Health Tips In Telugu: కంటి తెల్లగుడ్డు మీద ఒక ఎర్రని, రక్తపు చార వంటి గుర్తు కనిపించిందంటే.. అది అక్కడి ఒక చిన్న రక్త నాళం చిట్లిందని అర్థం. ఈ పరిస్థితి కి చాలా సందర్భాల్లో కారణాలు తెలియవు. కొన్ని రోజుల్లోనే ఆ చార కనిపించకుండా పోతుంది.
అయితే.. అధిక రక్తపోటుకు లేదా మధుమేహానికి సూచిక కావచ్చు. అంతేకాదు, రక్త సరఫరాలో గడ్డలు కట్టి అడ్డంకులు ఏర్పడి అధిక రక్తస్రావానికి దారితీయగల ప్రమాదానికి ఈ రక్త చారిక సంకేతం కావచ్చు.
రక్తం పలుచబారటానికి వాడే ఆస్పిరిన్ వంటి మందులు కూడా ఈ చారకు కారణం కావచ్చు. ఈ సమస్య తరచుగా వస్తున్నట్లయితే తమకు ఇస్తున్న మందుల మోతాదును సమీక్షించాల్సిందిగా తనకు చికిత్స చేస్తున్న వైద్యుణ్ణి కోరవచ్చు.
కన్నులో బూడిద రంగు వలయం
కంటిలో నల్లగుడ్డు (శుక్ల పటలం) చుట్టూ తెల్లటి లేదా బూడిద రంగు వలయం కనిపిస్తే అది అధిక కొవ్వుకు చిహ్నంగా, గుండె జబ్బు ప్రమాదం ఎక్కువ ఉన్నదని చెప్పే సంకేతంగా పరిగణిస్తారు. సాధారణంగా వయోవృద్ధుల కళ్లలో కూడా ఈ వలయాలు కనిపిస్తుంటాయి. అందుకే దీనికి వైద్య పరిభాషలో ఆర్కస్ సెనిలిస్ అని పేరు పెట్టారు.
నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే!
చదవండి: Diabetes: షుగర్ పేషెంట్లకు ఆరోగ్య ఫలం!.. ఒక్క గ్లాసు జ్యూస్ తాగితే 15 నిమిషాల్లో..
Eye Problems: ప్రమాద సంకేతాలు.. ఉబ్బిన కళ్లు, రెప్పల మీద కురుపులు.. ఇంకా ఇవి ఉన్నాయంటే
Comments
Please login to add a commentAdd a comment