Macula
-
కంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు 'లీ' ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చూపు మందగించడం, కంటికి వచ్చే అంటువ్యాధులకు పరిష్కారంగా ఫార్మా కంపెనీ లీ హెల్త్ డొమెయిన్ ‘డీ–మాక్యులా’ పేరుతో సహజ సిద్ధ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చింది. అశ్వగంధ, బోస్విల్లా శరాషియో, జీగ్జాంథిన్, త్రిఫల, బిటా కెరోటిన్, కుంకుమ పువ్వును దేశీయ ఆవు నెయ్యిలో మరిగించి సేకరించిన రసాయనంతో డీ–మాక్యులా సాఫ్ట్‌జెల్ క్యాప్సూల్ తయారైందని కంపెనీ డైరెక్టర్ ఆళ్ల లీలా రాణి తెలిపారు. కంటి మంట, పొడిబారడం, హానికర నీలి కాంతికి వ్యతిరేకంగా పోరాడడానికి, డయాబెటిక్ రెటినోపతి చికిత్సలో సహాయకారిగా ఉంటుందన్నారు. అమెజాన్, లీహెల్త్డొమెయిన్.కామ్ ద్వారా కూడా లభిస్తుంది. -
బ్యూటిప్స్
రోజ్ క్రీమ్ గులాబీ రెక్కలు - 5 నిమ్మరసం - 5 చుక్కలు శనగపిండి - 2 టీ స్పూన్లు ఛాయపసుపు - చిటికెడు పై పదార్థాలకి కొంత నీటిని చేర్చి పేస్ట్ చేయాలి. ముఖాన్ని శుభ్రపరిచి ఆ పేస్ట్‌ని ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత ముఖాన్ని పాలతో శుభ్రపరచాలి. ఆ తరువాత నీటితో కడిగేయాలి. 15 రోజులకి ఒకసారి ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మం నునుపు అవ్వడమే కాకుండా మొటిమలు, నల్లమచ్చలు కూడా మటుమాయం అవుతాయి. సూపర్ బాడీ హెయిర్ ట్రీట్మెంట్ రెండు టేబుల్ స్పూన్ల మొలాసిస్, రెండు టేబుల్ స్పూన్ల జిలటిన్, ఒక టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్, ఒక టేబుల్ స్పూన్ బీర్ తీసుకుని అన్నింటినీ ఒక కప్పులో వేసి బాగా కలపాలి. దువ్వెనతో కాని హెయిర్ బ్రష్‌తో కాని జుట్టంతటికీ పట్టించి తలకు పాలిథిన్ కవర్ కాని షవర్ క్యాప్ కాని పెట్టి అరగంట సేపు అలాగే ఉంచాలి. తరువాత వేడినీటితో శుభ్రం చేసి చివరగా తలస్నానం చేయాలి. -
మచ్చలను తుడిచేద్దాం...
బ్యూటిప్స్ ప్రతిరోజూ ఉదయం ముందుగా చన్నీటితో ముఖం కడిగి టొమాటో రసం, నిమ్మరసం మిశ్రమాన్ని ముఖానికి రాయాలి (ఒక బాటిల్లో తాజా టొమాటోరసం అంతే మోతాదులో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో భద్రపరిచి రోజూ వాడవచ్చు). ఈ మిశ్రమాన్ని కాటన్‌తో కాని వేళ్లతో కాని అప్లయ్ చేయాలి. పది నిమిషాలకు లేదా ఆరిన తర్వాత చన్నీటితోనే తుడిచేయాలి. ఇది నేచురల్ స్కిన్‌కి మంచి టోనర్. ఇది ముఖం మీది నల్లమచ్చలతో పాటు అవాంఛిత రోమాలను కూడా తొలగిస్తుంది. మచ్చలను తొలగించడంలో చందనం చక్కగా పని చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ చందనం పొడిలో తగినంత పన్నీటిని కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత చన్నీటితో తడిపి వలయాకారంగా రుద్దుతూ కడగాలి. ముఖం మీద ఉన్న మచ్చలు పోవాలంటే నిమ్మకాయ బాగా పని చేస్తుంది. ప్యాక్‌ల కోసం టైం కేటాయించలేని వాళ్లు వంటలోకి పిండేసిన నిమ్మచెక్కను తిరగేసి ముఖానికి రుద్ది పది నిమిషాల తర్వాత చన్నీటితో కడిగితే చాలు. క్రమంగా మచ్చలు చర్మంలో కలిసిపోతాయి. నిమ్మచెక్కను రసం పిండేసిన తర్వాత వెనక్కి తిప్పి చక్కెరలో అద్ది ముఖానికి సున్నితంగా మర్దన చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే నల్లమచ్చలు, మొటిమలు అన్నీ పోయి ముఖం క్లియర్‌గా మారుతుంది. రెండు టీ స్పూన్ల పెసరపిండిలో చిటికెడు పసుపు కలిపి, రెండు చుక్కల నిమ్మరసం, ఒక స్పూను పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. -
నల్ల మచ్చలకు చెక్..
బ్యూటిప్స్ రెండు తమలపాకులను మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమంలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. రోజులో ఎప్పుడైనా ఒకసారి ఆ పేస్ట్‌ను నల్లమచ్చలపై స్క్రబ్ చేయాలి. క్రమం తప్పకుండా అలా చేస్తే నల్లమచ్చలు త్వరగా మాయమవుతాయి. తేయాకును రాత్రంతా పాలలో నానబెడ్డండి. అవి దొరక్కపోతే నాణ్యమైన టీ పొడినైనా తీసుకోండి. ఉదయం లేచిన వెంటనే చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకున్నాక ఆ మిశ్రమాన్ని నల్ల మచ్చలపై అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని మర్దన చేసుకుంటూ గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరి. ఈ నల్ల మచ్చలు పోవాలంటే మరో చిన్న చిట్కా ఉంది. అదేమిటంటే రోజూ ముఖానికి పసుపుకు కొద్దిగా గ్లిజరిన్ కలిపి రాసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక పాలతో కానీ గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మచ్చలు తగ్గుముఖం పడతాయి.