ఆధునికత మనకు ఎన్నింటినో పరిచయం చేస్తుంది.కానీ, ఫ్యాషన్‌లో మాత్రం రాబోయే రోజుల్లో హిస్టరీ రిపీట్ కాబోతోంది. వింటేజ్ హుందాగా విచ్చేస్తోందిముదురు రంగులు విదిల్చికొని లేత రంగులు కొత్త భాష్యం చెబుతున్నాయి. పవర్‌లూమ్స్ ఎంత పెరిగినా హ్యాండ్‌లూమ్స్ అందించే సౌకర్యానికి నవతరం పెద్ద పీట వేస్తోంది. 2025 ఫ్యాషన్ రంగంలో ప్రధానంగా కనిపించే పాత– కొత్తల కలయిక.
ఫ్యాబ్రిక్ అనేది మన మనస్తత్వాన్ని ఎదుటివారికి పరిచయం చేస్తుంది. డిగ్నిఫైడ్ లుక్‌తో ΄ాటు మేనికి సౌకర్యాన్నిచ్చే సస్టెయినబుల్ ఫ్యాబ్రిక్‌ని నిన్నటి తరమే కాదు నేటి తరమూ ఆసక్తి చూపుతుంది. సస్టెయినబిలిటీ ఫ్యాబ్రిక్, పేస్టల్ కలర్స్, హెరిటేజ్ డిజైన్స్ ముందు వరసలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్త ఫ్యాషన్ షోలలోనూ వీటి హవానే కనిపిస్తోంది. హైదరాబాద్ వాసి, ఫ్యాషన్ డిజైనర్ హేమంత్ సిరి ఈ విషయం గురించి మరిన్ని వివరాలు ఇలా మన ముందుంచారు.
నాణ్యమైన ఫ్యాబ్రిక్
మెటీరియల్ నాణ్యత పెరిగేకొద్దీ ధర కూడా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అయినా మేనికి హాయినిచ్చే ఫ్యాబ్రిక్‌నే ప్రపంచమంతా ఇష్టపడుతున్నారు. ఉదాహరణకు.. కలంకారీ డిజైన్స్ తీసుకుందాం. ఈ డిజైన్స్‌లో చాలా రెప్లికాస్ వచ్చాయి. ఔట్‌లైన్ కలంకారీ అయినా, డిజైన్ మొత్తం కెమికల్ ప్రింట్ ఇస్తున్నారు. ఇలాంటప్పుడు ఖర్చు తగ్గవచ్చు. కానీ, ఒరిజనల కలంకారీ ఫాబ్రిక్‌కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక .. కంచి, గద్వాల్, పైథానీ వంటి హ్యాండ్లూమ్స్‌లోనూ ఇమిటేషన్ పవర్‌లూమ్స్ వచ్చి, ఖర్చు తగ్గవచ్చు.
కానీ, ఒరిజనల్ హ్యాండ్లూమ్ వైభవం ఎప్పటికీ తగ్గదు. పైగా, అలాంటి వాటిని తమ వార్డ్రోబ్‌లోకి తెచ్చుకోవడానికి మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ కలర్స్ ఇష్టపడుతున్నారు. మన దేశీయ ఉత్పత్తుల తయారీని ప్రొత్సహించడం, పెంచడం వంటి వాటి వల్ల ధరల్లోనూ మార్పులు వస్తాయి. డిమాండ్ పెరుగుతుంటే ఉత్పత్తి కూడా పెరుగుతుంది.
లేలేత రంగులు
ఫ్యాబ్రిక్‌పై వాడే రసాయనాల ముదురు రంగులు తగ్గిపోనున్నాయి. ఇప్పటికే చాలా పెళ్ళిళ్లలోనూ చూస్తుంటాం. లేత రంగులు, నేచురల్ కలర్స్‌కి వచ్చేశారు. పేస్టల్ కలర్స్‌లో ఉండే గొప్పతనం ‘రిచ్’గా, ప్రత్యేకంగా చూపుతుంది. అందుకే నవతరం పేస్టెల్ కలర్స్‌వైపు మొగ్గుచూపుతుంది. ఈ ఆలోచనలు నిన్నటితరాన్నీ ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాషన్ ప్రపంచంలో లేత రంగులు గొప్పగా వెలిగి΄ోనున్నాయి.
హ్యాండ్ ఎంబ్రాయిడరీ
బామ్మలనాటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ వర్క్స్ మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి. అంతేకాదు హ్యాండ్ పెయింట్, గాడీగా లేని ఎంబ్రాయిడరీని ఇష్టపడుతున్నారు. కొన్ని రకాల ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌ను కూడా తమ డ్రెస్ డిజైన్స్‌లలో చూపుతున్నారు.
తేలికగా ఉండేలా..
ఏ డ్రెస్ అయినా సరే కంఫర్టబుల్‌గా, సులువుగా ధరించే వీలు ఉండే డ్రెస్‌ల మీద ఫోకస్ పెరుగుతోంది. పెళ్లి వంటి గ్రాండ్ అకేషన్స్ అయినా లైట్‌వెయిట్‌ను ఇష్టపడతున్నారు. ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకున్నా సపై్టయినబుల్ ఫ్యాబ్రిక్‌ని ఇష్టపడుతున్నారు.
వింటేజ్ స్టైల్
రిసెప్షన్, ఫ్యాషన్ షో వంటి వేడుకలలో హైలైట్ కావడానికి డ్రెస్సుల ‘కట్స్’ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దీని వల్ల జ్యువెలరీ తక్కువ వాడుతున్నారు. ఇందులో భాగంగా హెరిటేజ్ కాన్పెప్ట్, రెట్రో స్టైయిల్ ముందుకు వస్తోంది.
మెరుస్తున్న ఐవరీ చందేరీపై అప్లిక్ పూల వర్క్‌తో ప్రిన్సెస్ డయానా డ్రెస్‌లో నాటి రోజులను ముందుకు తీసుకువస్తుంది.
ఆర్గానిక్ ముల్ చందేరి ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డ్రెస్ రొమాంటిక్ ఫినిషింగ్ టచ్‌ను జోడిస్తుంది. చేతితో ఎంబ్రాయిడరీ చేసిన మందార పువ్వులు, మిర్రర్ వర్క్‌లతో నిండిన ముల్ చందేరీ డ్రెస్, ఫెదర్‌లైట్ వైట్ కేప్ మొత్తం రూపాన్ని అందంగా మార్చేస్తుంది. కాలం పరుగులు తీస్తూనే ఉంది.
చేతితో ఎంబ్రాయిడరీ చేసిన మందార పువ్వులు, మిర్రర్ వర్క్‌లతో నిండిన ముల్ చందేరీ డ్రెస్, ఫెదర్‌లైట్ వైట్ కేప్ మొత్తం రూపాన్ని అందంగా మార్చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment