హైదరాబాద్: ఈస్ట్ రోటరీ క్లబ్, హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, ఉస్మానియా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం హోంమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా స్కిన్ బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉస్మానియా ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జన్ మధుసూదన్ నాయక్, రోటరీ క్లబ్ అధ్యక్షులు వై.వి.గిరిలు మాట్లాడారు.
శరీరం కాలిపోయిన కేసు ల్లో 40 శాతం కన్నా ఎక్కువ బర్న్ అయిన వారికి ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే ప్రతిరోజూ డ్రస్సింగ్ చేయాల్సి ఉంటుందని, డ్రస్సింగ్ చేసే సమయంలో రోగి నరకయాతన అనుభవిస్తారన్నారు. అదే స్కిన్ బ్యాంకు ఉంటే కాలినచోట స్కిన్ వేస్తే మూడు నెలల వరకు డ్రస్సింగ్ అవసరం ఉండదని చెప్పారు. భారతదేశంలో మొత్తం 15 స్కిన్ బ్యాంకులు ఉండగా అందులో 9 రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేసినవే కావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు సుధీష్‌రెడ్డి, చౌదరి, సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment