ఫ్యాషన్ ప్రపంచం శరవేగంగా మారిపోతోంది. క్రియేటివ్ డిజైన్లు, ఆర్టిస్టిక్ ఫ్యాషన్ సరికొత్త స్టైల్స్ నిరంతరం మారిపోతూనే ఉంటాయి. జూలై 9న ఫ్యాషన్‌డే గా జరుపుకుంటారని మీకు తెలుసా? పదండి దీని కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.
ఫ్యాషన్ ప్రభావాన్ని , ప్రాభవాన్నిఫ్యాషన్ పోకడలను అర్థం చేసుకోవడమే ఫ్యాషన్ డే ఉద్దేశం. ఫ్యాషన్ ఔత్సాహికులు, డిజైనర్లు, ఫ్యాషన్ ప్రియులందరికీ ఇది ఒక గొప్ప అవకాశాల్సి కల్పిస్తుంది. ఫ్యాషన్ సాంస్కృతిక ఔచిత్యంతో పాటు సృజనాత్మకత, సృజనాత్మకత, వాస్తవికతను గుర్తించి, డిజైనర్లు, ఫ్యాషన్ స్టయిల్స్‌ను అభినందించేందుకు ఫ్యాషన్ డే 2024ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
పూర్వంనుంచీ మన ధరించే వస్త్రాలు ఒక స్టేటస్ సింబల్. ప్రస్తుతం ఫ్యాషన్ కళాత్మక వ్యక్తీకరణ మారింది. సామాజిక మార్పులతో పాటు ఫ్యాషన్‌లోకూడా విప్లవాత్మక మార్పు లొచ్చాయి. ఫ్యాషన్ అంటే కేవలం బట్టలు మాత్రమే కాదు. అలంకరణలో సృజనాత్మక వ్యక్తీకరణ ప్రతీది ఫ్యాషనే.
ఫ్యాషన్ డే 2024: ధీమ్
ఈ ఏడాది పర్యావరణ అనుకూల పద్ధతులను పాటిస్తూ, నైతిక, ఆలోచనాత్మక వినియోగాన్ని హైలైట్ చేసేలా 'సస్టెయినబుల్ ఎలిగాన్స్' అనే థీమ్‌తో ఫ్యాషన్ డే నిర్వహిస్తున్నారు. సుస్థిరత, ఫ్యాషన్ కలిసి జీవించే దిశగా ఫ్యాషన్ డే 2024ని జరుపుకుంటూ భూమా తరక్షణలో భాగం కావడం.
Comments
Please login to add a commentAdd a comment