12 సార్లు... 1 నిమిషానికే!
అధ్యయనం
మనుషులు నిమిషానికి ఎన్నిసార్లు కన్నార్పుతారో తెలుసా...12 సార్లు. అవును ప్రతి 5 సెకన్లకోసారి కనురెప్పలు వాటంతట అవే మూసుకుపోతాయి. నిమిషానికి... 12సార్లయితే మరి గంటకు...12 *60=720 సార్లు. రోజుకు... 24*720=17280 సార్లు.
ఆసక్తికరమైన అంశాన్ని చూసేటప్పుడు కన్నార్పే నిడివి 5 సెకన్లకంటే ఎక్కువగా ఉంటుంది.
కంప్యూటర్ మానిటర్‌ని చూసేటప్పుడు కూడా కన్నార్పడం ఆలస్యం అవుతుంటుంది. దాంతో కంటిని శుభ్రపరిచే ప్రక్రియ తక్కువగా జరుగుతుంది. కంప్యూటర్ మీద పనిచేసే వారికి కంటిసమస్యలు త్వరగా రావడానికి ఇదీ ఓ కారణమే. కళ్లకు తగినంత తేమను అందిస్తూ, దుమ్ముధూళిని తొలగించడానికే కనురెప్పలు మూసుకుంటాయి.