Rotary Club
-
Busireddy Shankar Reddy: మాది సమష్టి సేవ
ప్రభుత్వం అన్నీ చేస్తుంది... కానీ! చేయాల్సినవి ఇంకా ఎన్నో ఉంటాయి. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెడుతుంది ప్రభుత్వం. చెప్పుల్లేకపోతే వచ్చే వ్యాధులను అరికట్టేదెవరు? స్కూలు భవనం కడుతుంది ప్రభుత్వం. ప్రహరీలు... టాయిలెట్లను మరచిపోతుంటుంది. హాస్పిటళ్లను కట్టిస్తుంది ప్రభుత్వం. వైద్యపరికరాల్లో వెనుకబడుతుంటుంది. ‘ప్రభుత్వం చేయలేని పనులు చేయడమే మా సేవ’ అంటున్నారు రోటరీ క్లబ్ గవర్నర్ డా.శంకర్‌రెడ్డి. ‘మనది పేద ప్రజలున్న దేశం. ప్రభుత్వాలు ఎంత చేసినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ముందుకు వచ్చే వాళ్లందరం సంఘటితమై చేస్తున్న సేవలే మా రోటరీ క్లబ్ సేవలు’ అన్నారు బుసిరెడ్డి శంకర్‌రెడ్డి. ఒక రైతు తన పొలానికి నీటిని పెట్టుకున్న తర్వాత కాలువను పక్కపొలానికి మళ్లిస్తాడు. అంతే తప్ప నీటిని వృథాగా పోనివ్వడు. అలాగే జీవితంలో స్థిరపడిన తర్వాత సమాజానికి తిరిగి ఇవ్వాలి. అప్పుడే జీవితానికి సార్థకత అన్నారు. సమాజానికి తమ సంస్థ అందిస్తున్న సేవల గురించి సాక్షితో పంచుకున్నారాయన. ‘కష్టపడడమే విజయానికి దారి’... ఇందులో సందేహం లేదు. కష్టపడి పైకి వచ్చిన వారిలో సేవాగుణం కూడా ఉంటుంది. నేను 1994లో మెంబర్షిప్ తీసుకున్నాను. అప్పటి నుంచి మా సీనియర్ల సర్వీస్‌ను చూస్తూ మేము ఇంకా వినూత్నంగా ఏమి చేయవచ్చనే ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. సర్వీస్‌లో ఉండే సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాను. చదువుకునే పిల్లవాడికి పెన్ను ఇవ్వడం కూడా చాలా సంతృప్తినిస్తుంది. ఆ పెన్ను అందుకునేటప్పుడు పిల్లల కళ్లలో చిన్న మెరుపు, ముఖంలో సంతోషం... ఇవి చాలు ఈ జీవితానికి అనిపిస్తుంది. నేను స్కూళ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి కారణం కూడా అదే. మంచినీటి సౌకర్యం లేని స్కూళ్లలో ఆర్వో ప్లాంట్, కొన్ని స్కూళ్లకు టాయిలెట్లు, హ్యాండ్ వాష్ స్టేషన్లు, తరగతి గదుల నిర్మాణం, క్లాస్‌రూమ్‌లో బెంచీలతో మొదలైన మా సర్వీస్‌లో ఇప్పుడు పిల్లల ఆరోగ్యం ప్రధానంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో ఉండే పిల్లలకు ప్రభుత్వం కొంతవరకు సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ అప్పటికప్పుడు తీర్చాల్సిన అవసరాలకు నిధులుండవు. వాటిల్లో ప్రధానమైనది ఆరోగ్యం. వాతావరణం మారిన ప్రతిసారీ పిల్లల మీద దాడి చేయడానికి సీజనల్ అనారోగ్యాలు పొంచి ఉంటాయి. మీరు ఊహించగలరా పాదాలకు సరైన పాదరక్షలు లేకపోవడం వల్ల చలికాలంలో పిల్లలు అనారోగ్యం బారిన పడతారు. నులిపురుగుల కారణంగా అనారోగ్యాల పాలవుతారు. హాస్టల్ ఆవరణలో కూడా చెప్పులతో తిరగాలని చెప్పడంతోపాటు మంచి బూట్లు ఇవ్వడం వరకు రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్నాం. బూట్లు కూడా మంచి బ్రాండ్‌వే. లోటో కంపెనీ షూస్ మార్కెట్లో కొనాలంటే రెండు వేలవుతాయి. ఆ కంపెనీతో మాట్లాడి వారి సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ) ప్రోగ్రామ్ కింద మూడు వందల లోపు ధరకే తీసుకున్నాం. మేము సర్వీస్ కోసం చేసే ప్రతి రూపాయి కూడా నేరుగా ఆపన్నులకే అందాలి. కమర్షియల్‌గా వ్యాపారాన్ని పెంపొందించే విధంగా ఉండదు. పిల్లలకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించడం వల్ల చాలామంది పిల్లల్లో కంటిచూపు సమస్యలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం కంటి సమస్యల కోసం పెద్ద ఎత్తున వైద్యశిబిరాలు నిర్వహించినప్పటికీ పిల్లల మీద దృష్టి పెట్టలేదు. రవి గాంచని చోటును కవి గాంచును అన్నట్లు... ప్రభుత్వం చూపు పడని సమస్యల మీద మేము దృష్టి పెడుతున్నాం. శంకర్ నేత్రాలయ, మ్యాక్సివిజన్, ఆస్టర్ గ్రూప్ వైద్యసంస్థలతో కలిసి పని చేస్తున్నాం. తక్షణ సాయం! ఆరోగ్యం, చదువుతోపాటు ప్రకృతి విలయాలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులకు తక్షణ సాయం కోసం స్థానిక కలెక్టర్ల నుంచి పిలుపు వస్తుంది. అలా ఇల్లు కాలిపోయిన వాళ్లకు పాత్రలు, నిత్యావసర దినుసులు, దుస్తులు, దుప్పట్లు... వంటివి ఇస్తుంటాం. మా సేవలకు స్థిరమైన నిధి అంటూ ఏదీ ఉండదు. సాధారణంగా ఇందులో సభ్యులుగా జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి సమాజానికి తమ వంతుగా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చే వాళ్లే ఉంటారు. తక్షణ సాయానికి ఆ స్థానిక క్లబ్ సభ్యులు సొంత డబ్బునే ఖర్చుచేస్తారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం చేపట్టే కార్యక్రమాలకు మాత్రం కచ్చితంగా ప్రాజెక్టు రిపోర్ట్, కొటేసన్ సిద్ధం చేసుకుని నిధుల సమీకరణ మొదలు పెడతాం. ఇందులో మూడింట ఒక వంతు క్లబ్, ఒక వంతు దాత, ఒక వంతు ఇంటర్నేషనల్ రోటరీ ఫౌండేషన్ సహకరిస్తుంది. ఇది సమష్టి సేవ! రోటరీ క్లబ్ ద్వారా అందించే సేవలన్నీ సమష్ఠి సేవలే. ఏ ఒక్కరమూ తమ వ్యక్తిగత ఖాతాలో వేసుకోకూడదు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కలిపి మా పరిధిలో 113 క్లబ్లున్నాయి. ఎక్కడి అవసరాన్ని బట్టి అక్కడి సభ్యులు స్పందిస్తారు. సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం. ఇక నా వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే... మాది భద్రాచలం దగ్గర రెడ్డిపాలెం. పూర్వికులు ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా నర్సరావు పేట నుంచి భద్రాచలానికి వచ్చారు. సివిల్ కాంట్రాక్టర్‌గా ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్‌కు çసర్వీస్ ఇస్తున్నాను. మా ఊరికి నేను తిరిగి ఇస్తున్నది నీటి వసతి. పేపర్ మిల్లు నుంచి వెలువడే వాడిన నీటిని మా ఊరి పంట పొలాలకు అందించే ఏర్పాటు కొంత వరకు పూర్తయింది. పైప్‌లైన్ పని ఇంకా ఉంది. మేము గోదావరి తీరాన ఉన్నప్పటికీ నది నుంచి మాకు నీళ్లు రావు. గ్రామాల్లో విస్తృతంగా బోర్‌వెల్స్ వేయించాం. బూర్గుంపాడులో నేను చదువుకున్న స్కూల్‌కి ఆర్వో ప్లాంట్ నా డబ్బుతో పెట్టించాను. ‘ఇవ్వడం’లో ఉండే సంతృప్తి మాత్రమే మా చేత ఇన్ని పనులు చేయిస్తోంది. నాకు అరవైదాటాయి. కుటుంబ బాధ్యతలు పూర్తయ్యాయి. మా అమ్మాయి యూఎస్‌లో ఉంది, అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక నేను సర్వీస్ కోసం చేస్తున్న ఖర్చు గురించి నా భార్య అన్నపూర్ణ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కొన్ని కార్యక్రమాలకు నాతోపాటు తను కూడా వస్తుంది. కాబట్టి సమాజంలో ఉన్న అవసరతను అర్థం చేసుకుంది, నన్ను కూడా అర్థం చేసుకుంది. కాబట్టే చేయగలుగుతున్నాను’’ అని వివరించారు రొటేరియన్ డాక్టర్ బుసిరెడ్డి శంకర్‌రెడ్డి. శ్రీమంతులకు స్వాగతం! జీవితంలో సుసంపన్నత సాధించిన వారిలో చాలా మందికి సొంత ఊరికి ఏదైనా చేయాలని ఉంటుంది. తాము చదువుకున్న స్కూల్‌ను అభివృద్ధి చేయాలని ఉంటుంది. అలాంటి శ్రీమంతులకు నేనిచ్చే సలహా ఒక్కటే. మా సర్వీస్ విధానంలో ‘హ్యాపీ స్కూల్’ కాన్సెప్ట్ ఉంది. ఒక పాఠశాలను హ్యాపీ స్కూల్‌గా గుర్తించాలంటే... కాంపౌండ్ వాల్, పాఠశాల భవనం, డిజిటల్ క్లాస్ రూములు, నీటి వసతి, టాయిలెట్లు ఉండాలి. అలా తీర్చిదిద్దడానికి 90 లక్షలు ఖర్చవుతుందనుకుంటే ముప్ఫై లక్షలతో ఒక దాత వస్తే, మా రోటరీ క్లట్, అంతర్జాతీయ రోటరీ ఫౌండేషన్ నిధులతో పూర్తి చేయవచ్చు. గతంలో ఏపీలో కూడా మేము చాలా పాఠశాలలను దత్తత తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తోంది. అక్కడ మా అవసరం లేదు, మాకు సర్వీస్ చేసే అవకాశమూ లేదు. తెలంగాణలో గడచిన ప్రభుత్వం పాఠశాలల మీద దృష్టి పెట్టకపోవడంతో మేము చేయగలిగినంత చేస్తూ వస్తున్నాం. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇటీవల హైదరాబాద్ నగరం, మెట్రో రైల్వే స్టేషన్లలో 65 వాటర్ కూలర్లనిచ్చాం. నీలోఫర్, ఎమ్ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్‌కి వైద్యపరికరాలు, స్పర్శ్ పేరుతో క్యాన్సర్ బాధితులకు పాలియేటివ్ కేర్, కొన్ని హాస్పిటళ్లకు అంబులెన్స్‌లు ఇచ్చింది రోటరీ క్లబ్. ఇక ఆలయాల్లో పూజలకు అన్ని ఏర్పాట్లూ ఉంటాయి, కానీ భక్తులకు సౌకర్యాలు పెద్దగా ఉండవు. మా భద్రాచలం, పర్ణశాలలో టాయిలెట్లు, భక్తులు దుస్తులు మార్చుకోవడానికి గదుల నిర్మాణం... ఇలా మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాం. – వాకా మంజులా రెడ్డి ఫొటో: గడిగె బాలస్వామి -
Hyd: చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు కోసం రోటరీ క్లబ్.. మోటార్ ఫెస్ట్..
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ రోటరీ క్లబ్ గొప్ప కార్యం తలపెట్టింది. హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించే దిశగా ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇండియన్ నేషనల్ ఆటోక్రాస్ చాంపియన్‌షిప్ నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులను హైదరాబాద్‌లోని బౌల్డర్‌హిల్స్‌లో గోల్ఫ్‌కోర్స్ ట్రాక్ ఏర్పాటుకు వినియోగించనుంది. అదే విధంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారుల ఆపరేషన్ నిమిత్తం థియేటర్ నిర్మాణానికి ఉపయోగించనుంది. సిద్ధిపేట పట్టణంలోని సత్య సాయి ఆస్పత్రిలో ఈ మేరకు ఆపరేషన్ థియేటర్ నిర్మాణానికి వచ్చిన నిధులను ఖర్చు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ నిర్మాణానికి దాదాపు 7.5 కోట్ల భారీ మొత్తం ఖర్చవుతుందని అంచనా. కాగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరుగనున్న ఆటోక్రాష్ చాంపియన్‌షిప్‌లో టాప్ రేసర్లు పాల్గొననున్నారు. జూన్ 2-4 వరకు ఈ ఈవెంట్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపే క్రమంలో నిర్వహిస్తున్న ఈ కార్ రేసింగ్ ఈవెంట్‌ను విజయవంతం చేయాలని నిర్వాహకులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చి రేసింగ్ ఈవెంట్‌ను ఆస్వాదించాలని కోరారు. చదవండి: ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు -
విశాఖలోని డంపింగ్ యార్డులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు
-
ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభం..రోజుకు రెండున్నర టన్నుల రీసైక్లింగ్
మధురవాడ (భీమిలి): నగరంలోని మధురవాడ జోన్–2 పరిధిలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డులో రోటరీ ఫౌండేషన్, రోటరీ క్లబ్‌లు, ఎన్జీవోలు, పలు సంస్థలు సహాయ సహకారాలతో ప్లాస్టిక్ వేస్ట్ రీసైక్లింగ్ ప్రాజెక్టును ఆదివారం సాయంత్రం రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్. స్టీఫెన్ ఉర్షిక్ ప్రారంభించారు. రోటరీ క్లబ్ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. దీనికి రోటరీ ఫౌండేషన్, ఆమెరికాలోని నేపర్ విల్లే, సన్‌రైజ్, అరోరా, డారియన్, బ్రాడ్లీబోర్బోనైస్, ఓక్ పార్క్ రివర్ ఫారెస్ట్, సోనోమా వ్యాలీ రోటరీ క్లబ్ సహకారం, భారతీ తీర్థ, నార్త్ సౌత్ ఫౌండేషన్ వంటి ప్రభుత్వేతర సంస్థలు, అరబిందో ఫార్మా ఫౌండేషన్, విహాన్ కియా వంటి సంస్థలు తమ సీఎస్ఆర్ నిధులు సమకూర్చాయి. ఈ ప్రాజెక్టు ఇండియా యూత్ ఫర్ సొసైటీ (ఐవైఎఫ్ఎస్) వంటి పర్యావరణ పరిరక్షణ రంగంలో చురుగ్గా పనిచేస్తున్న ఎన్జీవో ద్వారా అమలు చేయనున్నట్టు నిర్వాహకులు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో ప్లాస్టిక్ బాటిల్స్‌ను సేకరించి రోజుకు రెండున్నర టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైక్లింగ్ చేస్తున్నట్టు చెప్పారు. ఒక కిలోకి 60–70 బాటిల్స్ ఉంటాయన్నారు. ఈ వ్యర్థాలతో టూత్ బ్రష్‌లు, దువ్వెనలు, ప్లాస్టిక్ సంచులు తయారు చేస్తున్నట్టు తెలిపారు. దాదాపు అరెకరం విస్తీర్ణంలో ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్‌ను రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసి తాజాగా మొయినాబాద్ సహకారంతో ప్రారంభించినట్టు తెలిపారు. దీని ద్వారా ప్లాస్టిక్ వ్యర్థ రహిత విశాఖగా మారే అవకాశం ఉందన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్. స్టీఫెన్ ఉర్షిక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ రోటరీ 7 ప్రాధాన్యతల్లో ఒకటని చెప్పారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్‌కు అమెరికా, ఇండియాలతో రోటరీ ప్రతినిధులు కలిసి పనిచేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ ప్రాజెక్టు ఇక్కడ విజయవంతమైతే ప్రపంచంలో మరిన్ని చోట్ల ఆయా రోటరీ క్లబ్‌లతో కలసి అమలుకు కృషి చేస్తామని చెప్పారు. పూర్వ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శేఖర్ మెహతా మాట్లాడుతూ రోటరీ గ్లోబల్ గ్రాంట్‌తో ఇండియా,అమెరికా క్లబ్ కలిసి పనిచేశాయన్నారు. తద్వారా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. రోటరీ క్లబ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినా బాద్ ప్రెసిడెంట్ పతాంజలి రామ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఇక్కడ బాటిల్ రీసైక్లింగ్ చేస్తుందని, భవిష్యత్‌లో మరిన్ని నిధులు వెచ్చించి వేరే రకాల ప్లాస్టిక్ కూడా రీసైక్లింగ్ చేసేవిధంగా రూపకల్పన చేస్తామన్నారు. అరబిందో ఫార్మా చైర్మన్ రఘనాథన్ కన్నన్ మాట్లాడుతూ వేరే ప్రాంతాల్లో కూడా అమలు చేసే విదంగా ఈ ప్రాజెక్టులు డిజైన్, ప్లానింగ్ చేశామన్నారు. అలాగే యువత కూడా పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్ వినియోగించిన అనంతరం సక్రమంగా డస్ట్‌బిన్స్‌లో వేయాలని సూచించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ నీరజ్ జెల్లి, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సునీల్ వడ్లమాని, సర్వీస్ ప్రాజెక్టు చైర్మన్ ఉదయ్ పిలానీ, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ అంజు బ్రిజేష్, రోటరీ క్లబ్ అమెరికా ప్రతినిధి శ్రీ నమశ్శివాయం, రోటరీ క్లబ్ వైజాగ్ ఎలైట్ ప్రతినిధి రవీంధ్ర నాథ్ డొక్కా తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణకు రోటరీ క్లబ్ ప్రయత్నాలు
-
ఆత్మీయతను పంచడం అభినందనీయం: గవాస్కర్
సాక్షి, హైదరాబాద్: అవస్థలు, నొప్పులు లేకుండా ఏ జీవితం ముగియదు. అలాంటి సందర్భంలో మేమున్నామని ఆత్మీయతను పంచడం ఉన్నతమైన సేవలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. నగరంలోని స్పర్శ్ హాస్పీస్ పాలియాటివ్ కేర్ సెంటర్‌ను సునీల్ గవాస్కర్ ఆదివారం సందర్శించి అక్కడి పేషెంట్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవిత చరమాంకంలో ఎదురయ్యే అవస్థలను తగ్గించడానికి అందించే ఉపశమన సేవలు అరుదని, నగరం వేదికగా రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ ఆధ్వర్యంలో ఉచితంగా అందింస్తున్న ఈ సేవలు అభినందనీయమన్నారు. చిన్నతనంలో తను కూడా డాక్టర్ కావాలనే బలమైన కోరిక ఉండేదని, తన కుటుంబ సభ్యుల్లో ఉన్న డాక్టర్ల వలన వైద్య రంగంలోని ఔన్నత్యాన్ని తెలుసుకున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, స్పర్శ్ హాస్పీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చదవండి: (Ind Vs Aus 3rd T20- Uppal: హైదరాబాద్ బిర్యానీకి రోహిత్ ఫిదా) -
బతుకమ్మా... బతుకు ఇవ్వమ్మా...
ఖమ్మం మయూరిసెంటర్: బతుకమ్మ... నేల మీద కురిసే పూల వెన్నెల. పూలంటే ఓ ఆశ. పూల పండుగ బతుకమ్మ అంటే.. బతుకుకు భరోసానిస్తుందనే విశ్వాసం. ఆ నమ్మకంతోనేనేమో ఆ చిన్నారులు ఆడిపాడారు. తలసేమియాతో బాధపడుతున్న తమకు ‘బతుకు ఇవ్వమ్మా.. బతుకమ్మా.. ’అంటూ వేడుకున్నారు. ఖమ్మంలోని రోటరీ క్లబ్ లింబ్ సెంటర్లో సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వ ర్యంలో తలసేమియా చిన్నారులతో ఆదివారం బతు కమ్మ వేడుకలు నిర్వహించారు. భారీ బతుకమ్మను తయారు చేసి... పిల్లలు ఉత్సాహంగా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. తమకు అవసరమైన రక్తాన్ని నెలనెలా దానం చేస్తూ కాపాడుతున్న దాతలను చల్లగా చూడాలని, తమ ఆయుష్షు పెంచాలని బతుకమ్మను వేడుకున్నారు. ఈ వేడుకల్లో కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, వైద్యులు డి.నారాయణమూర్తి, సతీష్, సంస్థ బాధ్యులు ప్రొద్దుటూరి పావని, పి.రవిచందర్, అనిత, ఉదయ్‌భాస్కర్, శివ, రాజేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని, చిన్నారులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. -
స్పర్శ్ హాస్పీస్కు సాక్షి అవార్డు.. ‘గొప్ప గుర్తింపు’
Sakshi Excellence Awards: సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్‌కేర్’ అవార్డును స్పర్శ్ హాస్పీస్ తరఫున సీఈఓ డా.రామ్ మోహన్‌రావు అందుకున్నారు. స్పర్శ్ హాస్పీస్ ‘ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్‌కేర్’ మరణాన్ని ఎలాగూ తప్పించలేం కానీ మరణ యాతనను తగ్గించవచ్చనే ఆలోచనతో ‘రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో 2011లో హైదరాబాద్‌లో ఏర్పాటైంది ‘స్పర్శ్ హాస్పీస్’ సంస్థ. అవసాన దశలో ఉన్నవారికి, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ద్వారా కావాల్సిన మానసిక, ఆధ్యాత్మిక స్థైర్యాన్ని అందిస్తోంది. వివిధ కారణాల వలన ఈ సెంటర్‌కి రాలేని వారి కోసం స్పర్శ్ టీమ్ సభ్యులు వారి ఇళ్లకే వెళ్లి సపర్యలు చేస్తున్నారు. ఈ విధంగా ఈ 9 ఏళ్లలో 3300 మంది రోగులకు సేవలందించింది స్పర్శ్ హాస్పీస్. ఈ గుర్తింపుతో మరింత మందికి సేవలు సమాజానికి చేస్తున్న మంచి సేవకు గొప్ప గుర్తింపు. పదేళ్లుగా జీవితపు ఆఖరి దశలో ఉన్న 4వేల మంది రోగులకు అండగా నిలిచి, వారి అంతిమదశలో కష్టాలను నివారించాం. సాక్షి లాంటి సంస్థల గుర్తింపు, ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే మరింత మందికి సేవ చేయగలుగుతాం. – డా.రామ్ మోహన్‌రావు, సిఇఓ, స్పర్శ్ హాస్పీస్ -
మున్సిపల్ శాఖ మంత్రిగా అందరూ నన్నే ట్రోల్ చేస్తారు: కేటీఆర్
హైదరాబాద్: క్యాన్సర్ రోగుల కోసం హైదరాబాద్‌లోని ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పర్శ్ హాస్పిస్ నుంచి ఆహ్వానం వచ్చే వరకు పాలియేటివ్ కేర్ అంటే ఏంటో తెలియదని అన్నారు. పాలియేటివ్ కేర్ గురించి స్వయంగా తెలుసుకుంటే గొప్పగా అనిపించిందని తెలిపారు. ఐదేండ్లలోనే స్పర్శ్ హాస్పిస్‌కు మంచి భవనం రావడం సంతోషకరమని పేర్కొన్నారు. చదవండి: బతికుండగానే చంపేశారు.. రోటరీ క్లబ్ చేసే ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున సహకారం ఉంటుందన్నారు. స్పర్శ్ హాస్పిస్‌కు నీటి బిల్లు, విద్యుత్ బిల్లు, ఆస్తిపన్ను రద్దుచేస్తామని హామీ ఇచ్చారు. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదేనని పేర్కొన్నారు. ప్రభుత్వమే అన్ని చేయాలంటే కుదరదని, ప్రైవేటు సంస్థలతో కూడా ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో వర్షం పడితే ట్రాఫిక్ ఉంటుందన్నారు. అయితే ట్రాఫిక్‌కు సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా అందరూ తననే ట్రోల్ చేస్తారని, కానీ హైదరాబాద్‌లో వర్షం పడితే ట్రాఫిక్ జామ్‌కు తానొక్కడినే బాధ్యుడిని కాదన్నారు. చదవండి: మా పిన్ని ఓ లేడీ టైగర్.. రక్షించండి సార్ -
Hyderabad: 28న ‘స్కిన్ బ్యాంక్’ ప్రారంభం
హైదరాబాద్: ఈస్ట్ రోటరీ క్లబ్, హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, ఉస్మానియా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం హోంమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా స్కిన్ బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉస్మానియా ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జన్ మధుసూదన్ నాయక్, రోటరీ క్లబ్ అధ్యక్షులు వై.వి.గిరిలు మాట్లాడారు. శరీరం కాలిపోయిన కేసు ల్లో 40 శాతం కన్నా ఎక్కువ బర్న్ అయిన వారికి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే ప్రతిరోజూ డ్రస్సింగ్ చేయాల్సి ఉంటుందని, డ్రస్సింగ్ చేసే సమయంలో రోగి నరకయాతన అనుభవిస్తారన్నారు. అదే స్కిన్ బ్యాంకు ఉంటే కాలినచోట స్కిన్ వేస్తే మూడు నెలల వరకు డ్రస్సింగ్ అవసరం ఉండదని చెప్పారు. భారతదేశంలో మొత్తం 15 స్కిన్ బ్యాంకులు ఉండగా అందులో 9 రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేసినవే కావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు సుధీష్‌రెడ్డి, చౌదరి, సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
స్కిన్ బ్యాంక్: కాలిన చోట చర్మం వేస్తారు
హైదరాబాద్: ఈస్ట్ రోటరీ క్లబ్, హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, ఉస్మానియా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం హోంమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా స్కిన్ బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉస్మానియా ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జన్ మధుసూదన్ నాయక్, రోటరీ క్లబ్ అధ్యక్షులు వై.వి.గిరిలు మాట్లాడారు. శరీరం కాలిపోయిన కేసు ల్లో 40 శాతం కన్నా ఎక్కువ బర్న్ అయిన వారికి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే ప్రతిరోజూ డ్రస్సింగ్ చేయాల్సి ఉంటుందని, డ్రస్సింగ్ చేసే సమయంలో రోగి నరకయాతన అనుభవిస్తారన్నారు. అదే స్కిన్ బ్యాంకు ఉంటే కాలినచోట స్కిన్ వేస్తే మూడు నెలల వరకు డ్రస్సింగ్ అవసరం ఉండదని చెప్పారు. భారతదేశంలో మొత్తం 15 స్కిన్ బ్యాంకులు ఉండగా అందులో 9 రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేసినవే కావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు సుధీష్‌రెడ్డి, చౌదరి, సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
‘రోటరీ’కి రూ.100 కోట్ల విరాళం
బెంగళూరు: స్వచ్ఛంద సంస్థ రోటరీ ఇంటర్నేషనల్‌కు బెంగళూరు స్థిరాస్తి వ్యాపారి రూ.100 కోట్లు విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడి కుమారుడైన డి.రవిశంకర్ ఈ మొత్తాన్ని ఇచ్చినట్లు బెంగళూరు రోటరీ క్లబ్ ప్రతినిధి, బెంగళూరు క్రెడాయ్ ఉపాధ్యక్షుడు సురేశ్ హరి వెల్లడించారు. రవిశంకర్ ఇచ్చిన సొమ్మును చిన్నారుల ఆరోగ్యం సహా రోటరీ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న చారిటీ కార్యక్రమాలకు వెచ్చిస్తామని హరి తెలిపారు. రవిశంకర్ తండ్రి కామేశ్.. వినోబాబావే భూదాన ఉద్యమంలో పాల్గొని తన భూమినంతా దానం చేశారు. -
రోటరీ క్లబ్‌తో తెలంగాణ జాగృతి యూకే భాగస్వామ్యం
సాక్షి, లండన్ : తెలంగాణ జాగృతి యూకే విభాగం మరో మైలు రాయిని సాధించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత కలలను, ఆశయాలను సాకారం చేసేలా కేవలం సాంస్కృతిక, కళా రంగాలలోనే కాకుండా సేవ రంగంలోనూ దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా చారిత్రాత్మక సేవ సంస్థ అయిన రోటరీ క్లబ్‌తో తెలంగాణ జాగృతి యూకే విభాగం భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ సందర్బంగా బాసిల్డాన్లో తెలంగాణ జాగృతి యూకే విభాగం, రోటరీ క్లబ్‌తో పరస్పర సహకారాన్ని కోరుకుంటూ అనుబంధ పత్రాన్ని విడుదల చేశారు. తమ సేవ కార్యక్రమాలను ప్రవాస తెలంగాణ, తెలుగు వారికే కాకుండా బ్రిటన్‌లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు విస్తృతం చేయడానికి రోటరీ క్లబ్ సంస్థతో అనుబంధం పత్రం చేసుకున్నామని జాగృతి యూకే అధ్యక్షులు సుమన్ బలమూరి తెలిపారు. రోటరీ క్లబ్ సభ్యుల సహకారం మరువ లేనిదని, మున్ముందు వారి భాగస్వామ్యంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని సుమన్ పేర్కొన్నారు. జాగృతి కార్యక్రమాలను ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం చేయడం మంచి ఆలోచనని జాగృతి వ్యవస్థావప అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకి రోటరీ క్లబ్ సభ్యులు అభినందనలు తెలిపారు. ఇటీవలే తెలంగాణ జాగృతి యూకే విభాగం యూకే ప్రభుత్వ ఎన్హెచ్ఎస్(నేషనల్ హెల్త్ సర్వీస్)తో భాగస్వామ్యం ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. రోటరీ క్లబ్ ముఖ్య బృందంతో పాటు, సుమన్ బలమూరి, ఉపాధ్యక్షుడు వంశీ తులసి, కార్య వర్గ సభ్యులు సలాం యూసఫ్, వంశీ సముద్రాల, వెంకట్ బాలగోని ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
మాజీ క్రికెటర్ వాగ్ధానభంగం
సాక్షి, చెన్నై: నేత్రదానంపై మాజీ క్రికెటర్ సయిద్ కిర్మాణీ మనసు మార్చుకున్నారు. మతపరమైన విశ్వాసాల కారణంగా కళ్లు దానం చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు. చెన్నైలో శనివారం రోటరీ రాజన్ ఐ బ్యాంక్, మద్రాస్ రోటరీ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో కిర్మాణీ పాల్గొన్నారు. నేత్రదానం చేస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రమాణం చేశారు. అయితే ఈ వాగ్దానాన్ని వెనక్కు తీసుకున్నట్టు సోమవారం ప్రకటించారు. ‘నాకు భావోద్వేగాలు, నమ్మకాలు ఎక్కువ. అవయవదానంపై డాక్టర్ మోహన్ రాజ్ చేస్తున్న చైతన్య కార్యక్రమాలు నచ్చి నేత్రదానం చేస్తానని వాగ్దానం చేశాను. మత విశ్వాసాల కారణంగా నా ప్రతిజ్ఞను నిలబెట్టుకోలేకపోతున్నాను. కానీ అందరూ కళ్లు దానం చేయాలని కోరుకుంటున్నాన’ని కిర్మాణీ పేర్కొన్నారు. భారత అంధుల క్రికెట్ జట్టుకు అనధికారిక అంబాసిడర్‌గా ఉన్న తాను ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో క్రికెటర్ల అంకితభావం ఎంతోగానో ఆకట్టుకుందని, అందుకే నేత్రదానానికి ముందుకు వచ్చానని చెప్పారు. అయితే మతవిశ్వాసాల కారణంగా మాటను నిలుపుకోలేకపోతున్నానని కిర్మాణీ వెల్లడించారు. -
కళా తపస్వికి జీవిత సాఫల్య పురస్కారం
ఎన్నో కళాత్మక చిత్రాలతో తెలుగు వెండితెరను సుసంపన్నం చేసిన సీనియర్ దర్శకులు కళాతపస్పి కె.విశ్వనాథ్ గారిని విజయవాడ నగరంలో ఘనంగా సన్మానించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. రోటరీ క్లబ్ ప్లాటినమ్ జూబ్లీ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2016-17 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జీవిత సాఫల్య పురస్కార కమిటీ చైర్మన్ డాక్టర్ ఎం.సి.దాస్, రోటరీ పౌరసంబంధాల విభాగం చైర్మన్ పులిపాక కృష్ణాజీ లతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకలో కె.విశ్వనాథ్ చిత్రాల్లో కొన్ని నృత్య సన్ని వేశాలను, పాటలను ప్రదర్శిస్తారని తెలిపారు. -
నైట్ కిక్.. ర్యాంప్ వాక్
-
స్వర్గధామానికి గ్రహణం
రెండేళ్లు గడిచినా ప్రారంభం కాని పనులు నేతల హామీలు గాలికి కావలి : కావలి పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకున్న ‘స్వర్గధామానికి’ రాజకీయ పార్టీల నేతల వాగ్ధాన భంగంతో గ్రహణం పట్టింది. దీంతో రెండున్నరేళ్లుగా స్వర్గధామం పనులు నిలిచిపోయాయి. కావలి పట్టణ ఉత్తర శివార్లలో ఒక ఎకరా 9 సెంట్ల మున్సిపాలిటీ స్థలాన్ని రోటరీ క్లబ్‌కు అప్పగించారు. ఆ స్థలంలో అంతిమ సంస్కారాలు చేసేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన నిర్మాణాలు చేయాలనేది రోటరీ క్లబ్ లక్ష్యం. ‘రోటరీ స్వర్గధామం ట్రస్ట్’ అనే సంస్థను రిజిస్టర్ చేసి దాని ద్వారా పట్టణంలో రూ.2 కోట్ల అంచనాతో నిర్మాణాలు చేయాలని భారీ ప్రణాళికలు రూపొందించారు. ఇందులో అస్థికల నిల్వ, ఉడ్ స్టోర్ తదితర ముఖ్యమైన భవనాన్ని రోటరీ క్లబ్ వారే స్వయంగా నిర్మించాలని నిర్ణయించారు. ఇక మిగిలిన వాటిని దాతల సహకారంతో నిర్మాణాలు చేయాలని నిర్ణయించారు. ప్రకటనలతో సరి 2014 నవంబర్ 4న ఈ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు ఈ స్వర్గధామంలో రూ.35 లక్షలతో దహనశాలను నిర్మించి ఇస్తానని ప్రకటించారు. పిండక్రతువుల హాలు నిర్మాణానికి రూ.5 లక్షల ఇస్తానని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఇలా పలువురు పలు వాగ్ధానాలు చేశారు. కానీ ఒక్కరూ కూడా నయా పైసా కూడా విదల్చలేదు. దీంతో రోటరీ క్లబ్ వారు కావలిలో ప్రజల కోసం ‘స్వర్గధామం’ నిర్మిస్తున్నామని అద్భుతమైన కలర్ ఫుల్ బ్రోచర్ వేశారు. ఈ బ్రోచర్లోని స్వర్గధామం డిజైన్ పట్టణ ప్రజల కళ్లల్లో ఇప్పటికీ ఊగిసలాడుతూనే ఉంది. అయితే దాతృత్వం చేస్తామని ఆర్భాటంగా హామీ ఇచ్చిన నాయకులు వాటిని మరిచిపోయినట్లుగా వ్యవహరిస్తున్న తీరు స్థానికుల్లో చర్చనీయాంశమైంది. కావలి ప్రజల కోసమే మా ఆశ, శ్వాస అంటూ ఊదరగొట్టే రాజకీయ నాయకులు ఈ స్వర్గధామం విషయాన్ని గుర్తు తెచ్చుకొని, వాటి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
సంపూర్ణ అక్షరాస్యతే రోటరీ క్లబ్ ధ్యేయం
ఖిలా వరంగల్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణ అక్షరాస్యతను సాధించడమే రోట రీ క్లబ్ ధ్యేయమని క్లబ్ గవర్నర్ రత్న ప్రభాకర్ అన్నారు. జాతీయ ఉపాధ్యాయ, ఆక్షరాస్యత ఉద్యమంలో భాగంగా ఆదివారం సాయంత్రం రోటరీ క్లబ్ ఆఫ్ కాకతీయ వరంగల్ ఆధ్వర్యంలో వరంగల్ స్టేషన్‌రోడ్డులోని మహేశ్వరీ గార్డెన్లో క్లబ్ ఆధ్యక్షుడు రవ్వ జగదీష్ ఆధ్యక్షతన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రత్న ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం చేయని సేవా కార్యక్రమాలు రోటరీ క్లబ్ చేపట్టడం ఆభినందనీయమన్నారు. సంపూర్ణ అక్షరాస్యతా దేశంగా మారాలన్నదే క్లబ్ లక్ష్యమని, దీనికి ఉపాధ్యాయుల పాత్ర, సహకారం ఎంతో అవసరమన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులన్ని డిజిటల్ క్లాస్ రూమ్‌లుగా మార్చి ఈ– లర్నింగ్ బోధనే ధ్యేయంగా రోటరీ భావించిందన్నారు. జిల్లాలోని173 పాఠశాలకు డిజిటల్ క్లాస్‌రూంలకు కావాల్సిన మెటీరి యల్ను అందజేశామని తెలిపారు. బడి బయట ఉన్న బాలబాలికలను ఏడాదికి లక్ష చొప్పున పాఠశాలల్లో చేర్పించాలని లక్ష్యంగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అనంతరం జిల్లాలో ఎంపిక చేసిన 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులను రోటరీక్లబ్ గవర్నర్ రత్న ప్రభాకర్, జిల్లా ఉప విద్యాధికారి సారంగపాణి అయ్యంగార్ ప్రశంసా పత్రా లు, శాలువాలతో ఘనంగా సన్మానించా రు.చందర్, ఇంద్రసేనారెడ్డి, రోటరీక్లబ్ ఫౌం డేషన్ ఏరియా చైర్మన్, అసిస్టెంట్ గవర్నర్ వైద్యనాథ్, భానుప్రసాద్‌రెడ్డి, ప్రభాకర్, శివకుమార్, మానస, సభ్యులు పాల్గొన్నారు. -
కుట్టు మిషన్ల పంపిణీ
హుజూర్నగర్ : పట్టణంలోని సాయిబాబా కల్యాణ మండపంలో మంగళవారం స్థానిక రోటరీక్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా కీతా మల్లికార్జున్‌రావు, ప్రధాన కార్యదర్శిగా పొలిశెట్టి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా కంభంపాటి వెంకటరమణ, మందడపు నారాయణరావు, సహాయ కార్యదర్శులుగా ఏలూరు రాంబాబు, కోతి సంపత్‌రెడ్డి, కోశాధికారిగా కంచర్ల అరవిందరెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఇంజనీర్ అవార్డు గ్రహీత, విద్యుత్ డీఈ ఎ.శ్రీనివాస్‌ను సన్మానించారు. అదేవిధంగా రోటరీక్లబ్ ఆధ్వర్యంలో పలువురికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎకనామిక్స్ రీడర్ డాక్టర్ అందె సత్యం, డాక్టర్ శ్రీశరత్, కుక్కడపు అనిల్ పాల్గొన్నారు. -
మట్టి వినాయక విగ్రహాలపై అవగాహన కల్పిస్తున్న రోటరీ క్లబ్
-
రోటరీక్లబ్ ఆధ్వర్యంలో 400 వాష్బేసిన్లు
అరకులోయ(విశాఖపట్టణం జిల్లా): విశాఖ జిల్లా రోటరీక్లబ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 400 వాష్బేసిన్లు నిర్మించనున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లాలోని అరకులోయలో రెండు ఆర్వో మంచి నీటి ఫ్లాంట్లు, 4 వాష్బేషిన్లు నిర్మించి, ప్రారంభించారు. శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా ముందుగా 49 వాష్బేసిన్లు ఏర్పాటు చేయనున్నామని రోటరీక్లబ్ సభ్యులు వడ్లమాని రవి, సూర్యారావులు తెలిపారు. ఒక్కో వాష్‌బేషిన్‌లో 16ట్యాప్‌లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ వాష్బేసిన్లు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, హైస్కూల్స్‌లో నిర్మిస్తామని వారు తెలిపారు. -
బతుకమ్మ పండుగకు భారీ ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: బతుకమ్మ పండుగకు జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు అధికారులు సిద్ధమయ్యారు. 30వేల బతుకమ్మలతో ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఊరేగింపుగా వెళ్లనున్నారు. దీంతో ఆ మార్గంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్యాంక్‌బండ్‌పై రోటరీ క్లబ్ వద్ద బతుకమ్మ ఘాట్ పనులకు సిద్ధమయ్యారు. ఆ మార్గాల్లోని రహదారుల మరమ్మతులు చేయడంతో పాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులకు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ నిధులు మంజూరు చేశారు. వెంటనే పనులు పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ట్యాంక్‌బండ్ ప్రాంతంలో పనులు పరిశీలించారు. ఆయా పనులకు కేటాయింపులిలా ఉన్నాయి.... ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఫుట్‌పాత్ లు, టేబుల్ డ్రెయిన్ల మరమ్మతులకు రూ. 2.80 లక్షలు ట్యాంక్‌బండ్‌పై టాయ్లెట్ల రిపేర్లు, రంగులు, టేబుల్ డ్రెయిన్ పనులకు రూ.4.50 లక్షలు రోటరీ పార్కు వద్ద బతుకమ్మ ఘాట్ నిర్మాణానికి రూ.34.86 లక్షలు రోటరీ పార్కు వద్ద ఫౌంటేన్ మరమ్మతులకు రూ.9.93 లక్షలు. 7,8,9,10 సర్కిళ్లలో విద్యుత్ దీపాలతో అలంకారానికి రూ. 11.08 లక్షలు వీటితోపాటు నగరంలోని ముఖ్య కూడళ్లలో పెద్ద సైజు బతుకమ్మలను ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పెద్ద సైజు బతుక మ్మలను ఏర్పాటు చేశారు. -
గుంటూరులో ఆకట్టుకున్న తెలుగమ్మాయిలు
-
ఆచార్య పేరి సుబ్బరాయన్‌కు రాష్ట్రపతి అవార్డు
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: గ్రేటర్ తిరుపతి రోటరీ క్లబ్ సభ్యుడు, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం మాజీ ప్రొఫెసర్ డాక్టర్ పేరి సుబ్బరాయన్‌కు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి అవార్డు ప్రకటించినట్లు రోటరీ క్లబ్ గవర్నర్ ప్రత్యేక ప్రతినిధి సోమ్‌ప్రకాష్ తెలి పారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయనగరం జిల్లాకు చెందిన ప్రొఫెసర్ సుబ్బరాయన్ రాజమండ్రి, తిరుపతి, న్యూఢిల్లీలోని అనేక విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో పనిచేసి విశేష అనుభవం గడిం చారని పేర్కొన్నారు. ఆయన చేసిన పరిశోధనలకు బోస్టన్, లండన్ విశ్వవిద్యాలయాలు ప్రత్యేక ఆహ్వానాలు పంపించాయని తెలి పారు. అవార్డు పొందిన సుబ్బరాయన్‌కు త్వరలోనే తిరుపతిలో సన్మా నం చేయనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో రోటరీ సభ్యులు చంద్రశేఖర్, ద్రవిడ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ అరుణాచలం పాల్గొన్నారు.