తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: గ్రేటర్ తిరుపతి రోటరీ క్లబ్ సభ్యుడు, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం మాజీ ప్రొఫెసర్ డాక్టర్ పేరి సుబ్బరాయన్‌కు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి అవార్డు ప్రకటించినట్లు రోటరీ క్లబ్ గవర్నర్ ప్రత్యేక ప్రతినిధి సోమ్‌ప్రకాష్ తెలి పారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయనగరం జిల్లాకు చెందిన ప్రొఫెసర్ సుబ్బరాయన్ రాజమండ్రి, తిరుపతి, న్యూఢిల్లీలోని అనేక విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో పనిచేసి విశేష అనుభవం గడిం చారని పేర్కొన్నారు.
ఆయన చేసిన పరిశోధనలకు బోస్టన్, లండన్ విశ్వవిద్యాలయాలు ప్రత్యేక ఆహ్వానాలు పంపించాయని తెలి పారు. అవార్డు పొందిన సుబ్బరాయన్‌కు త్వరలోనే తిరుపతిలో సన్మా నం చేయనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో రోటరీ సభ్యులు చంద్రశేఖర్, ద్రవిడ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ అరుణాచలం పాల్గొన్నారు.
ఆచార్య పేరి సుబ్బరాయన్‌కు రాష్ట్రపతి అవార్డు
Published Fri, Aug 16 2013 3:43 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement
Advertisement