మిర్చి రైతులను ఏమార్చి..! | mirchi farmers facing problems with merchants | Sakshi
Sakshi News home page

మిర్చి రైతులను ఏమార్చి..!

Published Mon, Aug 18 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

mirchi farmers facing problems with merchants

పాతగుంటూరు : కోల్ట్ స్టోరేజీల నిర్వాహకులు, వ్యాపారుల మాయూజాలంతో మిర్చి రైతులు మోసపోతున్నారు. మంచి ధర వచ్చినపుడు మిర్చి అమ్మి నాలుగు రాళ్లు సంపాదిద్దామన్న రైతులను ఏమార్చి కోల్డ్ స్టోరేజీల నిర్వాహకులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు జీరో వ్యాపారంతో సెస్ చెల్లించకుండా మార్కెట్ యూర్డు ఆదాయూనికి గండికొడుతున్నారు.ఇదీ జరుగుతోంది.. కోస్తాంధ్రలోని జిల్లాల రైతులు తాము పండించిన మిర్చిని గుంటూరు మిర్చి యార్డులో విక్రరుస్తుంటారు.
 
సరుకు తీసుకొచ్చిన రోజు మార్కెట్ ధర ఆశాజనకంగా లేకపోయినా, మరికొద్ది రోజుల్లో మంచి ధర వచ్చే అవకాశం ఉందని భావించినా తాము తెచ్చిన మిర్చి బస్తాలను కోల్డు స్టోరేజిల్లో నిల్వ చేస్తుంటారు. ఈ సందర్భంలోనే మంచి ధర వచ్చిన రోజున సరుకు విక్రరుుంచేందుకు వీలుగా కోల్డు స్టోరేజీల నిర్వాహకులు, వ్యాపారులు రైతులతో ఒప్పంద పత్రం(బాండ్) రాయించుకుంటారు.
 
అంతేకాకుండా కోల్డ్ స్టోరేజీలో పెట్టిన సరుకును తాకట్టుగా ఉంచుకుని అవసరమైతే రైతులకు రుణంగా కొంతమొత్తం కూడా అందజేస్తారు. మంచి ధర వచ్చిన రోజున రైతులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి సరుకు విక్రరుుస్తారు. సాధారణంగా ఇక్కడే రైతులు మోసపోతుంటారు. వ్యాపారులు మార్కెట్‌లో విక్రరుుంచిన ధర కన్నా రైతుకు తక్కువ చెల్లించి జెల్లకొడుతుంటారు.
 
కమీషన్ ఏజెంట్లది కీలకపాత్ర.. ఈ దందాలో కమీషన్ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. పంట సాగుకు రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను గుంటూరులోని కమీషన్ ఏజెంట్లు, కోల్డ్ స్టోరేజీల నిర్వాహకులు అరువుపై ఇప్పిస్తారు. తీసుకున్న అరువుకు వ్యాపారులు వడ్డీ కట్టించుకుంటారు. అంతేకాకుండా ఖాళీ ప్రామిసరీ నోట్లపై రైతుల సంతకాలు, వేలిముద్రలు తీసుకుంటారు.
 
ఇంత జరిగినా అవసరానికి ఆదుకున్నారన్న కృతజ్ఞతతో కమీషన్ ఏజెంట్లు చెప్పినట్లు మిర్చి రైతులు వింటుంటారు. వారు చెప్పిన కోల్డ్ స్టోరేజీల్లోనే మిర్చి బస్తాలను నిల్వ చేస్తారు. కాగా గుంటూరులో ఉన్న కోల్డ్ స్టోరేజీల్లో ఎక్కువ శాతం కమీషన్ ఏజెంట్లు, ఎగుమతి-దిగుమతి వ్యాపారులు, ఎరువులు, పురుగుమందుల దుకాణదారులవే కావటం గమనార్హం.అధిక అద్దె వసూలు.. కోల్డ్ స్టోరేజీలో ఏడాదిపాటు నిల్వ చేసేందుకు బస్తాకు 100 రూపాయల చొప్పున అద్దె చెల్లించాలనేది నిబంధన.
 
కానీ రూ.130 చొప్పున వసూలు చేస్తున్నారు. కేవలం నెల రోజులే నిల్వ చేసినా కనీస రుసుముగా 130 రూపాయలు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదని పెదకూరపాడుకు చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు చెప్పారు. దీనిపై ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే పెట్టుకోండి లేకుంటే వెళ్లిపోండని కోల్డు స్టోరేజీల నిర్వాహకులు సమాధానం ఇస్తున్నారని వాపోయూరు. నిల్వ చేసే రోజులను బట్టి అద్దె వసూలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
 
అన్ని రకాల కూలుల వసూలు.. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి బస్తాలను అమ్మిన సందర్భంలోనూ అన్ని రకాల కూలీలను వ్యాపారులు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి కాటా, హమాలీ కూలి తప్ప మరే కూలి కట్టాల్సిన అవసరం లేదు. అయినా వ్యాపారులు దొడ్డి కూలి, కాటా కూలి, ఎత్తుడు, దించుడు కూలి, తరుగు ఇలా అనేక పేర్లతో సొమ్ము మినహారుుంచుకుని మిగతా మొత్తం చెల్లిస్తున్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ఎక్కువమంది రైతులు యార్డుకు సరుకు తెచ్చిన రోజే అరుునకాడికి విక్రరుుంచి వెళ్లిపోతున్నారు.
 
మార్కెట్ యార్డు ఆదాయం గోవిందా.. కోల్డ్ స్టోరేజీల వద్దే మిర్చి టిక్కీలను విక్రరుుస్తుండటంతో వ్యాపారుల నుంచి రావాల్సిన ఒక శాతం యార్డు సెస్ వసూలు కావటం లేదు. దీన్నే జీరో వ్యాపారమని అంటారు. దీనివల్ల మిర్చి యూర్డు ఏటా కోట్లాది రూపాయల ఆదాయూన్ని కోల్పోతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. వ్యాపారుల నుంచి భారీగా మామూళ్లు అందుతుండటమే దీనికి కారణమన్న ఆరోపణలు ఉన్నారుు. వ్యాపారులు చేస్తున్న జీరో వ్యాపారం గురించి ప్రస్తుత దిగుమతి వ్యాపారుల సంఘం నాయకులు ఐదేళ్ల క్రితమే అప్పటి కలెక్టర్, మార్కెటింగ్ శాఖ కమిషనర్‌ల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement