Published
Tue, Jul 26 2016 7:06 PM
| Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
కుట్టు మిషన్ల పంపిణీ
హుజూర్‌నగర్ : పట్టణంలోని సాయిబాబా కల్యాణ మండపంలో మంగళవారం స్థానిక రోటరీక్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా కీతా మల్లికార్జున్‌రావు, ప్రధాన కార్యదర్శిగా పొలిశెట్టి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా కంభంపాటి వెంకటరమణ, మందడపు నారాయణరావు, సహాయ కార్యదర్శులుగా ఏలూరు రాంబాబు, కోతి సంపత్‌రెడ్డి, కోశాధికారిగా కంచర్ల అరవిందరెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఇంజనీర్ అవార్డు గ్రహీత, విద్యుత్ డీఈ ఎ.శ్రీనివాస్‌ను సన్మానించారు. అదేవిధంగా రోటరీక్లబ్ ఆధ్వర్యంలో పలువురికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎకనామిక్స్ రీడర్ డాక్టర్ అందె సత్యం, డాక్టర్ శ్రీశరత్, కుక్కడపు అనిల్ పాల్గొన్నారు.