నల్ల మచ్చలకు చెక్..
బ్యూటిప్స్
రెండు తమలపాకులను మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమంలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. రోజులో ఎప్పుడైనా ఒకసారి ఆ పేస్ట్‌ను నల్లమచ్చలపై స్క్రబ్ చేయాలి. క్రమం తప్పకుండా అలా చేస్తే నల్లమచ్చలు త్వరగా మాయమవుతాయి.
తేయాకును రాత్రంతా పాలలో నానబెడ్డండి. అవి దొరక్కపోతే నాణ్యమైన టీ పొడినైనా తీసుకోండి. ఉదయం లేచిన వెంటనే చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకున్నాక ఆ మిశ్రమాన్ని నల్ల మచ్చలపై అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని మర్దన చేసుకుంటూ గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరి.
ఈ నల్ల మచ్చలు పోవాలంటే మరో చిన్న చిట్కా ఉంది. అదేమిటంటే రోజూ ముఖానికి పసుపుకు కొద్దిగా గ్లిజరిన్ కలిపి రాసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక పాలతో కానీ గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మచ్చలు తగ్గుముఖం పడతాయి.