Sewing Machine Day 2024 జాతీయ కుట్టు మెషీన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 13న జరుపుకుంటారు. ఏంటి ఇదొక డే కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? ఉంది.. దీని కథా కమామిష్షు తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.
ఆది మానవుడు ఆకులు, నార వస్త్రాలు కట్టుకుని తిరిగేవాడని చరిత్ర చెబుతోంది. పరిణామ క్రమంలో వస్త్రధారణలో అనేక పరిణామా లొచ్చినప్పటికీ, కుట్టుయంత్రాన్ని తయారు చేయడం విప్లవాత్మకమైన పరిణామమని చెప్పవచ్చు. వీటన్నింటికి మాతృక కుట్టుమెషీన్‌ను కనుగొనడమే. అలా 1790లో కుట్టు మెషీన్ ఆవిష్కరణ సందర్భాన్ని జాతీయ కుట్టు యంత్ర దినోత్సవంగా జరుపుతారు.
ఆంగ్ల ఆవిష్కర్త థామస్ సెయింట్ దీనికి పేటెంట్ తీసుకున్నారు. కానీ థామస్ కుట్టు యంత్రం రూపకల్పన ముందుకు సాగలేదు. దీని తొలి నమూనా 1874లో తయారైంది. విలియం న్యూటన్ విల్సన్ అనే వ్యక్తి లండన్‌లోని పేటెంట్ కార్యాలయంలో సెయింట్ డ్రాయింగ్‌లను గుర్తించారు. ఈ డిజైన్‌కు కొన్ని సర్దుబాట్లు చేసి వర్కింగ్ మోడల్‌ను రూపొందించారు ఈ నమూనా ఇప్పుడు లండన్ సైన్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంది. అయితే 1800ల తరువాత కుట్టు యంత్రాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి.
ఎలియాస్ హోవే ,ఐజాక్ సింగర్ కుట్టు యంత్రాలను అభివృద్ధి చేసి ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆ తరువాత సామాన్య మానవుడికి కుట్టు మెషీన్లు అందుబాటులో వచ్చాయి. ఆ తరువాత అనేక కంపెనీలకు చెందిన, మెషీన్లు ఆధునిక హంగులతో అందుబాటులోకి వచ్చాయి. విభిన్న డిజైన్లతో ఫ్యాషన్ ప్రపంచం పరుగులు తీయడానికి, కుట్టుకళకు ఇంత ప్రాధాన్యత రావడానికి కారణమైన కుట్టు యంత్రాల ఆవిష్కారం, చరిత్ర గురించి తెలుసు కోవడం చాలా అవసరం.
Comments
Please login to add a commentAdd a comment