సాక్షి, సిటీబ్యూరో: రోజంతా కంప్యూటర్లకు అతుక్కపోవడం, గంటల తరబడి టీవీల ముందు కూర్చోవడం, రెప్పవాల్చకుండా అదేపనిగా పనిచేయడం, కనీస విరామం లేకపోవడం వల్ల ఐటీ దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో నూటికి 40 శాతం మంది ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యుల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కళ్లు ఎరుపెక్కడం, కంట్లో నలుసు ఏర్పడటం, మంట, దురుద, తడారి పోవడం, నీరు కారడం, వంటి సమస్యలు కంటి చూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నగరంలోని వాసన్, అగర్వాల్, ఎల్వీప్రసాద్, సరోజినీదేవి, మ్యాక్స్‌విజన్ తదితర కంటి ఆస్పత్రుల్లో ప్రతి రోజూ 400కు పైగా కేసు లు నమోదు అవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. జీవనశైలిని మార్చుకోకపోతే భవిష్యత్తులో కంటి చూపు దెబ్బతినే అవకాశమూ లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రెప్పవాల్చకపోవడం వల్లే...
నగరంలో ఐటీ, దాని అనుబంధ రంగాల్లో మూడు లక్షల మందికి పైనే పనిచేస్తున్నట్లు ఓ అంచనా. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ కంప్యూటర్ల వినియోగం తప్పనిసరిగా మారింది. కనురెప్ప వాల్చకుండా గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్‌పై పనిచేస్తుండటం వల్ల కళ్లు దెబ్బతింటున్నాయి. ఐటీ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న ప్రతి వంద మందిలో 40 శాతం ఏదో ఒక కంటి సమస్యతో బాధపడుతున్నారని ప్రముఖ కంటి వైద్యుడు సుధాకర్‌రెడ్డి తెలిపారు. కంటిపై పెరుగుతున్న ఒత్తిడివల్ల తీవ్రమైన ఇరిటేషన్‌కు గురవుతున్నారు. ప్రతి చిన్న అంశానికి చిరాకు పడుతున్నారు. ఇక పిల్లలు గేమ్స్ అంటూ కంప్యూర్లకు అతుక్కపోతున్నారు. గంటల తరబడి టీవీలను వీక్షిస్తుండంతో చూపు మందగించి పుస్తకంలోని అక్షరాలను కూడా చదువలేకపోతున్నారు.
40 శాతం మందికి ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’
Published Thu, Aug 22 2013 12:59 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
Advertisement