బాలీవుడ్ బుల్లితెర నటి జాస్మిన్ భాసిన్ ఇటీవలే తన కళ్లకు ఆపరేషన్ చేయించుకుంది. కార్నియా దెబ్బతినడంతో సర్జరీ చేయించుకున్నట్లు సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించింది. ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌లో ధరించిన కాంటాక్ట్ లెన్స్‌ల కారణంగా కళ్లకు సమస్య వచ్చిందని తెలిపింది. జాస్మిన్ తన కళ్ల చికిత్స కోసం ముంబయి వెళ్లినట్లు చెప్పింది.
తాజాగా తాను కళ్ల సమస్య నుంచి బయపడినట్లు జాస్మిన్ భాసిన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం డేంజర్ జోన్ నుంచి బయపడ్డాడని పేర్కొంది. చికిత్స తర్వాత డాక్టర్ సలహాతో రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నట్లు వెల్లడించింది. చివరికి నా కంటి పాచ్‌లను తొలగించారని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తనకు చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. నా ముఖంపై ఈ చిరునవ్వును తిరిగి తెచ్చినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment