The Rotary Club of Lake District Moinabad: Autocross Championship For Cause - Sakshi
Sakshi News home page

Autocross Championship: చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు కోసం రోటరీ క్లబ్‌.. మోటార్‌ ఫెస్ట్‌..

Published Tue, May 30 2023 1:11 PM | Last Updated on Tue, May 30 2023 1:34 PM

The Rotary Club of Lake District Moinabad An Autocross Championship For Cause - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మొయినాబాద్‌ రోటరీ క్లబ్‌ గొప్ప కార్యం తలపెట్టింది. హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించే దిశగా ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇండియన్‌ నేషనల్‌ ఆటోక్రాస్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌ ద్వారా వచ్చిన నిధులను హైదరాబాద్‌లోని బౌల్డర్‌హిల్స్‌లో గోల్ఫ్‌కోర్స్‌ ట్రాక్‌ ఏర్పాటుకు వినియోగించనుంది.

అదే విధంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారుల ఆపరేషన్‌ నిమిత్తం థియేటర్‌ నిర్మాణానికి ఉపయోగించనుంది. సిద్ధిపేట పట్టణంలోని సత్య సాయి ఆస్పత్రిలో ఈ మేరకు ఆపరేషన్‌ థియేటర్‌ నిర్మాణానికి వచ్చిన నిధులను ఖర్చు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ నిర్మాణానికి దాదాపు 7.5 ​కో​ట్ల భారీ మొత్తం ఖర్చవుతుందని అంచనా.

కాగా రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో జరుగనున్న ఆటోక్రాష్‌ చాంపియన్‌షిప్‌లో టాప్‌ రేసర్లు పాల్గొననున్నారు. జూన్‌ 2-4 వరకు ఈ ఈవెంట్‌ నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపే క్రమంలో నిర్వహిస్తున్న ఈ కార్‌ రేసింగ్‌ ఈవెంట్‌ను విజయవంతం చేయాలని నిర్వాహకులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చి రేసింగ్‌ ఈవెంట్‌ను ఆస్వాదించాలని కోరారు.

చదవండి: ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement