cold storage
-
మిర్చి ధర పతనం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మిర్చి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది మే చివరి నాటికి క్వింటాల్ మిర్చి కనీస ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.26,500 ఉండగా.. ఈ ఏడాది కనీస ధర రూ.8 వేలు, గరిష్ట ధర 20,700 పలుకుతోంది. ప్రస్తుతం తేజ మంచి రకానికి రూ.19,500 మాత్రమే అత్యధిక ధర లభిస్తోంది. మిగిలిన అన్నిరకాల మిర్చి ధరలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు ఎగుమతులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో కోల్డ్ స్టోరేజీలలో 75 లక్షల మిర్చి బస్తాలు నిల్వ ఉండిపోయాయి. ధరలు తగ్గడంతో మిర్చి రైతుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ఎగుమతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంకోవైపు వర్షాలు ప్రారంభం కావడంతో మిరప నాట్లు వేసేందుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు.ఎగుమతుల్లో ఏపీదే మొదటి స్థానం 2022–23 సంవత్పరంలో రికార్డు స్థాయిలో రూ.10,440 కోట్ల విలువైన మిర్చి విదేశాలకు ఎగుమతులయ్యాయి. మిర్చి ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. దీంతో రెండేళ్లుగా రైతులు మిర్చి పంట వేయడంపైనే దృష్టి పెడుతున్నారు. మరోవైపు కర్ణాటకలోనూ మిర్చి దిగుబడి ఎక్కువగా రావడంతో అక్కడ కోల్డ్ స్టోరేజీలు సరిపోక ఏపీకి తీసుకొచ్చి నిల్వ చేస్తున్నారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో 100 వరకూ కోల్డ్‌స్టోరేజీలు ఉండగా.. 3.21 లక్షల టన్నులకు పైగా మిర్చిని నిల్వ చేశారు. ఇందులో 2.71 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రైతులది కాగా.. 52 వేల మెట్రిక్ టన్నుల సరుకు వ్యాపారులది. ఇవికాకుండా పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఉన్న కోల్డ్ స్టోరేజీలలో మొత్తం 75 లక్షల బస్తాల ( బస్తా 40 కిలోలు) సరుకు నిల్వ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉత్పత్తి గణనీయంగా రావడం వల్ల ధర రోజురోజుకీ తగ్గుతుండటం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.20 దేశాలకు ఎగుమతి మన దేశం నుంచి సుమారు 20 దేశాలకు మిర్చి ఎగుమతి అవుతోంది. ముఖ్యంగా చైనా, శ్రీలంక, మలేసియా, థాయ్‌లాండ్, స్పెయిన్, అమెరికా, ఇంగ్లాండ్, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. ఆయా దేశాలకు కారం, విత్త నాలను సైతం ఎగుమతి చేస్తున్నారు. -
పసుపు కోల్డ్ స్టోరేజ్ లో మంటలు
-
రాజన్న వరం.. యడ్లపాడు స్పైసెస్ పార్క్
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక యడ్లపాడు స్పైసెస్ పార్కు ప్రస్తుతం రైతులకు మేలు చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. పూర్తిస్థాయిలో ఇవి అందుబాటులోకి వస్తే.. రూ.వంద కోట్ల భారీ కలల ప్రాజెక్టు సాకారమవుతుంది. రైతులు, వ్యాపారులు ఆర్థిక పురోగతి సాధిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో మన జిల్లా ఎగుమతులు ఊపందుకుంటాయి. యడ్లపాడు: మిరప, పసుపు తదితర పంట ఉత్పత్తులను ముడి రూపంలో ఎగుమతి చేస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అంతర్జాతీయ స్థాయిలో సుంగంధ ద్రవ్యాల ఆదాయంలో మన వాటాను పెంచుకోవాలంటే మేలు రక వంగడాల ఉత్పత్తితోపాటు పంట దిగుబడులను గ్రేడింగ్ చేసి పొడులు, ఇతరత్రా రూపాల్లో వివిధ సైజుల్లో ప్యాకింగ్ చేస్తే ఎగుమతులు పుంజుకుంటాయి. అందుకే ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం పల్నాడు జిల్లా యడ్లపాడులో దేశంలోనే అతిపెద్ద సుంగంధ ద్రవ్యాల(స్పైసెస్) పార్కును ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ, స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో రూ.24 కోట్లతో మైదవోలు–వంకాయలపాడు గ్రామాల పరిధిలో 124.79 ఎకరాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో ఈ పార్కును నిర్మించడం విశేషం. వైఎస్సార్ చలువే దేశంలో 6 చోట్ల సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలని 2007లో కేంద్రప్రభుత్వం భావించింది. దీంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏపీకి స్పైసెస్ పార్కు కేటాయించాలని కేంద్రాన్ని పట్టుబట్టారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మిర్చి పంటలో 60 శాతం ఏపీలోనే.. అందులోనూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉత్పత్తి అవుతుందని, అక్కడే పార్కు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపి కేంద్రం ఆమోదాన్ని పొందారు. వెనువెంటనే భూసేకరణ ప్రక్రియ చేపట్టి దేశంలోనే అతిపెద్ద పార్కు నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత 2015లో పార్కు నిర్మాణం పూర్తయింది. పార్కు వల్ల ప్రయోజనాలు ► రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధరను పొందేందుకు ఎగుమతిదారులతో ప్రత్యక్ష మార్కెట్ అనుసంధానాన్ని ఏర్పరుచుకోవాలి. దీనికి ఈ పార్కు ఎంతో దోహదపడుతుంది. ► క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ కోసం సాధారణ అవస్థాపన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ► నాణ్యమైన ఉత్పత్తుల తయారీ, నిర్ధారణకు దోహదం చేస్తుంది. ఫలితంగా మంచి ధర లభిస్తుంది. ఇంకా ఏమేం వస్తాయి? ► పార్కులో ఇంకా గ్రేడింగ్, క్లీనింగ్, ప్యాకింగ్ స్టెరిలైజేషన్, స్టీమ్, చిల్లీపౌడర్, చిల్లీపేస్ట్, క్లోనింగ్ ఎక్స్‌పోర్టుకు కావాల్సిన ప్యాకింగ్ సిస్టం వంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. ► మిర్చి నుంచి రంగు, ఘాటు వేరు చేసే యూనిట్లు, ఓలియేరేజిన్ వంటివి తయారు చేసేవి, మసాల తయారీ, వివిధ మిర్చి ఉత్పత్తుల యూనిట్లు త్వరలోనే రానున్నాయి. ► ఈ రంగంలో ఇప్పటికే పేరున్న బహుళ జాతి కంపెనీలూ ఇక్కడ సొంత యూనిట్లు ప్రారంభించనున్నాయి. ► చిల్లీ డ్రైయర్స్, లేబొరేటరీస్, వేబ్రిడ్జిలు, బ్యాకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ► మిర్చి, పసుపు అనుబంధన సంస్థలు, కంపెనీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. స్పైసెస్ పార్కు అభివృద్ధికి కృషి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి వల్లే స్పైసెస్ పార్కు ఏర్పాటైంది. దీని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేస్తాను. ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాను. ఈ పార్కు వల్ల రైతులకు, వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుంది. ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. పార్కుకు వెళ్లే ప్రధాన మార్గం విస్తరణకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. – విడదల రజిని, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శీతల గిడ్డంగులతో ఉపయోగం శీతల గిడ్డంగుల వల్ల రైతులకు మేలు కలుగుతోంది. గతంలో పంట ఉత్పత్తులను గుంటూరుకు తీసుకువెళ్లేవారం. ఇప్పుడు స్పైసెస్ పార్కులో గిడ్డంగులు ఉండడంతో దూరంతోపాటు రవాణా భారం తగ్గింది. – బండారు వెంకటసాంబశివరావు, మిర్చిరైతు, వంకాయలపాడు గ్రామం మిర్చి రైతులకు బంగారు భవిత గతంలో పంటను భద్రపరిచే అవకాశం లేక మిర్చి పంటను కల్లాల్లోనే తెగనమ్ముకునేవాళ్లం. ప్రస్తుతం స్పైసెస్‌పార్కులో రెండు కోల్డ్‌స్టోరేజీలు రావడంతో సరైన ధర వచ్చేవరకు భద్రపరుచు కుంటున్నాం. ప్రాసెసింగ్ యూనిట్లూ రావడంతో మేమే గ్రేడింగ్ చేసుకుంటున్నాం. పార్కు వల్ల మా భవిత బంగారంలా ఉంటుంది. – కర్రా పెదరాజారావు, మిర్చిరైతు జాలాది గ్రామం రైతుకు భరోసా స్పైసెస్ పార్కులో సరుకు నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల ధర వచ్చినప్పుడే అమ్ముకోవచ్చు. పార్కు ఏర్పాటైనప్పటి నుంచి మా ప్రాంతంలో మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మంచి గిట్టుబాటు ధర లభిస్తోంది. పార్కు రైతుకు భరోసాగా ఉంది. – కొసన సాంబశివరావు, రైతు చెంఘీజ్‌ఖాన్‌పేట క్యూ కట్టిన కంపెనీలు ప్రస్తుతం పార్కులో స్పైసెస్ బోర్డు సొంతంగా కారంపొడి తయారు యూనిట్‌ను ఏర్పాటు చేసింది. దేశంలోనే ప్రముఖ కంపెనీ అయిన పైలెట్ స్మి తిరుచూరు నుంచి రూ.2 కోట్లతో ‘చిల్లీప్రాసెసింగ్ యూనిట్ మిషన్’ను తెప్పించి లీజుకు ఇచ్చింది. యూనిట్ల ఏర్పాటు కోసం కంపెనీలకు కేటాయించేందుకు బోర్డు 93.42 ఎకరాల విస్తీర్ణాన్ని 58 ప్లాట్లుగా విభజించింది. వీటికోసం 100కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 49 ప్లాట్లను 18 మంది పారిశ్రామికవేత్తలకు ప్రైవేట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బోర్డు కేటాయించింది. వీరిలో ఐదుగురు యూనిట్లను స్థాపించి నిర్వహిస్తున్నారు. డాలి, రామి ఆగ్రో, ఎస్ఎంఈ అగ్రిటెక్, స్వమి స్పైస్మిల్, ఉమా ఎక్స్‌పోర్ట్స్, డీకే ఎంటర్ప్రైజెస్ వంటి మరో ఏడు కంపెనీలు యూనిట్ల ఏర్పాటుకు నిర్మాణ పనులను చేపట్టాయి. ఇప్పటికే ఉన్న యూనిట్లలో క్వాలిటీ స్పైసెస్, స్పైస్ఎగ్జిన్, నంద్యాల సత్యనారాయణ, ఆగ్రోట్రేడ్, ఐటీసీ, జాబ్స్ ఇంటర్నేషనల్ యూనిట్లు ప్రధానమైనవి. సరుకు నిల్వకు గిడ్డంగులు 2018లో పార్కులో రూ.53.2 కోట్లతో 4 గోదాములను నిర్మించారు. 12 ఎకరాల్లో ఏర్పాటైన వీటి సామర్థ్యం 23 వేల మెట్రిక్ టన్నులు. వీటిలో 13వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఐదంతస్తుల రెండు శీతల గిడ్డంగులు ఉన్నాయి. వీటి విద్యుత్ అవసరాల కోసం 200కేవీఏ సామర్థ్యంగల రెండు సోలార్ యూనిట్లనూ ఏర్పాటు చేశారు. వీటితో పాటు అదనపు నిల్వల కోసం ప్రత్యేక యూనిట్ నిర్మించారు. పంట ఉత్పత్తుల రక్షణ కోసం కావాల్సిన యంత్రాలు, పరికరాలు సమకూర్చారు. రైతుల కోసం విశ్రాంతి గదులు నిర్మించారు. మిర్చి, పసుపు మాత్రమే కాకుండా అపరాలు, బియ్యం, నూనెవస్తువులు, వేరుశనగ, నువ్వులు, కందులు, పెసలు వంటి వాటినీ నిల్వ చేసుకునే అవకాశం కల్పించారు. శీతల గిడ్డంగులు ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చారు. సాధారణ గోదాములను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిర్వహిస్తోంది. రాయితీపై సేవలందిస్తోంది. (క్లిక్: పరిశోధన, ప్రయోగాల నిలయం ఏఎన్‌యూ) -
మిర్చి మిలమిల.. ఖాళీ అవుతున్న కోల్డ్ స్టోరేజీలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎండు మిర్చి ధర రోజు రోజుకూ పెరుగుతోంది. మార్కెటింగ్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల నేపథ్యంలో దళారుల ప్రమేయం తగ్గి, వాస్తవ ధరలు రైతులకు అందుతున్నాయి. చీడపీడల కారణంగా ఏడాది పంట దిగుబడులు తగ్గినా.. ధరలు పెరుగుతుండటం రైతన్నలకు ఊరటనిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 341 మిర్చి రకం ధర ఏకంగా క్వింటాల్ రూ.26 వేలకు చేరింది. దీంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన ఎండు మిర్చిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఎగబడుతున్నారు. మూడు నెలల్లో రూ.4,500 పెరుగుదల మిర్చి పైరుకు గత ఏడాది తెగుళ్లు సోకడంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఇదే సందర్భంలో ఎగుమతులు పెరిగాయి. బంగ్లాదేశ్ వంటి దేశాలకు సైతం ఎగుమతి కావడం, దేశీయంగా డిమాండ్ పెరగడంతో ధరలు ఎగబాకుతున్నాయి. దీంతోపాటు నాణ్యమైన సరుకు లభ్యత తక్కువ ఉండటం ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. విదేశాలకు ఎగుమతి అయ్యే తేజ, బాడిగ రకాల మిర్చికి గతంలో అధిక ధర ఉండేది. అందుకు భిన్నంగా ప్రస్తుతం 341 రకం మిర్చికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా ఈ రకం మిర్చి ధర కనీవినీ ఎరుగని రీతిలో ఎగబాకుతోంది. మార్చి నెలలో 341 మిర్చి క్వింటాల్ రూ.21,500 ధర పలికి రికార్డు సృష్టించింది. ఈ ధర క్రమంగా పెరుగుతూ.. ప్రస్తుతం రూ.26 వేలకు చేరింది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర రకాలదీ అదే దారి గుంటూరు, నడికుడి, ఖమ్మం, వరంగల్ మార్కెట్లలో నాణ్యత గల అన్ని రకాల మిర్చి ధరలు పెరుగుతున్నాయి. క్వింటాల్‌కు సగటున రూ.20 వేలకు పైగా పలుకుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లోని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చిని సైతం కొనేందుకు వ్యాపారులు ఎగబడటంతో సందడి నెలకొంది. ఈ రకానికి డిమాండ్ ఎందుకంటే.. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు, తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో 341 రకం మిర్చిని సాగు చేస్తారు. చిక్కటి ఎర్ర రంగు కలిగి ఉండే ఈ రకాన్ని కారం తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దేశీయంగా పచ్చళ్ల తయారీతోపాటు, గృహావసరాలకు వాడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఉత్తర భారతదేశంలో ఈ రకానికి మంచి డిమాండ్ ఉంది. కొత్త పంట నవంబర్ వరకు వచ్చే అవకాశం లేకపోవడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. (క్లిక్: ఒక్క రూపాయికే పక్కా ఇల్లు) ఆశాజనకంగా ధరలు నేను 2020లో రెండెకరాల్లో మిర్చి పంట వేశాను. కరోనా నేపథ్యంలో గిట్టుబాటు ధర లేక కోల్డ్ స్టోరేజీలో ఉంచాను. ప్రస్తుతం మిర్చి ధర ఆశాజనకంగా ఉంది. అందువల్ల విక్రయిస్తున్నాను. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు పెరిగాయి. ఎంతో సంతోషంగాఉంది. – వి.శ్రీనివాసరావు, మిర్చి రైతు, సుబ్బాయిగూడెం, పెనుగంచిప్రోలు మండలం -
భలే రుచి.. భీమాళి మామిడి తాండ్ర
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఒక్కసారి కొరికితే.. నోటినిండా తియ్యటి తేనెలూరు తుంది. ఎంత తిన్నా జిహ్వ చాపల్యం తీరక.. ‘వదల భీమాళి.. నిన్నొదల’ అనాలని పిస్తుంది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం భీమాళి గ్రామస్తులు తయారు చేసే మామిడి తాండ్ర రుచి అలాంటిది మరి. వేసవి వచ్చిం దంటే చాలు. గ్రామంలో మామిడి తాండ్ర హడావుడి మొదలవుతుంది. ఇక్కడ తయారయ్యే తాండ్ర రుచులు తెలుగు ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల వారి మనసునూ దోచుకుంటున్నాయి. గ్రామంలో పూర్వీకుల నుంచి మామిడి తాండ్ర తయారీ కుటీర పరిశ్రమగా వేళ్లూను కుంది. అప్పటి సంప్రదాయ రుచుల్ని నేటికీ ఆ గ్రామస్తులు నిలబెట్టుకుంటూ వస్తున్నారు. గ్రామంలో దాదాపు 400 కుటుంబాలకు అదే జీవనాధారం. ఏటా కనీసం లక్ష కేజీల మామిడి తాండ్ర ఈ ఒక్క గ్రామంలోనే తయారవు తుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మామిడి తాండ్ర తయారీ ఉన్నప్పటికీ భీమాళి తాండ్రకు ప్రత్యేకత ఉండటంతో ఆదరణ లభిస్తోంది. తయారీ విధానమే ప్రత్యేకం మామిడి తాండ్ర తయారీకి కండ ఎక్కువ ఉండే రకాలైన కలెక్టర్, కోలంగోవ, సువర్ణ రేఖ లాంటి రకాల మామిడి పండ్ల నుంచి గుజ్జు, రసం తీసి సమపాళ్లలో చక్కెర కలుపుతారు. వెదురు చాపలపై తాండ్రగుజ్జు వేసి ఎండబెడతారు. దానిపై రోజూ గుజ్జుతో కొత్త పొరలు వేస్తుంటారు. కావాల్సిన మందానికి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉంటారు. బాగా ఎండిన తర్వాత ముక్కలుగా కోస్తారు. ఒక్కో చాపకు 60 నుంచి 70 కేజీల మామిడి తాండ్ర తయారవుతుంది. పండ్ల నుంచి తీసిన టెంకలను పాతర వేసి.. మొలక వచ్చాక వర్షా కాలంలో అంట్లు కట్టి అమ్ముతుంటారు. మామిడి పండ్ల నుంచి గుజ్జు తీస్తున్న మహిళలు జాగ్రత్త లేకుంటే నష్టం తాండ్ర తయారీలో ఎలాంటి ఫుడ్ కలర్స్, రసాయనాలు వినియోగించరు. నిత్యం మ్యాంగోజెల్లీని ఎండబెట్టి, భద్రం చేయాలి. వాతావరణం చల్లగా ఉం టే రంగు, రుచి మారే ప్రమాదం ఉంది. తాండ్ర రుచిగా ఉండాలన్నా, నిల్వ చేయాలన్నా ఎర్రటి ఎండలో ఎక్కువ కాలం ఎండబెట్టాలి. నిల్వ చేసే దారిలేదు కోల్డ్ స్టోరేజీ లేకపోవడంతో మామిడి తాండ్రను నిల్వ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీనివల్ల దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. పెరిగిన కూలి ఖర్చులు, సరుకుల ధరలు, గిట్టుబాటు కాని అమ్మకపు ధరతో పరిశ్రమ కునారిల్లుతోంది. పేరు పడ్డ తాండ్ర తయారీకి రుణ సదుపాయం కల్పించాలని, అమ్మకపు పన్ను రద్దు చేయాలని, కుటీర పరిశ్రమగా గుర్తిం చాలని, స్థానికంగా శీతల గిడ్డంగులు నిర్మించాలని తయారీదారులు కోరుతున్నారు. ఎండ ఉంటేనే పని ఎండ ఎర్రగా కాస్తేనే తాండ్ర వేసేందుకు అవకాశం ఉంటుంది. ఏమాత్రం మేఘాలు పట్టినా తాండ్ర వేయలేం. ఎండలో ఎంత కష్టపడినా ఫలితం దక్కటం లేదు. –జి.సత్యవతి, తయారీదారు కోల్డ్ స్టోరేజీ నిర్మించాలి ఎండలో కష్టపడి తయారు చేసిన తాండ్రను కోల్డ్ స్టోరేజీ లేకపోవడంతో వెంటనే అమ్ముకోవాల్సి వస్తోంది. దీనివల్ల మంచి ధర రావడం లేదు. విజయనగరంలోని కోల్డ్ స్టోరేజీకు తరలించి నిల్వ ఉంచితే వచ్చే లాభం కాస్తా దాని అద్దెకే సరిపోతోంది. – ఎస్.రమణ, తయారీదారు అమ్మకపు పన్ను రద్దుచేయాలి కుటీర పరిశ్రమగా తయారు చేస్తున్న తాండ్రపై ప్రభుత్వం అమ్మకపు పన్ను రద్దు చేయాలి. అప్పుడే కొనుగోలుదారులు, వ్యాపారులు గ్రామానికి వస్తారు. తాండ్ర తయారీ దారులకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. – మిడతాన అచ్చింనాయుడు, తయారీదారు -
మిర్చి యార్డుకు భారీగా సరుకు
సాక్షి, అమరావతిబ్యూరో: గుంటూరు మిర్చి యార్డుకు పెద్ద ఎత్తున సరుకు వచ్చి చేరుతోంది. దీంతో యార్డు ప్రాంగణం మిర్చి టిక్కీలతో నిండిపోయింది. సరుకుతో నిండిన వాహనాలు భారీ సంఖ్యలో రోడ్డుపైనే నిలిచిపోయాయి. ప్రస్తుతం సోమవారం నాటికి యార్డులో 3.5 లక్షల టిక్కీల బస్తాలు నిల్వలున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో యార్డులో సిబ్బంది, దిగుమతి, ఎగుమతి వ్యాపారులు, కార్మికులు హడలిపోతున్నారు. రాయలసీమ, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున సరుకు తీసుకువస్తున్నారు. యార్డు ప్రాంగణం అంతా మిర్చి బస్తాలతో నిండిపోవడంతో శానిటైజ్ చేసేందుకు వీలు కావటం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా యార్డుకు వచ్చే మొత్తం సరుకును కలిపి బయటకు పంపేందుకు చర్యలు తీసుకొంటున్నారు. యార్డు పరిసరాలను శానిటైజ్ చేసి, కోవిడ్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే దిశగా యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఈనెల 21 నుంచి 25 వ తేదీ వరకు యార్డుకు సెలవులు ప్రకటించారు. పెద్ద ఎత్తున సరుకు ఎందుకు వస్తోందంటే.. సకాలంలో వర్షాలు కురవటంతో కాలువలకు సాగు నీటిని పుష్కలంగా విడుదల చేశారు. ప్రధానంగా మిర్చి పంట అధికంగా పండే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నాగార్జున సాగర్ కుడికాలువలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ 12 వ తేదీ వరకు నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మిర్చి దిగుబడులు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా ఈ ఏడాది సాధారణ రకం మిర్చి రకాలు 334, నెంబరు 5341, సూపర్ 10 వంటి రకాలు సైతం మంచి ధర పలుకుతున్నాయి. వీటి ధర ప్రస్తుతం రూ.11 వేల నుంచి రూ.13 వేలు పలుకుతోంది. ఈ నేపథ్యంలో రైతులు మిర్చి సరుకును అమ్ముకునేందుకు యార్డుకు తరలిస్తుండటంతో యార్డు పూర్తిగా నిండిపోతోంది. హైబ్రిడ్ రకాలను రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. రైతులకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. యార్డులోకి వచ్చే రైతులకు మాస్క్ లేకపోతే, గేటులో ఉచితంగా మాస్క్ ఇస్తున్నాం. శానిటైజ్ చేసుకుని లోపలికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. అనారోగ్య పరిస్థితులు ఉంటే రైతులను యార్డులోకి అనుమతించటం లేదు. యార్డును పూర్తిగా సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో శుభ్రపరిచేందుకు వీలుగా సెలవులు ప్రకటించాం. – వెంకటేశ్వరరెడ్డి, మిర్చి యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి -
స్విగ్గీ, జొమాటోతో టీకా డెలివరీ!
