Skin Bank
-
చర్మ దాత సుఖీభవ
నేత్రదానం, రక్తదానం గురించి అందరికీ తెలుసు కానీ చర్మదానం గురించి తెలిసింది తక్కువే. కానీ నానాటికీ విస్తరిస్తున్న వైద్యరంగంలో చర్మం ప్రాధాన్యత ఎనలేనిది. మంచి చర్మం ఆరోగ్యానికి సూచిక. అలాగే కాలిన గాయాలు, ప్రమాదాలు, జబ్బుల వల్ల అనేకమంది రోగులకు కొత్త చర్మం అవసరమవుతూ ఉంటుంది. అలాంటప్పుడు రాజధానిలోని విక్టోరియా ఆస్పత్రిలోని స్కిన్‌బ్యాంకు కొంతమేర ఆదుకుంటోంది. కర్ణాటక: రాష్ట్రంలో ప్రప్రథమంగా చర్మ నిధి (స్కిన్ బ్యాంక్) ప్రారంభమైన ఏడేళ్లలో దాతల సంఖ్య 200 కు చేరుకుంది. అయినప్పటికీ చర్మదానం గురించి సమాజంలో అవగాహన లోపించినందున దాతల సంఖ్య పెరగడం లేదు. బెంగళూరు వైద్య పరిశోధనా సంస్థ (బీఎంసీఆర్‌ఐ) ఆధ్వర్యంలోని విక్టోరియా ఆసుపత్రిలో రోటరీ ఆశీర్వాద్ సంయుక్త ఆధ్వర్యంలో 2016లో చర్మనిధి ఏర్పాటైంది. అప్పటినుంచి ఇప్పటివరకు 197 మంది దాతలనుంచి త్వచాన్ని సేకరించారు. ప్రమాదాలు, జబ్బులకు గురైనవారికి చికిత్సకోసం చర్మానికి అధిక డిమాండ్ ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వినతులు కర్ణాటక మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, ఇంకా పలు రాష్ట్రాల నుంచి చర్మం కావాలని ఈ కేంద్రానికి వినతులు వస్తుంటాయి. కానీ అందులో 60 శాతం మాత్రమే సరఫరా సాధ్యమైందని తెలిపారు. కాలిన ప్రమాదాలలో గాయపడినవారికి స్కిన్ గ్రాఫ్టింగ్ చికిత్సకు చర్మం అవసరమని బీఎంసీఆర్‌ఐ ప్లాస్టిక్ సర్జరీ విభాగం చీఫ్ కేటీ.రమేశ్ తెలిపారు. ప్రస్తుతం చర్మ నిధిలో 12 వేల చదరపు సెంటీమీటర్ల చర్మం నిల్వలు ఉన్నాయి. చర్మదానం గురించి ప్రజల్లో జాగృతం చేయడానికి సోషల్ మీడియా ప్రచారం సహా విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలను సందర్శించి వివరిస్తున్నామని తెలిపారు. చర్మదానానికి ఎందుకు వెనుకంజ ప్రజలు నేత్రదానం, ఇతర అవయవ దానం చేయడానికి ప్రమాణపత్రం ఇస్తారు. ఉత్సాహంగా రక్తదానం చేస్తారు. కానీ చర్మదానం చేయడం లేదని వైద్యులు తెలిపారు. చర్మం తీయడం బాధాకరంగా ఉంటుంది, శస్త్రచికిత్స చేస్తారు వంటి అపోహలే ఇందుకు కారణమన్నారు. చర్మదానం అంటే శరీర భాగమంతా చర్మం తీసుకోరు. తొడలు, కాళ్ల నుంచి కొన్ని సెంటీమీటర్ల చర్మం పొరను మాత్రమే తీసుకుంటారు. ఏర్పడిన చిన్నపాటి కోత త్వరలోనే మానిపోతుంది. కాలిన బాధితులకు కావాలి విక్టోరియా ఆసుపత్రిలో మహాబోధి కాలిన గాయాల వార్డులో అనేకమంది రోగులకు చర్మం అవసరం పడుతూ ఉంటుంది. ప్రతి నెల ఇక్కడ 220 మంది కాలిన గాయాలతో చేరుతుండగా వారిలో 70 శాతం కేసులు తీవ్రంగా ఉంటాయి. దీంతో ఎక్కువశాతం వీరి అవసరాలకే చాలడం లేదు. ఆరోగ్యవంతులు ఎవరైనా చర్మాన్ని ధారపోయవచ్చు. విరివిగా చర్మదానం చేయడం వల్ల ఎంతోమంది క్షతగాత్రుల జీవితాలకు సాయం చేసినట్లు అవుతుంది. దాతల్లో హెచ్చుతగ్గులు చర్మనిధికి 2016లో 18 మంది దాతలు రాగా, 2017లో 40 కి పెరిగింది. కానీ మళ్లీ తగ్గిపోయింది. 2018లో 33 మంది దాతలు ఉండగా ఆపై 17కు పడిపోయింది. 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో 9 మంది మాత్రమే చర్మదానం చేశారు. 2021 నాటికి 18కి, 2022లో 40 కి పెరిగింది. ఈ ఏడాదిలో 22 మంది నుంచి చర్మం స్వీకరించారు. అలాగే 44 మంది రోగుల కోసం చర్మాన్ని పంపారు. ఇప్పటివరకు 310 మంది నుంచి వినతి వస్తే 194 మందికి మాత్రం సరఫరా చేశారు. వీరిలో నాలుగేళ్ల బాలుర నుంచి 85 ఏళ్లు వృద్ధుల వరకూ ఉన్నారు. అలాగే దాతల్లో 17 ఏళ్లు యువకుని నుంచి 98 ఏళ్లు వృద్ధుని వరకు 197 మంది దానం చేశారని చర్మనిధి పర్యవేక్షకుడు బీఎన్.నాగరాజ్ తెలిపారు. -
Hyderabad: 28న ‘స్కిన్ బ్యాంక్’ ప్రారంభం
హైదరాబాద్: ఈస్ట్ రోటరీ క్లబ్, హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, ఉస్మానియా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం హోంమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా స్కిన్ బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉస్మానియా ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జన్ మధుసూదన్ నాయక్, రోటరీ క్లబ్ అధ్యక్షులు వై.వి.గిరిలు మాట్లాడారు. శరీరం కాలిపోయిన కేసు ల్లో 40 శాతం కన్నా ఎక్కువ బర్న్ అయిన వారికి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే ప్రతిరోజూ డ్రస్సింగ్ చేయాల్సి ఉంటుందని, డ్రస్సింగ్ చేసే సమయంలో రోగి నరకయాతన అనుభవిస్తారన్నారు. అదే స్కిన్ బ్యాంకు ఉంటే కాలినచోట స్కిన్ వేస్తే మూడు నెలల వరకు డ్రస్సింగ్ అవసరం ఉండదని చెప్పారు. భారతదేశంలో మొత్తం 15 స్కిన్ బ్యాంకులు ఉండగా అందులో 9 రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేసినవే కావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు సుధీష్‌రెడ్డి, చౌదరి, సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
స్కిన్ బ్యాంక్: కాలిన చోట చర్మం వేస్తారు
హైదరాబాద్: ఈస్ట్ రోటరీ క్లబ్, హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, ఉస్మానియా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం హోంమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా స్కిన్ బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉస్మానియా ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జన్ మధుసూదన్ నాయక్, రోటరీ క్లబ్ అధ్యక్షులు వై.వి.గిరిలు మాట్లాడారు. శరీరం కాలిపోయిన కేసు ల్లో 40 శాతం కన్నా ఎక్కువ బర్న్ అయిన వారికి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే ప్రతిరోజూ డ్రస్సింగ్ చేయాల్సి ఉంటుందని, డ్రస్సింగ్ చేసే సమయంలో రోగి నరకయాతన అనుభవిస్తారన్నారు. అదే స్కిన్ బ్యాంకు ఉంటే కాలినచోట స్కిన్ వేస్తే మూడు నెలల వరకు డ్రస్సింగ్ అవసరం ఉండదని చెప్పారు. భారతదేశంలో మొత్తం 15 స్కిన్ బ్యాంకులు ఉండగా అందులో 9 రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేసినవే కావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు సుధీష్‌రెడ్డి, చౌదరి, సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆమె ఆలోచన... ఓ స్కిన్ బ్యాంక్!
►వినూత్న రీతిలో నగర ఐపీఎస్ సుమతి ప్రయత్నం ►ఆరోగ్య శాఖకు సూచించిన అధికారిణి ►సాధ్యాసాధ్యాలపై జోరుగా అధ్యయనం సిటీబ్యూరో: నార్త్‌జోన్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ అధికారిణి బి.సుమతి 2016 జూన్‌లో గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ప్రత్యేకించి బర్న్స్ వార్డ్‌కు వెళ్లారు. అది కేవలం సాధారణ పర్యటనే అని అందరూ అనుకున్నారు. దాని వెనుక ఓ వినూత్న ఆలోచన ఉందని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కేవలం కొన్ని మెట్రో నగరాలకే పరిమితమైన స్కిన్ బ్యాంక్‌ను సిటీలోనూ ఏర్పాటు చేయించాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారికంగా కాకపోయినా... అనధికారికంగా ఆరోగ్య శాఖకు ఈ కీలక సలహా ఇచ్చారు సుమతి. దీంతో అధికార యంత్రాంగాలు ఈ స్కిన్ బ్యాంక్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై జోరుగా అధ్యయనాలు చేస్తున్నాయి. తన సర్వీసులో తాను చూసిన ఎన్నో కాలిన కేసుల నేపథ్యంలోనే తనకీ ఆలోచన వచ్చిందని సుమతి చెబుతున్నారు. మరణాల్లో అత్యధికం ఇన్ఫెక్షన్తోనే... ప్రమాదాలు, ఆత్మహత్యయత్నాల్లో శరీరంపై కాలిన గాయాలైతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. క్షణాల నుంచి నెలల్లోపు ఎప్పుడైనా ఈ క్షతగాత్రుల్ని మృత్యువు కబళించే ఆస్కారం ఉంటుంది. కాలిన గాయాలైన సందర్భాల్లో అనేక మంది మరణించడానికి ప్రధాన కారణం తదనంతర ఇన్ఫెక్షన్స్. కాలినప్పుడు ఆయా ప్రాంతాల్లో శరీరంపై ఉండే చర్మం పూర్తిగా దెబ్బతింటుంది. అక్కడి టిష్యూస్ సైతం చనిపోవడంతో తిరిగి కొత్త చర్మం వచ్చే ఆస్కారం లేదు. దీంతో అనేక రకాలైన ఇన్ఫెక్షన్స్ సోకి బాధితులు చనిపోతుంటారు. పదిహేనేళ్లకు పైగా పోలీసు విభాగంలో పనిచేసిన సుమతి తన సర్వీసులో అనేక కాలిన కేసుల్ని చూశారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులు కొలుకున్నట్లే భావించినా హఠాత్తుగా కన్నుమూసిన ఘటనలు ఎన్నో చూశారు. ఆయా సందర్భాల్లో వైద్యులతో సంప్రదింపులు జరిపిన సుమతి ఇన్ఫెక్షన్స్ కారణంగానే మరణం సంభవించినట్లు తెలుసుకున్నారు. ఆ సమయంలో స్కిన్ బ్యాంక్ గురించి ఆలోచించారు. సుదీర్ఘ పరిశీలన తర్వాత... ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న సుమతి అనేక కేసులతో పాటు ఇంటర్నెట్లోనూ సుదీర్ఘ పరిశీలన చేశారు. అమెరికా, యూరవ్ వంటి చోట్ల ప్రాచుర్యం, ప్రజాదరణ పొందిన స్కిన్ బ్యాంక్స్ పనితీరును గమనించారు. ఈ అనుభవాలకు తోడు నార్త్‌జోన్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గాంధీ ఆస్పత్రి బర్న్స్ వార్డ్ సందర్శన ఆమెను కదిలించాయి. వెంటనే స్కిన్ బ్యాంక్ అంశాన్ని పరి«శీలించాల్సిందిగా సంబంధిత విభాగాలకు అనధికారికంగా సూచించారు. దీనిపై స్పందించిన ఉన్నత స్థాయి అధికారులు వైద్య ఆరోగ్య శాఖతో పాటు బర్న్స్ వార్డ్ ఉన్న ఆస్పత్రుల్లో పని చేసే, ఆ రంగంలో విశేష అనుభవం కలిగిన వైద్యులతో లోతైన అధ్యయనం చేయిస్తున్నారు. ఈ బ్యాంక్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, వ్యయం, లాభనష్టాలపై పలువురి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఈ స్కిన్ బ్యాంక్స్ నిర్వహణ భారీ ఖర్చుతో కూడుకున్న అంశమని నిపుణులు చెప్తున్నారు. దేశంలోనూ ఢిల్లీ, ఫుణే, ఇండోర్, ముంబై, నవీ ముంబై, బెంగళూరుల్లో స్కిన్ బ్యాంక్స్ పని చేస్తున్నాయి. స్కిన్... డోనర్ టు రిసీవర్ ►కళ్లు తదితర అవయవాల మాదిరిగానే చర్మాన్ని సైతం మనిషి చనిపోయిన తర్వాత ►అతడి కుటుంబం అనుమతితో సేకరిస్తారు. ►మరణం సంభవించిన తర్వాత గరిష్టంగా ఆరు గంటల్లోపు చర్మాన్ని సేకరించాల్సి ఉంటుంది. ►కేవలం 18 ఏళ్లకు మించిన వాళ్ల శరీరం నుంచే చర్మాన్ని సేకరిస్తారు. ఈ ప్రక్రియ 30 నుంచి 40 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ►స్కిన్ బ్యాంక్‌నకు చెందిన వారే మృతుడి ఇల్లు, ఆస్పత్రి, మార్చురీలకు వస్తారు. ►కేవలం తొడ భాగం నుంచే చర్మాన్ని సేకరిస్తారు. ►ఇలా సేకరించిన చర్మాన్ని స్కిన్ బ్యాంక్‌లో నిర్ణీత టెంపరేచర్, జాగ్రత్తల మధ్య రెండు నుంచి ఐదేళ్ల పాటు భద్రపరిచే అవకాశం ఉంది. ►హెచ్ఐవీ, హెపిటైటిస్, స్కిన్ క్యాన్సర్, చర్మ వ్యాధులు, సుఖ వ్యాధులు ఉన్న వారి చర్మం సేకరణకు పనికి రాదు. ►చర్మం విషయంలో దాత, గ్రహీతల రక్తం గ్రూపు కలవాల్సిన పనిలేదు. ఇలా రిసీవర్‌కు ఏర్పాటు చేసిన చర్మం నాలుగు వారాల పాటు రక్షణ కల్పించి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. -
చర్మదానం.. ఎవరైనా చేయొచ్చు..!
సాక్షి, ముంబై: చర్మదానం చేసేవారి సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. దీనిపై నగరవాసులకు సరైన అవగాహన కల్పించడం ద్వారా చర్మదాతల సంఖ్య ను పెంచవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నగరంలోని కార్పొరేషన్ ఆస్పత్రుల్లో చర్మాన్ని దానం చేసే వారి సంఖ్య కొంత మేర తగ్గిపోయిందని ఓ సర్వే ఆధారంగా వెల్లడైంది. చర్మాన్ని ఎవరైనా దానం చేయొ చ్చు. అంటువ్యాధులు, దీర్ఘవ్యాధులు, చర్మక్యాన్సర్తోపాటు హెపిటైటిస్-బీ,సీ, హెచ్ఐవీ ఉన్నవారు సైతం చర్మాన్ని దానం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. దాతలు ద్వారా సేకరించిన చర్మాన్ని స్కిన్బ్యాంక్లో భద్రపరుస్తారు. బతికున్న చర్మదాతల నుంచి మత్తుమందు ఇచ్చి చర్మాన్ని స్వీకరిస్తారు. మరణించిన వారి నుంచి 24 గంటల్లోపు చర్మాన్ని స్వీకరించవచ్చు. అయితే మృతదేహాలను కోల్డ్‌స్టోరేజీలో ఉంచడం ద్వారానే వీరి చర్మాన్ని స్వీకరించేందుకు వీలు కలుగుతుంది. కాగా, దేశంలోనే చర్మ బ్యాంక్ కలిగిన ఏకైన మెడికల్ కాలేజీ నగరంలోని సైన్ ఆస్పత్రిలో ఉంది. ఈ బ్యాంక్ అందజేసి న గణాంకాల మేరకు.. చర్మదానం చేసేవారి సంఖ్య 2012లో 177 ఉండగా 2013లో 144కు చేరింది. దీంతో చర్మదానం చేసే వారి సంఖ్య 18 శాతం తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. కాగా, కేవ లం సైన్ ఆస్పత్రిలోనే కాలిన రోగుల కోసం ఏడాదికి 400 నుంచి 500 చర్మ దాతలు అవసరం ఉం టుంది. ఈ చర్మం రోగులకు సహజమైన కట్టులా (నేచురల్ బేండేజ్)గా ఉపయోగపడుతుంది. దీం తో వైద్య ప్రక్రియ కూడా వేగంగా సాగుతుందని వైద్యులు చెబుతున్నారు. చర్మదానం చేసే వారి సంఖ్య తగ్గడం వల్ల కాలిన గాయాలైన వారికి చర్మం అందుబాటులో లేకపోవడంతో ‘డ్రెస్సింగ్’ నిర్వహిస్తున్నామని, అది చాలా నొప్పితో కూడుకొని ఉంటుందని వారు పేర్కొన్నారు. అలాగే డ్రెస్సింగ్ ను రోజూ నిర్వహించాల్సి వస్తుందని సైన్ ఆస్పత్రి చికిత్సా విభాగానికి చెందిన వైద్యాధికారి మీనా కుమార్ తెలిపారు. చర్మం అందుబాటులో ఉంటే రోగులకు చౌకగా చికిత్స జరుగుతుందని ఆయన తెలిపారు. ఇద్దరు లేదా ముగ్గురు రోగుల నుంచి సేకరించిన చర్మం ఒక్క రోగికి మాత్రమే ఉపయోపడుతుందన్నారు. ఎక్కువ కాలిన గాయాలతో బాధపడుతున్న వారికి ఈ చర్మదానంతో చాలా ప్రయోజనమని వైద్యాధికారి తెలిపారు. చర్మదానం చేయడంపై నగర వాసుల్లో అవగాహన పెరుగుతోందని, అయితే ఇందుకు కార్పోరేషన్ అధికారుల సహకారం కూడా అవసరమన్నారు. నగర వాసుల్లో చర్మదానంపై మరింత అవగాహన పెంచేందుకు అధికారులు కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచిం చారు. మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చే సమయం లో వైద్యులు మృతుల కుటుంబాలకు ఈ చర్మదానంపై అవగాహన కల్పిం చాలని కోరారు. అయితే చర్మదానంపై కేవలం అవగాహన కల్పించడమే కాకుండా సేకరించే సదుపాయాలు కూడా కల్పించాలని నిపుణులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, తాము స్కిన్ కలెక్షన్ కోసం చాలా ఆస్పత్రులు తిరిగామని, కానీ కొన్ని ఆస్పత్రులు మాత్ర మే ఇందుకు అంగీకరించాయని ఓ సామాజిక కార్యకర్త తెలిపారు.