sewing machine
-
జూన్ 13 : స్పెషాల్టీ ఏంటో తెలిస్తే, వావ్..! అనాల్సిందే!
Sewing Machine Day 2024 జాతీయ కుట్టు మెషీన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 13న జరుపుకుంటారు. ఏంటి ఇదొక డే కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? ఉంది.. దీని కథా కమామిష్షు తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.ఆది మానవుడు ఆకులు, నార వస్త్రాలు కట్టుకుని తిరిగేవాడని చరిత్ర చెబుతోంది. పరిణామ క్రమంలో వస్త్రధారణలో అనేక పరిణామా లొచ్చినప్పటికీ, కుట్టుయంత్రాన్ని తయారు చేయడం విప్లవాత్మకమైన పరిణామమని చెప్పవచ్చు. వీటన్నింటికి మాతృక కుట్టుమెషీన్‌ను కనుగొనడమే. అలా 1790లో కుట్టు మెషీన్ ఆవిష్కరణ సందర్భాన్ని జాతీయ కుట్టు యంత్ర దినోత్సవంగా జరుపుతారు. ఆంగ్ల ఆవిష్కర్త థామస్ సెయింట్ దీనికి పేటెంట్ తీసుకున్నారు. కానీ థామస్ కుట్టు యంత్రం రూపకల్పన ముందుకు సాగలేదు. దీని తొలి నమూనా 1874లో తయారైంది. విలియం న్యూటన్ విల్సన్ అనే వ్యక్తి లండన్‌లోని పేటెంట్ కార్యాలయంలో సెయింట్ డ్రాయింగ్లను గుర్తించారు. ఈ డిజైన్‌కు కొన్ని సర్దుబాట్లు చేసి వర్కింగ్ మోడల్‌ను రూపొందించారు ఈ నమూనా ఇప్పుడు లండన్ సైన్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంది. అయితే 1800ల తరువాత కుట్టు యంత్రాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి.ఎలియాస్ హోవే ,ఐజాక్ సింగర్ కుట్టు యంత్రాలను అభివృద్ధి చేసి ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆ తరువాత సామాన్య మానవుడికి కుట్టు మెషీన్లు అందుబాటులో వచ్చాయి. ఆ తరువాత అనేక కంపెనీలకు చెందిన, మెషీన్లు ఆధునిక హంగులతో అందుబాటులోకి వచ్చాయి. విభిన్న డిజైన్లతో ఫ్యాషన్ ప్రపంచం పరుగులు తీయడానికి, కుట్టుకళకు ఇంత ప్రాధాన్యత రావడానికి కారణమైన కుట్టు యంత్రాల ఆవిష్కారం, చరిత్ర గురించి తెలుసు కోవడం చాలా అవసరం. -
రిచెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ఎవరో తెలుసా? గ్లోబల్ సెలబ్రిటీలు ఆమె కస్టమర్లు
సాధించాలన్న పట్టుదల ఉండాలి. వృత్తి పట్ల ప్రేమ,నిబద్ధత ఉండే చాలు..ఎన్నిఅడ్డంకుల్నైనా అధిగమించి విజయ బావుటా ఎగుర వేయొచ్చు. సవాళ్లు ఎన్ని వచ్చినా దారిలో ముళ్లను ఏరి పారేసినట్టు వాటిని అధిగమించి శభాష్ అనిపించు కోవచ్చు. స్ఫూర్తినిచ్చే అద్భుతమైన విజయాన్ని అందుకున్న అద్భుత మహిళ గురించి తెలుసుకుందాం. కుట్టు మిషన్‌తో ఏం సాధిస్తాంలే అనుకోలేదు. కేవలం రెండే రెండు కుట్టు మిషన్లతో ప్రారంభించి కోట్లకు అధిపతిగా అవతరించిన అనితా డోంగ్రే సక్సెస్ జర్నీ .. తను చేసేపని పట్ల స్పష్టమైన దృక్పథం , అంతకుమించిన నిబద్ధత, మారుతున్న అభిరుచులకు అనుగుణంగా మల్చుకుని తానేంటో అనితా డోంగ్రే నిరూపించుకున్న వైనం స్ఫూర్ది దాయకం. అవమానాల్నికూడా లెక్క చేయకుండా రెండు దశాబ్దాల కృషితో దేశవ్యాప్తంగా 270కి పైగా షాపుల నెట్‌వర్క్‌తో , వందల కోట్ల సంపదతో అనితా డోంగ్రే భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళా ఫ్యాషన్ డిజైనర్‌గా రాణించారు. View this post on Instagram A post shared by Anita Dongre (@anitadongre) అమ్మేప్రేరణ, ఆది గురువు అనితా డోంగ్రే కు ఫ్యాషన్ ప్రపంచ మీద ఆసక్తి ఏర్పడింది తల్లి ద్వారానే. తల్లి ఒక వస్త్ర దుకాణంలో టైలర్‌గా పనిచేసేది.అలాగే తనకు, తన తోబుట్టువులకు తల్లి రూపొందించిన దుస్తులు చూసి ప్రేరణ పొందింది. తల్లిలోని ఇ నైపుణ్యమే అనితను ఫ్యాషన్ డిజైనర్‌గా అద్భుతమైన కెరీర్‌కు పునాదులు వేసింది. అలా 19 ఏళ్ల వయసులో అనితాకు ప్యాషన్ డిజైనర్‌గా అవతరించింది. ఈ క్రమంలోనే వర్కింగ్ విమెన్‌కు అందుబాటు ధరలో దుస్తులను అందించే భారతీయ రీటైల్ కంపెనీ లేదని గుర్తించారు. ఫ్యాషన్ డిజైనర్‌గా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దీనికి బంధువులు, స్నేహితులు నిరుత్సాహపర్చినా, తల్లి మాత్రం వెన్ను తట్టి ప్రోత్సహించింది. అనితా డోంగ్రే సొంత వ్యాపారం 1995లో అనిత ,ఆమె సోదరి కలిసి ఒక చిన్న ఫ్లాట్‌లో పాశ్చాత్య దుస్తులను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ప్రారంభంలో బ్లాండ్లనుంచి గానీ, మాల్స్నుంచి దాకా వీరి ఉత్పత్తులకు ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు సరికదా ఎద్దేవా చేశారు. కానీ ఆమె మాత్రం నిరాశ పడలేదు. మరింత పట్టుదల పెరిగింది. తన స్వంత కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. AND డిజైన్స్ పేరుతో ప్రారంభించిన బిజినెస్ పెద్దగా సక్సెస్ లేదు. అయినా ఏ మాత్రం తగ్గలేదు. 2015లో ఈ కంపెనీ పేరును హౌస్ ఆఫ్ అనితా డోంగ్రేగా మార్చారు. ఇక అంతే అక్కడినుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. తనదైన ప్రత్యేకమైన శైలిలో రూపొందించిన అనిత ఫ్యాషన్ దుస్తులకు విపరీతమైన ప్రజాదరణ లభించింది. రిచెస్ట్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఘనతకు దక్కిచు కున్నారు. ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతను భారతీయ సాంప్రయదాయం,కళలకు స్టయిల్ జోడించి హైబ్రిడ్ దుస్తులతో తనదైన ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని రూపొందించింది. అలా ఒక చిన్న అపార్ట్మెంట్ బాల్కనీలో రెండు కుట్టు మిషన్లతో ప్రారంభమైం ఇప్పుడు దేశవ్యాప్తంగా 270 అవుట్లెట్లకు విస్తరించింది. ప్రస్తుతం ఆమె భారతదేశంలోని అత్యంత సంపన్న ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరుగా నిలిచారు అనితా. కంపెనీ విలువ రూ.1400 కోట్లకు పైమాటే. సంపన్న వివాహాల నుండి అంతర్జాతీయ రెడ్ కార్పెట్లగాలాస్ దాకా ప్రతిచోటా మహిళలకోసం అద్భుతమైన సృష్టిని చూడవచ్చు. బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్, అంతర్జాతీయ పాప్ గాయని బియాన్స్ నోలెస్ , ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ లాంటి సెలబ్రిటీలు అనితా డోంగ్రే కస్టమర్లలో ఉన్నారంటే ఆయన క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. AND, గ్లోబల్ దేశీ, గ్రాస్‌రూట్, అనితా డోంగ్రే బ్రాండ్స్‌తో ఆమె వ్యాపారం దూసుకుపోతోంది. వేడుక ఏదైనా సరే.. ఆమె ఫ్యాషన్ స్టయిల్ ఒక ఐకాన్‌గా నిలుస్తుంది. అంతేకాదు ఇటీవల ఆమె పర్యావరణ అనుకూలమైన లాండ్రీ జెల్‌ను లాంచ్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Grassroot by Anita Dongre (@grassrootbyanitadongre) -