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ మరో కొద్ది నెలల్లో భారత్‌లో అందుబాటులోకి రావచ్చనే అంచనాల నేపథ్యంలో టీకా పంపిణీకి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీకా డోసుల్ని ఉంచడానికి దేశవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీ యూనిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించే పనిలో పడింది. దీనికి సంబంధించి జాతీయ నిపుణుల కమిటీ ఫార్మాసూటికల్, ఆహార రంగాలలో ఉన్న కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ స్టార్టప్‌లతో ఒప్పందాలు కుదర్చుకొని తాలూకా స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. టీకా డోసుల పంపిణీకి సంబంధించి ఒక ముసాయిదా ప్రణాళికను వచ్చేవారంలో విడుదల చేయనున్నట్టుగా ఆ వర్గాలు తెలిపాయి. భారత్ తాను సొంతంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌తో పాటు 3 విదేశీ వ్యాక్సిన్లు మరి కొద్ది నెలల్లో అందుబాటులోకి రావచ్చు. వ్యాక్సిన్ డోసుల్ని ఉంచడానికి మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు అవసరం. కేంద్ర ఆరోగ్య శాఖ భారీ కోల్డ్ స్టోరేజ్‌లను రెండు నెలల పాటు వాడుకోవడానికి వీలుగా వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. -
గిడ్డంగులు,కోల్డ్ స్టోరేజీల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష
-
కోల్డ్ స్టోరేజ్ సూపర్వైజర్ ఆత్మహత్య
సాక్షి, తల్లాడ(ఖమ్మం) : బావిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక శ్రీకృష్ణ కోల్డ్ స్టోరేజ్ సూపర్వైజర్ వేముగంటి శివకుమార్(27) ఏప్రిల్ 29వ తేదీ నుంచి కనిపించడం లేదు. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన శివకుమార్ సొంత గ్రామానికి వెళ్లాడనే అనుమానంతో ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయలేదు. అయితే తల్లాడ మండలం తెలగవరం సమీపంలో ఫోన్ సిగ్నల్స్ వచ్చాయి. దీంతో కోల్డ్ స్టోరేజ్ మేనేజర్ అనిల్.. సూపర్వైజర్ అదృశ్యంపై మూడు రోజుల క్రితం తల్లాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చావులో ఒక్కటయ్యారు..) అయితే ఆదివారం తల్లాడ సమీపంలోని డంపింగ్ యార్డ్‌కు దగ్గర్లో ఉన్న బావిలో శివకుమార్ శవమై తేలుతూ కనిపించాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ బి.తిరుపతిరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆన్లైన్ రమ్మీలో కొంత నగదును పోగొట్టుకోవడం వల్ల మానసికంగా ఆందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. (జీడి తోటకు వెళ్లిన మహిళపై.. ) -
గుంటూరు: టిక్కీకి రూ.150 అద్దె
సాక్షి, అమరావతి: మిర్చిని నిల్వ చేసుకునే రైతుల నుంచి టిక్కీకి రూ.150 అద్దె వసూలు చేసేందుకు గుంటూరు కోల్డ్ స్టోరేజి ప్లాంట్ల నిర్వాహకులు అంగీకరించారు. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డును ప్రభుత్వం మూసివేసింది. దీంతో కొందరు రైతులు తమ పంటను కోల్డ్ స్టోరేజి ప్లాంట్లలో నిల్వ చేసుకుంటున్నారు. దీన్ని తమకు అనుకూలంగా చేసుకునేందుకు కొందరు నిర్వాహకులు రైతుల నుంచి రూ.200 అద్దెను వసూలు చేస్తున్నారు. దీనిపై రైతులు బుధవారం మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదనరెడ్డికి ఫిర్యాదు చేశారు. వివరాలను సేకరించిన ముఖ్యకార్యదర్శి కోల్డ్ స్టోరేజి ప్లాంట్ల నిర్వాహకులతో గురువారం చర్చలు జరిపి, ఇరువర్గాలకు ఆమోదయోగ్యంగా అద్దెను నిర్ణయించారు. సీజను పూర్తయ్యేవరకు రైతుల నుంచి ఒక్కో టిక్కీకి రూ.150 అద్దెను వసూలు చేసే విధంగా, హమాలీల ఎగుమతి, దిగుమతి ఖర్చులను నిర్వాహకులే భరించాలని నిర్ణయించారు. (259 మంది ఖైదీల విడుదల) -
గోదాములు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు మ్యాపింగ్
సాక్షి, అమరావతి: గ్రామాల వారీగా గోదాములు, మండలాల వారీగా కోల్డ్ స్టోరేజీలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుపై మ్యాపింగ్ చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల వారీగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి, వైఎస్సార్ జిల్లా పులివెందుల ప్రాంత అభివృద్ధి పనులపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లన్నీ ఒకే నమూనాలో ఉండాలని సూచించారు. పులివెందులలో మెడికల్ కాలేజీ పనుల పురోగతి గురించి ఆరా తీయగా, పనులకు సన్నద్ధమవుతున్నామని అధికారులు వెల్లడించారు. క్యాన్సర్ ఆసుపత్రి, ఇటీవల శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు. పనుల ప్రగతి, నిధుల ఖర్చు, ఇతరత్రా అంశాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఈసారి వరద వచ్చినప్పుడు గండికోట, చిత్రావతి రిజర్వాయర్లు నింపేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణపై దృష్టి పెట్టాలి ముద్దనూరు–కొడికొండ చెక్‌పోస్టు మధ్య రోడ్డు విస్తరణ పనులపై దృష్టి పెట్టాలని, ఈ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఖర్జూరం పంటపై కొందరు రైతులు ఆసక్తి చూపుతున్నారని అధికారులు ముఖ్యమంత్రితో ప్రస్తావించారు. వాతావరణం, ఖర్చులు ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. దీనిపై అధ్యయనం చేయించాలని సీఎం ఆదేశించారు. చిరుధాన్యాలను బాగా ప్రోత్సహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ (ఏపీ కార్ల్‌లో)లో ఉన్న మౌలిక వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. వెటర్నరీ, హార్టికల్చర్ రంగాల్లో గొప్ప సంస్థ ఏర్పాటుకు తగిన ఆలోచనలు చేయాలని, వారంలో దీనిపై ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పులివెందులలో ప్రపంచ స్థాయి నాణ్యతతో బోధన అందించే స్కూల్ ఏర్పాటుపై, టౌన్ హాలు నిర్మాణంపై దృష్టి పెట్టాలని చెప్పారు. -
రూ.100 కోట్లతో స్నేహా ఫామ్స్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పౌల్ట్రీ రంగ సంస్థ స్నేహా ఫామ్స్ తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ప్రాసెసింగ్ కెపాసిటీ గంటకు 6,000 బర్డ్స్ నుంచి 12,000లకు చేర్చనుంది. అలాగే కోల్డ్ స్టోరేజీ సామర్థ్యం ప్రస్తుతం 2,000 టన్నులుంది. దీనికి 3,000 టన్నులకు పెంచనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకల్ వద్ద కంపెనీకి ప్రాసెసింగ్ ప్లాంటుతోపాటు శీతల గిడ్డంగి ఉంది. సంస్థ ఇప్పటికే ప్రాసెస్డ్ చికెన్, ఫ్రెష్ చికెన్ విక్రయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్థానంలో నిలిచింది. అలాగే ప్రాసెసింగ్ కెపాసిటీ పరంగా దేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఎనిమిది నెలల్లో ఈ విస్తరణ పూర్తి అవుతుందని స్నేహా ఫామ్స్ ఎండీ డి.రామ్ రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. నూతన విభాగాల్లోకి ప్రవేశించేందుకు తాజా విస్తరణ దోహదం చేస్తుందన్నారు. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మెగా ప్రాజెక్టు కింద తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి పొందామని చెప్పారు. కొత్త విభాగాల్లోకి స్నేహా... స్నేహా ఫామ్స్ త్వరలో నగ్గెట్స్, లాలీపాప్స్ వంటి రెడీ టు కుక్, చికెన్ కర్రీ వంటి ఉత్పత్తులతో రెడీ టు ఈట్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే అయిదారు ఉత్పత్తులతో ట్రయల్స్ నిర్వహించామని రామ్‌రెడ్డి తెలిపారు. ‘ఫ్రోజెన్ చికెన్ విభాగంలోకి కూడా వస్తున్నాం. రెడీ టు ఈట్ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తాం. ఇప్పటికే దాణాను ఎగుమతి చేస్తున్నాం. సఫల బ్రాండ్ కింద సోయా, రైస్ బ్రాన్ ఆయిల్స్ దేశీయంగా విక్రయిస్తున్నాం. 80,000 కిలోల ప్రాసెస్డ్ చికెన్, 2.5 లక్షల బ్రాయిలర్ కోళ్లు ప్రతిరోజు అమ్ముతున్నాం. గ్రూప్ టర్నోవర్ రూ.3,000 కోట్లుంది. ఇందులో స్నేహా ఫామ్స్ వాటా రూ.2,500 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్‌లో 15–20 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. 3,000 మంది ఉద్యోగులు ఉన్నారు. విస్తరణతో కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుంది’ అని వివరించారు. -
కోల్డ్ స్టోరేజ్‌లో అగ్ని ప్రమాదం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు గాంధీపురం పరిధిలోని కనకదుర్గ కోల్డ్ స్టోరేజ్‌లో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సందర్భంగా అందులో నిల్వ చేసిన 70వేల బస్తాల మిర్చి, అపరాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.30 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు తెలిసింది. కోల్డ్ స్టోరేజీలో అంతర్గతంగా మంటలు చెలరేగి పొగలు కిటికీల గుండా బయటకు వ్యాపించి కనీసం నీళ్లు చల్లేందుకు కూడా వీలు లేని పరిస్థితులు తలెత్తాయి. ఆఖరుకు స్టోరేజీ గోడలకు డ్రిల్లింగ్ మిషన్‌తో రంధ్రాలు చేసి కొంత మేరకు మంటలు చల్లార్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో స్థానికంగా ఉన్న ఫైర్‌సేఫ్టీ కిట్ సాంకేతిక లోపం తలెత్తడంతో సిబ్బంది ఏమీ చేయలేకపోయారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. లక్ష బస్తాల సామర్థ్యం.. మహబూబాబాద్‌కు చెందిన వ్యాపారులు బ్రిజ్ గోపాల్ఝవర్, సిరికిషన్ ముందుడ, తల్లాడ రాంమూర్తి, నాగపూర్‌కు చెందిన రాజుబాయ్ ఆధ్వర్యాన రెండేళ్ల క్రితం ఐదు అంతస్తులతో కూడిన కనకదుర్గ కోల్డ్‌స్టోరేజ్ నిర్మించారు. ఇందులో పలువురు స్టోరేజ్‌లో రైతులు తమ మిర్చి బస్తాలను నిల్వ చేసుకున్నారు. ఇక బుధవారం ఉద యం హమాలీలు ‘సీ’ చాంబర్ వద్ద మిర్చి కాం టాలు పెడుతుండగా మాడువాసన రావడం.. ఆ వెంటనే ఏ, బీ చాంబర్ల నుంచి పొగలు రావడంతో యజమానులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఐదో అంతస్తులో ఉండడం వల్ల అగ్నిమాపక సిబ్బంది ఆ ప్రాంతా నికి వెళ్లి పరిశీలించారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికి అదుపులోకి రాలేదు. విషయం తెలుసుకున్న మానుకోట, డోర్నకల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్, రెడ్యానాయక్ చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. ఇక ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతో మరిపెడ, నర్సం పేట, ఇల్లందుకు చెందిన అగ్నిమాపక వాహనాలు మంటలు ఆర్పడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అలాగే, కొంతమేరకు మిర్చి బస్తాలను మరో కోల్డ్ స్టోరేజీలోకి వాహనాల ద్వారా తరలించారు. కోల్డ్‌స్టోరేజీలో మిర్చి నిల్వ చేసుకున్న రైతులు ఘటన స్థలికి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే, యజమానిలో ఒకరైన తల్లాడ రాంమూర్తి చిన్న కుమారుడు శ్రీను పొగ వాసనకు అస్వస్థతకు గురయ్యాడు. రైతులకు ఇచ్చిన బాం డ్లు, నిల్వ ఉంచిన సరుకు వివరాల రికార్డులు కోల్డ్ స్టోరేజీలోనే ఉండిపోవడంతో ఎంతమేరకు నష్టం జరిగిందనే విషయాలు తెలియరాలేదు. నాలుగు అగ్నిమాపక వాహనాలతో పాటు ప్రత్యేకంగా నీటి ని తెప్పించి మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అనుకున్న ఫలితం దక్కలేదు. కాగా, ఘటనా స్థలాన్ని సందర్శించిన వారిలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కేఎస్ ఎన్.రెడ్డి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, గుండా పోతురాజు, మహ్మద్ ఫరీద్, ముత్యం వెంకన్న, మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, సయ్యద్‌జాకీర్, చౌడవరపు రం గన్న, భూక్యా సురేందర్, షఫియోద్దీన్తో పాటు వివిధ శాఖల అధికారులు, పోలీసులు కె.సురేఖ, జి.వేణుగోపాల్‌రెడ్డి, లక్ష్మణ్, రమేష్, ఎస్.రవికుమార్, జె.వెంకటరత్నం, సిరిసిల్ల అశోక్ ఉన్నారు. ఎందుకు ఆలస్యమైందంటే.. షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో మంటలు అదుపులోకి రాకపోవడానికి గల కారణంపై నిపుణులు ఈ విధంగా స్పందించారు. కోల్డ్ స్టోరేజీలో గోడలకు డాంబర్ పూసి ఉంటుందని.. అమ్మోనియం గ్యాసు ఉంటుందని తెలిపారు. కర్రలపై బస్తాలు ఏర్పాటు చేస్తారని, కూలింగ్ పోకుండా ఉండేందుకు థర్మకోల్ షీట్లు అమరుస్తారని, ఈ కారణాల వల్ల మంటలు ప్రారంభమైనప్పుడు అవి అదుపులోకి రావడం కష్టమవుతుందని చెప్పారు. నేడు మిర్చి అమ్ముకుందామనుకున్నా... నేను 102 బస్తాలు (45 క్వింటాళ్ల) మిర్చిని కనకదుర్గ కోల్డ్ స్టోరేజీలో ఐదు నెలల క్రితం ఏర్పాటు చేసుకున్నాను. ప్రస్తుతం మిర్చి ధర క్వింటాల్‌కు రూ.13వేలు పలుకుతుందని గురువారం అమ్ముకుందామనుకున్నాను. ప్రమాదం జరిగిన చాంబర్లో నా మిర్చి బస్తాలు ఉన్నాయి. నాలాగే వందల మంది రైతుల మిర్చికి జరిగిన నష్టం విషయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. – వీరోజు రమేష్, రైతు, పెత్తాళ్లగడ్డ -
మిర్చి రైతుకు దండగ.. వ్యాపారికి పండగ
సాక్షి, ఖమ్మం: ఎండనక వాననక..రేయనక పగలనక..రెక్కలు ముక్కలు చేసుకొని రైతులు పండించిన పంటలు వ్యాపారులకు సిరులు కురిపిస్తున్నాయి. ఆరుగాలం శ్రమించిన కర్షకుడికి నష్టాలు మిగలగా..ఆ సరుకును కొనుగోలు చేసి నిల్వ పెట్టుకున్న వ్యాపారులకు అనతి కాలంలోనే లాభాలను కూడబెడుతున్నాయి. ఈ ఏడాది రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ పెట్టుకున్నవారికి లాభాల వాన కురుస్తోంది. పలు దేశాల్లో మిర్చికి డిమాండ్ పెరుగుతుండటంతో ఇక్కడ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన సరుకుకు ధర పలుకుతోంది. పంట డిమాండ్ ఉన్న దేశాలకు ప్రభుత్వం ఎగుమతులకు అవకాశాలు కల్పించడంతో వ్యాపారులకు బాగా కలిసి వచ్చింది. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ప్రధానంగా క్వింటాల్ రూ.12 వేలకు పైమాటే సగటున రూ.4 వేల మేరకు లాభం 32 కోల్డ్ స్టోరేజీల్లో 15లక్షల క్వింటాళ్ల నిల్వలు సాగు చేసే పంటల్లో మిర్చి ఒకటి. చైనా, మలేషియా, సింగపూర్ తదితర దేశాల్లో తేజ రకం మిర్చికి మంచి డిమాండ్ ఉంటుంది. జిల్లాలో జనవరి నుంచి ఏప్రిల్ నెల వరకు ఈ పంట ఉత్పత్తి సీజన్. అప్పుడే పంట విక్రయానికి వస్తుంది. ఖమ్మం పరిసర జిల్లాల్లో పండించిన తేజ రకం మిర్చిని రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో విక్రయిస్తుంటారు. పంట సీజన్లో సగటున క్వింటా రూ.8,500 పలికింది. తొలికోత మిర్చికి రూ.7వేల నుంచి రూ.7,500 వరకు మాత్రమే ధర పలకగా, రెండో కోత మిర్చికి రూ.8 వేల నుంచి రూ. 9వేలకు మించి పడలేదు. ఇక మూడో కోత మిర్చికి రూ. 8 వేల వరకు మాత్రమే ధర పలికింది. అయితే..అప్పుడు రైతుల నుంచి పంటను వ్యాపారులు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ పెట్టారు. ఇతర ఆదాయ వనరులు, పెట్టుబడులు ఉన్న రైతులు కొందరు నిల్వ పెట్టుకున్నారు. ఏసీ మిర్చికి క్వింటా ధర రూ. 12 వేలకు పైగానే పలుకుతోంది. నిల్వ మిర్చికి భలే గిరాకీ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన తేజ రకం మిర్చి ధర క్రమక్రమంగా పెరుగుతోంది. సీజన్లో వ్యాపారులు పంట కొనుగోలు చేసిన 70 రోజుల వ్యవధిలో ధర అమాంతం పెరిగింది. జూన్ ఆరంభంలో క్వింటా ధర రూ.10 వేలు దాటి..ఇప్పుడు ఎగబాకింది. 20 రోజుల వ్యవధిలో ఏకంగా క్వింటాల్‌కు రూ. 2,300 పెరిగి రూ.12,300లకు చేరింది. ప్రస్తుతం నాణ్యతను బట్టి రూ. 12 వేల నుంచి రూ. 12,300 వరకు రేటు పడుతోంది. రైతు వద్ద కొనుగోలు చేసిన ధర కన్నా అదనంగా మరో రూ.4 వేలు మిర్చికి ధర పలుకుతోంది. అయితే కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నందుకు స్వల్పంగా ఖర్చులున్నా..భారీగా లాభాలు దక్కనున్నాయి. పొరుగు దేశాల్లో డిమాండ్ తేజ రకం మిర్చికి పొరుగు దేశాల్లో డిమాండ్ ఉంది. దీంతో ఇక్కడ పండించే ఈ రకం మిర్చికి ధర పెరుగుతోంది. చైనా, మలేషియా, సింగపూర్ తదితర దేశాలకు ఈ రకం మిర్చిని వివిధ రకాలుగా వ్యాపారులు ఎగుమతులు చేస్తున్నారు. ఆయిల్ రూపంలో కొందరు, తొడిమలు తీసి మరికొందరు వ్యాపారులు ఈ పంట ఉత్పత్తిని ఎగుమతులు చేస్తున్నారు. దీంతో పంట ఎగుమతుల వేగం తక్కువగా ఉంది. దీంతో ఆయా దేశాల్లో పంటకు డిమాండ్ పెరుగుతోంది. 32 కోల్డ్ స్టోరేజీల్లో లక్షల క్వింటాళ్ల నిల్వలు జిల్లాలోని మొత్తం 32 కోల్డ్ స్టోరేజీల్లో దాదాపు 15 లక్షల క్వింటాళ్ల మిర్చి నిల్వలు ఉన్నట్లు సమాచారం. విలువ దాదాపు రూ.15 వేల కోట్లు ఉంటుందని ఓ అధికారి అంచనా వేశారు. కొందరు వ్యాపారులు తమ ఫరమ్ పేరిట, ఏజెన్సీల పేరిట పంటను నిల్వ పెట్టుకోగా, ఇంకొందరు ఆదాయపు, ఇతర పన్నుల నుంచి తప్పించుకునేందుకు రైతుల పేరిట కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ పెట్టారు. కొద్ది రోజులుగా వ్యాపారులు ఖరీదు దారులకు(ఎగుమతిదారులు) విక్రయాలు చేస్తున్నారు. ఎగుమతి దారులు ఎప్పటికప్పుడు సరుకును విదేశాలకు పంపించేస్తున్నారు. అప్పట్లో క్వింటా రూ.6,500కే విక్రయించా.. రెండెకరాల్లో మిర్చి వేశా. 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. పంట సాగుకు పెట్టుబడి అప్పుగా తీసుకొచ్చా. అవసరాలు, అప్పుల దృష్ట్యా పంట పండిన వెంటనే క్వింటాకు రూ.6,500 చొప్పున విక్రయించా. ఇప్పుడున్న రేటుతో చూసుకుంటే క్వింటాకు రూ.6 వేలు కోల్పోయా. ఇప్పుడు విక్రయించి ఉంటే మరో రూ. 2.40 లక్షల వరకు అదనంగా వచ్చేవి. – బిచ్చాల శ్రీనివాస్‌రావు, వల్లభి, ముదిగొండ మండలం -
కాలి బూడిదైన కోల్డ్‌స్టోరేజీ
సాక్షి, నందికొట్కూరు(కర్నూలు) : నందికొట్కూరు మండలం 10 బొల్లవరం గ్రామ సమీపంలోని శ్రీ చక్ర కోల్డ్‌స్టోరేజీలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు యజమాని చెబుతున్నారు. అందులో ఉన్న వ్యవసాయోత్పత్తులు కాలి బూడిదయ్యాయి. దీంతో సుమారు రూ.5 కోట్ల దాకా నష్టం వాటిల్లింది. తహసీల్దార్ హసీనా సుల్తానా తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒంగోలుకు చెందిన రమేష్ అనే వ్యక్తి శ్రీచక్ర కోల్డ్ స్టోరేజీని కొత్తగా నిర్మించారు. ఇంకా కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇందులో రమేష్‌తో పాటు మరో ఐదుగురికి చెందిన వ్యవసాయోత్పత్తులు నిల్వ చేశారు. ఎండు మిర్చి 25 టన్నులు, కందులు 25 టన్నులు, శనగలు 50 టన్నుల వరకు నిల్వ చేసినట్లు తెలుస్తోంది. అయితే..కోల్డ్‌స్టోరేజీలో మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడున్న కూలీలు గమనించి 10 బొల్లవరం గ్రామస్తులకు తెలియజేశారు. వారు కర్నూలులోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే..భారీఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో రాత్రి ఎనిమిది గంటల సమయానికి గానీ అదుపులోకి రాలేదు. మొత్తం నాలుగు ఫైరింజన్లను వినియోగించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో వ్యవసాయోత్పత్తులన్నీ కాలి బూడిదయ్యాయి. కోల్డ్ స్టోరేజీ కూడా దెబ్బతింది. రూ.5 కోట్ల దాకా నష్టం జరిగినట్లు యాజమాని రమేష్ ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. సంఘటన స్థలాన్ని సీఐ సుధాకరరెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, ఆర్ఐ సత్యనారాయణ, వీఆర్వో పవిత్ర తదితరులు పరిశీలించారు. కాగా..ఈ ప్రమాదంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్సూరెన్స్ కోసమే ఇలా చేసి ఉంటారని అంటున్నారు. -
కాలి బూడిదైన రైతుల ఆశలు
రెంటచింతల: పల్నాడు కోల్డ్ స్టోరేజ్ దగ్ధమైన ఘటనలో నష్టపోయిన 293మంది రైతులకు నేటికీ చిల్లిగవ్వ కూడా నష్టపరిహారం అందలేదు. సంవత్సరాలు గడుస్తున్నా కోల్డ్‌స్టోరేజ్ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. నిన్నా మొన్నటి వరకు బీమా కంపెనీ చెల్లిస్తుండంటూ నమ్మిస్తూ వచ్చింది. రైతులు కూడా ఎంతో ఆశతో ఎదురుచూశారు. అయితే, తీసుకున్న రుణాలకు నగదు చెల్లంచాలంటూ ఆంధ్రాబ్యాంక్ నోటీసులు పంపండంతో వారికి దిక్కుతోచడం లేదు. మనోవేదనకు గురవుతున్నారు. న్యాయం చేయాలంటూ జిల్లా గ్రీవెన్స్ సెల్లో అనేకమార్లు అర్జీలిచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. బ్యాంక్‌లో బంగారం పెట్టి రుణాలు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఖరీఫ్‌లో సాగుకోసం అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పు చేస్తున్నారు. నోటీసులపై బ్యాంక్ మేనేజర్‌తో చర్చలు ఇటీవల పలువురు రైతులు జెడ్పీటీసీ సభ్యుడు నవులూరి భాస్కర్‌రెడ్డితో కలసి బ్యాంక్ మేనేజర్ చిలక శ్రీనివాసరావుతో నోటీసుల విషయమై చర్చించారు. తమకు 293 మంది రైతులు వడ్డీతో కలుపుకుని రూ.11.71 కోట్లు చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. 2016 మేలో ఒక కంపెనీ, జూన్ నెలలో మరో కంపెనీ నష్టపరిహారం చెల్లించేందుకు తిరస్కరించాయని, రైతులు రుణాలను కట్టాల్సిందేనని మేనేజర్ తెలిపారు. మాయమాటలు చెప్పిన కోల్ట్ స్టోరేజ్ యాజమాన్యం అగ్ని ప్రమాదంలో 70వేల టిక్కీల మిర్చి, 4వేల టిక్కీల పసుపు, 300 బస్తాల శెనగలు కాలిపోయినట్లు అప్పట్లో కోల్డ్‌స్టోరేజ్ యాజమాన్యం ప్రకటించింది. ఆస్తులు అమ్మి అయినాసరే రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని నమ్మబలికింది. ఐదేళ్లు గడుస్తున్నా రైతులకు ఒరిగిందేమీలేదు. సుమారు 25శాతం మంది రైతులు పైసా కూడా బ్యాంక్, కోల్డ్‌స్టోరేజ్ వద్ద రుణం తీసుకోలేదని తెలుస్తోంది. గత నెల 29న కొందరు రైతులు న్యాయం చేయకపోతే తమకు మరణమే శరణ్యమని పురుగు మం దు డబ్బా తీసుకుని బ్యాక్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 1985 యాక్ట్ ప్రకారం కోల్డ్ స్టోరేజ్‌కు సమీపంలో ఫైర్ నిబంధనల ప్రకారం లక్ష లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్, సేఫ్టీ సిలెండర్ల స్పింకర్లు లేనికారణంగానే ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు ఐదెకరాల పొలం కౌలుకు తీసుకుని లక్షలు పెట్టుబడి పెట్టి పండించి కోల్డ్‌స్టోరేజ్‌లో 130 క్వింటాళ్ల మిర్చిని దాచుకున్నా. ఒక్క రూపాయి కూడా రుణం తీసుకోలేదు. బీమా వస్తుందని నమ్మబలికిన కోల్డ్‌స్టోరేజ్ యాజమాన్యం మొహంకూడా చూపించడం లేదు. బ్యాంక్ వారు అప్పు చెల్లించాలని నోటీసులు పంపిస్తున్నారు. బ్యాంక్ కొత్తగా రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. – మోరం జయరాజారెడ్డి, కౌలురైతు, రెంటచింతల. -
కోల్డ్‌స్టోరేజ్ ఎదుట రైతుల ఆందోళన
చిలకలూరిపేట రూరల్: కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులు రోడ్డెక్కారు. మండలంలోని బొప్పూడి గ్రామ శివారు, జాతీయ రహదారి సమీపంలో గత నెల 15న బొప్పూడి కోల్డ్ స్టోరేజ్‌లో ఒక వ్యక్తి స్వార్థం కోసం వందలాది మంది రైతులు నిల్వ చేసుకున్న పంటకు నిప్పు అంటించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులైన వ్యక్తుల్ని ఇటీవల రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. స్టోరేజ్‌లో పంటను నిల్వ చేసుకుని వాటిపై బ్యాంక్ రుణం పొందని రైతులకు యాజమాన్యం న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. నేటికీ ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోవడంతో బుధవారం స్టోరేజ్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించటంతో రెండు గంటల పాటు వాహనాలు నిలచిపోయాయి. ఆందోళన నేపథ్యం ఇది... కోల్డ్ స్టోరేజ్‌లో కర్షకులు వివిధ పంటలను గిట్టుబాటు ధరల కోసం నిల్వ చేసుకున్నారు. ఈ క్రమంలో గత నెలలో కొందరు నిప్పుపెట్టడంతో 1.10 లక్షల టిక్కీలలో 60వేల టిక్కీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ప్రమాదంతో రూ. 30 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. నష్టపోయిన రైతులలో అధికశాతం మంది పలు జాతీయ బ్యాంక్‌ల ద్వారా రుణాలు పొందారు. సంబంధిత బ్యాంక్‌లు బీమా సౌకర్యాలను కల్పించడంతో ధీమా వెసులుబాటు ఉంది. వీరిలో 120 మంది రైతులు రూ. 4.60 కోట్ల పంటను నిల్వ చేసి ఎటువంటి బ్యాంక్‌ల నుంచి రుణాన్ని తీసుకోలేదు. ప్రమాదం సంభవించిన సమయంలోనూ వీరికి యాజమాన్యం బాండ్లు పంపిణీ చేయలేదు. అదే సమయంలో ఆందోళన చేశారు. యాజమాన్యం దిగివచ్చి పోలీసుల సమక్షంలో బాండ్లను పంపిణీ చేసింది. మంత్రి మధ్యవర్తిత్వం ప్రమాదం సంభవించిన వారం రోజుల అనంతరం బ్యాంక్‌ల ద్వారా రుణాలు పొందని వందలాది మంది రైతులు, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో చర్చలు జరిపారు. అందరికీ న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో రైతులు మిన్నకుండిపోయారు. ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఇటీవల నిందితులను జిల్లా ఎస్పీకార్యాలయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో తమ పరిస్థితి ఏమిటని మరో విడత స్టోరేజ్ యాజమాన్యాన్ని రైతులు ప్రశ్నించారు. తమ పరిధిలో ఏమీ లేదని పేర్కొనడంతో స్టోరేజ్ ఆవరణలో ఆందోళన చేశారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించటంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ పి.ఉదయ్‌బాబు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమింప చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ త్వరలో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆందోళన నిర్వహిస్తామన్నారు. -
నష్ట భయంతోనే కోల్డ్స్టోరేజీకి నిప్పు
గుంటూరు: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామ పరిధిలోని బొప్పూడి కోల్డ్ స్టోరేజ్‌లో జరిగిన అగ్నిప్రమాదం మిస్టరీని పోలీసులు ఛేదించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు సోమవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం కుందూరువారిపాలెం గ్రామానికి చెందిన కె.జగన్నాథం సమీప గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి నిల్వ ఉంచి ధర పెరిగిన తర్వాత విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో 2014లో కొనుగోలు చేసిన సరుకును బొప్పూడి కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ చేశాడు. అనంతరం దాన్ని హామీగా పెట్టి నరసరావుపేట, గుంటూరులోని బ్యాంకుల్లో రూ.7.30 కోట్ల రుణంగా తీసుకున్నాడు. అయితే బకాయిలు చెల్లించకపోవడంతో బ్యాంకుల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఇటీవల నరసరావుపేటకు చెందిన బ్యాంకర్లు కొంత స్టాకును వేలం కూడా వేశారు. ఈ నేపథ్యంలో నష్టాల నుంచి ఎలాగైనా బయటపడాలని అగ్నిప్రమాద కుట్ర పన్నాడు. పథకం వేసిందిలా... తన సమస్యను అనంతపురం జిల్లాకు చెందిన స్నేహితుడు కాకర్ల రామచంద్ర నాయుడుకు వివరించి సలహా కోరాడు. కోల్ట్ స్టోరేజీని తగలబెట్టడమే మార్గమని సలహా ఇవ్వడమే కాకుండా ఆ పని తానే చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే జిల్లా పెద్దపప్పూరుకు చెందిన కొదమల వేణుగోపాల్, మల్లెల రాము, రవ్వగుండ్ల నారాయణ స్వామి, కొదమల లక్ష్మిమూర్తితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరికి జగన్నాథం రూ.5 లక్షలు ఇచ్చారు. పథకం ప్రకారం వారు గత నెల 15వ తేదీ తెల్లవారుజామున కోల్డ్ స్టోరేజీ వాచ్‌మన్‌ను గదిలో బంధించి బి–బ్లాక్‌కి పెట్రోలు పోసి నిప్పంటించారు. తిరిగి కారులో అనంతపురం వెళుతున్న క్రమంలో పెద్దపప్పూరు వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలో పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. అదే సమయంలో కారులో కాలిన గాయాలతో ఉన్న నారాయణస్వామిని ఎస్ఐ అనుమానంతో ప్రశించగా అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి వెళ్లిపోయారు. కోల్ట్ స్టోరేజీ దగ్ధం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఏ బ్లాకు ఉన్న సుమారు రూ.9 కోట్ల విలువైన స్టాకును అక్కడ నుంచి తరలించారు. బీ–బ్లాకులోని రూ.20 కోట్ల విలువైన సరుకు అగ్నికి ఆహుతయింది. కోల్ట్‌స్టోరేజీ యజమాని రామినేని వెంకట సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసును ఛేదించిందిలా... కోల్డ్ స్టోరేజీ దగ్ధం విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో పెద్దపప్పూరు ఎస్ఐకు తన తనఖీల్లో పట్టుపడిన కారులోని నిందితులపై అనుమానం వచ్చింది. వెంటనే చిలకలూరిపేట రూరల్ సీఐ యు.శోభన్‌బాబుకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. విషయం తెలుసుకున్న నిందితులు ఈ నెల ఒకటో తేదీన చిలకలూరిపేటలోని న్యాయవాదిని కలిసేందుకు రాగా జగన్నాథంతోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కొదమల కృష్ణమూర్తి పరారీలో ఉన్నాడు. ప్రధాన నిందితుడు జగన్నాథం ఆస్తులను ఫ్రీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. సుమారు 500 మంది రైతులకు న్యాయం జరిగే వరకు ఆస్తులు ఫ్రీజ్‌లోనే కొనసాగుతాయన్నారు. సమావేశంలో డీఎస్పీ కె.నాగేశ్వరరావు, సీఐ యు.శోభన్‌బాబు, ఎస్ఐ ఉదయ్‌బాబు పాల్గొన్నారు. -
7 కోట్ల నష్టం అధికమించడం కోసం..
-
7 కోట్ల నష్టాన్ని పూడ్చుకోవడానికి 20 కోట్లకు నిప్పు!
సాక్షి, గుంటూరు : వ్యాపారంలో ఒడిదొడుకులు అతన్ని మార్చేశాయి. నష్టం నుంచి బయటపడాలనే ఆరాటం దుర్భుద్ధిని తట్టిలేపింది. బ్యాంకుల రుణం ఎగ్గొట్టాలని పథకం వేశాడు. తన నష్టాన్ని పూడ్చుకొనే క్రమంలో ఇతరుల కష్టాన్ని బూడిదపాలు చేశాడు. చివరికి కటకటాలపాలై ఊచలు లెక్కిస్తున్నాడు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం కుందూరువారిపాలెనికి చెందిన జగన్నాథం వ్యాపారి. రైతుల నుంచి పంట కొనుగోలు చేసి.. ధర పలికినప్పుడు పెద్దపెద్ద వ్యాపారస్తులకు విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో గతేడాది కూడా రైతుల నుంచి సరుకు కొనుగోలు చేశాడు. కాని సరైన ధర లేకపోవడంతో సరుకంతటిని బొప్పూడి కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచాడు. సరుకును చూపి బ్యాంకుల నుంచి ఏడు కోట్లు రుణం తీసుకున్నాడు. కాని గడువు పూర్తైనా అప్పు తీర్చకపోవడంతో బ్యాంక్ అధికారులు కొంత సరుకు వేలం వేశారు. కాలిపోయిన కోల్డ్ స్టోరేజ్ (ఇన్సెట్లో) పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి జగన్నాథం మిగతా అప్పు తీర్చాలని, లేదంటే.. మళ్లీ వేలం వేస్తామని బ్యాంకు అధికారులు హెచ్చరించడంతో దిక్కుతోచని జగన్నాధం కోల్డ్ స్టోరేజికు నిప్పు పెట్టే పథకం వేశాడు. గత నెల 14న అర్థరాత్రి కిరాయిగూండాలతో కలిసి కోల్డ్ స్టోరేజికి నిప్పుపెట్టాడు. జగన్నాధం స్వార్థపు ఆలోచన రైతుల కష్టాన్ని బూడిదపాలు చేసింది. 7 కోట్ల నష్టాన్ని పూడ్చుకోవడానికి 20 కోట్ల సరుకుకు నిప్పుపెట్టాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. రైతులకు న్యాయం చేయడానికి జగన్నాధం ఆస్తిని విక్రయించాలని నిర్ణయించారు. ఇందుకోసం లీగల్‌గా అన్ని చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఒకరి నష్టం.. మరొకరికి భారంగా మారి 20 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. వ్యాపారంలో నష్టం వస్తే దాన్ని సరైన మార్గంలో అధిగమించే మార్గం వెతకాలి కానీ.. అడ్డదారుల్లోకి వెళ్తే జీవితమే నష్టపోతుందని జగన్నాధం కథ చెబుతోంది. -
కోల్డ్ స్టోరేజ్ దగ్ధం కుట్ర బట్టబయలు
చిలకలూరిపేటరూరల్: కోల్డ్ స్టోరేజ్ దగ్ధం కేసులో నిందితులైన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చూపేందుకు రంగం సిద్ధమైంది. మండలంలోని బొప్పూడి గ్రామ శివారు, జాతీయ రహదారి సమీపంలో ఉన్న బొప్పూడి కోల్డ్ స్టోరేజ్‌లో ఈనెల 15వ తేదీన గుర్తు తెలియని దుండగులు బీ చాంబర్‌కు నిప్పుపెట్టారు. మంటలకు స్టోరేజ్‌లో రైతులు నిల్వ ఉంచుకున్న 60వేల వివిధ పంటలకు చెందిన టిక్కీలు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ. 30 కోట్ల నష్టం సంభవించింది. ఈ కేసులో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల మండలం కందూరివారిపాలెం గ్రామానికి చెందిన జగన్నాథాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి తరహాలో విచారించినట్లు తెలిసింది. ఇందులో అనంతపురం జిల్లా పెదపప్పూరు మండలం సోమనపల్లి గ్రామానికి ఒక ముఠా నాయకుడు, మరో నలుగురు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వారిని కూడా అదుపులోకి తీసుకుని ఇంటరాగేషన్ చేసినట్లు సమాచారం. అనంతరం పురం జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు క్రియాశీలకంగా వ్యహరించి పాత్రధారులుగా ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లాలోని సంచలనం కలిగించిన కేసుపై రూరల్ సర్కిల్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సీసీ ఫుటేజి సహాయంతో సంబంధిత కారు నంబర్, అనుమానితుడైన జగన్నాథాన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో జిల్లా అధికారుల సమక్షంలో నిందితుల్ని అరెస్ట్ చూపించే పనిలో రూరల్ పోలీసులు నిమగ్నమైనట్లు సమాచారం. -
కోల్డ్‌స్టోరేజిలో మళ్లీ చెలరేగిన మంటలు
-
కూరగాయలు, పండ్లు ఇక కుళ్లిపోవు!
