కోల్ట్ స్టోరేజ్‌లో రైతు మృతి
Published Thu, Mar 30 2017 11:42 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
- రెండు రోజుల తర్వాత గుర్తింపు
కోడుమూరు: ప్యాలకుర్తి సమీపంలోని కోల్డ్‌స్టోరేజ్ ప్రమాదవశాత్తు ఓ మృతి చెందాడు. హాలహర్వి మండలం చింతకుంటకు చెందిన పుండుకూర రామయ్య(55)కు సంబంధించిన 233 మిరప సంచులను ప్యాలకుర్తి కోల్డ్‌స్టోరేజిలో నిల్వ చేసేందుకు ఈ నెల 28వ తేదీ తన కుమారుడు వెంకటేష్‌తో కలిసి వచ్చాడు. గోదాములోని 5వ అంతస్తులో నిల్వచేశారు. ఆ సమయంలో మిరప ఘాటుకు తట్టుకోలేక రామయ్య కిందకు వెళుతున్నానంటూ అక్కడి నుంచి వచ్చేశాడు. 5వ అంతస్తు నుంచి కిందకు వస్తున్న సమయంలో లిప్ట్ కోసం ఏర్పాటు చేసిన మార్గాన్ని చీకట్లో గుర్తించకపోవడంతో ప్రమాదవశాత్తు అందులో పడి తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మరణించాడు. అయితే ఈ విషయాన్ని ఎవరూ గమనించలేకపోయారు. కొద్ది సేపు తర్వాత గోదాము నుంచి బయటకు వచ్చిన కొడుకు వెంకటేశ్ తండ్రి కోసం కనిపించకపోవడంతో తనకు చెప్పకుండానే ఊరికి వెళ్లిపోయాడని అతను కూడా స్వగ్రామానికి వెళ్లాడు. అక్కడ కూడా తండ్రి లేకపోవడంతో మరుసటిరోజు కూడా ఇతర ప్రాంతాల్లో వెతుకుతూ ఆచూకీ తెలియలేదు. అనుమానంతో గురువారం ప్యాలకుర్తి కోల్ట్‌స్టోరేజిలో గాలించాడు. తీవ్ర రక్తపు మడుగులో చనిపోయిన తండ్రి శవాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు.
కోల్డ్ స్టోరేజ్ యజమానులపై బాధితుల ఫిర్యాదు
కోల్ట్‌స్టోరేజ్‌లో విద్యుత్ లైట్లు, లిఫ్ట్‌కు కనీసం భద్రతా సౌకర్యాలేకపోవంతో యజమాని నిర్లక్ష్యం వల్లనే తండ్రి చనిపోయాడని మృతుడు కుమారుడు వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని చింతకుంట గ్రామానికి తీసుకెళ్లారు. కోల్డ్‌స్టోరేజి యజమాని, మేనేజర్ మధుసూదన్, ఇన్‌చార్జి చంద్రలపై మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కోల్డ్‌స్టోరేజి యజమాని టీడీపీ ప్రధాన నాయకుడికి సన్నిహితం కావడంతో కేసు నమోదు కాకుండా ఉండేందుకు తీవ్రమైన ఒత్తిడికి తీసుకొచ్చినప్పటికీ బాధితులు ఒప్పుకోకుండా కేసునమోదు చేయించారు. కోల్డ్‌స్టోరేజి యజమాని పరారీలో ఉన్నాడు.
Advertisement
Advertisement