Azadi Ka Amrit Mahotsav: 7 రోజుల్లో 450 జాతీయ జెండాలు
పట్నా: 91 ఏళ్ల వృద్ధుడు కేవలం వారం రోజుల్లో ఏకంగా 450 జాతీయ జెండాలను తన కుట్టుమెషీన్‌పై కుట్టాడు. ఈ అరుదైన సంఘటన బిహార్ రాష్ట్రం సుపౌల్ జిల్లా నిర్మాలీలో చోటుచేసుకుంది. లాల్మోహన్ పాశ్వాన్(91) అచ్ఛమైన గాంధేయవాది. దర్జీగా జీవనం సాగిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంందర్భంగా ‘హెల్ప్ ఏజ్ ఇండియా’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ జాతీయ జెండాల కోసం లాల్మోహన్కు ఆర్డర్ ఇచ్చింది. కేవలం 7 రోజుల్లో 450 జెండాలు కుట్టి హెల్ప్ ఏజ్ ఇండియాకు అందజేశారు. రోజుకు 12 గంటలపాటు పనిచేసి, జెండాలు కుట్టానని లాల్మోహన్ చెప్పారు. జెండాలు కుట్టడాన్ని పవిత్రమైన బాధ్యతగా భావించానని, స్వాతంత్య్ర దినోత్సవ కంటే ముందు రోజే జెండాలను అందజేసినందుకు చాలా గర్వించానని అన్నారు. -
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చేయూత
నెల్లూరు(అర్బన్): పేద మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కార్పొరేషన్ నుంచి సాయమందిస్తామని మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. భక్తవత్సలనగర్‌లోని వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్, రీసెర్చి సెంటర్ ఆధ్వర్యంలో ఎన్యూఎల్ఎం సహకారంతో మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 100 మంది మహిళలకు ఆదివారం కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు గ్రూపులుగా ఏర్పడితే కార్పొరేషన్ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్‌లలో కొన్ని గదులను ఎలాంటి అడ్వాన్స్ లేకుండా తక్కువ అద్దెకు కేటాయిస్తామని చెప్పారు. ఊరగాయలు, జూట్ బ్యాగులు, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ లాంటి పరిశ్రమల స్థాపనకు మహిళలకు మెప్మా అండగా ఉంటుందన్నారు. ట్రస్ట్ చైర్మన్ వసంతలక్ష్మి, కార్పొరేటర్లు రజని, రాజానాయుడు, పెంచలయ్య, ప్రశాంత్‌కుమార్, ప్రసాద్, షంషుద్దీన్, టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు శోభారాణి పాల్గొన్నారు. -
కుట్టు మిషన్ల పంపిణీ
హుజూర్నగర్ : పట్టణంలోని సాయిబాబా కల్యాణ మండపంలో మంగళవారం స్థానిక రోటరీక్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా కీతా మల్లికార్జున్‌రావు, ప్రధాన కార్యదర్శిగా పొలిశెట్టి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా కంభంపాటి వెంకటరమణ, మందడపు నారాయణరావు, సహాయ కార్యదర్శులుగా ఏలూరు రాంబాబు, కోతి సంపత్‌రెడ్డి, కోశాధికారిగా కంచర్ల అరవిందరెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఇంజనీర్ అవార్డు గ్రహీత, విద్యుత్ డీఈ ఎ.శ్రీనివాస్‌ను సన్మానించారు. అదేవిధంగా రోటరీక్లబ్ ఆధ్వర్యంలో పలువురికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎకనామిక్స్ రీడర్ డాక్టర్ అందె సత్యం, డాక్టర్ శ్రీశరత్, కుక్కడపు అనిల్ పాల్గొన్నారు. -
మహిళలకు కానుక
అత్యాధునిక టెక్నాలజీతో సిద్ధం చేసిన కుట్టుమిషన్లను మహిళలకు పంపిణీ చేయడానికి ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 54 వేల మందికి వీటిని అందించనున్నారు. తొలి విడతగా 27,900 మందికి పంపిణీ చేసే కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు. సాక్షి, చెన్నై: మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి జయలలిత అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళా స్వయం సహాయక బృందాల్ని బలోపేతం చేయడం లక్ష్యంగా సరికొత్త పథకాల్ని అమల్లోకి తెస్తున్నారు. అలాగే తల్లీశిశువులకు భద్రత కల్పిస్తున్నారు. పేద యువతుల వివాహానికి ప్రోత్సాహకం అందజేస్తున్నారు. తాజాగా మహిళా టైలర్ల సంక్షేమంపై దృష్టి పెట్టారు. మహిళా సహకార సంఘాల పరిధిలోని కుట్టు శిక్షణ కేంద్రాల్లో టైలర్లుగా రాణిస్తున్న వారికి ఆపన్న హస్తం అందిస్తూ చర్యలు తీసుకున్నారు. వీరికి ప్రభుత్వ సహకారం, సహకార సంఘం రుణంతో కుట్టు మిషన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. కుట్టుమిషన్ల పంపిణీ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి ఏటా ఉచితంగా యూనిఫాం అందజేస్తోంది. వీటిని మహిళా సహకార సంఘాల కుట్టు శిక్షణ కేంద్రాల్లోని మహిళా టైలర్ల ద్వారా సిద్ధం చేయడానికి జయలలిత నిర్ణయించారు. మహిళా టైలర్లను ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా కసరత్తులు పూర్తి చేశారు. మొత్తం రూ.54 కోట్లతో 54 వేల మందికి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కుట్టుమిషన్లను పంపిణీ చేయడానికి నిర్ణయించారు. తొలి విడతగా 27,900 మందికి పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు. సచివాలయంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కుట్టుమిషన్ల పంపిణీని ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు. ఇద్దరు మహిళా టైలర్లకు ఈ మిషన్లను అందజేశారు. గృహాల కేటాయింపు సముద్రతీర గ్రామాల్లోని ఐదు వేల మంది లబ్ధిదారులకు కొత్త గృహాల్ని జయలలిత కేటాయించారు. సునామీ వంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొని నిలబడే రీతిలో ఈ గృహాల్ని నిర్మించారు. సునామీ విలయ తాండవం గురించి తెలిసిందే. అలాంటి విపత్తుల నుంచి సముద్రతీర వాసుల్ని రక్షించడం లక్ష్యంగా కొత్త తరహాలో గృహాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో 11 జిల్లాలోని 444 గ్రామాలు సముద్రానికి అతి సమీపంలో ఉండడాన్ని గుర్తించింది. ఈ గ్రామాల్లోని ప్రజలకు 14,364 గృహాల్ని నిర్మించేందుకు రూ.209 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం 5674 గృహాల నిర్మాణం పూర్తయింది. సచివాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ గృహాల్ని ముఖ్యమంత్రి జయలలిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. వీటిని లబ్ధిదారులకు కేటాయించారు. అలాగే ధర్మపురి, అరియలూరు, కోయంబత్తూరు, కడలూరు, ఈరోడ్, పుదుకోట్టై, తిరునల్వేలి, తిరువారూర్, తంజావూరు తదితర 21 జిల్లాల్లో రూ.5.6 కోట్లతో నిర్మించిన 134 ఆరోగ్య కేంద్రాల్ని జయలలిత ప్రారంభించారు.