మొబైల్ రైతు బజార్ల కోసం ప్రత్యేక టీంలు
Published Tue, Jul 19 2016 9:13 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
– మార్కెట్‌యార్డుల్లో శీతల గోదాములు
– సీఈఓ రమణమూర్తి వెల్లడి
– టెక్కె మార్కెట్‌లోని రైతు బజార్ పరిశీలన
నంద్యాలరూరల్: రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ రైతుబజార్లను ఏర్పాటు చేసి వినియోగదారులకు తాజా కూరగాయలు, పండ్లు అందించేందుకు చర్యలు చేపట్టామని రైతుబజార్ల రాష్ట్ర సీఈఓ రమణమూర్తి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక టీంలను ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నంద్యాల టెక్కె మార్కెట్ యార్డులోని రైతుబజార్–2ను మంగళవారం ఆయన పరిశీలించారు. అమరావతిని పైలెట్‌ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇంటింటికి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు మొబైల్ రైతుబజార్ల ద్వారా అందించనున్నామని చెప్పారు. ఈ ప్రక్రియను రాష్ట్రంలోని 13జిల్లాల్లో త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. రైతులు కూడా రసాయన ఎరువులు, పురుగు మందులు కాకుండా సేంద్రియ ఎరువులతో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉత్పత్తి చేసి రైతుబజార్లకు విక్రయించుకోవాలని సూచించారు. రైతుల పంటను నేరుగా పొలాల వద్ద నుండి మొబైల్ రైతుబజార్ల ద్వారా కొనుగోలు చేసి వినియోగదారులకు తాజాగా తక్కువ ధరకు అందిస్తామని తెలిపారు. మార్కెట్‌యార్డుల్లో కూరగాయలు, పండ్లు నిల్వ చేసుకునేందుకు వీలుగా శీతల శీతల గోదాములు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన వెంట ఏడీఎం సత్యనారాయణచౌదరి, నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు సెక్రటరీ బాల వెంకటరెడ్డి, అధ్యక్షులు శివరాం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement