిటియం అనే కండరం పెరుగుతుంది. ఇది తిన్నగా చూపును తగ్గిస్తుంది కొద్ది పాటి జాగ్రత్తలు పాటిస్తే - ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేస్తున్నప్పుడు రక్షణగా అద్దాలు (ప్రొటెక్టివ్ గ్లాసెస్) ధరించడం వలన కళ్లను గాలి పొల్యూషన్ నుంచి కాపాడుకోవచ్చు - అద్దంతో కూడిన హెల్మెట్ కవర్‌ను ధరించడం మంచిదే - ఇంటినుంచి ఆఫీసుకు వెళ్లగానే మంచినీళ్లతో కళ్లను కడుక్కోవడం మంచిది - అలాగే ఆఫీసునుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా మంచినీళ్లతో కళ్లను కడుక్కోవాలి - ప్రయాణం చేసి కొద్దిగా కంటికి ఇబ్బందిగా ఉన్నప్పుడు లూబ్రికెంట్ డ్రాప్స్ వేసుకోవచ్చు - పదే పదే కళ్లతో బాధపడుతూంటే వైద్యుల సలహా మేరకు యాంటిబయోటిక్ చుక్కలు వేసుకోవచ్చు. - ద్విచక్రవాహనంలో తిరిగే వారు ప్రతి ఆరుమాసాలకు కంటి వైద్యులను సంప్రదించడం మంచిది - ద్విచక్ర వాహనంలో వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలను ఎలాంటి కళ్లద్దాలుగానీ, హెల్మెట్‌గానీ లేకుండా ముందువైపు కూర్చోపెట్టద్దు. - ఎక్కువగా పెద్ద పెద్ద చౌరస్తాల్లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కళ్లకు ఎఫెక్ట్ అయ్యే పొగలు వెలువడున్నాయి. వీలైనంత వరకూ ఇలాంటి చౌరస్తాల గుండా వెళ్లడం తగ్గించాలి - డా. రవికుమార్‌రెడ్డి కంటివైద్య నిపుణులు, మెడివిజన్ హాస్పిటల్ మెహిదీపట్నం -
40 శాతం మందికి ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’
సాక్షి, సిటీబ్యూరో: రోజంతా కంప్యూటర్లకు అతుక్కపోవడం, గంటల తరబడి టీవీల ముందు కూర్చోవడం, రెప్పవాల్చకుండా అదేపనిగా పనిచేయడం, కనీస విరామం లేకపోవడం వల్ల ఐటీ దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో నూటికి 40 శాతం మంది ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యుల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కళ్లు ఎరుపెక్కడం, కంట్లో నలుసు ఏర్పడటం, మంట, దురుద, తడారి పోవడం, నీరు కారడం, వంటి సమస్యలు కంటి చూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నగరంలోని వాసన్, అగర్వాల్, ఎల్వీప్రసాద్, సరోజినీదేవి, మ్యాక్స్‌విజన్ తదితర కంటి ఆస్పత్రుల్లో ప్రతి రోజూ 400కు పైగా కేసు లు నమోదు అవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. జీవనశైలిని మార్చుకోకపోతే భవిష్యత్తులో కంటి చూపు దెబ్బతినే అవకాశమూ లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెప్పవాల్చకపోవడం వల్లే... నగరంలో ఐటీ, దాని అనుబంధ రంగాల్లో మూడు లక్షల మందికి పైనే పనిచేస్తున్నట్లు ఓ అంచనా. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ కంప్యూటర్ల వినియోగం తప్పనిసరిగా మారింది. కనురెప్ప వాల్చకుండా గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్‌పై పనిచేస్తుండటం వల్ల కళ్లు దెబ్బతింటున్నాయి. ఐటీ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న ప్రతి వంద మందిలో 40 శాతం ఏదో ఒక కంటి సమస్యతో బాధపడుతున్నారని ప్రముఖ కంటి వైద్యుడు సుధాకర్‌రెడ్డి తెలిపారు. కంటిపై పెరుగుతున్న ఒత్తిడివల్ల తీవ్రమైన ఇరిటేషన్‌కు గురవుతున్నారు. ప్రతి చిన్న అంశానికి చిరాకు పడుతున్నారు. ఇక పిల్లలు గేమ్స్ అంటూ కంప్యూర్లకు అతుక్కపోతున్నారు. గంటల తరబడి టీవీలను వీక్షిస్తుండంతో చూపు మందగించి పుస్తకంలోని అక్షరాలను కూడా చదువలేకపోతున్నారు.