Lee Is A Medicine For Eye Problems, Details Inside - Sakshi

కంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు 'లీ' ఔషధం

Jun 15 2023 6:54 AM | Updated on Jun 15 2023 8:57 AM

Lee is a medicine for eye problems - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చూపు మందగించడం, కంటికి వచ్చే అంటువ్యాధులకు పరిష్కారంగా ఫార్మా కంపెనీ లీ హెల్త్‌ డొమెయిన్‌ ‘డీ–మాక్యులా’ పేరుతో సహజ సిద్ధ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చింది. అశ్వగంధ, బోస్విల్లా శరాషియో, జీగ్జాంథిన్, త్రిఫల, బిటా కెరోటిన్, కుంకుమ పువ్వును దేశీయ ఆవు నెయ్యిలో మరిగించి సేకరించిన రసాయనంతో డీ–మాక్యులా సాఫ్ట్‌జెల్‌ క్యాప్సూల్‌ తయారైందని కంపెనీ డైరెక్టర్‌ ఆళ్ల లీలా రాణి తెలిపారు. కంటి మంట,  పొడిబారడం, హానికర నీలి కాంతికి వ్యతిరేకంగా పోరాడడానికి, డయాబెటిక్‌ రెటినోపతి చికిత్సలో సహాయకారిగా ఉంటుందన్నారు. అమెజాన్, లీహెల్త్‌డొమెయిన్‌.కామ్‌ ద్వారా కూడా లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement