చర్మదానం.. ఎవరైనా చేయొచ్చు..!
సాక్షి, ముంబై: చర్మదానం చేసేవారి సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. దీనిపై నగరవాసులకు సరైన అవగాహన కల్పించడం ద్వారా చర్మదాతల సంఖ్య ను పెంచవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నగరంలోని కార్పొరేషన్ ఆస్పత్రుల్లో చర్మాన్ని దానం చేసే వారి సంఖ్య కొంత మేర తగ్గిపోయిందని ఓ సర్వే ఆధారంగా వెల్లడైంది.
చర్మాన్ని ఎవరైనా దానం చేయొ చ్చు. అంటువ్యాధులు, దీర్ఘవ్యాధులు, చర్మక్యాన్సర్‌తోపాటు హెపిటైటిస్-బీ,సీ, హెచ్‌ఐవీ ఉన్నవారు సైతం చర్మాన్ని దానం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. దాతలు ద్వారా సేకరించిన చర్మాన్ని స్కిన్‌బ్యాంక్‌లో భద్రపరుస్తారు. బతికున్న చర్మదాతల నుంచి మత్తుమందు ఇచ్చి చర్మాన్ని స్వీకరిస్తారు.
మరణించిన వారి నుంచి 24 గంటల్లోపు చర్మాన్ని స్వీకరించవచ్చు. అయితే మృతదేహాలను కోల్డ్‌స్టోరేజీలో ఉంచడం ద్వారానే వీరి చర్మాన్ని స్వీకరించేందుకు వీలు కలుగుతుంది. కాగా, దేశంలోనే చర్మ బ్యాంక్ కలిగిన ఏకైన మెడికల్ కాలేజీ నగరంలోని సైన్ ఆస్పత్రిలో ఉంది. ఈ బ్యాంక్ అందజేసి న గణాంకాల మేరకు.. చర్మదానం చేసేవారి సంఖ్య 2012లో 177 ఉండగా 2013లో 144కు చేరింది.
దీంతో చర్మదానం చేసే వారి సంఖ్య 18 శాతం తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. కాగా, కేవ లం సైన్ ఆస్పత్రిలోనే కాలిన రోగుల కోసం ఏడాదికి 400 నుంచి 500 చర్మ దాతలు అవసరం ఉం టుంది. ఈ చర్మం రోగులకు సహజమైన కట్టులా (నేచురల్ బేండేజ్)గా ఉపయోగపడుతుంది. దీం తో వైద్య ప్రక్రియ కూడా వేగంగా సాగుతుందని వైద్యులు చెబుతున్నారు. చర్మదానం చేసే వారి సంఖ్య తగ్గడం వల్ల కాలిన గాయాలైన వారికి చర్మం అందుబాటులో లేకపోవడంతో ‘డ్రెస్సింగ్’ నిర్వహిస్తున్నామని, అది చాలా నొప్పితో కూడుకొని ఉంటుందని వారు పేర్కొన్నారు.
అలాగే డ్రెస్సింగ్ ను రోజూ నిర్వహించాల్సి వస్తుందని సైన్ ఆస్పత్రి చికిత్సా విభాగానికి చెందిన వైద్యాధికారి మీనా కుమార్ తెలిపారు. చర్మం అందుబాటులో ఉంటే రోగులకు చౌకగా చికిత్స జరుగుతుందని ఆయన తెలిపారు. ఇద్దరు లేదా ముగ్గురు రోగుల నుంచి సేకరించిన చర్మం ఒక్క రోగికి మాత్రమే ఉపయోపడుతుందన్నారు. ఎక్కువ కాలిన గాయాలతో బాధపడుతున్న వారికి ఈ చర్మదానంతో చాలా ప్రయోజనమని వైద్యాధికారి తెలిపారు.
చర్మదానం చేయడంపై నగర వాసుల్లో అవగాహన పెరుగుతోందని, అయితే ఇందుకు కార్పోరేషన్ అధికారుల సహకారం కూడా అవసరమన్నారు. నగర వాసుల్లో చర్మదానంపై మరింత అవగాహన పెంచేందుకు అధికారులు కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచిం చారు. మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చే సమయం లో వైద్యులు మృతుల కుటుంబాలకు ఈ చర్మదానంపై అవగాహన కల్పిం చాలని కోరారు. అయితే చర్మదానంపై కేవలం అవగాహన కల్పించడమే కాకుండా సేకరించే సదుపాయాలు కూడా కల్పించాలని నిపుణులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, తాము స్కిన్ కలెక్షన్ కోసం చాలా ఆస్పత్రులు తిరిగామని, కానీ కొన్ని ఆస్పత్రులు మాత్ర మే ఇందుకు అంగీకరించాయని ఓ సామాజిక కార్యకర్త తెలిపారు.