మన దేశంలో ఆరుగాలం కష్టపడి పండించిన కూరగాయలు, పండ్లు పొలం దగ్గర నుంచి వినియోగదారులకు చేరే ముందే దెబ్బతినటం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు ప్రజల నోటికి అందేలోగా 16% మేరకు వృథా అవుతున్నాయి. వీటి విలువ రూ. 40,811 కోట్లు. తగిన ప్యాకేజింగ్, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాల్లేకపోవడమే ఇందుకు మూలకారణం. అయితే, దేశీ సాంకేతికతతో తాము ఆవిష్కరించిన ప్రత్యేక కవర్లు, సంచులను వాడుకుంటే ఇక ఈ బాధ ఉండదని మైసూరులోని ‘రక్షణ ఆహార పరిశోధన ప్రయోగశాల(డి.ఎఫ్.ఆర్.ఎల్.)’ సీనియర్ ముఖ్య శాస్త్రవేత్త డా. ఎ. రామకృష్ణ (98452 93278) చెబుతున్నారు. పర్యావరణహితమైన ఈ సరికొత్త మోడిఫైడ్ అట్మాస్ఫియర్ ప్యాకేజింగ్(మాప్) సాంకేతికతను మైసూరులోని డి.ఎఫ్.ఆర్.ఎల్. రిసెర్చ్ అప్లియన్సెస్ విభాగం అధిపతి కూడా అయిన డా. రామకృష్ణ ఆవిష్కరించారు. ఇటీవల ఒక సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా డా. రామకృష్ణ ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.రైతులు, చిల్లర వ్యాపారులతోపాటు.. వినియోగదారులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందన్న భావనతో ‘సాక్షి సాగుబడి’ ఈ కథనాన్ని అందిస్తున్నది. బ్రీతబుల్ యాక్టివ్ ప్యాకేజింగ్ అంటే..? ఆహార వృథాను అరికట్టడంతోపాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడే ఈ చక్కని సాంకేతికతను ఆవిష్కరించిన ఘనత డా. రామకృష్ణకు దక్కింది. ‘బ్రీతబుల్ యాక్టివ్ ప్యాకేజింగ్ ఫిల్మ్స్ టెక్నాలజీ’గా దీన్ని పిలుస్తున్నారు. ఇది పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన సాంకేతికత. ఈ సాంకేతికతపై ఆరు నెలల క్రితం మైసూరులోని డి.ఎఫ్.ఆర్.ఎల్. పేటెంట్ హక్కులు పొందింది. త్రివిధ దళాల ఆహార అవసరాలు తీర్చడానికి కేంద్ర రక్షణ శాఖ పరిశోధనా విభాగం పరిధిలో డి.ఎఫ్.ఆర్.ఎల్. ఏర్పాటైంది. ఆక్సిజన్, కార్బన్డయాక్సయిడ్పై నియంత్రణ ప్రత్యేకమైన దేశీ పరిజ్ఞానంతో ఈ బ్రీతబుల్ సంచులను ఎటువంటి రసాయనిక లేపనాలు వాడకుండానే రూపొందించారు. చెట్ల నుంచి కోసిన తర్వాత కూడా కూరగాయలు, పండ్లు శ్వాసిస్తూనే ఉంటాయి. ఆక్సిజన్‌ను తీసుకుంటూ కార్బన్‌డయాక్సయిడ్‌ను విడుదల చేస్తూ ఉంటాయి. ‘మాప్’ టెక్నిక్ ద్వారా రూపొందించిన ప్రత్యేకమైన ‘బ్రీతబుల్’ సంచుల ద్వారా ఈ ప్రక్రియను నియంత్రిస్తే వాటిని చాలా రోజుల వరకు చెడిపోకుండా నిల్వ చేసుకోవచ్చు. డి.ఎఫ్.ఆర్.ఎల్. శాస్త్రవేత్త దీనిపైనే పరిశోధించి తగిన సంచులను తయారు చేయడంలో సఫలీకృతులయ్యారు. ఈ సంచులలో నిల్వ చేసే కూరగాయలు, పండ్ల నుంచి వెలువడే నీటి ఆవిరి పరిమాణాన్ని బట్టి.. సంచి లోపల ఆక్సిజన్, కార్బన్డయాక్సయిడ్ల పరిమాణాన్ని తగిన రీతిలో నియంత్రించడం ద్వారా ఈ సంచులు నిల్వ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. ఒక దశలో శ్వాస క్రియ పూర్తిగా నిలిచిపోయే స్థితి ఏర్పడుతుంది. ∙ ఎన్ని రోజులు నిల్వ ఉంచవచ్చు? ఈ సంచులలో నింపిన కూరగాయలు, పండ్లను 30–40 రోజుల వరకు వడలిపోకుండా, నాణ్యత దెబ్బతినకుండా, రంగు మారకుండా నిల్వ చేసుకోవచ్చు. ఇందుకు ఎటువంటి కోల్డ్ స్టోరేజ్ అవసరం లేదు. సాధారణ గది వాతావరణంలోనే నిల్వ చేసుకోవచ్చు. ఎటువంటి రసాయనాలనూ వాడాల్సిన అవసరం లేదు. సూక్ష్మజీవులను పరిహరించే జాగ్రత్త తీసుకోవడం వల్ల ఈ సంచుల్లో పండ్లు, కూరగాయలు కుళ్లిపోవు. ఎన్ని కిలోలను నిల్వచేయొచ్చు? వంద గ్రాముల నుంచి 5 కిలోల వరకు వేర్వేరు సైజుల్లో సంచులను తయారు చేసుకుంటే తరలించడానికి బాగుంటుంది. 25 కిలోల సంచులు కూడా తయారు చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఏయే రకాల పండ్లు, కూరగాయలు నిల్వ చేయొచ్చు? అన్ని రకాల కూరగాయలు, పండ్లను నిశ్చింతగా 40 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. సంచుల తయారీకి ఖర్చెంత? ప్రతి కిలో కూరగాయలు, పండ్లను నిల్వ చేయడానికి సరిపోయే సంచి తయారు చేయడానికి ఒక రూపాయి చొప్పున ఖర్చవుతుంది. పాతిక కేజీల టమాటాలు లేదా మామిడి పండ్లు నిల్వచేసే సంచి తయారీకి రూ.25 ఖర్చవుతుంది. పర్యావరణానికి హాని కలుగుతుందా? ఈ సంచులు/కవర్లు పర్యావరణానికి హాని చేయని మోడిఫైడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌ను వాడినందు వల్ల.. సెకండరీ ప్యాకేజీ చేయనవసరం లేకుండానే ఈ సంచుల్లో నిల్వ చేసుకోవచ్చు. ఈ సంచులను ఒకసారి కొంటే మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. పాత సంచులతో మళ్లీ కొత్త సంచులను తయారు చేసుకోవచ్చు. ప్యాకేజీ పదార్థాల వృథాను, కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఈ సంచులు ఎక్కడ దొరుకుతాయి? మైసూరులోని డి.ఎఫ్.ఆర్.ఎల్. ఈ సంచుల తయారీకి అవసరమైన పూర్తి దేశీ సాంకేతికతను ఆవిష్కరించి, పేటెంట్ పొందింది. అయితే, డి.ఎఫ్.ఆర్.ఎల్. సంచులను తయారు చేసి అమ్మదు. ఈ టెక్నాలజీని విక్రయించడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వ/ ప్రైవేటు సంస్థలు/వ్యక్తులు కొనుగోలు చేసి వాణిజ్య స్థాయిలో ఈ సంచులను ఉత్పత్తి చేసి మార్కెట్లో అందుబాటులోకి తేవచ్చు. సీజన్లో ధర లేక పారబోసిన టమాటాలు (ఫైల్) ఎవర్ని సంప్రదించాలి? THE DIRECTOR Defence Food Research Laboratory, DRDO, Ministry of Defence, Govt of India Siddartha Nagar, Mysore- 570 011, Tel: 0821-2473783, Fax: 0821-2473468, E-mail: dfrlmysore@sancharnet.in డా. ఎ. రామకృష్ణ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డీఎఫ్ఆర్ఎల్, మైసూరు -
మార్కెట్లోకి చేప
పుల్కల్(అందోల్): మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వరాలు కురిపించింది. మత్స్యకారులు ఇక మీద చేపలను అమ్ముకునేందుకు మార్కెట్లలో దళారుల బెడద లేకుండా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే జిల్లాలో పలు చోట్ల ఫిష్ కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేయనుంది. వాటితోపాటు ఫిష్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన నిధులు సైతం మంజూరు చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతోపాటు దళారీల బారిన పడకుండా ఉండనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో సంగారెడ్డి మినహా ఎక్కడా ఇప్పటి వరకు చేపల మార్కెట్లు లేవు. దీంతో మత్స్యకారులు పట్టిన చేపలను సంగారెడ్డికి తరలించేందుకు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో వారు మత్స్యకారుల వద్ద తక్కువ ధరలకు కొనుగోలు చేసి మార్కెట్లో మాత్రం అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని గమనించిన ప్రభుత్వం ప్రతీ పట్టణంలోనూ ప్రత్యేకంగా ఫిష్ మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లాకు ఏడు ఫిష్ మార్కెట్లను మంజూరు చేస్తూ, వాటికి కావాల్సిన నిధులను సైతం విడుదల చేసింది. వీటిలో పటాన్చెరులో మాత్రం మోడల్ ఫిష్ మార్కెట్‌ను ఏర్పాటు చేయడం కోసం రూ. 2 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. అక్కడ స్థలాన్ని కేటాయించాల్సి ఉంది. సంగారెడ్డి పట్టణంలో రెండవ ఫిష్ మార్కెట్‌కు అవసరమైన స్థలాన్ని కేటాయించారు. సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, పటాన్చెరు, జిన్నారంతోపాటు సింగూర్‌లో ఫిష్ మార్కెట్లను ఏర్పాటు చేయడం కోసం నిధులు మంజూరు చేశారు. అందుకు ఆయా పట్టణాలలో స్థలాన్ని కేటాయించి మత్స్య శాఖ అధికారులకు ఇచ్చినట్లయితే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కోల్డ్ స్టోరేజీలతో మేలు.. ప్రధానంగా చేపలు పట్టిన వెంటనే మార్కెట్‌కు తరలించే అవకాశం లేనందున ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకారులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మార్కెట్లో కూరగాయలు తీసుకున్నట్లుగానే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేపల మార్కెట్‌కు వెళ్లి కొనుక్కునే సదుపాయం కలుగుతుంది. దీని వల్ల మత్స్యకారులకు నష్టం జరగకుండా ఉంటుంది. పట్టిన చేపలను కోల్డ్ స్టోరేజీలో భద్రపర్చి తర్వాత అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కోల్డ్ స్టోరేజీలు లేనందున మత్స్యకారులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. కోల్డ్ స్టోరేజీ ఇలా..: కోల్డ్ సోరేజీలో ఐస్, ఏసీ సౌకర్యం కలిగిన కూలింగ్ గదులు, నీటి సౌకర్యం, చేపలను నిల్వ చేసేందుకు అనువైన గదులు, విద్యుత్‌తోపాటు 230 కేవీ సామర్థ్యం కలిగిన జనరేటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అంగీకారం.. ఏ రకంగానూ మత్స్యకారులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. దీనికి తాజాగా తీసుకున్న నిర్ణయమే నిదర్శనం. రాష్ట్రంలో పాలను ఎలా అయితే కొనుగోలు చేస్తోందో అదే తరహాలో తెలంగాణ కో ఆపరేటీవ్ సొసైటీల ఆధ్వర్యంలో చేపలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను వారం, లేదా నెల చొప్పున నేరుగా మత్స్యకారుల ఖాతాలో డబ్బులు జమ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మార్కెట్‌తోపాటు ప్రభుత్వమే కొనుగోలు చేసినట్లయితే వారికి అన్ని రకాల సహకారం అందించినట్లు అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రవాణా సౌకర్యం కల్పిస్తాం మత్స్యకారులు నేరుగా చేపలను పట్టణాలకు తరలించేందుకు అవసరమైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. ఇందుకుగాను గడిచిన రెండు సంవత్సరాల్లో రూ.27 కోట్ల వ్యయంతో ఆటోలు, జీప్, మోపెడ్ వాహనాలను మత్స్యకారులకు అందించాం. వాటితోపాటు అడిగిన వారికి మోటార్ సైకిళ్లను సైతం ఇచ్చాం. ఇది కేవలం మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగమే. – సుజాత, మత్స్యశాఖ ఏడీ -
‘మిర్చి’ తరుణమొచ్చే..
ఖమ్మంవ్యవసాయం: మంచి తరుణం మించినా రాదు..అన్నట్లు ఇప్పుడు మిర్చి రైతులకు కలిసొచ్చే కాలమొచ్చింది. గతేడాది పండించిన మిర్చికి అప్పుడు క్వింటాకు రూ.4వేలు ఓ దశలో రూ.2వేలు మాత్రమే పలకడంతో..అడ్డికి అమ్ముకోలేక కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. ఈక్రమంలో ఇప్పుడు రేటు అమాంతం పెరిగి క్వింటా రూ.10వేలకు చేరింది. ప్రస్తుతం ఈఏడాది సాగు చేసిన పంట ఇంకా చేతికి రాలేదు. అయినా..పాత మిర్చికి మాత్రం రేటు బాగా పలుకుతోంది. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ పలుకుతుండడంతో..మిరప కొనుగోళ్లకు ఆదరణ పెరిగింది. విదేశాల్లో డిమాండ్.. ఇక్కడ పండించే ‘తేజా’ రకం మిర్చికి చైనా, సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో మంచి ధర పడుతోంది. అక్కడ ఈ మిర్చి నుంచి నూనె (ఆయిల్) తీసి ఆహారంగా, ఇతర అవసరాలకు, రసాయనాల్లో వినియోగిస్తుంటారని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయా దేశాల్లో తేజా మిర్చి ఆయిల్ కొరత ఏర్పడటంతో ధరకు రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయంగా మిర్చికి రేటు పెరగడంతో ఇక్కడ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన మిర్చి విక్రయాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. మరో నెల రోజుల్లో ఈ ఏడాది సాగు చేసిన మిర్చి పంట ఉత్పత్తి రానుండటంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన సరుకును వ్యాపారులు, రైతులు విక్రయించేస్తున్నారు. ఇప్పటికే 4 వేల క్వింటాళ్ల వరకు విక్రయించేశారు. ఖమ్మం, మధిర, తల్లాడ తదితర ప్రాంతాల్లో మిర్చి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఏసీ మిర్చితో పాటు, తాలు మిరప బేరం కూడా కొనసాగుతోంది. వ్యాపారులు నేరుగా కోల్డ్ స్టోరేజీలకు వెళ్లి కొంటున్నారు. ఊహించని ధర.. గతేడాది పంట సీజన్లో మిర్చికి రూ.4వేలకు మించి ధర పలకలేదు. ఓ దశలో (ఏప్రిల్ నెల) క్వింటాకు రూ.2వేలు కూడా పడలేదు. 2015–16 సంవత్సరంలో పంటకు రూ. 13 వేల వరకు కూడా ధర పలికింది. దీంతో గతేడాది మిర్చిని విస్తారంగా సాగు చేశారు. ఉత్పత్తి కూడా పెరగడంతో ధర మందగిస్తూ పూర్తిగా పడిపోయింది. కనీసం పంట కోత కూలి ఖర్చులకు కూడా రాలేదు. చేసేది లేక, భవిష్యత్‌పై ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో పెద్ద ఎత్తున నిల్వలు పెట్టారు. వాటికి ప్రస్తుతం సీజన్‌తో పోలిస్తే రెట్టింపునకు పైగా రూ.10 వేల వరకు ధర పలుకుతుండడంతో ఆనందంలో ఉన్నారు. జిల్లాలో మొత్తం 32 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఒక్కో కోల్డ్ స్టోరేజీలో 80నుంచి 1.10 లక్షల బస్తాల వరకు నిల్వ సామర్థ్యం ఉంది. జిల్లాలోని కోల్డ్ స్టోరేజీల్లో దాదాపు 32లక్షల మిర్చి బస్తాలు నిల్వ ఉండగా, ప్రస్తుతం పంటకు ధర పలుకుతుండటంతో నిల్వలు సగానికి చేరి ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇంకా 16 నుంచి 18 లక్షల బస్తాల వరకు స్టోరేజీల్లో నిల్వ ఉండి ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. దాదాపు నెల రోజుల్లో ఈ నిల్వలు మొత్తం అమ్మకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. -
వచ్చే సీజన్‌కల్లా మిర్చి కోల్డ్ స్టోరేజ్‌లు
► మార్కెట్ యార్డుల్లో ఏర్పాటుకు మంత్రి హరీశ్ ఆదేశం ► ఖరీఫ్ దిగుబడులపై మార్కెట్ కార్యాచరణ ప్రణాళిక ► మార్కెటింగ్ శాఖ పనితీరుపై సుదీర్ఘ సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాబోయే మిర్చి సీజన్ కల్లా మార్కెట్ యార్డుల్లో కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణం పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశిం చారు. వచ్చే ఖరీఫ్ పంట దిగుబడులపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఆ శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగ ళవారం ఈ–నామ్, గోదాముల నిర్మాణం, రైతుబజార్లు, కోల్డ్ స్టోరేజ్‌లు, మన కూర గాయల పథకం వంటి అంశాలపై 4 గంట లకుపైగా సమీక్షించారు. హరీశ్‌రావు మాట్లా డుతూ ఏయే నెలల్లో పంటలు తగ్గి ఇరుగు పొరుగు రాష్ట్రాల దిగుమతులపై ఆధారపడి ధరలు పెరుగుతున్నాయో సమగ్ర అధ్యయ నం చేయాలని అధికారులను ఆదేశించారు. దిగుమతుల వల్ల ధరలు పెరిగి వినియోగదా రులకు ఇబ్బందులు వస్తున్నందున నిరంతర సమీక్ష అవసరమన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలు, పండ్ల దిగుమతిపై ఆధారపడకుండా పకడ్బం దీగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి కోరారు. ఈ మేరకు త్వరలో జిల్లా ఉద్యాన, మార్కెటింగ్, రైతు బజార్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట దగ్గరున్న వెనికతల గ్రామాన్ని సందర్శించి ఉల్లిగడ్డలు పండించే విధానం, వాటిని నిల్వ చేస్తున్న పద్ధతులపై అధ్యయనం చేయాలని కోరారు. మార్కెటింగ్ అధికారులు సృజనాత్మక విధానాలు ప్రవేశపెట్టే దిశగా ప్రయ త్నాలు చేయాలని ఆదేశించారు. మూడేళ్లుగా 18.55 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 355 గోడౌన్లు నిర్మిస్తున్నామని, వీటిల్లో 300 గోదాముల నిర్మాణం పూర్తయిందని చెప్పా రు. ఈ సారి పత్తి దిగుబడి పెరిగే అంచనాలు ఉన్నందున వాటి కొనుగోలుకు సంబంధించి మార్కెటింగ్ యంత్రాంగం సిద్ధంగా ఉండాల న్నారు. హుస్నాబాద్, ఆసిఫాబాద్, భైంసా పట్టణాల్లో కొత్తగా రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
ఫిషింగ్ హార్బర్లో కోల్డ్ స్టోరేజ్ సమస్య
-
కోల్డ్ స్టోరేజీలో అమ్మోనియా గ్యాస్ లీక్..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోల్డ్ స్టోరేజీలో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడం కలకలం రేపింది. ఫతేపూర్ జిల్లాలోని జహనాబాద్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అమ్మోనియా గ్యాస్ లీక్ అయిన కోల్డ్ స్టోరేజీ నుంచి 42 మంది కార్మికులను తరలించినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. కోల్డ్ స్టోరేజీ పరిధిలో 2 కిలోమీటర్ల వరకు రాకపోకలను నిలిపివేశారు. ఘటన జరిగిన సమీపంలో ఎలాంటి గ్రామాలు లేవని అధికారులు తెలిపారు. అమ్మోనియా గ్యాస్‌ను పీల్చడం ద్వారా ముక్కు, శ్వాసనాళాల్లో తీవ్రమైన మంట వస్తుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని సర్కిల్ ఆఫీసర్ రవింద్ర వర్మ వెల్లడించారు. మెడికల్ బృందాలను ఆ ప్రాంతానికి పంపినట్లు వెల్లడించారు. గ్యాస్ తీవ్రత తగ్గేవరకు మాస్క్‌లు ధరించాలని ప్రజలకు సూచించారు. -
రైతు కంట్లో కారం
► వారం కిందటితో పోల్చితే మిర్చి ధర 25% వరకు తగ్గించిన వ్యాపారులు ► వరంగల్ ఎనుమాముల మార్కెట్‌యార్డులో రైతుల ఆందోళన ► మిర్చి బస్తాలు దహనం చేసి నిరసన.. గేట్లకు తాళం వేసి ధర్నా ► ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ నినాదాలు.. కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు డిమాండ్ ► వారం కిందటా రైతుల ఆందోళన.. అయినా పట్టించుకోని మార్కెట్ పాలకవర్గం వరంగల్ సిటీ వ్యాపారుల తెంపరితనం, మార్కెట్‌యార్డు పాలకమండళ్ల ‘సహకారం’తో మిర్చి రైతుల కంట్లో మంట పుట్టిస్తోంది. కష్టపడి పండించి మార్కెట్‌కు తీసుకువస్తే తగిన ధర అందక రైతులు ఆవేదనకు లోనవుతున్నారు. అటు పంటను అమ్ముకోలేక.. ఇటు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు లేక అవస్థలు పడుతున్నారు. చివరికి తాము పండించిన పంటనే తగలబెట్టేందుకూ సిద్ధమవుతున్నారు. వ్యాపారులు మిర్చి ధర తగ్గించి మోసం చేస్తున్నారంటూ గురువారం వరంగల్ అర్బన్ జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చిని దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారులు కావాలనే ధర తగ్గిస్తున్నారని, అయినా పాలకవర్గం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మార్కెట్ ప్రధాన గేట్లకు తాళం వేసి, ధర్నా చేశారు. మిర్చి ధర తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదే మార్కెట్‌యార్డులో వారం కింద కూడా రైతులు మిర్చిని దహనం చేయడం గమనార్హం. ధరలు తగ్గించిన వ్యాపారులు ఉగాది పండుగ నేపథ్యంలో ఐదు రోజుల సెలవుల అనంతరం ఏనుమాముల మార్కెట్ గురువారం తిరిగి ప్రారంభమైంది. రైతులు సుమారు 50 వేల బస్తాలకుపైగా మిర్చిని అమ్మకానికి తీసుకువచ్చారు. కానీ వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేశారు. దేశీ రకం మిర్చి వారం క్రితం క్వింటాల్‌కు రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకగా.. గురువారం రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకే పలికింది. సింగిల్‌పట్టీ రకం ధరను రూ.16 వేల నుంచి రూ.14 వేలకు తగ్గించారు. తేజా రకం మిర్చి అయితే వారం కింద రూ.6 వేలు పలకగా.. దాదాపు సగానికి తగ్గించి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకే కొనుగోలు చేశారు. మిగతా సాధారణ రకం మిర్చి ధరనూ తగ్గించారు. వారం క్రితం రూ.7,500 పలికిన సాధారణ రకం మిర్చి.. గురువారం గరిష్టంగా రూ.5 వేలు మాత్రమే పలికింది. అసలు గత సంవత్సరం అన్ని రకాల మిర్చి కూడా క్వింటాల్‌కు రూ.12 వేలకు పైనే పలికింది. నాణ్యమైన రకాలైతే రూ.18 వేల వరకు ధర రావడం గమనార్హం. ఆవేదనతో ఆందోళన మిర్చి ధరలు తగ్గించడంతో రైతుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. వ్యాపారులు కావాలనే ధర తగ్గిస్తున్నా పాలకవర్గం పట్టించుకోవడం లేదంటూ వారు ఆందోళనకు దిగారు. మార్కెట్ కార్యాలయం వద్దకు చేరుకుని చైర్మన్ బయటకు రావాలని నినాదాలు చేశారు. ఒక మిర్చి బస్తాను మార్కెట్ దారిలో వేసి దహనం చేసి నిరసన తెలిపారు. మార్కెట్ ప్రధాన గేట్లకు తాళం వేసి ధర్నాకు దిగారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు.. మార్కెట్ వద్దకు చేరుకుని, బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళన విరమించాలంటూ రైతులను శాంతిపజేశారు. ఏసీ గోదాములు నిర్మించాలి మంత్రి హరీశ్‌రావుకు చిత్తశుద్ధి ఉంటే అక్కరకు రాని గోదాములు కాకుండా.. మిర్చి ధర తక్కువగా ఉన్నప్పుడు నిల్వ చేసుకునేలా ఏసీ గోదాములు (కోల్డ్ స్టోరేజీలు) నిర్మించాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం మార్కెట్లో మిర్చి ధరలు సగానికి సగం పడిపోయాయని... నిల్వ చేసుకుందామంటే కోల్డ్ స్టోరేజీల సదుపాయం లేదని మండిపడ్డారు. ప్రైవేట్ కోల్డ్ స్టోరేజీలు కేవలం వ్యాపారులకే అవకాశం ఇస్తుండడంతో రైతులకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. దాంతో అటు పంటను అమ్ముకోలేక, ఇటు దాచుకునే సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నామని.. తమకు ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సాయంత్రానికి ఏనుమాముల మార్కెట్లో రైతుల ఆందోళన తగ్గినా.. మార్కెట్ నిండా అమ్మకానికి వచ్చిన మిర్చి బస్తాలు, వాటి వద్ద కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తూ కూర్చున్న రైతులు కనిపించారు. కొందరు రైతులు మాత్రం తక్కువ ధరకే మిర్చిని అమ్ముకుని వెళ్లిపోయారు. – గతేడాది సాధారణ రకాల మిర్చి క్వింటాల్‌కు రూ.12వేలకు పైనే పలికింది. నాణ్యమైన రకాలకు రూ.18 వేల వరకు ధర వచ్చింది. ‘నామ్’తో నష్టపోతున్నాం: పసుపు రైతులు ఏనుమాముల మార్కెట్ పసుపు యార్డులో ప్రవేశపెట్టిన నామ్ (జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం)తో నష్టపోతున్నామని వ్యాపారులు, అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. కళ్లకు గంతలు కట్టి బేరం చేయడాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం పలువురు రైతులు మార్కెట్‌కు పసుపు పంటను తీసుకొచ్చారు. అయితే ‘నామ్’లో భాగంగా సీక్రెట్ బిడ్డింగ్‌తో తాము నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మేలు రకం (కాడి) కంటే నాసిరకం (గోల) పసుపుకే ఎక్కువ ధర కోట్ చేస్తున్నారని.. తల్లి, పిల్ల పసుపునకు ఒకే ధర పలికితే నామ్‌తో ఏం లాభమని నిలదీశారు. కళ్ల ముందు సరుకు చూస్తూ నాణ్యత ప్రకారం కొనుగోలు చేసే ఓపెన్ టెండర్ విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీంతో రైతులకు మంచి ధర రావాలనే ప్రభుత్వం ‘నామ్’ను అమలు చేస్తోందని మార్కెట్ చైర్మన్ కొంపెల్లి ధర్మరాజు వివరించగా.. రైతులు అంగీకరించలేదు. ‘నామ్’అమలు చేయాలనుకుంటే మార్కెట్ యార్డులో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి.. దేశంలోని ఏయే మార్కెట్లో పసుపు ధర ఎంత పలికిందో తెలియజేయాలని డిమాండ్ చేశారు. -
కోల్ట్ స్టోరేజ్‌లో రైతు మృతి
- రెండు రోజుల తర్వాత గుర్తింపు కోడుమూరు: ప్యాలకుర్తి సమీపంలోని కోల్డ్‌స్టోరేజ్ ప్రమాదవశాత్తు ఓ మృతి చెందాడు. హాలహర్వి మండలం చింతకుంటకు చెందిన పుండుకూర రామయ్య(55)కు సంబంధించిన 233 మిరప సంచులను ప్యాలకుర్తి కోల్డ్‌స్టోరేజిలో నిల్వ చేసేందుకు ఈ నెల 28వ తేదీ తన కుమారుడు వెంకటేష్‌తో కలిసి వచ్చాడు. గోదాములోని 5వ అంతస్తులో నిల్వచేశారు. ఆ సమయంలో మిరప ఘాటుకు తట్టుకోలేక రామయ్య కిందకు వెళుతున్నానంటూ అక్కడి నుంచి వచ్చేశాడు. 5వ అంతస్తు నుంచి కిందకు వస్తున్న సమయంలో లిప్ట్ కోసం ఏర్పాటు చేసిన మార్గాన్ని చీకట్లో గుర్తించకపోవడంతో ప్రమాదవశాత్తు అందులో పడి తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మరణించాడు. అయితే ఈ విషయాన్ని ఎవరూ గమనించలేకపోయారు. కొద్ది సేపు తర్వాత గోదాము నుంచి బయటకు వచ్చిన కొడుకు వెంకటేశ్ తండ్రి కోసం కనిపించకపోవడంతో తనకు చెప్పకుండానే ఊరికి వెళ్లిపోయాడని అతను కూడా స్వగ్రామానికి వెళ్లాడు. అక్కడ కూడా తండ్రి లేకపోవడంతో మరుసటిరోజు కూడా ఇతర ప్రాంతాల్లో వెతుకుతూ ఆచూకీ తెలియలేదు. అనుమానంతో గురువారం ప్యాలకుర్తి కోల్ట్‌స్టోరేజిలో గాలించాడు. తీవ్ర రక్తపు మడుగులో చనిపోయిన తండ్రి శవాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. కోల్డ్ స్టోరేజ్ యజమానులపై బాధితుల ఫిర్యాదు కోల్ట్‌స్టోరేజ్‌లో విద్యుత్ లైట్లు, లిఫ్ట్‌కు కనీసం భద్రతా సౌకర్యాలేకపోవంతో యజమాని నిర్లక్ష్యం వల్లనే తండ్రి చనిపోయాడని మృతుడు కుమారుడు వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని చింతకుంట గ్రామానికి తీసుకెళ్లారు. కోల్డ్‌స్టోరేజి యజమాని, మేనేజర్ మధుసూదన్, ఇన్చార్జి చంద్రలపై మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కోల్డ్‌స్టోరేజి యజమాని టీడీపీ ప్రధాన నాయకుడికి సన్నిహితం కావడంతో కేసు నమోదు కాకుండా ఉండేందుకు తీవ్రమైన ఒత్తిడికి తీసుకొచ్చినప్పటికీ బాధితులు ఒప్పుకోకుండా కేసునమోదు చేయించారు. కోల్డ్‌స్టోరేజి యజమాని పరారీలో ఉన్నాడు. -
పరారీలో బినామీ రైతులు
ధర్మవరం కోల్డు స్టోరేజీ వ్యవహారం ప్రత్తిపాడు : ధర్మవరంలో సాయిభ్య అగ్రి కోల్డ్‌స్టోరేజీ రుణాల కేసులో బినామీలు పరారయ్యారు. స్టోరేజీ యజమాని కె.వెంకటసత్య ప్రసాద్, 111 మంది రైతుల పేర తప్పుడు దృవీకరణ పత్రాలతో సుమారు రూ.28 కోట్లకు కాకినాడలోని దేనా బ్యాంకుకు టోకరా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు పోలీసులు గ్రామం లోకి వస్తున్నార్న విషయం తెలుసుకున్న రైతులు పరారయ్యారు. తాము రుణాలు తీసుకోలేదని, సంతకాలు పెట్టమంటే పెట్టామని, పోలీసులకు చిక్కితే అరెస్టు చేస్తారన్న భయంతో గ్రామం విడిచి వెళ్లినట్టు తెలుస్తోంది. బ్యాంకు జాబితాలో ఉన్నవారు రైతులు కాదని రైతు కూలీలని తెలుస్తోంది. టోకరా ఇచ్చింది ఇలా.. కోల్డ్ స్టోరేజీలో ఉన్న సరుకు నిల్వపై యజమాని ఇచ్చిన ధ్రువీకరణ పత్రం చూపితే రూ.25 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న యజమాని ముందు వరుసలో ఉత్ప త్తులను ఉంచి వెనుక వరుసలో ఉన్న పెట్టెలు ఖాళీవి పెట్టి అధికారులకు మస్కా కొట్టినట్టు తెలుస్తున్నది. స్టోరేజీ యజమాని ఇచ్చిన తప్పుడు ధ్రువీకరణ పత్రంతో పాటు రైతు ఆధార్ కార్డు, రేష¯ŒSకార్డు, 2 ఫొటోలతో బినామీదారులను కాకినాడ దేవా బ్యాంకుకు తీసుకువెళ్లి యాజమానే రు ణం మంజూరు చేయించేవారు. ఇలా 2013 నుంచి ఇలాగే రుణాలు పొంది 2015–16 నుంచి బకాయి చెల్లించకపోవడంతో ఈ టోకరా బయటపడింది. బినామీకి ముట్టింది రూ. 2 వేలేనట కోల్డు స్టోరేజీ యాజమాని బినామీ రైతులకు చెల్లించింది రూ 2 వేలేనని, వ్యవసాయ కూలీలు, తన స్టోరేజీలో పనిచేసే వారి నుంచి ఆధార్‌కార్డు, రేష¯ŒSకార్డు, ఫొటోలతో వారిని కాకినాడ దేనా బ్యాంకు తీసుకువెళ్లి, రుణం మంజూరు చేయించేవారట. రుణం పొందిన సొమ్ముంతా స్టోరేజి యజమాని తీసుకుని, బినామీలకు ఆరోజు కాకినాడలో భోజన తదితర ఏర్పాట్లు చేసి, తిరుగు ప్రయాణంలో రూ. 2వేలు చేతిలో పెట్టి సాగనంపేవారని బినామీల బంధువులు చెబుతున్నారు. -
ఉత్తుత్తి ఉత్పత్తులతో రూ.28 కోట్లు స్వాహా
కాకినాడ దేనా బ్యాంక్‌లో భారీ కుంభకోణం ధర్మవరం ఆగ్రో కోల్డ్‌స్టోరేజీ తనిఖీలో బయటపడిన వైనం పరారీలో కోల్డు స్టోరేజీ యజమాని ప్రత్తిపాడు : కోల్డ్ స్టోరేజీలో ఖాళీ పెట్టెలను వ్యవసాయ ఉత్పత్తులుగా చూపి మాయ చేసి, కోట్లు కొట్టేసిన ఘరానా దోపిడి ఇది. రైతులను నిలువునా ముంచి, వారి పేరనే రూ.కోట్లు నొక్కేసిన కోల్డు స్టోరేజీ యజమాని మాయాజాలమిది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రూ.28 కోట్లు స్వాహాచేసినట్టు బ్యాంకు అధికారుల తనిఖీలో వెల్లడైంది. ధర్మవరం గ్రామంలో జాతీయ రహదారిని చేర్చి 20 ఏళ్ల క్రితం సాయిభ్య ఆగ్రో కోల్డ్ స్టోరేజీని కంచుస్తంభం వెంకట సత్య ప్రసాద్ నెలకొల్పారు. ఈ స్టోరేజీ లో రైతులు చింతపండు, మిర్చి, మామిడి రసం, పత్తి విత్తనాలు, బెల్లం తదితర వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడం, గిట్టుబాటు ధర వచ్చినపుడు విక్రయించడం జరుగుతోంది. స్టోరేజీలో ఉన్న సరుకులపై బ్యాంకుల నుంచి రైతులు రుణాలు పొందడం సహజమే. ఇదే తరహాలో కోల్డు స్టోరేజీలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను చూపి, రైతులు కాకినాడ దేనాబ్యాంకు నుంచి రుణాలు పొందారు. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, గొల్లప్రోలు, ఏలేశ్వరం, అయినవిల్లి, పిఠాపురం, కాకినాడ, తాళ్లరేవు, కిర్లంపూడి తదితర మండలాలతో పాటు విశాఖ, ఖమ్మం జిల్లాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 111 మంది రైతులు కాకినాడ దేనా బ్యాంకు నుంచి రుణాలు పొందారు. 2013–14, 2014–15లతో పొందిన రుణాల చెల్లింపు సక్రమంగా జరగడంతో బ్యాంకు అధికారులు 2015–16లో రూ. 27,57,55,000 రుణాలు అందించారు. అయితే రుణాన్ని తిరిగి చెల్లించడంలో తీవ్ర జాప్యం జరగడంతో బ్యాంకు అధికారులు సాయిభ్య ఆగ్రో కోల్డు స్టోరేజీలో తనిఖీలు చేపట్టగా వ్యవసాయ ఉత్పత్తులు ఉండాల్సిన చెక్కపెట్టెలో వేరుశెనగ తొక్కలు, చెక్కపొట్టు గమనించి అధికారులు నిర్ఘాంతపోయారు. దీంతో దేనా బ్యాంకు మేనేజర్ ఎ¯ŒS.నరసింహ ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రుణగ్రహీతల్లో బినామీలే అధికం కోల్డ్ స్టోరేజీలో వ్యవసాయ ఉత్పత్తులపై రుణాలు పొందిన వారిలో బినామీలే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. కార్మికులను సైతం రైతులుగా చూపి, సాయిభ్య ఆగ్రో స్టోరేజీ యజమాని వెంకట సత్యప్రసాద్ బ్యాంకు నుంచి రుణాలు పొందినట్టు తెలుస్తోంది. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంతోనే బ్యాంకు అధికారులు తీరు కూడా సొమ్ము స్వాహాకు దోహదపడింది. కోల్డు స్టోరేజీలో ఉన్న చింతపండు, మిర్చి, తాండ్ర, పత్తి విత్తనాలు తదితర ఉత్పత్తులను కనీసం పరిశీలించకుండానే రుణం మంజూరు చేసినట్టు తెలుస్తోంది. దీన్నే సాకుగా తీసుకుని వెంకట సత్యప్రసాద్ చెక్క పొట్టు, వేరుశెనగ తొక్కలతో చెక్కపెట్టెలను నింపి, స్టోరేజీలో భద్రపరిచారు. లోతుగా దర్యాప్తు : సీఐ శ్రీనివాసరావు ధర్మవరం సాయిభ్య ఆగ్రో కోల్డు స్టోరేజీ యాజమాని కంచుస్తంభం వెంకట సత్య ప్రసాద్‌తో పాటు 111 మంది రైతులపై కేసు నమోదు చేసినట్టు ప్రత్తిపాడు సీఐ అద్దంకి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ బ్యాంకును మోసం చేసి, రుణం పొందినట్లు అందిన ఫిర్యాదుపై లోతుగా దర్యాప్తు చేపడతామన్నారు. కోల్డ్ స్టోరేజీని సీజ్ చేశామన్నారు. -
నిబంధనలు పాటించకపోతే బ్లాక్‌లిస్ట్
కోల్డ్ స్టోరేజీ యజమానులకు మార్కెటింగ్‌శాఖ కమిషనర్ హెచ్చరిక గుంటూరు (కొరిటెపాడు): అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని కోల్డ్‌స్టోరేజీలను బ్లాక్‌లిస్టులో పెట్టి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కమిషనర్ పి.మల్లికార్జునరావు స్పష్టం చేశారు. స్థానిక చుట్టుగుంటలోని మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ జిల్లాలో ఐదేళ్ల వ్యవధిలో ఏడు శీతల గిడ్డంగుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి రూ.150 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. కోల్డ్‌స్టోరేజీలపై నియంత్రణ లేదనే అపోహ వుందని, దానిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. కోల్డ్‌స్టోరేజీలకు ప్రత్యేక లైసెన్సు విధానం తీసుకురావడానికి కొలతలు తయారు చేయాలని సూచించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, ఫైర్, విద్యుత్, పరిశ్రమల శాఖల అధికారుల నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ)లు క్రోడీకరించి ప్రతి ఏడాది లైసెన్సును రెన్యువల్ చేసేలా చూస్తామని, ఈ మూడు కంటిన్యుటీ లేకపోతే స్టోరేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్సు ధ్రువీకరణ పత్రానికి రాకపోతే బ్లాక్‌లిస్టులో పెడ్తామన్నారు. ప్రమాదాల నివారణకు పూర్తి కొలతలతో ప్రొఫార్మాను తయారు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన శనివారం మధ్మాహ్నం 12 గంటలకు కోల్డ్‌స్టోరేజీల్లో ప్రమాదాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం జరుగుతుందని తెలిపారు. గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ప్రమాదాలను నివారించడానికి సీసీ కెమెరాలు, కార్బన్డైఆకై ్సడ్(నిప్పును ఆర్పేది), డ్రై స్ప్రింక్లర్స్ ఏర్పాటు, లక్ష లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేయాలని సూచించారు. -
కోల్డ్ స్టోరేజిలో మళ్లీ మంటలు
-
కోల్డ్ స్టోరేజిలో అగ్నిప్రమాదం
-
కలవరం..
* కోల్డ్‌స్టోరేజి దగ్ధంతో ఆందోళన * ఎవరికి ఎంత నష్టమో తెలియక రోజంతా పడిగాపులు * 17 నుంచి 20 వేల టిక్కీలు దగ్ధమయ్యాయని ప్రా«థమిక అంచానా * సమీక్షించిన కలెక్టర్..విచారణ జరుపుతామని వెల్లడి గుంటూరు రూరల్: కోల్డ్‌స్టోరేజి దగ్ధమవుతోందన్న విషయం తెలిసిన లాలుపురం పంచాయతీ సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ మిర్చి నిల్వలు ఏమయ్యాయో అనుకుంటూ పరుగుపరుగున సంఘటన స్థలానికి చేరుకున్నారు. తమ టిక్కీలు ఎక్కడున్నాయో...ఎలా ఉన్నాయో..ఎవరిని అడగాలో తెలియక ఉదయం నుంచీ అక్కడే దిగాలుగా ఉండిపోయారు. ధరకోసం మిర్చిని కోల్డ్‌స్టోరేజిలో నిల్వచేస్తే ప్రమాదం ముంచుకొచ్చిందని, తక్కువ ధరకు అమ్ముకున్నా కొంతైనా ఇబ్బందులు తొలగేవని, ఇప్పుడు ఏం జరుగుతుందోనని పలువురు రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీనంగా ఒకరికొకరు గోడు చెప్పుకుంటూ కనిపించారు. గుంటూరు రూరల్ మండలం లాలుపురం పంచాయతీలోగల లక్ష్మిలావణ్య కోల్డ్ స్టోరేజి సోమవారం ఉదయం అగ్నిప్రమాదానికి గురికావడంతో అక్కడ కనిపించిన పరిస్థితి ఇది. ఏం జరిగింది... సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో కోల్డ్‌స్టోరేజిలో పనిచేసే సిబ్బంది యార్డులో అమ్మకాల కోసం మొదటగా బీ ఛాంబర్లో శాంపిల్స్‌ను తీశారని, అనంతరం ఏ ఛాంబర్లో శాంపిల్స్‌ను తీసేందుకు ప్రయత్నించగా విపరీతమైన కోరు వస్తుండటంతో గుమ్మస్తాలు బయటకు వచ్చి ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని తెలిపారని కోల్డ్‌స్టోరేజి యజమానులు ఆతుకూరి సాంబశివరావు, సత్యనారాయణ తెలిపారు. దీంతో విషయాన్ని పోలీసులు, ఫైర్ సిబ్బందికి తెలియపరచగా హుటాహుటీన అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ఏ ఛాంబర్లోని 17 నుంచి 20వేల టిక్కీలకు పైగా దగ్ధమయ్యాయని, రూ 10 కోట్లకు పైగా నష్టం జరిగి ఉంటుందని అధికారుల ప్రాథమిక అంచనా. పోలీసులు జోక్యం చేసుకుని బీ ఛాంబర్‌ను బద్దలు కొట్టించి అందులోని 90 శాతం పైగా టిక్కీలను బయటకు తీశారు. ఏ, బీ చాంబర్లలో మొత్తం మీద 40 వేల టిక్కీలవరకూ మిర్చి నిల్వలున్నాయని మరో 100 టిక్కీలు కారం న్విలున్నట్లు ఏసీ యజమానులు తెలిపారు. 9 ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నాలు ఒక పక్క మిర్చి ఘాటు, దీనికి తోడు మంటలు దీంతో కోల్డ్ స్టోరేజ్ వద్ద ప్రజలు నిలబడేందుకు వీలు లేకుండా పోయింది. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మంటలు విపరీతంగా పెరిగి పోవటంతో ఫైర్ ఆఫీసర్ జిలాని ఆద్వర్యంలో 9 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. ఉదయం ఆరు గంటలనుంచి రాత్రి ఏడు గంటలవరకూ మంటలు అదుపులోకి రాకపోవటం, చీకటి పడటంతో చేసేదిలేక ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు నిలిపి వేశారు. మళ్లీ ఉదయం ఏ ఛాంబర్‌ను పగులగొట్టి పరిస్థితిని పరిశీలించనున్నారు. విచారణ చేపడతాం: కలెక్టర్ కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం పరిసరాల్లో ఫైర్ నిబంధనలు పాటించక పోవటంతో ఘటన జరిగి ఉంటుందని, దీనిపై సమగ్ర విచారణ చేయనున్నామని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. ఘటన విషయం తెలుసుకున్న కలెక్టర్ హుటాహుటీన కోల్డ్‌స్టోరేజి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వీలైనంత త్వరగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాలని ఫైర్ సిబ్బందిని ఆదేశించారు. ఫైర్ నిబంధనలు పాటించని కోల్డ్ స్టోరేజ్‌లను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోనున్నామన్నారు. అనంతరం సంఘటనా స్థలానికి మిర్చి యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు చేరుకుని పరిశీలించారు. రికార్డుల స్వాధీనం.. స్టాక్ తాలూకు రికార్డులు, బిల్లులు తదితర పుస్తకాలను స్టోరేజ్ యజమానుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రాత్రి సమయంలో స్టోరేజ్‌లో విధుల్లో ఉన్న సిబ్బంది, గుమ్మస్తాలు, ముఠా సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. సంఘటన ఏలా జరిగింది.. విద్యుత్ ప్రమాదమేనా మరేదైనా కారణాలున్నాయా అనే కోణాల్లో సైతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. పోలీసుల జోక్యంతో కొంత సేఫ్.. కోల్డ్ స్టోరేజ్ దగ్ధమవుతుండటంతో అడిషనల్ ఎస్పీ సుబ్బారాయుడు, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కే. శ్రీనివాసరావు జోక్యం చేసుకుని బీ ఛాంబర్‌ను పోక్లెయిన్ల సహాయంతో అప్పటికప్పుడు పగుల గొట్టించారు. మంటలు బీ చాంబర్లోకి వ్యాపించక ముందే కొంతైనా నష్టాన్ని నివారించాలని పోలీసులు చేసిన ప్రయత్నాలు చివరికి సఫలమయ్యాయి. బీ చాంబర్‌లోని 90 శాతంకు పైగా మిర్చి, కారం టిక్కీలను బయటకు తెచ్చి పక్కనే ఖాళీగా ఉన్న గోడౌన్లో నిల్వచేసి పటిష్ట బందోబస్తును చేశారు. పోలీసులు చొరవతో కొంత నష్టాన్ని కాపాడారని స్థానిక రైతులు, ప్రజలు అభినందించారు. -
కోల్డ్ స్టోరేజిలో అగ్నిప్రమాదం
- 8 వేల క్వింటాళ్ల మిర్చి దగ్ధం - నష్టం అంచనా రూ.10 కోట్లు సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా లాల్పురం పంచాయతీ పరిధిలోని లక్ష్మీలావణ్య కోల్డ్ స్టోరేజిలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఏ-బ్లాక్‌లో అగ్నిప్రమాదం సంభవించిదని, దాదాపు 8వేల క్వింటాళ్ల మిర్చి కాలిపోయినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ నష్టం రూ.10 కోట్ల వరకు ఉంటుందంటున్నారు. తెల్లవారు జామున ఉదయం 5 గంటలకు మిర్చి శాంపిల్స్ తీసేందుకు వెళ్లిన కూలీలు కోల్డ్ స్టోరేజీలో మంటలను గమనించి ఫైర్ అధికారులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన ఫైర్ అధికారులు బి-బ్లాక్ గోడలను జేసీబీతో పడగొట్టి ఏ-బ్లాక్‌లోని మిర్చిని బయటకు తీసుకొచ్చారు. కోల్డ్ స్టోరేజిలో రైతులు, వ్యాపారులకు సంబంధించిన సరుకు ఉన్నట్లు తెలిసింది. ఈ కోల్డ్ స్టోరేజ్ ప్రమాణాలు సరిగా పాటించకపోవడమే ప్రమాదానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని కలెక్టర్ కాంతిలాల్ దండే, మార్కెటింగ్ ఏడీ వరలక్ష్మి, మిర్చి యార్డు సెక్రటరీ దివాకర్, గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు పరిశీలించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తొమ్మిది ఫైర్ ఇంజన్లను వినియోగించామని జిల్లా ఫైర్ అధికారి జిలాని తెలిపారు. కోల్డ్ స్టోరేజిలో మిర్చితోపాటు, కొద్దిమేర శనగలు, జొన్నలు కూడా ఉన్నట్లు సమాచారం. -
మొబైల్ రైతు బజార్ల కోసం ప్రత్యేక టీంలు
– మార్కెట్‌యార్డుల్లో శీతల గోదాములు – సీఈఓ రమణమూర్తి వెల్లడి – టెక్కె మార్కెట్లోని రైతు బజార్ పరిశీలన నంద్యాలరూరల్: రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ రైతుబజార్లను ఏర్పాటు చేసి వినియోగదారులకు తాజా కూరగాయలు, పండ్లు అందించేందుకు చర్యలు చేపట్టామని రైతుబజార్ల రాష్ట్ర సీఈఓ రమణమూర్తి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక టీంలను ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నంద్యాల టెక్కె మార్కెట్ యార్డులోని రైతుబజార్–2ను మంగళవారం ఆయన పరిశీలించారు. అమరావతిని పైలెట్‌ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇంటింటికి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు మొబైల్ రైతుబజార్ల ద్వారా అందించనున్నామని చెప్పారు. ఈ ప్రక్రియను రాష్ట్రంలోని 13జిల్లాల్లో త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. రైతులు కూడా రసాయన ఎరువులు, పురుగు మందులు కాకుండా సేంద్రియ ఎరువులతో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉత్పత్తి చేసి రైతుబజార్లకు విక్రయించుకోవాలని సూచించారు. రైతుల పంటను నేరుగా పొలాల వద్ద నుండి మొబైల్ రైతుబజార్ల ద్వారా కొనుగోలు చేసి వినియోగదారులకు తాజాగా తక్కువ ధరకు అందిస్తామని తెలిపారు. మార్కెట్‌యార్డుల్లో కూరగాయలు, పండ్లు నిల్వ చేసుకునేందుకు వీలుగా శీతల శీతల గోదాములు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన వెంట ఏడీఎం సత్యనారాయణచౌదరి, నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు సెక్రటరీ బాల వెంకటరెడ్డి, అధ్యక్షులు శివరాం తదితరులు పాల్గొన్నారు. -
రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం
రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ టౌన్: రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని నిర్మల్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతన చైర్మన్ దేవేందర్‌రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతులకు సాగునీరు అందించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. పెండింగ్‌లో ఉన్నప్రాజెక్టులన్నింటినీ సత్వరమే పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దేవాదాయశాఖలో ఉన్న నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చినప్పుడే అమ్ముకోవడానికి వీలుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగానే గోదాంలను నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే రూ.కోటి నిధులతో నిర్మల్‌లో కోల్డ్‌స్టోరేజీ పనులను ప్రారంభించనట్లు తెలిపారు. నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం మరిన్ని విద్యుత్సబ్స్టేషన్లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు పూర్తయితే నిర్మల్‌లో 50వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పట్టణప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా స్వర్ణనది నీటిని ఎస్సారెస్పీకి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే స్వర్ణనదిపై 12చెక్ డ్యాంల నిర్మాణపనులు ప్రారంభించనట్లు తెలిపారు. రానున్నరోజుల్లో రైతు సంక్షేమంకోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తుందన్నారు. అనంతరం దేవేందర్‌రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. రైతులకు అన్ని రకాల సహాయసహకారాలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో ఆర్డీవో శివలింగయ్య, మున్సిపల్ చైర్మన్ అప్పాలగణేశ్, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు రామేశ్వర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, నాయకులు సత్యనారాయణగౌడ్, గౌతంరెడ్డి, తహసీల్దార్ జాడి రాజేశ్వర్, కమిషనర్ త్రియంబకేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు. -
శీతల గిడ్డంగిలో ఘోర అగ్నిప్రమాదం
షార్ట్‌సర్క్యూట్ వల్లే అంటున్న అధికారులు రూ.12 కోట్ల విలువైన ఐటీసీ మిర్చి నిల్వలు దగ్ధం రైతులకు చెందిన మరో రూ.2 కోట్ల విలువైన మిర్చి కాలి బూడిద యడ్లపాడు : శీతలగిడ్డంగిలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ఎర్రకొండ వద్ద ఉన్న సీఆర్ కోల్డ్ స్టోరేజ్‌లో ఏసీ విభాగానికి చెందిన విద్యుత్ వైర్లులో షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఉదయం వరకు దట్టంగా పొగలు మాత్రమే కనిపించగా సాయంత్రం 6 గంటలకు ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఉదయం 8.10 గంటల సమయంలో కోల్డ్‌స్టోరేజ్ పైభాగంలోని ఏసీ మిషన్లు ఉండే ప్రాంతంలో పొగలు వస్తుండటాన్ని అధికారులు గమనించారు. ఈ కోల్డ్ స్టోరేజ్‌లో సుమారు 35 వేల టిక్కీల మిర్చి నిల్వలు ఉన్నాయని యజమాని కొత్తపల్లి రమేష్‌చంద్ర తెలిపారు. వీటిలో 30 వేల టిక్కీలు ఐటీసీ సంస్థవి, యడ్లపాడు, ప్రత్తిపాడు మండలాలకు చెందిన సుమారు 1200 మంది రైతులు ఇందులో మిర్చి నిల్వ చేశారు. పొగలు రావడాన్ని సెక్యూరిటీ గార్డులు గమనించి యజమానికి తెలియజేశారు. సమాచారం అందడంతో 8.30కి ఫైర్, పోలీసు సిబ్బంది వచ్చి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఫైర్ సిబ్బంది స్టోరేజ్ తలుపులు తీసే ప్రయత్నం చేయడంతో దట్టమైన పొగలు, తీవ్రంగా కారం కోర్తో తలుపులు మూసి బయటకు పరుగులు పెట్టారు. 11 గంటల వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేకపోయారు. మంగళవారం రాత్రి ఐటీసీ వారు తెచ్చిన 390 టిక్కీల మిర్చి స్టోరేజ్ కింద ప్లాట్ ఫారంలోనే ఉండటంతో వాటిని వెంటనే గుంటూరులోని మరో స్టోరేజ్‌కు తరలించారు. మిర్చి రైతుల ఆందోళన.. కోల్డ్‌స్టోరేజ్‌కు నిప్పు అంటుకుందన్న సమాచారంతో రైతులు పరుగు పరుగున సంఘటన స్థలానికి చేరుకున్నారు. అందరిలోనూ ఆందోళనతో కళ్లల్లో నీళ్లు కనిపించాయి. తమను లోపలికి పోనిస్తే టిక్కీలను తీసుకొచ్చుకుంటామంటూ వేడుకున్నారు. అయితే పోలీసులు లోపలకు పోలేని పరిస్థితి ఉందంటూ చెప్పి ఆపారు. ముందుగా ఐటీసీ వారి టిక్కీలను బయటకు తెచ్చేందుకు పొక్లెయిన్‌ను తీసుకురాగా, రైతులు దానిని అడ్డుకున్నారు. ఐటీసీ వారికి బీమా ఉంటుంది. ముందుగా మా టిక్కీల సంగతి తేల్చాలంటూ పట్టుబట్టారు. దీంతో యజమానికి, రైతుల మధ్య వాగ్వివాదం జరిగింది. గంటసేపు ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. యజమాని నుంచి నష్టపరిహారం ఇప్పిస్తామని చిలకలూరిపేట రూరల్ సీఐ దిలీప్‌కుమార్ చెప్పడంతో రైతులు ఆందోళనను విరమించారు. బయటకు తెచ్చింది 700 మిర్చి టిక్కీలు.. పొక్లెయిన్లతో శీతలగిడ్డంగి రెండు వైపులా గోడలను పగులగొట్టారు. ముఠా కార్మికులు సాయంత్రం వరకు కష్టపడి 700 టిక్కీలను బయటకు తీసుకురాగలిగారు. చిలకలూరిపేట, నరసరావుపేట, తెనాలి, గుంటూరు-2 నుంచి అగ్నిమాపక శకటాలు, సిబ్బంది వచ్చి రక్షణ చర్యలను చేపట్టారు. ఐటీసీ జనరల్ మేనేజర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సుమారు రూ.12 కోట్ల విలువైన నిల్వలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. రైతులు ఉంచిన మిర్చి టిక్కీలు రూ.2 కోట్లు, దెబ్బతిన్న భవనం విలువ రూ.8 కోట్లు ఉంటుందని గిడ్డంగి యజమాని కొత్తపల్లి రమేష్‌చంద్ర తెలిపారు. -
కోల్డ్ స్టోరేజ్
-
రూ. 4 వేల కోట్లపైనే...
‘పీఆర్సీ’ బకాయిలపై సర్కారు ప్రాథమిక అంచనా * పే ఫిక్సేషన్ ఆధారంగా వివరాల సేకరణ * పే అండ్ అకౌంట్స్, ట్రెజరీల నుంచి సమాచారం కోరిన ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్సీ వేతన సవరణ ప్రకారం చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం లెక్కలేసుకుంటోంది. ఈ భారం దాదాపు రూ.4,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల మధ్యలో ఉంటుందని ఆర్థిక శాఖ ప్రాథమికంగా అంచనా వేసుకుంది. ఉద్యోగుల కొత్త పే ఫిక్సేషన్ ప్రకారం వారికి రావాల్సిన పీఆర్సీ బకాయిలు ఎంత...? మొత్తంగా తొమ్మిది నెలల బకాయిలకు ఎంత చెల్లించాల్సి ఉంది...? అనే వివరాల సేకరణలో సర్కారు నిమగ్నమైంది. వెంటనే ఈ సమాచారం అందించాలని పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ కార్యాలయాలను కోరింది. మార్చి నెలలోనే పదో పీఆర్సీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ కొత్త వేతన సవరణకు అనుగుణంగా వేతనాల స్థిరీకరణ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. పెరి గిన వేతనాలు అందుకుంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు సైతం పెరిగిన పింఛన్‌ను పొందుతున్నారు. ఈ మేరకు నెలసరి చెల్లింపుల వివరాలన్నీ పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ కార్యాలయాల్లో సిద్ధంగా ఉన్నాయి. వీటి ఆధారంగా వారికి ఇవ్వాల్సిన బకాయిలకు ఎంత సొమ్ము కావాలనేది లెక్క తేలిపోతుంది. అందుకే పే అండ్ అకౌంట్స్, ట్రెజరీల నుంచి వచ్చే సమాచారంతో పీఆర్సీ బకాయిల ఫైలును సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించిం ది. పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2014 జూన్ నుంచి 2015 మార్చి వరకు బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఈ ఉత్తర్వులిచ్చే సమయంలోనే బకాయిలపై సర్కారు మల్లగుల్లాలు పడింది. బాండ్లు జారీ చేయటం.. లేదా నగదు చెల్లింపులు చేయటం.. జీపీఎఫ్ ఖాతాలో జమ చేయటం.. ఈ మూడు అంశాలను పరిశీలించింది. భారీ మొత్తం కావటంతో జీపీఎఫ్‌లో జమ చేస్తే... ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రాష్ట్ర రుణ పరిమితి తగ్గిపోతుంది. నగదు చెల్లింపులు చేయాలన్నా... విడతల వారీగా చెల్లించాలన్నా... ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు నిధుల్లో కోత పెట్టాల్సి వస్తుంది. మధ్యేమార్గంగా బాండ్లు జారీ చేసే దిశగా ఆలోచనలు చేసింది. ఈలోగా బాండ్ల జారీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రకటనలు జారీ చేశాయి. దీంతో ప్రభుత్వం బకాయిల అంశాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని పీఆర్సీ జీవోల్లో ప్రస్తావించి తాత్కాలికంగా దాటవేసింది. ఈ జీవోలు వచ్చి అయిదు నెలలు కావస్తోంది. తాజాగా బకాయిలపై ఆర్థిక శాఖలో ఫైలుకు మళ్లీ కదలిక వచ్చింది. బకాయిలకు ఎంత మొత్తం అవసరమనేది నిక్కచ్చిగా తేలి తేనే... వాటిని ఎలా చెల్లించాలనేది నిర్ణయం తీసుకునే వీలుంటుందని అధికారులు తాజా కసరత్తు ప్రారంభించటం గమనార్హం. కేబినెట్‌కు చేరిన డీఏ ఫైలు: ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన కరువు భత్యం (డీఏ) ఫైలును ఆర్థిక శాఖ కేబినెట్ ఆమోదానికి పంపించింది. 3.144 శాతం డీఏను ఖరారు చేసింది. తదుపరి జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాతే పెరిగిన డీఏ అమల్లోకి వస్తుంది. తిరస్కరించిన సిఫారసులిక అంతే... పదో పీఆర్సీ చేసిన సిఫారసులు కొన్నిం టిని ప్రభుత్వం పక్కన బెట్టింది. ఉద్యోగుల సర్వీసు వెయిటేజీ, పెన్షనర్లకు అదనపు పింఛన్ చెల్లింపు, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్, చెవిటి ఉద్యోగులకు అలవెన్స్ అంశాలపై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి పెన్షన్ పొందేం దుకు రిటైర్మెంట్ నాటికి 33 ఏళ్ల సర్వీసు ఉండాలనే నిబంధన ఉంది. గత పీఆర్సీ దీన్ని ఐదేళ్ల పాటు సడలించింది. దీన్ని 8 ఏళ్లకు పెంచాలని పదో పీఆర్సీ చేసిన సిఫారసులను ప్రభుత్వం తోసిపుచ్చింది. పెన్షనర్లకు వయస్సు పెరిగేకొద్ది అదనంగా చెల్లించే పెన్షన్ (అడిషనల్ క్వాంటమ్ పెన్షన్)ను 70 ఏళ్ల నుంచే అమలు చేయాలనే సిఫారసుకు హేతుబద్ధత లేదని తిరస్కరించింది. దీంతో ఇప్పుడున్న 70 ఏళ్ల విధానమే అమలవుతోంది. -
కోల్డ్‌స్టోరేజీలో కీలక ప్రతిపాదనలు
జీవోఎం నివేదికలు 3నెలలుగా సీఎం కార్యాలయంలోనే.. పెండింగ్‌లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల కొత్త మార్గదర్శకాలు హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ రంగానికి సంబంధించిన కీలకమైన ప్రతిపాదనలన్నీ ‘కోల్డ్‌స్టోరేజీ’లో మూలుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల ద్వారా అమలుచేస్తున్న వివిధ పథకాల్లో పెద్ద ఎత్తున మార్పులు చేస్తున్నట్లు ప్రకటించినా... వాటిపై ఇంకా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. వీటితోపాటు పలు అభివృద్ధి పనులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం (జీవోఎం)సమర్పించిన ప్రతిపాదనలు 3 నెలలుగా సీఎం వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి. ఎస్సీశాఖ బాధ్యతలను స్వయంగా చూసుకుంటున్న సీఎం కేసీఆర్.. ఆ శాఖకు సంబంధించిన ముఖ్యమైన ప్రతిపాదనలపై ఇంకా నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో పథకాలకోసం ఎదురుచూస్తున్న ప్రజలు నిరాశలో మునిగిపోతున్నారు. వెలువడని ఆదేశాలు: వివిధ సంక్షేమ శాఖల ద్వారా అమలుచేస్తున్న స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలకు ఒకేవిధమైన ఆదాయ, వయోపరిమితిని ఖరారు చేయడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలే రాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల పరిధిలోని విద్యాసంస్థలు, హాస్టళ్లలో మార్పులు తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నూతన విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలవుతున్నా ఎటువంటి చలనం లేదు. సంక్షేమశాఖల పరిధిలోని ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ప్రవేశాలకు సంబంధించిన తాజా మార్గదర్శకాలు విడుదలే కాలేదు. ఇలా మరెన్నో ప్రతిపాదనలు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖలకు 2015-16లో అమలు చేయాల్సిన సబ్సిడీ విధానం, బ్యాంక్ లింకేజీ, ఆయా పథకాల నిబంధనలు, ఇంకా తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులు, వ్యక్తిగత రుణ విభాగం కింద గరిష్ట రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపుతో పాటు రాయితీని రూ.5 లక్షలకు పెంచాలని మే 8న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రుల బృందం (జీవోఎం) సమావేశంలో నిర్ణయించారు. తర్వాత మే 14న ఆయా పథకాల్లో మార్పులు, మార్గదర్శకాల్లో చేపట్టాల్సిన సవరణలు, ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, సూచనలతో తుది అంచనాను ఉన్నతాధికారులు రూపొందించి, ప్రభుత్వానికి సమర్పించారు. అయినా ఇంకా కొత్త రాయితీ విధానం ఖరారు కాలేదు. ఇలా అనేక ప్రతిపాదనలపై ఇంకా నిర్ణయాలు వెలువడడం లేదు. -
దరి చేరని వెలుగు!
మారని గిరిజనుల బతుకులు మూలనపడిన ప్రాసెసింగ్ యూనిట్లు తెరుచుకోని శీతల గిడ్డంగి కోట్లాది రూపాయలు వృథా నిర్లక్ష్యపు చీకట్లలో ‘వెలుగు’ పథకాలు సీతంపేట : గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన పథకాలు నిర్లక్ష్యపు చీకట్లలో మగ్గిపోతున్నాయి. లబ్ధిదారుల జీవితాలనూ మసకబార్చేస్తున్నాయి. ఈ పథకాల అమలు కోసం ఏర్పాటు చేసిన యంత్రాలు, నిర్మించిన భవనాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలో టీపీఎంయూ (ట్రైబల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్) పరిధిలోని ఏడు మండలాల్లో గిరిజనుల అభ్యున్నతికి చేపట్టిని వెలుగు పథకాలు మూలన పడుతున్నాయి. సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, మెళియాపుట్టి, పాతపట్నం, మందస మండలాల్లో చేపట్టిన వెలుగు పథకాలు నిలిచిపోయాయి. ఏజెన్సీలో అమలవుతున్న పథకాల పరిశీలనకు ఉన్నతాధికారులు, ప్రముఖులు వచ్చినపుడు మాత్రమే హడావుడిగా మసిపూసి మారెడు కాయ చేసి చూపిస్తున్నారు. మార్కెటింగ్ పథకాల పరిస్థితి దారుణం గిరిజనుల ద్వారా మార్కెటింగ్ కేంద్రాలను నడిపి వారికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఐదు చోట్ల పసుపు, చింతపండు, జీడి ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ట్రైకార్ పథకం ద్వారా రూ.8.80 లక్షలు వెచ్చించారు. అయితే ‘వెలుగు’ నుంచి సైరె న ప్రోత్సాహం లేకపోవడంతో గిరిజన మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం లేక ప్రాసెసింగ్ యూనిట్లు మూత పడ్డాయి. ప్రస్తుతం ఒక్క యూనిట్ కూడా పనిచేయని పరిస్థితి ఉంది. రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన కందిపప్పు యూనిట్, ధాన్యం కొనుగోలు కేంద్రాలదీ అదే దుస్థితి. దిష్టిబొమ్మలా కోల్డ్ స్టోరేజి గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులు చెడిపోకుండా ధర వచ్చే వరకు నిల్వ ఉంచేందుకు వీలుగా సీతంపేటలో కోటి రూపాయలు వెచ్చించి నిర్మించిన కోల్డ్ స్టోరే జి పూర్తిగా నిరుపయోగంగా మారింది. రెండేళ్లుగా ఒక్క అటవీ ఉత్పత్తిని కూడా గిరిజనులు దీనిలో నిల్వ చేసిన దాఖలాలు లేవు. దీన్ని కూడా ‘వెలుగు’ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. అటవీ ఉత్పత్తులను తక్కువ ధరకు వ్యాపారులకు అమ్మేయకుండా.. తగిన ధర వచ్చే వరకు ఈ కోల్డ్‌స్టోరేజీలో వాటిని నిల్వ చేసుకోవచ్చని గిరిజనులకు అవగాహన కల్పించడంలోనూ అధికారులు విఫలం కావడంతో కోల్డ్ స్టోరేజి ఏర్పాటు లక్ష్యం నెరవేరకుండాపోయింది. బాలబడులదీ అదే దుస్థితి ఐదేళ్లలోపు చిన్నారులకు ఆటపాటల ద్వారా విద్యనందించాలనే ఉద్దేశంతో ఐటీడీఏ పరిధిలో ‘వెలుగు’ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసిన బాల బడులు నిర్వహణ కూడా సక్రమంగా సాగడంలేదు. గతంలో ఆటబొమ్మల సరఫరా పేరుతో భారీగా నిధులు దుర్వినియోగం చేశారు. కొత్తూ రు, భామిని, సీతంపేట మండలాల్లో ఏర్పాటు చేసిన 110 బాలబడుల్లో దాదాపు సగం అంతంతమాత్రంగా పని చేస్తున్నాయి. ఈ అంశాలను ఐకేపీ ఏపీడీ సావిత్రి వద్ద ప్రస్తావించగా సీజన్ ఆరంభమైతే యూనిట్లు ప్రారంభిస్తామన్నారు. కోల్డ్ స్టోరేజీని జీసీసీకి అప్పగించామన్నారు. -
నిబంధనలు పాటించని కోల్డ్ స్టోరేజీలపై చర్యలు
కొత్తపేట(గుంటూరు): కోల్డు స్టోరేజీల నిర్వాహకులు అగ్నిమాపక శాఖ నిబంధనలను పాటించడం లేదని, ఇలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రీజినల్ అగ్నిమాపకశాఖ అధికారి జి.వి.నారాయణ చెప్పారు. గురువారం ఆయన జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయ సాధారణ పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శీతల గిడ్డంగుల నిర్వాహకులు అగ్నిమాపక శాఖ సూచనలను బేఖాతరు చేస్తున్నారని, అగ్ని ప్రమాదాలను నిలువరించే ముందస్తు పరికరాలను ఏర్పాటు చేయడం లేదని మండిపడ్డారు. ఇలాంటివారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. వీటితోపాటు నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలు, సినిమా హాళ్లు, ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని అన్నారు. కేవలం రెండు మూడు గదుల్లో, అగ్నిమాపక వాహనం తిరగలేని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. 2009 నుంచి అనుమతులను రెన్యువల్ చేసుకోని పాఠశాలలు, సినిమా హాళ్లు, ప్రైవేట్ ఆస్పత్రులు, బహుళ అంతస్థుల యజమాన్యాలపై కోర్టులో కేసులు వేయనున్నామని వెల్లడించారు. గురజాల, ప్రత్తిపాడుల్లో ఫైర్ స్టేషన్లు డివిజన్ కేంద్రం గురజాల, ప్రత్తిపాడుల్లో నూతనంగా ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు నారాయణ తెలిపారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని, అనుమతులు రాగానే అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. విజయవాడలో సిద్ధమవుతున్న డీజీ కార్యాలయం విజయవాడలో అగ్నిమాపక శాఖ డెరైక్టర్ జనరల్ కార్యాలయం సిద్ధమవుతోందని నారాయణ వెల్లడించారు. ప్రస్తుతం భవనం ప్రారంభ దశలో ఉందని, రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని వివరించారు. అప్పుటినుంచి శాఖ పరమైన కార్యకలపాలను విజయవాడ నుంచి నిర్వహిస్తారని తెలిపారు. ఆయన వెంట డీఎఫ్‌వో ఎం.ఎ.క్యూ.జిలానీ, ఏడీఎఫ్‌వో రత్నబాబు ఉన్నారు. -
మిర్చి రైతులను ఏమార్చి..!
పాతగుంటూరు : కోల్ట్ స్టోరేజీల నిర్వాహకులు, వ్యాపారుల మాయూజాలంతో మిర్చి రైతులు మోసపోతున్నారు. మంచి ధర వచ్చినపుడు మిర్చి అమ్మి నాలుగు రాళ్లు సంపాదిద్దామన్న రైతులను ఏమార్చి కోల్డ్ స్టోరేజీల నిర్వాహకులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు జీరో వ్యాపారంతో సెస్ చెల్లించకుండా మార్కెట్ యూర్డు ఆదాయూనికి గండికొడుతున్నారు.ఇదీ జరుగుతోంది.. కోస్తాంధ్రలోని జిల్లాల రైతులు తాము పండించిన మిర్చిని గుంటూరు మిర్చి యార్డులో విక్రరుస్తుంటారు. సరుకు తీసుకొచ్చిన రోజు మార్కెట్ ధర ఆశాజనకంగా లేకపోయినా, మరికొద్ది రోజుల్లో మంచి ధర వచ్చే అవకాశం ఉందని భావించినా తాము తెచ్చిన మిర్చి బస్తాలను కోల్డు స్టోరేజిల్లో నిల్వ చేస్తుంటారు. ఈ సందర్భంలోనే మంచి ధర వచ్చిన రోజున సరుకు విక్రరుుంచేందుకు వీలుగా కోల్డు స్టోరేజీల నిర్వాహకులు, వ్యాపారులు రైతులతో ఒప్పంద పత్రం(బాండ్) రాయించుకుంటారు. అంతేకాకుండా కోల్డ్ స్టోరేజీలో పెట్టిన సరుకును తాకట్టుగా ఉంచుకుని అవసరమైతే రైతులకు రుణంగా కొంతమొత్తం కూడా అందజేస్తారు. మంచి ధర వచ్చిన రోజున రైతులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి సరుకు విక్రరుుస్తారు. సాధారణంగా ఇక్కడే రైతులు మోసపోతుంటారు. వ్యాపారులు మార్కెట్లో విక్రరుుంచిన ధర కన్నా రైతుకు తక్కువ చెల్లించి జెల్లకొడుతుంటారు. కమీషన్ ఏజెంట్లది కీలకపాత్ర.. ఈ దందాలో కమీషన్ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. పంట సాగుకు రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను గుంటూరులోని కమీషన్ ఏజెంట్లు, కోల్డ్ స్టోరేజీల నిర్వాహకులు అరువుపై ఇప్పిస్తారు. తీసుకున్న అరువుకు వ్యాపారులు వడ్డీ కట్టించుకుంటారు. అంతేకాకుండా ఖాళీ ప్రామిసరీ నోట్లపై రైతుల సంతకాలు, వేలిముద్రలు తీసుకుంటారు. ఇంత జరిగినా అవసరానికి ఆదుకున్నారన్న కృతజ్ఞతతో కమీషన్ ఏజెంట్లు చెప్పినట్లు మిర్చి రైతులు వింటుంటారు. వారు చెప్పిన కోల్డ్ స్టోరేజీల్లోనే మిర్చి బస్తాలను నిల్వ చేస్తారు. కాగా గుంటూరులో ఉన్న కోల్డ్ స్టోరేజీల్లో ఎక్కువ శాతం కమీషన్ ఏజెంట్లు, ఎగుమతి-దిగుమతి వ్యాపారులు, ఎరువులు, పురుగుమందుల దుకాణదారులవే కావటం గమనార్హం.అధిక అద్దె వసూలు.. కోల్డ్ స్టోరేజీలో ఏడాదిపాటు నిల్వ చేసేందుకు బస్తాకు 100 రూపాయల చొప్పున అద్దె చెల్లించాలనేది నిబంధన. కానీ రూ.130 చొప్పున వసూలు చేస్తున్నారు. కేవలం నెల రోజులే నిల్వ చేసినా కనీస రుసుముగా 130 రూపాయలు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదని పెదకూరపాడుకు చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు చెప్పారు. దీనిపై ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే పెట్టుకోండి లేకుంటే వెళ్లిపోండని కోల్డు స్టోరేజీల నిర్వాహకులు సమాధానం ఇస్తున్నారని వాపోయూరు. నిల్వ చేసే రోజులను బట్టి అద్దె వసూలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అన్ని రకాల కూలుల వసూలు.. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి బస్తాలను అమ్మిన సందర్భంలోనూ అన్ని రకాల కూలీలను వ్యాపారులు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి కాటా, హమాలీ కూలి తప్ప మరే కూలి కట్టాల్సిన అవసరం లేదు. అయినా వ్యాపారులు దొడ్డి కూలి, కాటా కూలి, ఎత్తుడు, దించుడు కూలి, తరుగు ఇలా అనేక పేర్లతో సొమ్ము మినహారుుంచుకుని మిగతా మొత్తం చెల్లిస్తున్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ఎక్కువమంది రైతులు యార్డుకు సరుకు తెచ్చిన రోజే అరుునకాడికి విక్రరుుంచి వెళ్లిపోతున్నారు. మార్కెట్ యార్డు ఆదాయం గోవిందా.. కోల్డ్ స్టోరేజీల వద్దే మిర్చి టిక్కీలను విక్రరుుస్తుండటంతో వ్యాపారుల నుంచి రావాల్సిన ఒక శాతం యార్డు సెస్ వసూలు కావటం లేదు. దీన్నే జీరో వ్యాపారమని అంటారు. దీనివల్ల మిర్చి యూర్డు ఏటా కోట్లాది రూపాయల ఆదాయూన్ని కోల్పోతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. వ్యాపారుల నుంచి భారీగా మామూళ్లు అందుతుండటమే దీనికి కారణమన్న ఆరోపణలు ఉన్నారుు. వ్యాపారులు చేస్తున్న జీరో వ్యాపారం గురించి ప్రస్తుత దిగుమతి వ్యాపారుల సంఘం నాయకులు ఐదేళ్ల క్రితమే అప్పటి కలెక్టర్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. -
అన్నదాతకు ఆసరా ఇవ్వండి
నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజి నిర్మించండి పట్టణ, గ్రామీణ ప్రజల దాహార్తి తీర్చండి లోక్‌సభలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి డిమాండ్ సాక్షి ప్రతినిధి, తిరుపతి : దుర్భిక్షంతో తల్లడిల్లుతోన్న రైతులను ఆదుకోవాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం లోక్‌సభలో కరవుపై జరిగిన చర్చలో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ గత ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇప్పటిదాకా ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారం మంజూరు కాలేదన్నారు. తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారాన్ని మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని.. రైతులను ఆదుకోవడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. వర్షాభావం వల్ల వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఉపాధిహామీ పథకం కింద రైతులు, రైతు కూలీలకు భారీ ఎత్తున పని కల్పించాలని సూచించారు. వరుస కరవుతో భూగర్భజలాలు అడుగంటిపోయాయని.. కనీసం తాగునీళ్లు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లె, రాయచోటి, రాజంపేట వంటి పట్టణాల్లో 15 రోజులకు ఒకసారి నీళ్లందిస్తున్న విషయాన్ని లోక్‌సభ దృష్టికి తెచ్చారు. రాజంపేట నియోజకవర్గం పరిధిలోనే కాకుండా చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో అనేక గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. తక్షణమే చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు భారీగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలోని పశ్చిమ మండలాల్లో, వైఎస్సార్ జిల్లాలో టమాటా వంటి కాయగూర పంటలు విస్తారంగా సాగుచేస్తారన్నారు. టమాటా అధికంగా దిగుబడి వచ్చినప్పుడు ధర దక్కక.. తక్కువ దిగుబడి ఉన్నప్పుడు ఎక్కువగా ధర ఉండటం వల్ల రైతులు లాభపడటం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నా.. ప్రజలకు కూరగాయల ధరలు అందుబాటులో ఉండాలన్నా తక్షణమే నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజీ గోదాము నిర్మించాలని డిమాండ్ చేశారు. -
కోల్డ్ స్టోరేజీ నిర్మాణం జరిగేనా ?
పాలకుల మౌనం గిలకలదిండి హార్బర్లో పెరుగుతున్న కష్టాలు వ్యాపారుల ఇష్టారాజ్యం ఐస్‌ప్లాంట్ నిర్మాణంలోనూ రాజకీయం మచిలీపట్నం : గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ ద్వారా ఏటా కోట్లాది రూపాయల విదేశీ మారకం సమకూరుతోంది. అయినప్పటికీ ఇక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో బోట్ల యజమానులు, మత్స్యకారుల సమస్యలు రోజురోజూకూ పెరుగుతున్నాయి. సోనా బోట్లు, మరపడవల ద్వారా ద్వారా వేటాడి తెచ్చే అతి విలువైన ట్యూనా చేపలకు మార్కెట్లో ఒక్కోసారి సరైన ధర పలకదు. ఆశించిన ధర వచ్చే వరకు వాటిని భద్రపరిచేం దుకు ఇక్కడ కోల్డ్‌స్టోరేజీ లేదు. దీంతో బోట్ల యజమానులు లక్షలాది రూపాయలు నష్టపోవాల్సి వస్తోంది. హార్బర్లో రెండేళ్ల కిందట ప్రారంభమైన ఐస్‌ప్లాంట్ నిర్మాణానికి రాజకీయరంగు పులుముకుంది. రూ.60 లక్షలతో దీని నిర్మాణానికి రెండేళ్ల కిందటే అనుమతులు వచ్చా యి. ఈ ప్లాంట్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. దీనికి ఎంపెడా నిధులు సమకూర్చగా, పోర్టు విభాగం ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర ఈ నెల 24న గిలకలదిండి హార్బర్లో మత్స్యకారులతో సమావేశమయ్యా రు. ఐస్ప్లాంట్లో నెలరోజుల్లోపు ఉత్పత్తి ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా రెండు శాఖల అధికారులు చెప్పారు. అయినప్పటికీ ఐస్‌ప్లాంట్ నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి రవీంద్ర హామీ ఇవ్వటం చర్చనీయాంశమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే దీని నిర్మాణం జరిగిందని చెప్పుకునేందుకు మంత్రితోపాటు ఆ పార్టీ నాయకులు యత్నించటం వివాదాస్పదమవుతోంది. అంతా దోపిడీనే.. గిలకలదిండి ఫిషింగ్ హార్బర్లో మత్స్యసంపదను కొనుగోలు చేసే సందర్భాల్లో వ్యాపారుల హవా కొనసాగుతోం ది. నలుగురైదుగురు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి వా టి ధరను ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధర చెప్పకుండానే కొనుగోళ్లు.. సోనా, మరబోట్ల ద్వారా తీసుకువచ్చిన మత్స్యసంపద కు ముందుగా ధర చెప్పకుండానే వ్యాపారులు తూకం వేయిం చే ఆనవాయితీ ఇక్కడ కొనసాగుతోంది. ధర ఇంకా నిర్ణయం కాలేదని, అడ్వాన్స్‌గా కొంత సొమ్ము తీసుకువెళ్లాలని చెప్పి వ్యాపారులు తప్పించుకుంటుంటారు. కోల్డ్ స్టోరేజీ లేకపోవటంతో ధర తక్కువగా ఉన్నప్పటికీ అతి విలువైన టూనా, ఇతర రకాల చేపలను బోటు యజమానులు అమ్ముకోవాల్సిందే. వ్యాపారులు ధర నిర్ణయించకుండా అడ్వాన్స్‌లు ఇచ్చి, మత్స్య సంపదను కొంటున్నారు. దీంతో బోటు యజమానులు, మత్స్యకారులు నష్టపోతున్నారు. ఇక్కడి హార్బర్లో కోల్డ్ స్టోరే జీ నిర్మించాలని బోటు యజమానులు, మత్స్యకారులు ఎన్నేళ్లుగానో కోరుతున్నారు. రూ.15 కోట్ల అంచనా వ్యయంతో కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి రెండేళ్ల క్రి తం అప్పటి ఎమ్మెల్యే పేర్ని నాని ప్రతిపాదన పంపారు. తరువాత రాజకీయ సమీకరణాలు మారటంతో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కొల్లు రవీంద్ర మంత్రి అయ్యారు. గిలకలదిండి హార్బర్లో పరిస్థితులపై ఆయనకు అవగాహన ఉంది. ఈనెల 24న ఫిషిం గ్ హార్బర్లో మత్స్యకారులతో మంత్రి రవీంద్ర సమావేశమైనపుడు కోల్డ్ స్టోరేజీ గురిం చి ప్రస్తావించకపోవడంపై వారితోపాటు బోటు యజమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి భూమి అందుబాటులో ఉందని.. గతంలో చేసిన ప్రతిపాదన ఆమోదింపజేస్తే ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. -
చర్మదానం.. ఎవరైనా చేయొచ్చు..!
సాక్షి, ముంబై: చర్మదానం చేసేవారి సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. దీనిపై నగరవాసులకు సరైన అవగాహన కల్పించడం ద్వారా చర్మదాతల సంఖ్య ను పెంచవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నగరంలోని కార్పొరేషన్ ఆస్పత్రుల్లో చర్మాన్ని దానం చేసే వారి సంఖ్య కొంత మేర తగ్గిపోయిందని ఓ సర్వే ఆధారంగా వెల్లడైంది. చర్మాన్ని ఎవరైనా దానం చేయొ చ్చు. అంటువ్యాధులు, దీర్ఘవ్యాధులు, చర్మక్యాన్సర్తోపాటు హెపిటైటిస్-బీ,సీ, హెచ్ఐవీ ఉన్నవారు సైతం చర్మాన్ని దానం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. దాతలు ద్వారా సేకరించిన చర్మాన్ని స్కిన్బ్యాంక్లో భద్రపరుస్తారు. బతికున్న చర్మదాతల నుంచి మత్తుమందు ఇచ్చి చర్మాన్ని స్వీకరిస్తారు. మరణించిన వారి నుంచి 24 గంటల్లోపు చర్మాన్ని స్వీకరించవచ్చు. అయితే మృతదేహాలను కోల్డ్‌స్టోరేజీలో ఉంచడం ద్వారానే వీరి చర్మాన్ని స్వీకరించేందుకు వీలు కలుగుతుంది. కాగా, దేశంలోనే చర్మ బ్యాంక్ కలిగిన ఏకైన మెడికల్ కాలేజీ నగరంలోని సైన్ ఆస్పత్రిలో ఉంది. ఈ బ్యాంక్ అందజేసి న గణాంకాల మేరకు.. చర్మదానం చేసేవారి సంఖ్య 2012లో 177 ఉండగా 2013లో 144కు చేరింది. దీంతో చర్మదానం చేసే వారి సంఖ్య 18 శాతం తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. కాగా, కేవ లం సైన్ ఆస్పత్రిలోనే కాలిన రోగుల కోసం ఏడాదికి 400 నుంచి 500 చర్మ దాతలు అవసరం ఉం టుంది. ఈ చర్మం రోగులకు సహజమైన కట్టులా (నేచురల్ బేండేజ్)గా ఉపయోగపడుతుంది. దీం తో వైద్య ప్రక్రియ కూడా వేగంగా సాగుతుందని వైద్యులు చెబుతున్నారు. చర్మదానం చేసే వారి సంఖ్య తగ్గడం వల్ల కాలిన గాయాలైన వారికి చర్మం అందుబాటులో లేకపోవడంతో ‘డ్రెస్సింగ్’ నిర్వహిస్తున్నామని, అది చాలా నొప్పితో కూడుకొని ఉంటుందని వారు పేర్కొన్నారు. అలాగే డ్రెస్సింగ్ ను రోజూ నిర్వహించాల్సి వస్తుందని సైన్ ఆస్పత్రి చికిత్సా విభాగానికి చెందిన వైద్యాధికారి మీనా కుమార్ తెలిపారు. చర్మం అందుబాటులో ఉంటే రోగులకు చౌకగా చికిత్స జరుగుతుందని ఆయన తెలిపారు. ఇద్దరు లేదా ముగ్గురు రోగుల నుంచి సేకరించిన చర్మం ఒక్క రోగికి మాత్రమే ఉపయోపడుతుందన్నారు. ఎక్కువ కాలిన గాయాలతో బాధపడుతున్న వారికి ఈ చర్మదానంతో చాలా ప్రయోజనమని వైద్యాధికారి తెలిపారు. చర్మదానం చేయడంపై నగర వాసుల్లో అవగాహన పెరుగుతోందని, అయితే ఇందుకు కార్పోరేషన్ అధికారుల సహకారం కూడా అవసరమన్నారు. నగర వాసుల్లో చర్మదానంపై మరింత అవగాహన పెంచేందుకు అధికారులు కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచిం చారు. మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చే సమయం లో వైద్యులు మృతుల కుటుంబాలకు ఈ చర్మదానంపై అవగాహన కల్పిం చాలని కోరారు. అయితే చర్మదానంపై కేవలం అవగాహన కల్పించడమే కాకుండా సేకరించే సదుపాయాలు కూడా కల్పించాలని నిపుణులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, తాము స్కిన్ కలెక్షన్ కోసం చాలా ఆస్పత్రులు తిరిగామని, కానీ కొన్ని ఆస్పత్రులు మాత్ర మే ఇందుకు అంగీకరించాయని ఓ సామాజిక కార్యకర్త తెలిపారు. -
జైలుపాలైన రైతుల కుటుంబ సభ్యుల ఆవేదన
పర్చూరు, న్యూస్‌లైన్: రైతుల పేరుతో దొంగ పత్రాలు సృష్టించి రుణాలు తీసుకున్న శీతల గిడ్డంగి యాజమాన్యం, బ్రోకర్ల మోసానికి తాము బలయ్యామని బాధిత రైతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొల్లులోని రామతులశమ్మ కోల్డ్ స్టోరేజీలో యాజమాన్యం, బ్రోకర్లు కలిసి రైతుల పేరుతో రుణాలు తీసుకొని బ్యాంకును మోసగించిన కేసులో ఈనెల 11వ తేదీన 27 మంది రైతులకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రైతులు ఒంగోలు సబ్‌జైలులోనే ఉన్నారు. రిమాండ్ గడువు ముగియడంతో మంగళవారం వీరిని బందోబస్తు మధ్య పర్చూరు కోర్టుకు తీసుకొచ్చారు. వీరి రాకకోసం నిరీక్షిస్తున్న కుటుంబ సభ్యులు పోలీసు వాహనాలు కోర్టు వద్దకు రాగానే ఉద్వేగానికి లోనయ్యారు. బేడీలతో ఉన్న రైతులను చూసి బోరున విలపించారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ వారితో కలిసి మాట్లాడుకునేందుకు పోలీసులు అవకాశమిస్తారని కుటుంబ సభ్యులు ఆశించారు. కానీ కోర్టులో రిమాండ్ పొడిగించిన తర్వాత రైతులను నేరుగా వాహనం ఎక్కించి ఒంగోలు తరలించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు తమవారిని చూసుకోవాలని ఎగబడ్డారు. వారి కోసం తెచ్చిన తినుబండారాలను సైతం ఇవ్వనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో మరింత ఆవేదన చెందారు. శీతల గిడ్డంగి యాజమాన్యం, బ్రోకర్లు కలిసి మాయమాటలు చెప్పి సంతకాలు చేయించుకొని రుణాలు తీసుకున్నారని, తీరా బ్యాంకుకు సొమ్ము చెల్లించకుండా మోసం చేశారని వాపోయారు. వారి మాటలు నమ్మి సంతకం పెట్టిన పాపానికి కేసుల్లో ఇరుక్కొని నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మోసానికి పాల్పడిన శీతల గిడ్డంగుల యాజమాన్యాన్ని, సరుకు సరిచూసుకోకుండా రుణాలిచ్చిన బ్యాంకు సిబ్బందిని అరెస్టు చేయాలని బాధిత రైతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే... ఇంకొల్లులోని రామతులశమ్మ కోల్డ్ స్టోరేజీకి పాలేరు వెంకటేశ్వర్లు, చెంచులక్ష్మిలు యజమానులు. అయితే వీరికి కొంత నగదు అవసరం కావడంతో బ్రోకర్‌గా ఉన్న కోటపాటి శ్రీనివాసరావును సంప్రదించారు. రైతులతో ఉన్న పరిచయాలతో సదరు బ్రోకర్ పర్మిట్లపై వారి చేత సంతకాలు చేయించి బ్యాంకుల్లో రుణాలు తీసుకొని యజమానులకు అందజేసేవాడు. కోల్డ్ స్టోరేజీ యజమానులు, బ్రోకరు బ్యాంకర్లతో కుమ్మక్కయ్యారని తెలుసుకోలేకపోయిన రైతులు శనగలు ఉన్నాయి..సరుకుపై రుణం తీసుకోవడమే కదా అని భావించి రుణ పత్రాలపై సంతకాలు చేశారు. యాజమాన్యం ప్రమేయాన్ని అలుసుగా తీసుకున్న బ్రోకర్ శ్రీనివాసరావు సొంతంగా రైతుల సంతకాలతో రుణాలు తీసుకోవడం ప్రారంభించాడు. ఇలా * 10 లక్షలతో ప్రారంభించి ఈ మొత్తాన్ని * 2.30 కోట్లకు పెంచాడు. రుణ పత్రాలపై రైతుల సంతకాలు మాత్రమే ఉండటంతో బకాయిలు చెల్లించలేదని సదరు బ్యాంకు అధికారులు 27 మంది రైతులపై కేసు నమోదు చేశారు. దీంతో గతనెల 11వ తేదీన స్థానిక కోర్టులో న్యాయమూర్తి కేఎస్ రామకృష్ణారావు రిమాండ్ విధించారు. రైతులు రిమాండ్ గడువు పూర్తవడంతో విచారణ నిమిత్తం మంగళవారం కోర్టుకు వచ్చారు. వారికి జడ్జి మరో 14 రోజులు రిమాండ్ పొడిగించారు. బాధిత కుటుంబ సభ్యుల ధర్నా కోల్డ్ స్టోరేజీ వ్యవహారంలో బాధిత రైతుల కుటుంబ సభ్యులు మంగళవారం పర్చూరులో నిరసన చేపట్టారు. రిమాండ్ లో ఉన్న రైతులను కోర్టుకు తెచ్చిన క్రమం లో ఆగ్రహానికి గురైన బాధిత రైతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రైతులతో రుణపత్రాలపై సంతకాలు తీసుకుని రుణాలు తీసుకున్న శీతల గిడ్డంగి యాజమాన్యాన్ని, అందుకు సహకరించిన బ్యాంకర్లను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ కోర్టు బయట చీరాల ఆర్అండ్బీ రహదారిపై కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. అనంతరం బొమ్మల సెంటర్లో మహిళలు రహదారిపై బైఠాయించారు. కుటుంబ సభ్యులు మానవహారం ఏర్పాటు చేశారు. పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. సీబీఐ విచారణ చేపట్టాలి.. పీ సీతమ్మ, బాధితుని కుమార్తె మా తండ్రి పసుపులేటి ఆంజనేయులుకోల్డ్ స్టోరేజీ బయట బడ్డీ బంకు నిర్వహిస్తున్నాడు. రుణపత్రాలపై సంతకాలు చేయకుంటే బడ్డీబంకు తీయిస్తామని చెప్పడంతో ఉన్నసరుకుపై రుణం తీసుకోవడమేగా అని వాళ్లు పెట్టమన్నచోట సంతకాలు చేశాడు. ఇలా మాతండ్రి పేరుతో * 7.9 లక్షల రుణం తీసుకున్నారు. ఈ కేసులో నిజాలు నిగ్గుతేలాలంటే సీబీఐ చేత విచారణ చేయించాలి. మా తండ్రి కౌలు తీసుకొని సాగుచేసిన భూమిలో వచ్చిన * 1లక్ష విలువైన శనగలు గిడ్డంగిలోనే పెట్టాం. ప్రస్తుతం వాటికి కూడా యాజమాన్యం సమాధానం చెప్పడం లేదు. ఆపరేటర్‌గా ఉన్న పాపానికి బలయ్యాం... జరుగుల రేణుక, బాధితుని భార్య నాభర్త జరుగుల హనుమంతరావు ఇదే కోల్డ్ స్టోరేజిలో ఆపరేటర్‌గా ఉన్నారు. యాజమాన్యం చెప్పిన చోట సంతకాలు పెట్టకుంటే ఉద్యోగం పోతుందని పెట్టమన్నచోటల్లా సంతకాలు చేశాడు. తీరా ఆయన పేరున *9 లక్షలు అప్పు తీసుకున్నట్లు బ్యాంక్ అధికారులు తేల్చారు. మాకు పొలం లేదు..వ్యవసాయం లేదు.. పనిచేసుకుని బతికే మాకు అంతస్థోమత ఎక్కడిది. అన్యంపున్యం ఎరుగని మా ఆయన్ని జైలుపాలు చేశారు. -
ఎగుమతుల లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లు
కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి 40 శాతం రాయితీ ‘అపెడా’ సభ్యుడు బి.మాధవరెడ్డి సాక్షి, హైదరాబాద్: భారతీయ వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల విలువైన ఎగుమతులను లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ‘అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ’ (అపెడా) సభ్యులు బి.మాధవరెడ్డి తెలిపారు. అపెడా సభ్యులుగా రెండోసారి నియమితులైన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది దేశం నుంచి రూ.1.20 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయని ఇందులో ఆంధప్రదేశ్ వాటా 15 శాతం ఉందని చెప్పారు. ఎగుమతులు పెంపొందించేందుకు రైతులు, ఔత్సాహిక ఎగుమతి దారులకు కోల్డ్‌స్టోరేజీలు, ప్యాకింగ్ యూనిట్ల నిర్మాణానికి ఇప్పటి వరకూ ఇస్తున్న 25 శాతం రాయితీని 40 శాతానికి పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు శంషాబాద్ విమానాశ్రయంలో తగిన మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. ఇదే తరహాలో విశాఖ విమానాశ్రయంతో పాటు రాష్ట్రంలోని ఐదు ఓ డరేవుల్లో రూ.50 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. -
కొనసాగుతున్న ‘విద్యుత్’ సమ్మె
సాక్షి, చిత్తూరు: జిల్లాలో మూడవరోజూ ప్రజానీకానికి విద్యుత్ కష్టాలు తప్పలేదు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెలో భాగంగా జిల్లా మొత్తం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు విద్యుత్‌సరఫరా నిలిపేశారు. దీంతో జిల్లాలో అన్ని రకాల వ్యాపారలావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. వేలాది లీటర్ల పాలు నిల్వచేసుకునే పరిస్థితి లేక పాలసేకరణ తగ్గించాయి. పరోక్షంగా ఈ ప్రభావం పాడిరైతులపైన పడింది. విద్యుత్ ఆధారంగా నిర్వహించే దుకాణాలు, చిన్నతరహా పరిశ్రమలు పూర్తిగా మూతేశారు. జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లె, కుప్పం, నగరి, పుత్తూరు ఏరియా ఆస్పత్రుల్లో విద్యుత్ లేక రోగులు ఇక్కట్లు పడుతున్నారు. తిరుమలకు, తిరుపతిలోని ప్రధాన ఆస్పత్రులకు మాత్రం విద్యుత్ సరఫరా ఇచ్చారు. మూడవ రోజు కూడా 2,500 మందికి పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. మదనపల్లె, చిత్తూరు, తిరుపతిల్లో విద్యుత్జేఎసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రైల్వే ట్రాక్షన్ విద్యుత్ రేణిగుంట వరకే ఉంది. రేణిగుంట-విజయవాడ మార్గంలో విద్యుత్‌సరఫరా పగటి పూట లేకపోవడంతో రైళ్ల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని మూడు 220 కేవీ సబ్స్టేషన్లు, 33 కేవీ సబ్స్టేషన్లు 295 పని చేయలేదు. ఇంజినీర్లు సమ్మెలో ఉన్నందున ఫీడర్లలో రాత్రి సమయాల్లో ఏర్పడిన బ్రేక్డౌన్లు, రిపేర్ల గురించి పట్టించుకోవటం లేదు. దెబ్బతింటున్న పాలు, కూరగాయలు విద్యుత్ సమ్మెతో కోల్డ్ స్టోరేజీల్లో, బీఎంసీల్లో, సూపర్మార్కెట్లలో పాలు, కూరగాయల నిల్వలు దెబ్బతింటున్నాయి. వేలాది లీటర్ల పాలు నిల్వ చేసుకునే పరిస్థితి లేక చెడిపోతున్నాయి. జిల్లాలోని ప్రైవేట్ డెయిరీలన్నీ పాలు నిల్వ చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయి. మదనపల్లె కేంద్రంగా ఉన్న ఒకటి, అర కోల్డ్ స్టోరేజీల్లో కూరగాయలు, టమాటలు నిల్వచేసుకునే పరిస్థితి లేదు. దీనికితోడు జిల్లావ్యాప్తంగా చిల్లర దుకాణాల్లో రీటైల్‌గా పాలు విక్రయించేవారు తమవద్ద తక్కువ స్టాకు ఉంచుకుంటున్నారు. సాయంత్రం వరకు కూలింగ్ లేకుంటే పాలు చెడిపోతాయంటున్నారు. మదనపల్లె, చిత్తూరు డివిజన్లలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నడుస్తున్న బీఎంసీలలో వందలాది లీటర్ల పాలు పాడయ్యాయి. 13 గంటలు కరెంట్ లేకపోవడంతో ఇళ్లలో ఫ్రిజ్జుల్లో నిల్వ చేసుకునే పదార్థాలను సైతం బయటపడేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రంతా జాగారమే! పగటి పూట రక్షిత మంచినీటిపథకాలు పనిచేయకపోవడంతో ప్రజలు రాత్రి పూట బిందెలు తీసుకుని వీధుల్లోకి వెళ్తున్నారు. అర్ధరాత్రి వరకూ కొళాయిల చుట్టూ చేరి నీళ్లు పట్టుకుంటున్నారు. వెల్డింగ్ దుకాణాల వారు రాత్రి సమయాల్లో పని చేస్తున్నారు. రాత్రి 7 గంటల తరువాతే జిరాక్స్, డీటీపీ సెంటర్లు కూడా తమ వ్యాపారం సాగిస్తున్నాయి. బ్యాంకుల్లో మాత్రం పరిమిత కంప్యూటర్లతో వాణిజ్య లావాదేవీలు నిర్వహిస్తున్నారు. బీఎస్ఎన్తో పాటు, కొన్ని ప్రైవేట్ సెల్‌కంపెనీలు కూడా జనరేటర్లు నిరవధికంగా నిర్వహించలేక టవర్లలో సిగ్నల్స్ ఆపేసే పరిస్థితి నెలకొంది. ఇంటర్నెట్, టీవీ చానళ్లు బంద్ విద్యుత్ సమ్మెతో పగటి పూట జిల్లాలో లక్షల సంఖ్యలో టీవీలు, ఇంటర్నెట్ కంప్యూటర్లు షట్‌డౌన్ అయ్యాయి. ముఖ్యంగా న్యూస్ చానళ్లు లేకపోవడంతో ప్రజానీకం హైదరాబాద్, ఢిల్లీలో జరిగే విషయాలు తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాల్లోని తమకు తెలిసినవారికి ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. -
బ్యాంకుల ద్వారా రూ.15 వేల కోట్ల రుణాలు
సోమేశ్వరం (రాయవరం), న్యూస్‌లైన్ : జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా రూ.15 వేల కోట్ల రుణాలను ప్రాధాన్య రంగాలకు అందజేసినట్టు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) ఏజీఎం కేఎస్ఎస్ సోమయాజులు వెల్లడించారు. శుక్రవారం ఆయన మండలంలోని సోమేశ్వరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని సందర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సహకార సంఘాలను బహుళార్థ ప్రయోజక సహకార కేంద్రాలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. ఎటువంటి ఆర్థిక లోటుపాట్లు జరగకుండా, సక్రమంగా ఆడిట్ జరిగిన సంఘాలకు మాత్రమే ఇటువంటి సౌకర్యం కల్పిస్తామని వివరించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు నాబార్డు 55 శాతం, ఆప్కాబ్ 15 శాతం, స్థానిక సహకార సంఘాలు 30 శాతం కలిపి రుణాలను అందజేస్తున్నట్టు చెప్పారు. రైతులు గొడౌన్లు, కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మించుకునేందుకు, బంగారు ఆభరణాల మీద రుణాలు తీసుకునేందుకు సహకార సంఘాల ద్వారా అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా రూ.11 వేల కోట్ల డిపాజిట్లు సేకరించగా, రూ.15 వేల కోట్లు రుణాలుగా అందజేశారన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులతో సహకార సంఘాలు, బ్యాంకుల ద్వారా ఖరీఫ్‌కు రూ.26,500, రబీకి రూ.30 వేల చొప్పున రైతులకు రుణాలను అందజేస్తున్నామన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో నాబార్డులో రూ.8,050 కోట్లు ప్రాధాన్య రంగాలకు రుణాలుగా అందజేసేందుకు నిర్ణయించామన్నారు. ఈ రుణాలను స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రుణాలుగా అందజేస్తామన్నారు. పంట రుణాలకు రూ.మూడు లక్షల వరకు ప్రాసిసెంగ్ చార్జీలు తీసుకోవడం లేదన్నారు. 2014-15 ఆర్థిక సంవ త్సరంలో రూ.9,200 కోట్లు రుణాలుగా ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వివరించారు. మొత్తం రుణాల్లో 79 శాతం వాణిజ్య బ్యాంకులు ఇస్తుంటే, సహకార సంఘాలు, డీసీసీబీ కలిపి 17 శాతం, గ్రామీణ బ్యాంకులు నాలుగు శాతం రైతులకు రుణాలుగా ఇస్తున్నట్టు తెలిపారు. రైతులకు లాభదాయకంగా ఉండేందుకు గోల్డ్లోన్లు, ఎరువులు ఒకేచోట ఇచ్చేందుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు. మీ-సేవ కేంద్రాలను సహకార సంఘాల ద్వారా నిర్వహించే ఆలోచన ఉన్నట్టు వెల్లడించారు. బక్షి కమిటీ తీర్మానాలు సలహాలు మాత్రమే.. సహకార సంఘాలపై ప్రకాష్ బక్షి కమిటీ చేసిన తీర్మానాలు కేవలం సలహాలు మాత్రమేనని సోమయాజులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ 29 రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని సిఫారసులు చేసిందన్నారు. వీటిని మన రాష్ట్రంలో అమలు చేయాలా లేక తిరస్కరించాలా అనే అంశం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. -
గాయత్రీ మిల్క్ డెయిరీపై అధికారుల దాడులు
సాక్షి, బళ్లారి : అధిక రోజులు నిలువ ఉండటానికి రసాయనాలు (హెచ్2 ఓ2 - హైడ్రోజన్ ఫెరాక్సైడ్) ఎక్కువగా కలిపిన గాయత్రి పాలు, పెరుగు పాకెట్ల ప్యాకింగ్ తయారీ తేదీని ముందస్తుగా వేసి అమ్మకాలు సాగిస్తున్న విషయం అధికారుల దాడితో వెలుగు చూసింది. అధికారుల కథనం మేరకు.. పాలు, పెరుగు ఎక్కువ రోజులు నిలువ ఉండటం కోసం రసాయనాలు ఎక్కువగా కలిపి విక్రయిస్తున్నట్లు గాయత్రి డెయిరీపై హెల్త్, ఫుడ్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో నగరంలోని ఏపీఎంసీ యార్డ్‌లోని గాయత్రి కోల్డ్ స్టోరేజీలో అధికారులు మంగళవారం రాత్రి సోదాలు నిర్వహించారు. మంగళవారం 27వ తేదీ అయినప్పటికీ అక్కడి పెరుగు ప్యాకెట్లపై తయారీ తేదీ ఆగస్టు 30, 31వ తేదీలు ఉన్నట్లు గుర్తించారు. అడ్వాన్స్‌గా తేదీలు ఎందుకు ముద్రించారని అధికారులు సంబంధిత వ్యక్తులను ప్రశ్నించగా.. వారు నీళ్లు నమిలారు. పాలు, పెరుగులో రసాయనాలు కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మూడు లారీల్లో మొత్తం దాదాపు రూ.70 వేల విలువ చేసే 2000 లీటర్ల పెరుగు ప్యాకెట్లను వారు స్వాధీనం చేసుకున్నారు. వాటిపై ఐదు రోజులు ముందస్తు తేదీ ముద్రితమై ఉంది. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ.. గాయత్రి మిల్క్ కంపెనీకి సంబంధించిన పాకెట్లను స్వాధీనం చేసుకొని ల్యాబ్‌కు పంపామని చెప్పారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ దాడుల్లో డీసీఐబీ ఇన్స్పెక్టర్ ఉమేష్ ఈశ్వర్ నాయక్, కానిస్టేబుళ్లు దినకర్, రామ్మోహన్, హెల్త్, ఫుడ్ ఇన్ స్పెక్టర్ ముదకప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం అనంతపురంలో ఉంది. కాగా, పాలు, పెరుగు నిలువ కోసం హెచ్2ఓ2 మోతాదు మించి కలిపితే.. ఆ పాలు తాగిన వారు దీర్ఘకాలంలో అనారోగ్యానికి (గ్యాస్ట్రిక్, ఆయాసం) గురవుతారని వైద్యులు చెబుతున్నారు.